వెండి కడియాలు - కొడవంటి ఉషా కుమారి

Vendi kadiyalu

“ఒసేయ్! సీతాలు!ఆ రోడ్డు పక్కన ఎవరో పెద్దావిడ ఉన్నాది. పదినిమిషాలు అయింది. అలా కూర్చునే ఉంది.ఎవరో కార్లో వచ్చారుఅలా చెట్టు దగ్గర కూర్చోబెట్టి వెళ్ళిపోనారు.” “ అవునా! మామ !చూద్దాం పద! అంది సీతాలు. సీతాలు,చిట్టయ్య భార్య భర్తలు. స్వీట్ షాప్ బండి రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకుంటారు.అది మంచి సెంటర్ కావడంతో అమ్మకాలు జోరుగానే ఉంటాయి. ఇద్దరూ రోడ్డు దాటి అవతల రోడ్డుకి వెళ్లారు. అక్కడ కూర్చున్న పెద్దవిడబలవంతంగా కళ్ళు విప్పి మళ్లీ కళ్ళు మూసుకుంటోంది. “అయ్యో! ఏటైనాది మామ!ఈ పెద్దావిడకి!” “ ఏమోనే! సీతాలు!ఉండు! నీళ్లు తీసుకుని వస్తాను!” అంటూ ఒక నీళ్ల బాటిల్ కొని తీసుకువచ్చాడు. మొహం మీద నీళ్లు చల్లారు కొద్దిగా కళ్ళువిప్పిందినెమ్మదిగా.మంచినీళ్లు తాగించారు.ఏమీ చెప్పలేకపోతోంది. అలా చూస్తోంది అంతే. “అమ్మ!నువ్వు యాడికి పోవాలా!”అడిగాడు. “ నేనా!ఏమో!” ఏదో గొణిగింది. “ ఎక్కడి నుంచి వచ్చా వు? పేరేంటి?” అడిగింది సీతాలు. “ఏమో!తెలియదు” “ ఏ ఊరు?” “ ఊరా!ఏమో!” అయోమయంగా అంది. “ఇలా కాదు కానీ,మామ! మన ఇంటికి తీసుకుపోదాం! ఆమెకు బాగున్నప్పుడే చెప్తాది!” అందిసీతాలు. “ అయితే పద! తీసుకెళ్దాం!”అన్నాడు చిట్టయ్య. ఇంటికి తీసుకెళ్లారు ఇల్లు చిన్న దే అయినా ఆవిడని జాగ్రత్తగా చూసుకున్నారు. తెలిసిన ఆయుర్వేద వైద్యుడిని తీసుకొని వచ్చారు. “ఈమెకు చాలా పవర్ ఉన్న మత్తుమందు ఇచ్చారు.తెలివి వచ్చేసరికి రెండు రోజులు పడుతుంది.మంచి ఆయుర్వేద మందు ఇస్తాను.” అని మందులు ఇచ్చి వెళ్ళాడు.రెండు రోజులు అయ్యేసరికి ఆ పెద్దావిడ కోలుకుంది. కొద్దిగా తెరిపిగా అనిపించడంతో, “అమ్మ! మీరు ఎవరు? మీది ఏ ఊరు?” అని అడిగాడు. “ నా పేరు మహాలక్ష్మి!మీరు ఎంతో దయ చూపుతున్నారు. కానీ,అయిన వాళ్ళ దగ్గర నాకు అది లభించలేదు. ప్రేమతో ఇంత అన్నం పెట్టారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు.” “ అయ్యో!ఇది కూడా రుణమేనా అమ్మ!వల్ల కో!” అన్నాడు. “ఇప్పుడు కాస్త బాగానే ఉంది ఇంక నేను బయలుదేరుతాను.” అందిమహాలక్ష్మి. “ అమ్మ!నువ్వు ఎవరో తెలియదు కానీ,అయిన వాళ్ళు కాదు అనుకున్నారు అని అర్థమవుతుంది.ఇక్కడే ఉండమ్మా!మాకేం బరువు కాదు” అన్నాడు చిట్టయ్య. ”ఇక్కడే ఉండమ్మా!ఉన్నదాంట్లోనే సర్దుకుందాం.” అంది సీతాలు. “మీరిద్దరూ ఎంతో సంస్కారం కలవారు. ఎంతోమంది చదువుకున్న వాళ్ళ కన్నా లక్ష రెట్లు నయం! నా చేత్తో పెంచిన నా కొడుక్కి సంస్కారం లేదు! మీ ఇద్దరి దగ్గర ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలా కూర్చోండి మీకు ఒక చిన్న కథ చెబుతాను.” అనడంతో ఇద్దరూ కూర్చున్నారు.

***** మహాలక్ష్మి తన కొడుకుతో పల్లెటూర్లో ఉండేది. అందరూ ఆమెను అభిమానించేవారు. ఆమె దగ్గర ఒక చిన్న పెట్టే ఉండేది.అందులోతమలపాకులువక్కలుఉండేవి.మెడలో బంగారు హారం కాళ్లకు వెండికడియాలతో లక్ష్మీదేవిలా ఉండేది. కొడుకుని పట్టణంలో చదివించింది. కోడలు లావణ్య రాకతో కష్టాలు మొదలయ్యాయి. లావణ్యది చైతన్యది ఒకేలాంటి మనస్తత్వం వాళ్ళిద్దరూ ఎప్పుడు ఆస్తి అమ్మేసి పట్నంలోఉండాలనిఆలోచించేవారు.చివరికి వాళ్ల కోసం తనే తలవంచాల్సి వచ్చింది. కోడలు కడుపుతో ఉండడంతో మరీఅపురూపమైపోయింది. లావణ్య తల్లి తండ్రి కూడా అక్కడే ఉండటంతో అందరికీ వండి వార్చాల్సిన పని మహాలక్ష్మి మీద పడింది. ఆస్తులు అమ్ముకొని వచ్చారే గానీ, చైతన్యకి ఉద్యోగం అయితే లేదు. “ ఒరేయ్ చైతూ!కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి రా! ఏదో ఒక పని చూసుకో!” అంది మహాలక్ష్మి. “చూసారా!చూసారా! మా అమ్మ, నాన్నని అంటోంది మీ అమ్మ.” కోపంగా అంది. “పరిస్థితి అర్థం చేసుకో! ఏదో ఒక ఉద్యోగం చేయాలిగా!”అనునయంగా అంది మహాలక్ష్మి. “అయినా మీరు ఎప్పుడు ఇంతే!మేము అన్యోన్యంగాఉంటేకళ్ళలోనిప్పులుపోసుకుంటారు!” “అయ్యో!అది కాదమ్మా !” “ఎందుకమ్మా! అస్తమాను వాదిస్తావు! మేం ఏం చేయాలో మాకు తెలుసులే! కాసేపు ఊరికే ఉండు.” చిరాగ్గా అన్నాడుచైతన్య.ఎప్పుడూఇల్లంతారణరంగంలా ఉండేది.మహాలక్ష్మి ని ఎప్పుడూమాట్లాడనిచ్చేది కాదు లావణ్య.అలాగే ఒక పాపకి జన్మనిచ్చింది. చిన్న పాపని చూసి ఎంతో సంబరపడింది మహాలక్ష్మి. కానీ పాపని ఎప్పుడు ఎత్తుకొని చ్చేది కాదు కోడలు. “మీ దగ్గర ఉంటే అన్నీ పల్లెటూరి బుద్ధులే వస్తాయి.” అంటూ విసుక్కునేది.రాను రాను మహాలక్ష్మీ పరిస్థితి. మరీఅధ్వాన్నం అయ్యింది.లావణ్య ఏం మాట్లాడినా అది కరెక్ట్ గానే అనిపించేది చైతన్యకి. “ఇదిగో ఇలా కాదు కానీ మీ అమ్మ అన్నింటికీ గొడవ చేస్తోంది.ఒక పని చేద్దాం! పాలల్లో మత్తుమందు కలిపి పట్టించేద్దాం.స్పృహ కోల్పోయాక దూరంగా ఎక్కడో వదిలేసి వచ్చేద్దాం.” “ కానీ,మళ్ళీ వచ్చేస్తే నో!” “వస్తే సంగతిఅప్పుడు చూద్దాం! మనకు చాలా దూరంగా అంటే ఈ రాష్ట్రం సరిహద్దు వరకు వెళ్లి వదిలేద్దాం.” “ఇది మంచి ఆలోచన.” “అయితేసరే ముందు పని చూద్దాం పదండి!” “ ఈ రాత్రికి మేటర్ పూర్తవ్వాలి.” అటుగా వెళు తున్నమహాలక్ష్మికి ఏదో లీలగా వినిపించింది.ఏమిటన్నది అర్థం కాలేదు.రాత్రి కొడుకు దగ్గరకు వచ్చి, “అమ్మ!పాలు తాగు! ఈ మధ్య మరీ నీరసంగా కనిపిస్తున్నావు.”అనడంతో తల్లి మనసు ఎంతో కదిలిపోయింది. కొడుకు తన గురించి ఆలోచిస్తున్నాడు సంతోషం అయిపోయిందిమనసు. “లేదు నాయనా! బాగానే ఉన్నాను!” “ అదేం లేదు! ముందు పాలు తాగు! నేను చెప్తున్నాను కదా!”అంటూ పాలు తాగించాడు. పాలు తాగిన కాసేపటికి స్పృహ కోల్పోయింది మహాలక్ష్మి. ఎక్కడికో వెళుతున్నట్టు లీలగా తెలుస్తోంది. “ లావణ్య! మెడలో హారం తియ్!” “సరే! సరే!స్పీడ్ గా పోనివ్వండి! ఈవిడికి స్పృహ వచ్చేలాఉంది.” “ఇక్కడ ఎవరూలేరు. ఇక్కడ వదిలేద్దాం.” అంటూ కారుఆపాడు.ఒక చెట్టు దగ్గర కూర్చోబెట్టి పక్కన ఆవిడ తమలపాకుపెట్టిఅక్కడపెట్టి,అక్కడినుండి వెళ్లిపోయారు.తిరిగి తెలివి వచ్చాక కానీ వాళ్ళ మాటలు అర్థం కాలేదు. “ఇదే ఈ మహాలక్ష్మి కథ.”కళ్ళల్లో నీరు తిరుగుతుంటే అంది. “అమ్మ!ఇక్కడే ఉండిపోరాదు. మేము ఉన్నంతలో బాగానే చూసుకుంటాం!” అన్నాడు చిట్టెయ్య. “అయితే నేనేం చేసినా మీ ఇద్దరూ కాదని అనకూడదు.అలా నాకు మాట ఇవ్వండి.” అంది మహాలక్ష్మి. “అలాగే అమ్మ!”అన్నారు ఇద్దరూ.ఏడుస్తూ ఇంట్లోకి వస్తున్న శ్రీహరిని చూసి సీతాలు, చిట్టయ్య గాబరా పడ్డారు. “ “ఏటయ్యిందిరా!ఎందుకు ఆ ఏడుపు!”అన్నాడు. “నీకు తెలుసా!అందరూ పెద్ద స్కూల్లోచదువుకుంటున్నారు.నేను మాత్రం ఆ డొక్కు స్కూల్లోనే!” ఏడుస్తూ అన్నాడు. “ఇది ఈడికి రోజూఉండేగోలే!ఒరేయ్!ఎక్కడైతేనేటి శుభ్రంగా చదువుకో!పెద్దసిక్కోచ్చిపడిందిఈడితో!”చిరాగ్గా అన్నాడు. “శ్రీ! ఇలారా!”అని పిలిచింది మహాలక్ష్మి. దగ్గరికి వచ్చాడు శ్రీహరి.నువ్వు ఇప్పటికే సగం రోజులు పైగా ఈ స్కూల్లోనే చదివావు.మహా అయితే ఇంకో మూడు నెలలు ఉంటుంది పెద్ద పరీక్షలు రాయడానికి.అందుకే ఈ మూడు నెలలు ఇక్కడే చదువు. తరువాత సెవెంత్ క్లాస్ లో కి వస్తావు.అప్పుడు నీకు నచ్చిన స్కూల్లో చదువుదువుగాని! నేనే చదివిస్తాను నిన్ను!” అనడంతో శ్రీహరిఎంతోసంబరపడ్డాడు.పెద్దస్కూల్లోచదివిస్తారా! నిజంగా!” “ నిజం!ఈ మూడు నెలలు మంచిగా చదువు. మరో మాట ఇకనుంచి నువ్వు నన్ను నానమ్మ! అని పిలవాలి సరేనా! “ “సరే! నానమ్మ!”సంతోషంగా అన్నాడు.” అవన్నీ జరిగే పనులేనా అమ్మ!” దిగులుగా అన్నాడు చిట్టయ్య. “అన్నీజరుగుతాయి! నువ్వేం బెంగ పెట్టుకోకు! వెళ్లి ఒక సన్నటిఊసతీసుకునిరా!శ్రీ!నువ్వువెళ్లితమలపాకుల పెట్టి తీసుకురా! నీకు తమాషా చూపిస్తాను.” “అలాగే!”అంటూ హుషారుగా వెళ్లి తీసుకువచ్చి ఇచ్చాడు.తమలపాకులు పెట్టి ఓపెన్ చేసి అందులో నుండి తమలపాకులు వక్కలు బయటికి తీసింది. లోపల అంతా నగిషీ చెక్క బడి ఉంది. జాగ్రత్తగా చూసి చిట్టయ్య తెచ్చిన ఊస తీసుకుని ఒకచోట చిన్నగా నొక్కింది.అక్కడ అలా నొక్కడం తో ఓపెన్ అయింది. లోపల చాలా బంగారం చిన్న చిన్న ముక్కలుగా నలుచదరంగా ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కో తులం ఉంటుంది.మొత్తం ఇరవై ఐదు తులాలు ఉండాలి. మనసులోనేలెక్క వేసుకుంది. “చూడు చిట్టయ్య ఇదిమొత్తంఇరవైఐదుతులాలు” seఅంది. “ అమ్మో ఇంత బంగారమే!”ఆశ్చర్యంగా అన్నాడు చిట్టయ్య. “ఈవేళ స్వీట్ బండి తీయకు.శ్రీ!ఈరోజు స్కూల్ కి వెళ్లకు! మనం బయటికి వెళ్లాలి!” “అమ్మా!ఎక్కడికి!”ఆందోళనగాఅన్నాడుచిట్టయ్య. నేనేం చెప్తే అలా వింటా మని మాట ఇచ్చారు కదా చిట్టి నాయుడు!” “ చిట్టి నాయుడు ఎవరు?” “నువ్వే! ఇకనుంచి నువ్వు చిట్టి నాయుడు వి. సరేనా!” “చిట్టి నాయుడు!మా అమ్మ ఇలాగే పిలిచేది! మళ్ళీ ఇన్నాళ్లకు విన్నాను.కళ్ళల్లో నీళ్ళుతిరుగుతుంటే అన్నాడు చిట్టయ్య. “సరే పదండి!”అనడంతో అందరూ బయటికి నడిచారు. మహాలక్ష్మి మంచి వ్యవహార్త.చక్కగామాట్లాడి బంగారానికి మంచి రేటు వచ్చేలా చేసింది. “మంగళ సూత్రం తాడు చూపించుబాబు! అలాగే నల్లపూసలు కూడా! అనడంతో అన్నీ ముందు పెట్టారు. “ఇదిగోసీతాలు!ఈ తాడునీకుబాగుంటుందేమో చూడు!”అనడంతో, “అమ్మా! నాకా!”ఆశ్చర్యంగా అంది సీతాలు. “అవును!నీకే!కోడలు పిల్ల పసుపు తాడుతో ఉంటే ఈ అత్త ఊరుకుంటుందా!ముందు చూడు!” “అది కాదు!”అంటూ ఏదో చెప్పబోయాడు చిట్టినాయుడు. “మాట ఇచ్చావుగా! మరి మాట్లాడకు!” కోపంగా అంది మహాలక్ష్మి. సూత్రం తాడు తీసుకుని నల్లపూసలు కూడా చూడటం మొదలు పెట్టింది మహాలక్ష్మి. సీతాలు ఏదోమాట్లాడబోయింది.ఆమెనివారించిచక్కటినల్లపూసల గొలుసు తీసి సీతాలు చేతిలో పెట్టింది. “ సరే!మనం మంచి షాపింగ్ మాల్ కి వెళ్దాం! శ్రీకి స్కూల్ బ్యాగ్ తీసుకుందాం!ఇంకాబట్టలుకూడా!”అనడంతో అయోమయంగాచూసారు.శ్రీహరి మాత్రం, “ భలే!భలే!” అంటూ చప్పట్లు కొట్టాడు. అలా తిరుగుతూ సీతకి కొన్ని చీరలు,తనకికొన్ని చీరలు, చిట్టి నాయుడికి, శ్రీహరికి కొన్ని బట్టలు తీసుకుంది. అందరూ ఇంటికిబయలుదేరారు.అందరిమోహాలుకళకలళ్లాడుతున్నాయి.ఇంటికి వచ్చాక మహాలక్ష్మి మంచం మీద కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. చిట్టెయ్య మహాలక్ష్మి కాళ్ల దగ్గర కూర్చున్నాడు. “అమ్మ!నువ్వు మా కోసం ఆకాశం నుంచి దిగివచ్చినలక్ష్మీదేవివాఅమ్మా!”అంటూకన్నీళ్లపెట్టుకున్నాడు “ చ న! ఏంటిది!చిట్టి నాయుడు! ఇది మనకి ఇంకా మొదలు అంతే!మనం ఇంకా చాలా చేయాలి! నీతోచాలామాట్లాడాలి!శ్రీహరితనబ్యాగ్ చూసిమురిసిరిసిపోతున్నాడు. సీతాలు వంటగదిలో ఉంది. “అత్తమ్మ !కాఫీ తీసుకో!”అంది సీతాలు. “ సీతాలు! లక్ష్క్ష్మీదేవినిపట్టుకుని అత్తమ్మ అంటున్నావ్ ఏంటి?”కోపంగా అన్నాడు చిట్టయ్య. “నేనే పిలవమన్నాను లే రా!నాకు నువ్వు కొడుకువి అయితే సీతాలు కి నేను అత్తమ్మనేగా” నవ్వుతూ అంది.ఈ లోగా శ్రీహరి కూడా వచ్చి మంచం మీద కూర్చున్నాడు. “చిట్టి నాయుడు!జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడి ఉంటారు!నేను కూడా అంతే!ఎన్నో బాధలు సమస్యలుకానీ ఇప్పుడు అలా కాదు మనం ఒకరి కోసం ఒకరు తోడుగా ఉందాం!జీవితంలోదూసుకుపోవాలి. “ అలాగే అమ్మ !నువ్వు ఎలా చెప్తే అలా! సరే అయితే! ఇల్లు చిన్నదే!కానీ స్థలం ఎక్కువగానే ఉంది మరో రెండు గదులు కట్టించాలి చూడు! ఇక్కడ పెద్ద షెడ్డువేయించు.స్థలం చూపిస్తూ అంది మహాలక్ష్మి. చిట్టి నాయుడు అయోమయంగా చూశాడు. “ఒక పది రోజుల్లో ఈ పనులన్నీ అయిపోవాలి. ఉదయాన్నే తాపీ మేస్త్రిని పిలిపించు. “ అలాగే అమ్మ!” “చిట్టి నాయుడు! ఒక మంచి చదువుకున్న మనిషి అవసరం ఉంది. వాకబుచెయ్యి. “ చదువుకున్న మనిషి అంటే నాకు తెలిసి ఒక అబ్బాయి ఉన్నాడు.ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నాడు సంపాదన లేదు.ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని ఎంతో బాధ పడుతున్నాడు. “ అవునా!అయితే నువ్వు శ్రమ అనుకోకుండా అతన్నిఇప్పుడే ఇక్కడికి తీసుకురా!” అది ఎంత పని అమ్మ!వాళ్ళ ఇల్లు ఇక్కడికి దగ్గర్లోనే! ఇప్పుడే తీసుకు వస్తాను!” అంటూ బయటికి వెళ్ళాడు కాసేపట్లోనే తీసుకువచ్చాడు. “నా పేరు వెంకటరమణ అండి! నన్ను రమ్మన్నారట!” అన్నాడు. “ కూర్చో! నాకు నువ్వు కొంచెం సహాయం చేయాల్సి ఉంటుంది! కానీ నెలకి ప్రస్తుతానికి పదివేలు మాత్రమే ఇవ్వగలను. నాకు అవకాశం ఉంటే పదిహేను వేల వరకు ఇస్తాను. తర్వాత ఇంకా ఎక్కువగా ఇస్తాను. “ మహాలక్ష్మి గారు!మీరు నాకు ఉద్యోగం ఇస్తాను అంటే ఎంత కష్టమైనా పనైనాచేస్తా! చెప్పండి!ఏం చేయాలి!” “ రేపు తాపీ మేస్త్రివస్తాడు ఆ పనులు,ఇంకా సిమెంటు, ఇసుక ఇలాంటి వాటికి ఎంత అవుతుంది అన్నీపక్కాగా లెక్కవేసి చెప్పాలి. ఇంకా లేబర్ ఖర్చు ఎంత అవుతుందోలెక్క వేయాలి. ఏ రోజు లెక్క ఆ రోజు నాకు చెప్పాలి.” “అలాగే! తప్పకుండా! రేపు ఉదయాన్నే వస్తానండి!” సంతోషంగా అన్నాడు వెంకటరమణ. “ ఈ మూడు వేలు నువ్వు ఉంచుకో! ఇంట్లో ఖర్చులకి వాడుకో!” అంటూ అందించింది. “ థాంక్స్ అమ్మ!”అన్నాడు. మర్నాడు నుండి పనులు మొదలుపెట్టారు పది రోజులు అయ్యే సరికి మహాలక్ష్మి అనుకున్నట్లుగా తయారైంది. తోడుగా వెంకటరమణ ఉండడంతో పని మరింత సులువైంది. సీతాలు,చిట్టయ్య లసంతోషానికి అంతే లేదు. శ్రీహరి సరే సరి!నానమ్మ! అంటూ వదలడమే లేదు “ అమ్మ!ఇంటి పని పూర్తయింది.ఇంక ఏం పని ఉందో మీరే చెప్పాలి.”అన్నాడు వెంకటరమణ. “ ఈ ఊర్లో ఏదైనా మంచి స్వీట్ షాపు పెట్టాలను కుంటున్నాను!మంచి ప్లేస్ చూడు! షాపు రెంట్ ఎంత ఉంటుంది?అలాంటివన్నీ కనుక్కో! కనుక్కొని చెప్పు!” వెంకటరమణ వివరాలన్నీ కనుక్కుని చెప్పాడు. రెంటుఎంత ఉంటుందో చెప్పాడు. “ కానీ ఒక పాత షాప్ అమ్మకానికి ఉంది! వాళ్ళకి డబ్బు అవసరం ఉండడంతో తక్కువకే అమ్మేలా ఉన్నారు! ఫర్నిచర్ ఉంది! షాప్ కొంచెం రిపేర్ చేయించుకోవాలి.” “రేపు మనం వెళ్లి చూద్దాం!” అంది మహాలక్ష్మి.మర్నాడు వెళ్లి సెటిల్ చేసుకున్నారు. షాపుకిపెయింట్లు అలాంటివన్నీ దగ్గరుండి మహాలక్ష్మి, వెంకటరమణ చూసుకున్నారు. ఇంటిదగ్గర షెడ్ లో రకరకాల స్వీట్లు చేయించే పని సీతాలు కి,చిట్టయ్యకి అప్పగించింది. “చిట్టి నాయుడు! ఈరోజు చాలా ముఖ్యమైన రోజు !మనం చేయించిన స్వీట్స్ అన్నీ తీసుకొని వెళ్లాల్సిన సమయం వచ్చింది! పదండి! అందరూ వెళదాం!”అందిమహాలక్ష్మి. అందరూ షాప్ కివెళ్లారు షాప్ కి పూలదండలు అవీకట్టి డెకరేట్ చేసి ఉంది.తెచ్చినస్వీట్స్అన్నీలోపలఅందంగాసర్దారు.

“చూడు చిట్టయ్య! ఈ షాపు పేరు ఏమిటో తెలుసా!”అన్నాడు వెంకటరమణ. “తెలియదు!ఏటా పేరు?” “ చిట్టి నాయుడు స్వీట్స్!” ఎలా ఉంది పేరు!” “ ఇదేటమ్మా! నా పేరెట్టీసినారునారు!”ఆశ్చర్యంగా అన్నాడు. “ ఎందుకంటే,షాపు నీదే గనుక!” నవ్వుతూ అంది మహాలక్ష్మి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. “పద! పద!”షాపు ఓపెన్ చెయ్యాలి కదా! శ్రీహరి చేత ఓపెన్ చేయిద్దాం!సరేనా!” “సరే అమ్మ!” “ శ్రీ!షాప్ ఎలా ఉంది!” “సూపర్ అంటే సూపర్! నాన్న మ్మ!” “ రిబ్బన్ కట్ చెయ్!” “ అలాగే నానమ్మ!”రిబ్బన్ కట్ చేశాడు. “ఓకే! వెంకట్!మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించాం! కానీ ఒక పెద్ద సమస్య ఉంది.” “చెప్పండి మేడం!” “ రేపు ఉదయాన్నే నువ్వు ఇంటికి రా! అప్పుడు చెప్తాను.”సరే మేడం!”వెంకట్ ఉదయాన్నే వెళ్ళాడు . ”నేను ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నా.” అంది మహాలక్ష్మి. “ అలాగే మేడం!” “ఇంకా చిట్టి నాయుడుకి, సీతాలుకి తెలుగు నేర్పాలి. ఇంకా ముగ్గురికి పెద్ద ఫోన్ వాడటం నేర్పాలి!ఈ కాలంలో అది అవసరం కూడా!” “ అలాగే మేడం! తప్పకుండా!” “ అమ్మో!నాకొద్దు!కావాలంటే మీ ఇద్దరూ నేర్చుకోండి!”అంటూ బయటికి పరిగెట్టబోయాడు చిట్టి నాయుడు. “వెంకట్! పట్టుకోవాడిని!” అనడంతో వెనకే వెళ్లి తీసుకొచ్చాడు. “ నాకు చదువు ఎలా వస్తాది అమ్మా!” “అదే వస్తుంది!” “ఆడు నేర్చుకుంటాడు అమ్మా! నాకొద్దు!” అంది సీతాలు. అలాంటి అవకాశాలు ఏమీ లేవు! అందరూ చదువుకోవాల్సిందే! ఖరాకండిగా చెప్పింది మహాలక్ష్మి.ఆరు నెలలలోచిట్టినాయుడుకి, సీతకి చదవడం రాయడం వచ్చాయి. ఫోన్ వాడటం వచ్చింది. మహాలక్ష్మి ఇంగ్లీష్ నేర్చుకుంది. చిట్టి నాయుడిస్వీట్స్ కి మంచి పేరు వచ్చింది.ఇప్పుడు చిట్టి నాయుడు, సీత ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. సిటీలోఎక్కడ ఫంక్షన్ జరిగినా చిట్టి నాయుడు స్వీట్స్ ఉండాల్సిందే! దానికోసం వెంకట్ ఎంతగానో కష్టపడ్డాడు! అతనికి ఇబ్బంది లేకుండా చాలా ఎక్కువగానే జీతం ఇచ్చేది. “ వెంకట్!చూడు!ఏదో పాత ఫ్యాక్టరీ అమ్మకానికి వచ్చింది వెళ్ళి చూద్దాం పద!” “అలాగే మేడం! ముందు నేను వెళ్లి చూసి వస్తాను! రేట్ ఎలా ఉంటుందో మీకు ఫోన్ చేస్తాను! ఈలోగా మీరు మనీ రెడీ చేసుకోండి.” “సరే వెంకట్! నువ్వు వెళ్ళు! ఒరేయ్ చిట్టినాయుడు!నువ్వు వెళ్లి కటింగ్ ప్లేయర్ తీసుకురా!” అనడంతో వెళ్లి తీసుకొచ్చాడు. “ ఈ వెండి కడియాలు తీయాలి కడియానికి లోపల వైపున మరొక చిన్న నట్టు ఉంది.ఇది ఓపెన్ చెయ్యి! అందిమహాలక్ష్మి. చిట్టినాయుడు ఓపెన్ చేశాడు. లోపల అంతా చిన్న చిన్న బంగారు నాణాలు ఉన్నాయి! అవన్నీ బయటికి తీసింది. “మా నాన్న ముందుచూపు ఇది!జాగ్రత్తగా ఇలా బంగారం భద్రపరిచాడు!నాకు అవసరం వచ్చినప్పుడు వాడుకోమన్నాడు. వెండి కడియాల్లోబంగారం ఉంటుందని ఎవరూ ఊహించలేరు కూడా! ఇవి మార్చి కేష్ గామారుద్దాం!త్వరలో మనంఫ్యాక్టరీకొనబోతున్నాం! చిట్టి నాయుడు, సీతాలు ఎంతోసంబరపడ్డారు. “ అందుకే నా అమ్మ!నువ్వు నడుస్తుంటే వెండి కడియాలుఘల్లు ఘల్లు మని శబ్దం వచ్చేవి! అవును లోపల వెండి మువ్వలుకూడా ఉన్నాయి. ఇదంతా మా నాన్నముందుచూపు!ఇప్పుడుమనకుఉపయోగపడుతోంది!” అందిమహాలక్ష్మి. ఫ్యాక్టరీతొందరలోనే మంచి అభివృద్ధిలోకి వచ్చింది. దానికోసం వెంకట్ ఎంతగానో కష్టపడ్డాడు. మరి ఇంక వెంకట్, చిట్టి నాయుడు, మహాలక్ష్మి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఐదు సంవత్సరాలు తిరిగేసరికి మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యాపారరంగంలో అగ్రగామిగా నిలిచింది. వెంకట్ ఆ సంస్థకి సీఈవో అయ్యాడు. మహాలక్ష్మి వారించినా చైతన్య లావణ్యఎలా ఉన్నారో ఆరా తీశారు వెంకట్, చిట్టినాయుడు.ఆస్తులన్నీ హారతి కర్పూరం లో అయిపోవడంతో రోడ్డునపడ్డారు. మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో చిన్న ఉద్యోగం ఇచ్చాడు వెంకట్. “రేపు మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫౌండర్ మహాలక్ష్మి గారు ప్రసంగిస్తారు! బిజినెస్ మాన్, కాలేజ్ స్టూడెంట్స్ వస్తా రు. ఇంకా ఉద్యోగులకు బోనస్ లు కూడా ఇస్తారనుకుంటా!” అన్నాడు చైతన్య. “ అవునా!పదండి!మనం కూడా వెళ్దాం!”మహాలక్ష్మి కొడుకు కోడలు ఎంతో ఆశపడుతున్నారు బోనస్ కోసం! చేతిలో వజ్రాన్ని వదిలేసి గులకరాళ్లు ఏరుకుంటున్నట్టుంది వారి పరిస్థితి! *

**** అక్కడ అంతా హడావిడిగా ఉంది. మహాలక్ష్మిప్రసంగం వినడానికి అక్కడ అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. “ మేడం! చైతన్య,లావణ్య వచ్చారు అన్నాడు వెంకట్. “వాళ్ళు మారే ఉంటారు!ఎంతైనా మీ కన్నా కొడుకు కదా! పిలిపించమంటారా అన్నాడు చిట్టి నాయుడు. “ చిట్టి నాయుడు! వాళ్లు మారే వాళ్ళు కాదు!అయినా వాళ్ళుఎలా ఉంటారో నువ్వే చూద్దువు గానినీ సెల్ ఆన్ చేసి ఉంచు. నేను ఇక్కడ నుంచి వింటూ ఉంటాను. “ సరే అమ్మ !”చిట్టి నాయుడు సెల్ ఆన్ లో ఉంచి దగ్గరికి వెళ్లి నించున్నాడు. “ఆవిడే మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫౌండర్!”అన్నాడుచైతన్య. “అలాగా!కొంచెం మీ అమ్మలా అనిపిస్తుంది!” “మా అమ్మ ఎందుకు అవుతుంది?ఆ రోజు తెలివి లేని ఆవిడని రోడ్డు పక్కన పడేసి పోయాం కదా!” “ ఆవిడ అయితే ఊరుకుంటామా! ఆవిడ ఆస్తి మొత్తం చేజిక్కించుకోకుండా ఉంటామా! అయినా అదిచాలా పవర్ ఫుల్ మందు. రెండు రోజులు అలాగే ఉంటే ప్రాణం పోతుంది.ఆవిడ అప్పుడే చచ్చిఉంటుంది.” “మా అమ్మ కాళ్ళకి వెండి కడియాలు ఉంటాయి!మామూలుగా అయితే శబ్దం చెయ్యవు. ఆవిడ కాళ్ళ విచేస్తాయి.” “ఆవిడ ఎలాంటిదో మనకు తెలుసు కదా! మంచితనం లేదు! మనుషిలో!” “అవునవును!”సెల్ ఆఫ్ చేసాడు వినలేక. మహాలక్ష్మి నవ్వుకుంది. “ సరేలే చూడు!ఆవిడ స్టేజ్ ఎక్కుతోంది. ఆమెకాలు పెట్టగానే ఘల్లుమని శబ్దం అయింది.చైతన్య లావణ్య గుండెల్లో బాంబు పేలినట్లు అయింది ఆమె పై పైకిఎక్కుతోంది.మెడలు పైకి సాచి చూస్తున్నారు!వారు ఇక్కడ! ఆమె ఎక్కడో! కాలం నడుస్తూనే ఉంది. మహాలక్ష్మి కాలివెండి కడియాలు సవ్వడి చేస్తూనే ఉన్నాయి. *****

మరిన్ని కథలు

Chillara kshanalu
చిల్లర క్షణాలు
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Nee jeevitam nee chetallo
నీ జీవితం నీ చేతల్లో
- జి.ఆర్.భాస్కర బాబు
Aseerwada mahima
ఆశీర్వాద మహిమ
- ambadipudi syamasundar rao.
Okati tliste marokataindi
ఒకటి తలుస్తే మరొకటైంది
- మద్దూరి నరసింహమూర్తి
Swargalokam vardhillali
స్వర్గలోకం వర్ధిల్లాలి
- సదాశివుని లక్ష్మణరావు విశాఖపట్నం
Dongalu baboy
దొంగలు బాబోయ్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Lokam teeru
లోకం తీరు
- టి. వి. యెల్. గాయత్రి.