
ఒక రాజు తన పరివారం తో వేటకు బయలు దేరాడు ఆ పరివారం లో ఉన్న మంత్రి కి మూగ జీవాల భాషను అర్ధం చేసుకొనే జ్ఞానము ఉంది అందువల్ల రాజు అతనిని అభిమానించే వాడు సహజంగా ఇతర మంత్రులకు ఆ మంత్రి అంటే ఈర్ష్యగా ఉండేది ఎప్పుడైనా అవకాశం రాకపోతుందా ఆ మంత్రి మీద కక్ష్య తీర్చుకోలేకపోతామా అని ఎదురు చూస్తూ ఉండేవారు ఆ మంత్రి కూడా తన హద్దుల్లో తాను ఉంటూ రాజు గారు అడిగితేనే మూగ జీవాల సంభాషణలను వివరించేవాడు ఆ సంభాషణలలో ఏదైనా కీడు జరిగే సందర్భాలు ఉంటె వీలైనంతవరకు జవాబు చెప్పకుండా దాటవేసేవాడు
రాజుగారి పరివారం లో ఉన్న ఇతర మంత్రులు ," మహారాజా మనము అరణ్యము గుండా ప్రయాణిస్తున్నాము ఎటునుంచి అయినా క్రూర మృగాలు లేదా విష సర్పాలు రాయచ్చు వాటి రాకను మనము గుర్తించలేము కానీ అడవిలోని పక్షులు లేదా కొన్ని జంతువులూ వాటిని గుర్తించి ప్రత్యేక మైన ధ్వనులు చేస్తాయి మన మంత్రి గారికి ఆ మూగజీవాల భాషను అర్ధము చేసుకో గలదు కాబట్టి అయన మనలను ముందుగా క్రూర మృగాలా రాకను పసిగట్టవచ్చు కాబట్టి మంత్రిగారిని ఆ పక్షులు లేదా జంతువులూ చేసే ధ్వనులకు అర్ధం చెప్పమని ఆదేశించండి "అని రాజు గారిని మంత్రి పైకి ఉసిగొల్పుతారు రాజు కూడా ఈ సూచనకు అంగీకరించి మంత్రితో ఆ పక్షులు చేసే ధ్వనులకు అర్ధము ఏమిటి అని అడుగుతాడు కట్టెలు కొట్టుకొని వాడు తనకు వచ్చే ఆపద నుండి తప్పించుకోగలిగాడు.
రాజు గారు ఆజ్ఞను దిక్కరించకూడదు కాబట్టి ఆ మంత్రి పైన ఎగురుతు గట్టి గట్టిగా అరుస్తూ వెళుతున్న పక్షులను కాసేపు శ్రద్దగా గమనించి అవి చేస్తున్న ధ్వనులను శ్రద్దగా కాసేపు విన్నాడు ఆ తరువాత ,"మహారాజా అవి చేస్తున్న ధ్వనులు మనకు ఏ రకమైన ప్రమాదాన్ని సూచించటం లేదు "అని క్లుప్తముగా చెప్పాడు కానీ ఇతర మంత్రులు రాజు మరి ఆ శబ్దాలకు అర్ధము ఏమిటని రెట్టించి అడిగారు దానికి మంత్రి, "మహారాజా ఆ పక్షులు చేస్తున్న శబ్దాల ప్రకారం కట్టెలు కొట్టుకోవడానికి ఒక వ్యక్తి వస్తాడు ఆ వచ్చిన వాడు పాము కాటుకు చనిపోతాడని పక్షులు మాట్లాడుకుంటున్నాయి"అని చెప్పాడు
రాజుకు ఇతర పరివారానికి ఇది ఎంతవరకు నిజమవుతుందో అన్న ఆసక్తి పెరిగింది రాజుగారు "నీవు చెప్పింది జరగకపోతే నీకు శిక్ష తప్పదు "అని హెచ్చరించాడు కాసేపటికి నెత్తి మీద కట్టెల మోపు తో ఒక కట్టెలు కొట్టే వాడు వచ్చి మోపును క్రిందకు దించి తువ్వాలుతో చెమట తుడుచుకుంటున్నాడు ఏమి జరుగుతుందా అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు కాసేపటికి ఆ కట్టెలు కొట్టేవాడు మోపును తలకెత్తుకొని బయలుదేరబోతున్నాడు వాడికి ఏమి జరగ నందుకు రాజు సంతోషించాడు కానీ మంత్రి మాట మీద కోపము వచ్చి నీకు అసలు ఏమిరాదు నాతొ మూగ జీవాల భాష వచ్చు అని అబద్దాలు చెపుతున్నావు నిన్ను శిక్షిస్తాను అని కోపంగా అంటాడు మంత్రి మహారాజా ఎక్కడో లోపము జరిగింది నేను విన్నది అర్ధం చేసుకున్నది మీతో చెప్పాను ఒక్క క్షణము ఆగండి అని చెప్పి ఆ కట్టెలు కొట్టేవాడిని మోపు దింపమని ఆ మోపును విప్పించారు ఆ మోపులో కట్టెల మధ్య ఒక నల్ల త్రాచు పాము చచ్చి పడిఉంది ఆ కట్టెలు కొట్టే వాడు రాజు ఇతర పరివారం పాము ను చూచి ఆశ్చర్యపోయారు.
మంత్రి ఆ కట్టెలు కొట్టే వాడిని అసలు ఏమి జరిగింది అని అడుగుతాడు దానికి ఆ వ్యక్తి "నేను కట్టెలు కొట్టాక ఇద్దరు వృద్ధ దంపతులు దారి తప్పి అడవిలో తిరుగుతున్నారు వాళ్ళు నన్ను వాళ్ళు వెళ్ళవలసిన గ్రామానికి దారి అడిగారు అప్పుడు నేను వారి వెంబడి కొంత దూరం నడిచి వారికి దారి చూపించాను అప్పుడు ఆ వృద్ధ దంపతులు నన్ను నీవు నిండు నూరేళ్లు చల్లగా ఉండు నాయనా అని ఆశీర్వదించారు ఆ తరువాత నేను ఈ కట్టెల మోపు నెత్తిపై పెట్టుకుని ఇటు వచ్చాను ఈ పాము ఈ మోపులో ఎలా చేరిందో నేను గమనించలేదు మోపులో దూరినాక చచ్చిందేమో పాపం అని రాజు గారితో చెప్పి వెళ్ళిపోయాడు
పక్షుల భాష తెలిసిన మంత్రి రాజు గారితో,"చూసారా మహారాజ ఎవరైనా మనస్సు పూర్తిగా ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం వృధా పోదు ఆ వృద్ధ దంపతులు ఆ కట్టెల వాడు చేసిన సహాయానికి మనస్సు పూర్తిగా నిండు నూరేళ్లు జీవించు నాయనా అని ఆశీర్వదించారు ఆ ఆశీర్వాదం ఆ వల్ల ఆ కట్టెలు కొట్టుకొనే వాడు తనకు రాబోయే ఆపద నుండి తప్పించుకోగలిగాడు అని వివరించాడు రాజు కూడా ఈ మాటల పై నమ్మకం కుదిరి మంత్రిపై అభిమానం కూడా పెరిగింది అందువల్ల పెద్ద ల ఆశీర్వచనాన్ని తప్పని సరిగా స్వీకరించాలి ఎందుకంటే పెద్దలు ఎప్పుడు చిన్నవాళ్లు మంచిని కోరి మనస్సు పూర్తిగా ఆశీర్వదిస్తారు కాబట్టి ఆశీర్వాదం పొందినవారికి ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది అన్న సత్యం ఈ కధ ద్వారా మనకు తెలుస్తుంది.