
ఇల్లంతా చుట్టాలతో నిండి ఉంది ఉదయమే కెనడా నుండి వచ్చన కు మేడపైన ఉన్నగది కేటాయించారు.గదిలోనుండి కిందికి వచ్చిన మనవడిని చూసిన సుబ్బాయమ్మ ' రారా మనవడా ఎల్లుండి పెళ్ళి పెట్టుకుని ఇప్పుడా రావడం ఇదిగో ఈకాఫీతాగి ఆకుర్చిలో కూర్చో నలుగుపెట్టి పెళ్ళికొడుకును చేయాలి, ముత్తయిదువులు ఆరంభించండి, సుభద్ర మనం ఇక్కడ ఉండకూడదు నావెంటవచ్చి ఓమూలని కూర్చో 'అన్నది జివితేష్ నాయనమ్మ.
కన్నిళ్ళను తుడుచుకుంటూ సుబ్బాయమ్మని అనుసరించింది సుభద్ర . జివితేష్ కు నలుగు పెట్టడానికి కొందరు ముత్తయిదువులు అతని దగ్గరకు వచ్చారు.
' ఆగండి నాకు ఊహ తెలిసే సరికే మాఅమ్మ మరణించింది,నాటి నుండి ఈకుటుంబ బాధ్యతలు వదినే నిర్వహిస్తుంది. నన్ను ,నాతమ్ముడిని పెంచినది వదినే, ఆమెను నేను ఏనాడు వదినగా చూడలేదు నాకు జన్మనివ్వలేదే కాని అన్నితానై మమ్మలను పెంచింది.ఆమెలో మాఅమ్మను చూసాను ,నాన్నగారు పక్షవాతంతో మంచంలో ఉంటే మూడేళ్ళు సేవ చేసింది వదినేగా,తనకు పిల్లలు కలగకున్నా మమ్మల్నే తన పిల్లలుగా పెంచింది ఎలా మరచిపోగలం. నాతమ్ముడు వదిన భుజంపైన, నేను ఆమెఓడిలో ఎన్నో రాత్రులు నిద్రపోయామో! మాతాత గారు నాకు చెపుతుండేవారు అన్నభార్యను తల్లిలా, స్నేహితుని భార్యను చెల్లిలా,తమ్ముడి భార్యను బిడ్డలా చూడాలని పెద్దలు చెపుతారు. ఇలా మమ్ములను పెంచి చదివించిన మాఅన్నయ్య గారు నేడు మనమధ్య లేకపోవచ్చు ,అందుకు సహకరించిన మావదినమ్మ నిజంగా మాకు అమ్మే ఈజీవితం అంతా ఆతల్లి మాతోనే ఉంటుంది.
సంప్రదాయాల చట్రంలో వదినమ్మను బంధి చేసి మాకు దూరంచేయకండి. స్త్రీకి పుట్టుకతో వచ్చే బొట్టు,కాటుక, పువ్వులు, గాజులు మధ్యలో తీయడం అమానుషం. భర్తలేని స్త్రీమూర్తి అన్నింటికి దూరంగా ఉండాలి కానీ భార్యలేని పురుషుడు అందరికి ఎదురు రావచ్చు, అన్ని కార్యక్రమాలలో పాల్గొనవచ్చు ఇదెక్కడి న్యాయం ? మగాడికి ఒకన్యాయం,ఆడవారికి ఒక న్యాయమా? ఇది అన్యాయం అనిపించడం లేదా? మనపై నమ్మకంతో మన ఇంటికి వస్తూ తన ఇంటిపేరును మార్చుకుని, మన వంశాంకురాలను అందించే స్త్రీలకు మనం ఇచ్చేగౌరవం ఇదా? తొలుతమెలపై ఆకులు కట్టుకోకుండా తిరిగిన రాతియుగం మానవుడు నేడు సైన్స్ పరంగా ఎంతో అభివృధ్ధి పదంలో పయనిస్తూ,నాగరీకం పేరున అనాగరీకంగా కులం కుళ్ళుతో,మతం మత్తులో జీవించడం ఆశ్చర్యం కలిగస్తుంది. మనం మారలి తరతరాల చావదినా పద ఈశుభకార్యం అంతా నీచేతుల మీదుగా జరగాలి నువ్వు నాకు వదినవు కావు తల్లివి అని ఈలోకానికి తెలియాలి సంప్రదాయాల పేరుతో అణగారిన స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయం ఈలోకానికి తెలియాలి పదా 'అని నేలపై కుర్చున్న సుభధ్రకు తనచేయి అందించాడు జివితేష్ .
కళ్ళుతుడుచుకుంటూ ధైర్యంగా జివితేష్ చేయి అందుకుంది సుభధ్ర.