పిచుకలు - శాఖమూరి శ్రీనివాస్

pichukalu

ప్రతిరోజు ఈ పిచ్చుకలు చేసే అల్లరి భరించలేకపోతున్నాను. రోజూ వచ్చి కాసేపు కిచకిచలాడి వెళితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, అవి అంత సౌమ్యం గా వుండడంలేదు. తాజా ఆకుకూరలు, కూరగాయల కోసమని వీటిలో విత్తనాలు చల్లుతానా? మొలకలు మట్టిలోనుంచి తొంగి చూసిన మరుక్షణమే ఎంచక్కా అవి తిని వెళుతున్నాయి. పిచుకలు మొలకల్ని తినిపోయిన ఖాళీ మట్టికుండీలన్ను భర్త మోహన్ కు చూపుతూ వాపోయింది శాంత.

అయితే ఏం చేద్దామా నీవే చెప్పు అసలే పిచుకలు అంతరించిపోయే పక్షుల జాబితాలో వున్నాయి. ఇంకొన్ని సంవ్త్సరాల తరువాత ఒక పిచ్హికైనా కనబడుతుందో లేదో? అవి రోజూ మన ఇంటికి రావడం మన అదృష్టం గా భావించాలి. ఎలాగోలా వాటి కిచకిచలను ఆస్వాదించడం నేర్చుకోవాలి. అలాగే మన మొలకల ద్వారా వాటి ఆకలి కొంతైనా తీరుతోందని సంతోషించాలి. శాంతకు హితవు చెప్పాడు మోహన్.
తల్లిదండ్రుల సంభాషణ వింటున్న కౌశిక్ కు మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది. అమ్మా నీవేం దిగులు పడొద్దు. పిచ్చుకలు మొలకలు తినకుండా చూసే పూచీ నాదీ. దానికి తగిన ఉపాయం నా దగ్గర వుందిగా? కళ్ళను ఎగరేస్తూ చెప్పాడు.

అలాగా... నీవలా చేసావనుకో నీకు నచ్చిన తినుబండారాలు చేసిపెడతాను నాన్నా. కౌశిక్ బుగ్గలను పులుముతూ చెప్పింది శాంత.ఇక ఆరోజు సాయంత్రమే ఇంట్లో వృధాగా పడుకున్న కొన్ని చెక్క పలకలు, కొంత తను దాచుకున్న సొమ్మును తీసుకుని వడ్రం గి దగ్గరకు వెళ్ళాడు కౌశిక్. ఆ చెక్క పలకల ద్వారా ఎలాంటి వస్తువు తయారుచేయాలో చెప్పే కొంత సొమ్ము కూడా ముందస్తుగా ఇచ్చి వచ్చాడు.రెండు రోజుల తరువాత వెళ్ళి తయారైన వస్తువును ఇంటికి తీసుకువచ్చాడు కౌశిక్. అదొక చెక్క గూడు ! దానిని తల్లిదండ్రులకు చూపిస్తూ గూటిని వసారాలో వేలాడదీసి రోజూ ఇందులో కొన్ని గింజలు, మంచి నీరు వుంచుదాం. రెండు మూడు రోజుల కల్లా పిచ్చుకలు ఈ గూటికి మచ్చికవుతాయి. చక్కగా గింజలు తిని, నీళ్ళు తాగి వెళ్ళిపోతాయి. ఇక మన మొలకల జోలికి అసలు రావు. ఇది నా హామీ అన్నాడు గర్వం గా..

ఇదంతా నీకెలా తెలుసురా ? ఆశ్చర్యం గా అడిగాడు మోహన్.

మా పుస్తకాల్లో వునందే ఇదంతా? అక్కడ చదివిన దానిని ఇక్కడ చేయడానికి ప్రయత్నిస్తున్నానంతే... ఇక పిచ్చుకలు ఈ గూటికి అలవాటు పడటమే మిగిలింది. శాస్త్రవేత్తలా ముఖం పెట్టి చెప్పాడు కౌశిక్. నాటి నుంచి ఆ గూటిలో నీళ్ళు గింజలు పెట్టడం ప్రారంభించారు.

నాలుగు రోజులకల్లా ఆ పిచ్చుకలు గూటిని, అందులో వుంచిన వాటిని గుర్తించాయి. ఉదయాన్నే వచ్చి కాసిన్ని గింజలు తిని రెండు గుక్కల నీటిని తాగి వెళ్ళడం ప్రారంభించాయి. అప్పటినుంచి అవి కుండీలోని మొలకల వైపు అవి కన్నెత్తి కూడా చూడలేదు.

కుమారుడు చేసిన పని శాంతకు ఎంతగానో నచ్చింది. పిచ్చుకల కువకువలు ఆమెకు ఇంపైన సంగీతం లా తోస్తోంది. రోజురోజుకూ కుండీలలోని మొలకలతో పాటు పిచ్చుకల సంఖ్య కూడా పెరగసాగింది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు