అందరికీ పండగ - ఎన్.గోపీకృష్ణ

andirikee pandaga

"పిల్లలూ ! ఇంకో వారం రోజుల్లో దీపావళి. మీరందరూ పండగనెలా జరుపుకోబోతున్నారు? " అడిగారు మాస్టారు కిట్టు క్లాసులోని విద్యార్థుల్ని...
మా అమ్మమింటింకి వెళ్తాను సర్..నేను పెద్ద పెద్ద బాంబులు కాల్చుతాను సార్...నేను మంచి డ్రస్ కొనుక్కుంటాను సార్...పండక్కి నేను మా తాతగారింటికి హైద్రాబాద్ కి వెళ్తాను సర్...అక్కడ నాకిష్టమిన పుల్లారెడ్డి స్వీట్స్ తింటాను సర్..
ఇలా రకరకాల సమాధానాలు చెప్పరు పిల్లలందరూ.
మాస్టారు వాళ్ళందివంకా చూసి, " అంతేన..? మన ఆనందం కోసం మాత్రమే పండుగలా? మన సమాజం కోసం, పర్యావరణం కోసం ఏమీ ఆలోచిననక్కరలేదా? ఏమీ చెయ్యరా? " అనడిగారు.
" చెప్పండి సర్ ఏం చెయ్యాలి " ముక్త కంఠం తో అడిగారు పిల్లలంతా.
"అది మీ ఆలోచనకే వదిలేస్తున్నాను..పండగ తర్వాత మీరంతా నాకు చెప్పాలి..సరేనా" అన్నారు మాస్టారు.
సరే సార్... అన్నారు పిల్లలంతా.
***********
ఆరోజు దీపావళి పండగ. కిట్టు అమ్మమ్మ గారింట్లో ఉన్నాడు. కిట్టు వాళ్ళ అమ్మ, అమ్మమ్మ, అత్త, అందరూ పిండివంటలు చేసే హడావుడిలో ఉన్నారు. కిట్టు వాళ్ళ నాన్న, మామయ్య హాల్లో కబుర్లు చెప్పుకుంటున్నారు.
"కిట్టూ...హరీ..సునితా..అందరూ పూజగదిలోకి రండి.. అలాగే మీ కొత్తబట్టలు కూడా తీసుకురండి..దేవుడి ముందు పెట్టి పూజ చెయ్యాలీ.." అంటూ పిలిచింది కిట్టు వాళ్ళ అమ్మమ్మ. అందరూ తీసుకుని వచ్చారు కానీ, కిట్టు మాత్రం దూరంగా ఉండిపోయాడు.. " కిట్టూ.. నీ కొత్త డ్రస్ ఏదీ? అనడిగింది వాళ్ళమ్మ. మమ్మీ..అదీ..అదీ...నా కొత్త డ్రస్....అంటూ నసిగాడు కిట్టు. ఈలోగా హరి, " అత్తా ఇందాక ఒంటిమీద చొక్కా కూడా లేకుండా ఇంటిముందుకొచ్చిన బిచ్చగాళ్ళ కుర్రాడికి కిట్టు తన కొత్త డ్రస్ ఇచ్చేసాడు.. అంటూ. చెప్పేసాడు. వార్నీ..అదేం పనిరా..?" అంటూ ఆశ్చర్యపోయింది కిట్టు వాళ్ళ అమ్మ. " అదికాదు మమ్మీ, మనకోసం కాకుండా వేరేవాళ్ళకోసం ఏం చేసారో చెప్పమన్నారు మా మేస్టారు. అందుకనీ..." అన్నాడు కిట్టు.
చిర్నవ్వుతో వాళ్ళ అమ్మమ్మ కిట్టుని దగ్గరకు తీసుకు, " నా మనవడు బంగారుకొండ. ఎంత పెద్ద మనసురా కన్నా" అంటూ ముద్దు పెట్టుకుంది.
అది చూసిన హరి, " అయితే నాయనమ్మా, నేనూ ఓ మంచిపని చేస్తా...చుట్టుపక్కల వాళ్ళనూ, మూగజీవాలనూ ఇబ్బందిపెట్టి, వాతావరణకాలుష్యానికి కారణమయ్యే పేద్ద శబ్దం వచ్చే టపాసులు కాల్చను. " అన్నాడు...
ఈలోగా కిట్టు వాళ్ళ మామయ్య, నాన వచ్చి, " వెరీగుడ్ హరీ....అలాగే ఇంకోమాట చెప్పనా? ఒక్క అబ్బాయి తల్చుకుంటేనే కనీసం ఒక్క పేదవాడిని సంతోషపెట్టగలిగాడు. మన ఫామిలీ, మన అపార్ట్మెంట్, మన కాలనీ...అందరూ కలిస్తే ఇంకెంతమందిని సంతోషపెట్టవచ్చు? మన వంతు మన ఫామిలీ అందరం కలిసి తలా కొంత వేసుకుని రోడ్ల పక్కన, అనాధ శరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో ఏ ఆనందాలూ లేని వాళ్ళ కోసం మనకు వీలైనంత స్పెండ్ చేద్దాం..... అందరికీ పండగ ఆనందాన్ని పంచుదాం.....సరేనా?" అన్నాడు..... అందరూ అలాగే అన్నట్టు తలూపారు....

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు