పెళ్ళిసంబంధం - వడ్లమాని లక్ష్మి సత్యనారాయణ

pellisambandham

కృష్ణమూర్తికి కోపం వచ్చింది. తన మీద, సభ్య సమాజం పైన. పెళ్లి వయసు వచ్చిన మొగ పిల్లల తల్లితండ్రుల పైన. రోజూ భార్య ఇచ్చే కాఫిని మెచ్చుకునే అతను,‘వేడి లేదు’,‘చెక్కర లేదు’ అంటూ విసుక్కున్నాడు.

దీని కల్లా కారణం ఏమిటంటే అతను వాళ్ళ ఒక్కగానొక్క అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. జాతకాలు,నక్షత్రాలు నమ్మకూడదు ‘ట్రాప్’అంటాడు.ఈ ప్రయత్నంలో అతను ఎవరైనా వివాహ వేదికలు గట్రా నిర్వహిస్తుంటే వెళ్ళడం నేర్చుకున్నాడు. దానికి ప్రత్యేకంగా ఆదివారం కేటాయించాడు. అతను అంత త్వరపడటానికి కారణం: రెండు సంవత్సరాలలో పదవీ విరమణ చేస్తాడు. ఈ లోపుగా పదవి ద్వారా వచ్చిన పరపతిని ఉపయోగించి అమ్మాయి పెళ్లి చేద్దామని ప్రయత్నం. ‘మాట్రిమోనీ కాలంలో’ రిజిస్టర్ చేశాడు.

ప్రతీ శనివారం ఇంటర్ నెట్ లో, వేరు వేరుమాట్రిమోనీ సైట్లలో మొగ పిల్లలప్రొఫైల్స్ చూడడం, నచ్చిన వాళ్లను షార్ట్ లిస్టు చెయ్యడం లాంటివి చేస్తూ, ఇచ్చిన వివరాల ప్రకారం తల్లితండ్రులుతో మాట్లాడడం మొదలు పెట్టాడు. మొదట్లో అందరూ వివరాలు తీసుకొని జాతకాలు ఒప్పలేదని, నక్షత్రాల కంపాటబిలిటీ తక్కువగా ఉందని, అమ్మాయి నాజూగ్గా లేదని, ఛాయ తక్కువఅంటూ రకరకాల కారణాలు చెప్పసాగారు. మూర్తిగారు అమ్మాయి కుందనపు బొమ్మ అని అందరూ అంటుంటే చాలా గర్వంగా ఉండేది. ఇప్పుడు ఇలా అంటున్నారేమిటిఅని బెంగ పెట్టుకోసాగాడు. తెలిసిన ప్రతిఒక్కరికీఎమన్నా సంబంధం ఉంటే చెప్పండి అనితరచితరచి అడగడం మొదలు పెట్టాడు. అంతవరకు వరకు పెళ్ళికి రమ్మని ఎవరు పిలిచినా, ఎదో కారణాల వాళ్ళ వెళ్ళనివాడు,ఇపుడు ఎవరైనా పెళ్ళికి పిలుస్తే, భార్యని, పిల్లని బలవంతం పెట్టి తీసుకు వెళ్లసాగాడు. పెళ్ళిలలో పలకరింపులయ్యాక, ఉన్న అబ్బాయిల గురుంచి వాకబు చెయ్యసాగాడు. ఎన్ని చేసినా ఫలితం కనిపించలేదు.

ఒకరోజు పొద్దునే కృష్ణమూర్తి వేలు విడిచిన మేనమామ ఫోన్ చేసి, పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత ఆయనకు తెలిసిన ప్రొఫెసర్ ఉనట్టు, అతనికి ఒక కొడుకు ఉన్నాడని అతనికి పెళ్లి చేస్తారంటూ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆఖరుగా ప్రొఫెసర్ గారు కొంచెం చాదస్తం అని, జాగ్రత్తగా మాట్లాడమంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఆ రోజు సెలవు కావడంవల్ల, కృష్ణమూర్తి టిఫిన్, కాఫీ అయ్యాక తీరికగా ప్రొఫెసర్ గారితో మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు.

పొద్దున ఎనిమిది గంటల తర్వాత ప్రొఫెసర్ గారెకి ఫోన్ చేసాడు. అవతల నుండి గట్టి మూలుగు లా వినపడింది. ఏమో తోచక ఫోన్ పెట్టేసి, మల్ల ఫోన్ చేశాడు. అవతలి నుండి “అయ్యా, రెండు రోజులనుండి దగ్గుగా ఉంది, మీకే మీ పని లేకపోతే దయచేసి ఫోన్ పెట్టేయండి, లేదా ఏమికావాలో చెప్పండి”అంటూ బొంగురు గొంతుతో అవతలనుందివిన్నపడ్డది. కృష్ణమూర్తి తమాయించుకొని తనని పరిచయం చేసుకొని అమ్మాయి వివరాలు చెప్పాడు. అన్నీ తీరికగా విన్న ప్రొఫెసర్ గారు, మెల్లగా అన్ని వివరాలు మళ్ళీ మళ్ళీ అడుగుతూ, అమ్మాయి సంగతి అటు ఉంచి కృష్ణమూర్తి గురించి వివరాలు అడగడం మొదలు పెట్టాడు. జీతం గురించి, ప్రతీ ఏడాది వచ్చే ఇంక్రిమెంట్ గురించి, ఆస్తిపాస్తుల గురించి, కొన్న కార్ గురించి అడుగుతుంటే కృష్ణమూర్తికి అనుమానం వేసి, ఆయనను అడిగాడు. ఆయన “అబ్బా అదేమీ లేదు , మీరు మాకు సరితుగాగలరా లేదా అని వివరాలు అడుగుతున్నా”అని చల్లగా చెప్పారు ప్రొఫెసర్ గారు. కృష్ణమూర్తి ఖంగు తిన్నాడు, ఇంతకుముందు ఎవరూ ఇలా అడగలేదు.

మళ్ళీ ప్రొఫెసర్ గారు ‘మీ వాళ్ళు ఎవరైనా మా యూనివర్సిటీ లో ఉన్నారా లేదా పని చేశారా’అని అడిగారు. అమ్మాయి గురించి వాకబు చేస్తారుకాబోసుఅని వాళ్ళ బాబాయి తోడల్లుడు శర్మ గారి గురించి చెప్పాడు. అంతే !! ప్రొఫెసర్ గారు “వాడు మీ చుట్టమా? వాడి వల్లకదండీ నా ప్రమోషన్ రాకుండా పొయిందీ. అయినవాడు కదా అని పని మాలా ఇంటికి వెడితే, నేను ఆఫీస్ విషయాలు ఇంట్లో మాట్లాడనుఅని మర్యాద లేకుండా చెప్పాడా!! నాకు రావలసిన ప్రమోషన్ ని ‘ మెరిటోరియస్కాండిడేట్’అంటూవేరే అనామకుడుకిసిఫార్సు చేస్తాడా?” అంటూ వచ్చే దగ్గును ఆపుకుంటూ ఆవేశ పడిపోసాగాడు. కృష్ణమూర్తికి ఏమిచెయ్యాలో తోచలేదు. అన్నీవింటూ ఊరుకున్నాడు.

కొంచెం సేపు అయ్యాక, ప్రొఫెసర్ వారు ఆవేశం తగ్గించుకుని, పిల్ల విషయాలు అడగడం మొదలు పెట్టారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ , కృష్ణమూర్తి జాగ్రతగా సమాధానం ఇవ్వ సాగాడు. అమ్మాయి ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇక్కడే మంచి కంపెనీలో పని చేస్తోందని చేపినప్పుడు, ‘అబ్బే ...ఇక్కడ ఎంత పని చేసినా అమెరికా కంపెనీ లాగా కాదండీఅంటూ. అమ్మయినిఎమె. ఎస్ ఎందుకు చేయించలేదన్నారు ప్రొఫెసర్ వారు. ఎక్కువ కష్టపడకుండా కాంపస్ సెలక్షన్ ఉద్యోగం సాధించిన విషయం, భవిష్యత్తులో కల లాభాలు అన్ని వివరంగా కృష్ణమూర్తి చెప్పాడు.

అయితే అమ్మాయి ఎమె. ఎస్ కాదు కనుక పెళ్లి అయ్యాక అక్కడ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ అన్నారు నిరుత్సాహంగా ప్రొఫెసర్ గారు. మా అబ్బాయికి పెళ్లి చేసుకున్న తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది తప్ప వాడికి ఆదాయ రీత్యా ఏమీ ఉపయోగం లేదంటూ తేల్చేశారు. కృష్ణమూర్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇంకొంచెం సమయం తర్వాత ప్రొఫెసర్ గారు ఇంతకీ మీకు అబ్బాయులేన్తమందిఅని అడిగారు. దానికి కృష్ణమూర్తి సమాధానమిస్తూ అంతకు ముందు తనకు ఒక్కతే కూతురు అని చెప్పినట్లు గుర్తు చేశాడు,దానికి ప్రొఫెసర్ గారు మళ్ళీ మూలిగినట్లు అనిపించి కృష్ణమూర్తి అడిగేశాడు. ప్రొఫెసర్ గారు సమాధానమిస్తూ భలే వారే కనీసం ఒక బావమరిది లేకుండా ఎలాగండి బాబు!!. అంటూ వాపోయారు. బావమరిది ఉంటే ఏదైనాఅవసరమున్నా లేదా కష్ట కాలంలో ఆదుకోవడానికి పనికి వస్తారంటూ ...ఏ కోశాన్నా మీ సంబంధం మాకు అనుకూలంగా లేదు అనిఖరాఖండీగా చెప్పేసాడు.

కృష్ణమూర్తికి కళ్ళు తిరిగాయి.ఏమిటి ఈ మనిషి? తన వంశం పెరగడానికి ఒక మంచి సంప్రదాయమైన కుటుంబంనుండి వచ్చిన అమ్మాయి కావాలా? లేక పెళ్లి అయిన మరుక్షణంనుండి డబ్బుల పంట పండించే కోడలు కావాలా?అంటూమధనపడిపోయి“అయ్యా ప్రొఫెసర్ గారూ.ఇంత నీచంగా ఆలోచించే మీరు ఎంతోమంది విద్యార్థుల భవితను గ్యారంటీగా చెడగొట్టి ఉంటారు. మీలాంటి వారు పిల్లలుతప్పుచేస్తునప్పుడు మందలించడం పోయి, వాళ్ళ కంటే దారుణంగా ఆలోచిస్తున్నారు. ఈ వయసులో నాకు ముచ్చటగా ఉన్నా, మా ఆవిడ ఇంకొక బిడ్డను కనడానికి ఇష్ట పడదు .మీ లాంటి వారితో సంబంధం కలుపుకుందామన్న నా అలోచనకు నన్ను నేనే తిట్టుకుంటున్నా...ఛి... ఛి...”అని చీదరించుకుంటూ ఫోన్ డిశ్కన్నెక్ట్ చేసి కృష్ణమూర్తి ఆలోచనలో పడిపోయాడు.

“ఎక్కడికి వెళుతున్నాము మనము?కేవలం ఆడపిల్లను కన్నంత మాత్రాన ఆ తల్లితండ్రులు ఇంత మానసిక క్షోభ పడాలా? ఒక్క పిల్ల అయినా సరే తన భవిష్యతు బాగా చేయాలంటూ.మొదటి సంతానం తర్వాత ఆపరేషన్ చేయించుకున్న తల్లితండ్రులు ఇంత బాధ పడాలా? ఒక సంబంధం కలుపుకుంటునప్పుడు అమ్మాయి వాళ్ళ ఆచార వ్యవహారాలు, వగైరాలు చూస్తారు తప్ప వివాహ క్రతువు అన్న దాన్ని కేవలం వ్యాపార దృక్పథంతో చూసే తల్లి తండ్రులని ఏమనాలి? వాళ్లకు వత్తాసు పలికే పిల్లలనేమనాలి??” ఆలోచిస్తున్న కొద్దీ కృష్ణమూర్తి కోపం, అసహనం పెరిగిపోవడం మొదలయ్యింది.

తన వివాహం చేయడానికి తన తండ్రి పడుతున్న ఆత్రుత వగైరాలు చూసి వసుధ తండ్రి దగ్గరకు వచ్చి “ అందరూ మీలాగా ఆలోచించరు డాడీ! మీరు నా వివాహానికి పడుతున్న ఆత్రుత, వాళ్ళు వేసే ప్రశ్నలకు మీరు పడుతున్న ఇబ్బంది నేను అర్థం చేసుకోగలను. కోడలి రాకను ఒక వ్యాపార దృష్టితో చూసే అత్తామామలతో నేను ఎలా ఇమడగలను అనుకున్నారు? మరేం ఫర్వాలేదు. నాకాన్నా వయస్సులో పెద్దవాళ్లుపెళ్ళికాకుండా ఉన్నారు. ఎప్పుడు ఏమిజరగాలో అప్పుడు అది జరుగుతుంది. మీరు ఇంతహైరానా పడవద్దు” అని సమాధాన పరుస్తున్న కూతురిని గర్వంగా చూస్తూ, ఇటుపైన అన్నీ సంబంధాలు కాకుండా కోడల్నికూతుర్లా చూసుకునే అతమమాలని వెదకాలిఅని అనుకుంటూ కృష్ణమూర్తి మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు, ఈసారి కోపంగా కాకుండా గంపెడు ఆశతో...!

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు