మార్పు - హైమాశ్రీనివాస్

change
కిరణ్మయి ఆఫీసు నుంచీ వచ్చేసరికి రాత్రి ఎనిమిదైంది.గుమ్మంవద్ద కూర్చునున్న అమ్మా నాన్నల్ని చూసిఆశ్చ ర్య పోయింది." ఏంటమ్మా! ఎప్పుడొచ్చారు? అసలు ఫోనెందుకు చేయలేదు? అసలు ఇలా ఎందుకు రావాల్సి వచ్చిందీ! " అంది. "ముందు తలుపు తెరువు. నిదానంగా అన్నీచెప్తాం." అంది అమ్మ అరుణ మ్మ ." దాహంతో నాలుక పిడచకట్టుకుపోయింది."అంటూ నాయన నాగేశం అన్నాడు. గబగబా తలుపు తాళం తీసి ఇద్దర్నీ లోపలికి పిలుచుకెళ్ళింది.ఫ్రిజ్ లో చల్లని నీరిచ్చి"ఏమైందో చెప్పండి! ఐనా అన్న మిమ్మల్నిలాఎలా పంపాడు? బుధ్ధిలేనివాడు.మీకోడలు మహారాణి ఏంచేస్తున్నది?”అంది ఉగ్రురాలై కిరణ్మై. " కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుందని అదంతా ఎందుకుఏమ్మా!." “అమ్మా! కిరణ్మయి ! ఇంక నీవేమాకు దిక్కు. మీవదిన మేము ఇంట్లో ఉంటే తానుండనని యాగీచేసింది. మమ్మల్ని గెంటేసింది.

ఫిల్లల్ను తీసుకుని పుట్టింటి కెళ్ళిపోయింది.మీఅన్న వెళ్ళి బ్రతిమాలి తీసుకొస్తానని వెళ్ళాడు. ఆమె వచ్చేసరికి మేముంటే గొడవవుతుందని మీ అన్న మమ్మల్ని వెళ్ళిపొమ్మన్నాడు “ అంటూ బావురుమన్నారు ఇద్దరునూ. “ అదేంటీ వదినకీ పిదపకాలం బుధ్ధి ఎందుకొచ్చిందీ! పార్వతీ పరమేశ్వరుల్లాంటి మిమ్మల్ని ఇంట్లోంచీ వెళ్ళమంటుందా! ఏం ఆమె అమ్మానాన్నల్లాంటి వాళ్ళు కాదా మీరు? వాళ్ళ అమ్మా నాన్నల్ను వాళ్ళ వదిన బయటికి గెంటేస్తే ఏం చేస్తుందిట? ఐదేళ్ళనాడొచ్చిన ఆమెకోసం , కనీపెంచీ పెద్దచేసిన అమ్మా నాయల్న ను పంపించేశాడా వాడు? “ అంటూ అన్న ,వదినపై కేకలేయసాగింది." ఐనా నేనుండగా మీకేం భయంలేదు. మీరిద్దరూ మాఇంట్లోనే ఉండండి.చూస్తాను వాడిపనీ, వాడి భార్య పనీనీ"అంది ధీమాగా. "మీ ఇంట్లో ఉంటే మీ అత్తామామా, మీఆయనా ఊరుకుంటారుటే!" అడిగింది అమ్మ అరుణమ్మ.

" మీ ఇంట్లో రెండుబెడ్రూంసేగా ఉండేవి, మేమెక్కడుంటా మమ్మా కిరణూ!" అడిగాడు నాయన నాగేశం. గతుక్కుమంది కిరణ్మయి . "అవనీ నేను చూసుకుంటా న్లేగానీ ఎప్పుడనగా తిన్నారో రండి వేడిగా దోసేసి పెడ తాను." అంది.వాళ్ళిద్దరూవెళ్ళి కాళ్ళూ ముఖాలూ కడుక్కుని డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నారు. పర ధ్యానంగా దోసె వేస్తున్న కిరణ్మయి తో " కిరణీ ! అసలు నిన్నో విషయం అడగాలే మాబాధలోపడి మర్చేపోయాం.అసలు ఇంటి కెందుకు తాళమేసుందే? ఎప్పుడూ మీ అత్తామామా ఇంట్లోనేగాఉంటారు. నీవు వచ్చేసరికి అన్నీ వండి పెడుతుంటారుగా?" "వాళ్ళూ వాళ్ళూ .." "ఏమైనారే వాళ్ళు ? పార్వతీ పరమేశ్వరులంటే అసలు వాళ్ళేనే...ఎక్కడికెళ్ళారు.నీవులేకపోయినా మేమెప్పుడొచ్చినా వేడిగా వండిపెట్టేవారావిడ! ఆయనెంత మంచివాడే మాకు కాళ్ళుకడుక్కోను నీరు తానే తెచ్చిచ్చేవాడు. చెప్పవేమే?ఎక్కడవాళ్ళు?తరిమేశావా? తగాదా పెట్టుకున్నావా?చెప్పు." "అదీ అదీ..." నోరుదాటి మాటరాలేదు కిరణ్మైకి . "ఛీ వాళ్ళకు స్థానంలేని చోట మాకూలేదు. ముందుగా ఇదివారిల్లు, ఆతర్వాతే మేముండాలి.మమ్మల్ని మీవదిన తరిమేసిందంటే అంత ఎగిరిందానివి , నీవేం చేశావే మీ అత్తామామల్ని? మేం వెళుతున్నాం,."అంటూ లేచి సంచీ తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిరూంలో పడుకుంది.అంతా ఒక సినిమా రీలులా తిరుగు తున్నది ఆమె మదిలో. " నేను నీతో బ్రతక లేను. నీ నిజస్వరూపం తెలీక నిన్ను పెళ్ళి చేసుకున్నందుకు చాలానే అనుభవించాను. ఇహ నాకు ఓపిక లేదు." ఖచ్చితం గా చెప్పింది కిరణ్మయి .

“ నిన్ను నేనేం మోసం చేశాను!.ఏవిషయంలో..? ” అడిగాడు సమ్యమనం పాటిస్తూ గాంధీ. “నీ అమ్మా నాన్నా మనతో ఉంటారని చెప్పావా? ” “ నా పేరెంట్స్ నాతో ఉండక మరెక్క డుంటారు?” ఆశ్చర్యంగా అడిగాడు. “నా కిష్టంలేదు. వాళ్ళు మనతో ఉండటం , పెళ్ళికి ముందు నీ వీవిష యం నాతో ఎందుకు మాట్లాడలేదు.” “ఇదేమన్నాఅన్నివిషయాల్లాగా పెళ్ళికి ముందు చర్చించేదా? నేనొక్కడ్నే వాళ్ళకు సంతానం,వాళ్ళు మరెక్కడి కెళతారు?” “ఏ ఏట్లో కన్నా వెళ్ళమను.నాకా విషయం తెలీదు. నీఅందం, హోదా చూసి నీతో పెళ్ళికి ఒప్పుకున్నాననుకున్నావా?? ఆపాటి హోదా, ఉద్యో గం ఉండే సంబం ధాలు నాకు చాలానే వచ్చాయి. వాళ్ళంతా వాళ్ళ పేరెంట్స్ ను వాళ్ల తోనే ఉంచుకుంటామన్నందుకే నేను ఒప్పుకోలేదు.” “మరి నన్నెందుకీ విషయం ముందే అడగలేదు . అడిగి ఉంటే ఖచ్చితంగానే చెప్పేవాడ్ని. నీకోసం వాళ్ళను వదులుకోవాలా? నన్నుకన్న అమ్మా నాన్నావాళ్ళు పరాయి వాళ్ళుకాదు !” “నా కోసం వాళ్ళని వదులుకోలేక పోతే నన్నే వదులుకో!..” రోషంగా అంది కిరణ్మయి . “ఏంటే నిన్ను వదులుకోవాలా ! నీకే మన్నా పిచ్చా”? ఆశ్చర్యంగా అడిగాడు గాంధీ. “ఎస్ ? నాకు పిచ్చే నీ అమ్మానాన్నలను మనతో ఉంచుకుంటే నేను వెళ్ళిపోతాను.” “ఐతే ఏమంటావ్? విడిపోతానంటావా?” “ ఔను వాళ్ళ బాధ్యత నేను వహించలేను.

నాకు విడాకు లిచ్చెయ్! హాయిగా వంటరి బ్రతుకు బ్రతుకు తాను.”ఖచ్చితంగా అంది కిరణ్మయి . “అసలు వాళ్ళబాధ్యత నీవేం వహిస్తున్నావ్ ! మోస్తున్నావా? వండిపెడుతున్నావా? వంటరి బ్రతుకు బ్రతకాలనుకున్నదానివి నన్నెందుకు చేసు కున్నావ్ “ నీ అమ్మా అబ్బా మనతో ఉంటారని తెలీక..” “మీ అమ్మా,నాయనా మీఅన్నతో ఉండటం లేదా!వాళ్ళ నెక్కడైనా వృధ్ధాశ్రమంలో చేర్పించాడా మీ అన్న? మీవదిన నీలాగా మాట్లాడి ఉంటే ఏమయ్యేది?” “మావాళ్ళ మాటెత్తకు., మావాళ్ళకూ మీవాళ్ళకూ పోలికెక్కడ ?” “ఏం? మీ అమ్మానాయనా ఒకటి, మా అమ్మానాయనా మరొకటా? మీ అమ్మా అబ్బా నీకెక్కువైతే మా అమ్మా అబ్బానాకెక్కువే!” “నీవేమైనా అనుకో, మీ వాళ్ళతో మావాళ్ళను పోల్చవద్దన్నానా?” “ఛీ! నీతో మాట్లాడటంకంటే ఆపశువులతో మాట్లాడటంమేలు.” అంటూబయటికెళ్ళిపోయాడు గాంధీ, అతడికి గాంధీమహాత్ముడంత ఓర్పు. మరొకరోజు—“ ఈ రోజు తేల్చు , ఆ ముసలాళ్ళని ఎప్పుడు పంపిస్తావో బయటికి..."కఠిన స్వరంతో అంది కిరణ్మయి " వాట్ నాన్ సెన్స్ యూ ఆర్ టాకింగ్ . నథింగ్ డన్.." " దెన్ ఐ కెన్ గో." "డు వాట్ యు వాంట్ .. ?!” దెన్ గివ్ మి మై పోర్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ.. " "ఆర్యూ మ్యాడ్ ? నీకేమన్నాపిచ్చా? ! నీ ఆస్తేంటీ ? నీవేమిచ్చావ్ నాకు.? ఇదంతా మా అమ్మానాన్నల ఆస్థి. అదివారి అనంతరం నాకు, నా బిడ్డలకూ చెందుతుంది.నీవు నాతో ఉంటే నీవూ అనుభవించ వచ్చు. అంతే." "ఐతే పెళ్ళి చేసుకుని వదిలేస్తావా?" " నేనెక్కడ వదిలాను? నీవే వెళ్ళిపోతానని బెదిరిస్తున్నావ్ రోజూ!. యాగీ చేస్తున్నావ్! నరకాన్ని ఇంట్లోనే సృష్టి స్తున్నావ్?" " ఔను నాకోరిక తీరే వరకూ ఇలాగే ఉంటాను. నా మాట ప్రకారం ఆ ముసలాళ్ళని బయటికి పంపకపోతే , నన్ను మీరంతా చంపాలని చూస్తు న్నారని , నా వళ్ళు నేనే కాల్చుకుని , మీ మీద కేసుపెట్టి జైల్ కుపంపు తాను,." "ఛీ నీచురాలా?నీవింత మృగానివని తెలీక నిన్నుచేసుకున్నాను.ఉండు మీఅన్నను అగుతాను.నీనిజస్వరూపం దాచి నాకెందుకు అంటగట్టాడో!" " నీవు మాఅన్నకు ఫోన్ చేస్తే ఇప్పుడే గాస్ స్టవ్ వెలిగించుకు చస్తా, ఏమనుకున్నావో? "అంటూ కిచెన్ లోకెళ్ళి తలుపు మూసింది . అంతా చూస్తూ ,వింటు న్న ఆ ముసలి దంపతులు గబగబా వెళ్ళి తలుపు తట్టారు." అమ్మా! తల్లీ! మేం వెళ్ళి పోతాం , నీవేం అఘాయిత్యం చేసుకోకు. నా కొడుక్కు ప్రాణ భిక్ష పెట్టు తల్లీ!" అంటూ నమస్కరించారు. “ఈ నాటకాలు నావద్ద సాగవు. ముందు మీరిద్దరూ బయటి కెళ్ళి పోతేనే నేను బయటికి వచ్చేది.లేకపోతే పొయ్యి వెలిగించేస్తాను."అంటూ ఆగడం చేసింది కిరణ్మయి , దయ్యం పట్టిన దానిలా. ఎంతో గౌరవంగా ఉపాధ్యాయ వృత్తిలో జీవించిన ముసలి వాళ్ళిద్దరూ కొన్నిబట్టలు గబగబా తమ సంచీల్లో కూరుకుని," ఇదో తల్లీ !వెళ్ళిపో తున్నాం. ఇహ బయటికి రా !" అంటూ హడావిడిగా బయట కెళ్ళిపోయారు. ప్రేక్షక పాత్ర వహించడం తప్ప మరేం చేయలేక పోయాడు గాంధి.

గాంధీతో చెప్పసాగాడు ఆనందు" బావా! క్షమించు. "కిరణ్మయి చిన్నతనం నుండీ పెంకెగానే ఉండేది. అమ్మ నాన్నా ఉద్యోగస్తులవటం వల్ల ఒక ఆయా చేతుల్లో పెరిగింది .కోరింది ఇవ్వకుంటే ఏదో ఒక అఘాయిత్యం చేసేది .అందుకని అమ్మానాన్నాఅడిగింది ఇచ్చి అతిగారాబం చేసి చెడ గొట్టారు ,కొండమీది కోతినైనా తెచ్చి చ్చేవాళ్ళు.కోరింది చదివించారు . హాస్టల్లో ఉంటానంది ,అక్కడే ఉండిచదివింది. అత్త, ఆడబిడ్డలూ లేనివాడ్ని తెస్తేనే పెళ్ళి చేసుకుంటానంది!తాను తన భర్తాతప్ప మరెవ్వరైనా ఇంట్లో తమతో ఉండేట్లైతే పెళ్ళే వద్దంది. ఎన్నో సంబంధాలు చూసి చూసి విసిగిపోయి ఆడబిడ్డేటూ లేదుకనుక తన అమ్మా నాన్న ల్లాంటి ముసలి అత్తా మామల్ని తమతో ఉండను అంగీక రించి,సర్దుకుంటుందని భావించి,మీకు కిరణ్మయి స్వభావంచెప్పకుండా పెళ్ళి చేసిన పాపం మాదే ,దీనికై పరిహారం మేమే చెల్లిస్తాం"అంటూ కళ్ళనీరుపెట్టుకున్నాడు. "ఏయ్ కిరణ్! ఏంటే మీ అమ్మా నాన్నా వృధ్ధాశ్రమంలో ఉన్నారు?" "ఔనే! నేలమీద పరుపుకూడాలేకుండా చాప మీదపడుకుని, ప్లాస్టిక్ కంచాల్లో అన్నంతింటున్నారు.""ఏంటే ! నీమాటలు నిజమా!మా అన్నకేం వచ్చింది? మావదిన వారిని వృధ్ధాశ్రమానికి పంపుతుంటే ఎలాచూస్తూ ఊరుకున్నాడు వాడు?" " నిజమేనే , కనీసం నీవుండబట్టి వాళ్ళగురించీ తెల్సి బాధపడుతున్నావ్?పాపం మీ ఆయనతప్ప మరెవ్వరూ లేని మీ అత్తామామాకూడా అక్కడేఉన్నారు? ఈరోజు మా అత్తగారి పుట్టినరోజుపండుగని వృధ్ధాశ్రమంలో పండ్లు,స్వీట్స్ పంచేందుకు వెళ్తే అక్కడ చూశాం, నీకేమైనా మతిపోయిందా!తల్లి తండ్రి లాంటి అత్తా మామల్ని వృధ్ధాశ్రమానికి తోలేసి, మీ అమ్మా నాన్నా గురించీ బాధపడుతున్నావ్? నీవేం మారలేదన్నమాట, మూర్ఖురాలా? ఛీ నీవు నా స్నేహితురాలినని చెప్పుకోనే అసహ్య మేస్తున్నది."అంటూ ఫోన్ పెట్టేసింది కిరణ్మయి స్నేహితు రాలు సరళ. ఇంతలో కిరణ్మై మేనత్త మాలతి ఫోన్ చేసింది" ఏమే నీవు మనిషివా రాక్షసివా! అత్తమావల్ని నీమీద హత్యా యత్నం చేశారని కేసుపెడతానని బెదిరించి వాళ్ళను భయపెట్టి తరిమేశావా? పదిరోజులనుంచీ భర్త ఇంటికిరాకపోయినా ఎట్లా తిని నిద్రపోతున్నావే! నీచురాలా? నీవు చూపిన దారినే మీ వదినా నడించింది. నీలాగే వాళ్ళ అత్తామామల్ని తరిమేసింది.ఛీ! మరెప్పుడూ మాతో మాట్లా డకు. నీవు లేవనుకుంటాం" అంటూ ఛీత్కరిస్తూ ఒకరితర్వాత ఒకరు ఫోన్లుచేస్తుంటే కిరణ్మయి తలతిరిగి పోయింది. ఏనాడూ పొగిడ్తలేకానీ ఛీత్కారారు అందు కోని కిరణ్మయి జరిగిన పరిణామాలన్నీ నెమరువేసుకోసాగింది.

అంతా తననిలా చీదరించు కుంటున్నారంటే తాను తప్పుచేస్తున్నానేమో అనే ఆలోచన తో మొదటి మారుగా తన ప్రవర్తన గురించీ తర్కించు కోసాగింది. ఒక్కర్తె ఉండటాన మొదటిసారిగా వంటరితనం ఫీలవుతూ టీ.వీ ఆన్ చేసింది. ఒక సీరియల్ ప్రసారమవుతున్నది 64 వ ఎపిసోడ్ .అది కోర్ట్ సీను. న్యాయమూర్తి " కేసు పూర్వాపరాలూ,వాదప్రతివాదాలూ విన్నాక ఈ కోర్టు తీర్పు ఇలా ఇస్తున్నది.కనిపెంచిన వారు వృధ్ధు లయ్యాక పిల్లల నిరాదరణకు గురై , వృధ్ధాశ్రమాల పాలైతే ఇహఈలోకం లో వృధ్ధాశ్రమాలు వీధి కొకటి లేస్తాయి. ప్రస్తుత విద్యా విధానం లో ధనం సంపాదించడం తప్ప, బాధ్యతలు, ప్రేమాభి మానాల గురించీ చెప్పే పాఠాలే లేనందున , పెద్ద చదువులు చదివిన వారంతా దేశ విదేశా లు పట్టి పోతుంటే,కన్నవారు వృధ్ధాశ్ర మాలపాలవుతున్నారు.మరికొందరు అత్త మామల్ని శత్రువులుగా చూస్తున్నారు. అదేమంటే ’గృహ హింస కేసు పెడతామని బెది రిస్తున్నారు. ఉన్న చట్టాలను ఇలా వికటంగావాడుకోడమూ నేరమే. రేప్పొద్దున వీరికి కలిగే సంతానానికి వీరే దారి చూపుతున్నారు.ఈ వింత కాలం లో ప్రతి బిడ్డా రెండేళ్ళనుంచే డేకేర్లూ ,ఆపైన చదువులన్నీహాస్టల్లో ఉండి చదివి ,ఉద్యోగాల్లోచేరి ఫీ.జీ ల్లో ఉంటూ , తమ తోటి ఉద్యోగుల్ని,లేదా క్లాస్ మేట్స్ ను ,వారికి జీవితం పట్ల సరైన అవగాహన ఏర్పడక ముందే ,జీతాలు చూసుకుని వివాహాలు చేసుకుంటున్నారు.వారికి గృహ జీవనం గురించీకాక సహజీవనం గురించి మాత్రమే తెలుస్తున్నది.

అమ్మా నాన్నాలతో ,సోదర సోదరీ మణులతో, బంధుజనాలతో కలసి ఉండేజీవితం అనుభవం లో ఉండటంలేదు. కొందరు ఒంటరి పేరెంట్ పోషణ లో పెరిగిపెద్దవారై సంఘజీవనానికీ, కుటుంబ వ్యవస్థకూ దూరమై,అంతా స్వార్ధం. ఉన్నతవిద్య ,వెంటనే ఉద్యోగం, ఉపాధిబాగా ఉండటంవలన డిపెన్ డెన్సీ అంటే ఆధార పడడం అనేది లేనందున ,అహంకారం,ఈగో ఎక్కువై పోతున్నాయి యువతలో.అందుకు తార్కాణాలే ఇటీవల కోర్టుకు వస్తున్న విడా కులకేసులన్నీ. ప్రస్తుతం ఈ కేసులో వివాహమైనా ఇంట్లో ఎవ్వరూ ఉండకూడదు, అత్తమామలు శత్రువులు,అందుకని ---అంటూ” న్యాయ మూర్తి చెప్తుండగా ,టీ.వీ ఆపేసి , ఒక నిర్ణయానికి వచ్చిన కిరణ్మయి ఇంటికి తాళమేసి కారుతీసుకుని బయటికి బయల్దేరింది..

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు