మరో జన్మ - నాగేంద్ర

maro janma

ఎండ తీవ్రంగానే వుంది. ఎండకంటే ఉక్కపోత బాగా ఇబ్బంది పెడుతోంది. ట్రెజరీ ఆఫీసు ముందు రావిచెట్టు మీద కాకులు అరుస్తూ గోల పెడుతున్నాయి. కింద అరుగు మీద నలుగురైదుగురు ముసలమ్మలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

వృద్ధాప్య పింఛను కోసం ప్రతినెలా వస్తూనే వుంటారు. పెద్దవయసు, అయినా తప్పదు. ప్రతినెలా రావలసిందే! కానీ, గత నాలుగు నెలలుగా పింఛను రాలేదు. ఈ రోజున ఆ మొత్తం ఒక్కసారే ఇస్తారని చెప్పారు.

పొద్దుట వచ్చేటప్పుడు అన్నం తిని రావడం మంచిదయింది. లేకపోతే, ఈ మధ్యాహ్నం వేళకల్లా ఆకలితో గాబరా పడిపోయేవారు.

సెప్టెంబరు మాసం. ఒక్కోరోజు తిక్క ఎండ కాస్తుంది. ఉక్కపోతతో జనానికి పిచ్చెక్కి పోతుంది. సాయంత్రానికల్లా విపరీతమైన వర్షం కురుస్తుంది.

ఆ ముసలమ్మలు త్రెజరీ ఆఫీసుకు రాగానే గుమాస్తా విజయబాబును కలిశారు. అతను విసుగ్గా "పొద్దున్నే వచ్చారా? మాకు వేరే పనులుండవా? గంటాగి రండి" అన్నాడు. వృద్ధులంతా నెమ్మదిగా రావిచెట్టు అరుగు మీదకు చేరి పిచ్చాపాటీతో కాలక్షేపం చేస్తున్నారు.
గంట తర్వాత మళ్లీ కలిస్తే, అందరి కాగితాలూ తీసుకుని, పరిశీలించి "ఒక గంట తర్వాత రండి" నిర్లక్ష్యంగా అంటూ కాగితాలు బల్ల మీద పడేశాడు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు అతి సధారణంగా ఉపయోగించే అద్భుతమైన చిట్కా అది.

"పండు రాలాలంటే బాగా పండాలి. పైస రాలాలంటే బాగా ఎండాలి." పనికోసం వచ్చినవాళ్లను ఏదో వంకన తిప్పుతో సాయంత్రం దాకా ఎండలో విసిగిస్తేనే డబ్బులు రాలుతాయి.

వారెన్ బఫెట్కు అవకాశం లేకగానీ, మన ట్రెజరీ గుమాస్తాల దగ్గర ట్రైనింగ్ తీసుకుని వుంటే మరిన్ని లాభాలు సునాయాసంగా గడించేవాడు.
డెబ్భై, ఎనభై ఏళ్ల ముసలివాళ్లను అట్లా ఎండలో తిప్పి, విసిగించి, చివరకు తలా యాభై నొక్కేసి, పెన్షను డబ్బులు ఇచ్చాడు విజయ్ బాబు. బాధపడ్డా, తిట్టుకున్నా తప్పనిసరై రాజీపడ్డారు అందరూ... లేకపోతే రేపు రండి, ఎల్లుండి రండి అని తిప్పి చంపుతాడు. ముందు ముందింకా వేధిస్తాడు.

ఆ రోజు సాయంకాలానికే ఆకాశంలో మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఉధృతమైన వర్షానికి సూచనలు కనిపిస్తున్నాయి. బాగా ఉక్కపోస్తే వర్షం దంచికొడుతుందట.

చీకటి పడింది. ఉరుములు, మెరుపులతో ఆకాశం అలజడిగా వుంది. పెంకుటింటి అరుగు మీద మనవడిని ఒళ్లో కూర్చోపెట్టుకుని కబుర్లు చెభుతోంది రాజమ్మ. దూరంగా రోడ్డుమీద వాహనాలు వస్తూ పోతున్నాయి. వీధిలైట్ల వెలుగులో వర్షపు చినుకుల దారాలు కనిపిస్తున్నాయి.
ఇంట్లో కోడలు వంటపనిలో వుంటే కొడుకు టీవీతో కాలక్షేపం చేస్తున్నాడు.

రోడ్డుమీద ధడేలుమని శబ్దం వినిపించింది. ఉరుములా అంపించకపోయేసరికి ఉలిక్కిపడి చూసింది రాజమ్మ. పెద్ద వాహనం ఒకటి బైకును ఢీకొట్టి వెళ్లిపోయింది. బైకు, దానిపైనున్న వ్యక్తి అల్లంత దూరాన ఎగిరిపడ్డారు.

"బాబూ, లారీ బైకును గుద్దేసిందిరా" ఆతృతతో అరచింది రాజమ్మ. కొడుకు, కోడలు అరుగు మీదకు వచ్చి చూశారు. దూరంగా వీధిలైట్ల వెలుగులో అస్పష్టంగా కనిపిస్తున్నాడా వ్యక్తి. చలనం లేదు.

"ఎట్లరా కొడకా... పాపం, బతికిండో, చచ్చిండో"

"మనకెందుకమ్మా గొడవ. పోలీసు కేసైతే ఇబ్బంది" అన్నాడు కొడుకు.

"నిజమే" అన్నది కోడలు.

వర్షం దూకుడు కాస్త తగ్గుముఖం పట్టింది.

"గట్లనొద్దు కొడకా... ఏ తల్లి కన్నబిడ్డడో! మనకు చేతనైతే గింత సాయం చేద్దాం. గొడుగేస్కపోయి చూసిరా" అని బతిమాలి గొడుగు ఇచ్చి పంపింది.

కొడుకు చూసి వచ్చాడు. "పానంతోటే వున్నడు గని, ఉలుకూ పలుకూ లేదు. తలకు దెబ్బ తగిలినట్టున్నది. రక్తం బాగా కారుతున్నది" అన్నాడు.

రాజమ్మకు ఏడుపు తన్నుకొచ్చింది. కొడుక్కు నచ్చజెప్పి, పక్కిండి పోచయ్యను బతిమాలి, ఆ వ్యక్తిని అరుగు మీదకు చేర్పించింది. 108కి ఫోన్ చేస్తూంటే లైను దొరకడం లేదు.

తలనుండి రక్తం కారిపోతూంటే చారెడంత పసుపు అద్ది కట్టు కట్టింది రాజమ్మ.

రాజమ్మ చెంచాతో గోరువెచ్చటి పాలు నోట్లో పోస్తూంటే తడిగుడ్డతో రక్తం మరకలు తుడిచింది కోడలు.

కొడుకు ఎంత ప్రయత్నించినా ఫోన్లో 108 దొరకడం లేదు. చివరకు ఒక ప్రైవేటు అంబులేన్స్ కు ఫోన్ చేశాడు.

ఆ వ్యక్తికి పూర్తిగా స్పృహ లేకపోయినా, లీలగా తెలుస్తూనే వుంది. కళ్లు తెరవలేకపోతున్నాడు. అతని ప్యాంటు జేబులోంచి మనీపర్సు కిందకు జారింది. బరువైన ఆ పర్సుని కోడలు దిండు కింద దాచింది.

ఆ వ్యక్తి అది గ్రహించాడు. ఆ పర్సులో పదివేలున్నాయి. తన ప్రాణం కాపాడినవాళ్లకు అటువంటివి పదిచ్చినా ఋణం తీరదు అనుకున్నాడు.
అంబులేన్స్ వచ్చింది. ఆ వ్యక్తిని పరీక్షించి, వెంటనే గ్లూకోజ్ పెట్టారు. "అమ్మా నువ్వు సరైన సమయంలో పసుపుతో తలకు కట్టు కట్టావు. లేకపోతే, ఈపాటికి చనిపోయి వుండేవాడు. రక్తం బాగా పోయింది" అన్నాడు డాక్టరు.

ఆ తర్వాత ఆ ట్రెజరీ సెంటర్ లోని 50 మంది ముసలమ్మలకు తమ పింఛనుతోపాటు ప్రతినెలా వందరూపాయలు అదనంగా లభించసాగింది.
ఆ ఐదువేలూ పోను మిగతా జీతం అందుకున్న విజయ్ బాబు మనసులో మరోజన్మ పొందినంత ఆనందం.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు