కుడి ఎడమైతే - లాస్య రామకృష్ణ

Kudi Edamaitey story by Lasya Ramakrishna

"హా య్ గీత్స్... ఏంటి ఇంత లేటు"

"అదేరా బాబు, రాత్రి లేట్ గా నిద్రపోయాను"

"ఓహ్ ఓకే"

"సరే, ఏంటి ఇవాళ కూడా నేనే డ్రైవ్ చెయ్యాలా"

"యా... నువ్వు డ్రైవ్ చేస్తుంటే నేను రోడ్డు మీద బ్యూటీస్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తాను"

"నో వేస్, ఇవాళ నువ్వు డ్రైవ్ చెయ్యి"

"ప్లీజ్ గీత్స్, అర్ధం చేసుకో"

ఒకే, నువ్వేం అడిగినా కాదనలేను అని మనసులో అనుకుని

"ఓకే రామ్స్, ఇవాళ మాత్రమే నేను డ్రైవ్ చేస్తాను, ఇక రేపట్నుంచి నువ్వే డ్రైవ్ చెయ్యాలి, ఈజ్ ఇట్ ఒకే ఫర్ యు"

"యా, ఫైన్, ఇక పద"

***

"ఎప్పుడూ ఇదే రెస్టారెంట్. బోర్ కొడుతోంది గీత్స్"

"ఇది నాకిష్టమైన రెస్టారెంట్ రా"

"ఓకే, ఫైన్"

"నీకిష్టమైనవి ఆర్డర్ చెయ్యరా"

"నాకు ఇష్టమైనవి నీకు తెలుసుకదా, నువ్వే ఆర్డర్ చెయ్యి"

రామ్స్ కి ఇష్టమైన కొన్ని రకాల డిషెస్ ని ఆర్డర్ చేస్తుంది గీత

"హమ్మయ్య, థాంక్స్ ఫర్ ది లంచ్ మేడం గారు"

"మై ప్లెషర్"

***

"గీత్స్ ఈ షర్ట్ ఎలా ఉంది"

"అద్భుతంగా ఉంది"

"సరే ఇది నువ్వు నాకు ఇస్తున్న బర్త్ డే గిఫ్ట్"

"ఇదా, బిల్ ఎంత, అమ్మో నాలుగు వేలా, మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు"

"నువ్వు దాచుకున్న డబ్బులు ఉన్నాయి కదా వాటితో కొను"

"రామ్స్ ఓకే ఈసారికి సరే" అని ఆ షర్ట్ కి బిల్ పే చేస్తుంది గీత

***

"ఎయ్ టికెట్స్ ఏవి"

"ఆల్రెడీ ఆన్ లైన్ లో బుక్ చేసానురా, నా ఫోన్ కి మెసేజ్ వచ్చింది అక్కడ ఈ మెసేజ్ చూపిస్తే టికెట్స్ ఇస్తారు" అని హడావిడిగా మేకప్ చేసుకుంటూ చెబుతుంది

"ఇంకా ఎంత సేపు నీ మేకప్... త్వరగా రెడీ అవ్వు. నేను నీ స్కూటీ దగ్గర వెయిట్ చేస్తాను" అని బయటికి వస్తాడు రామ్స్

***

"గీత్స్, గీత్స్"

"అబ్బ ఏంట్రా, ఇంత పొద్దున్నే"

"నీకో విషయం చెప్పాలి"

"మ్, చెప్పు"

"త్వరగా కిందకి రా"

"ఓకే, గివ్ మీ ఫైవ్ మినిట్స్"

"కం సూన్"

"ఓకే రా, పెట్టు ఫోను"

అరగంట తరువాత రామ్స్ వాళ్ళ ఇంటికి గీత వచ్చింది.

"ఏంటి ఫైవ్ మినిట్స్ అంటే థర్టీ మినిట్స్ అవునా"

"నీ సోది ఆపి అసలు సంగతి చెప్పు, అమ్మాయిలు తయారవడానికి టైం పడుతుందని తెలుసుకోవేరా మొద్దు"

"ఒకే ఒకే జస్ట్ కిడ్డింగ్"

"మ్, చెప్పు, ఏంటి అర్జెంటు గా మాట్లాడాలని పిలిచావు"

"అదీ, ఆదీ"

"చెప్పరా తొందరగా"

"అదేనే, నాక్కొంచెం సిగ్గేస్తోంది"

"సిగ్గా, చిన్నపటినుంచి కలిసి పెరిగాము. ఇళ్ళు కూడా పక్క పక్కనే ఉండేవి. ఎల్ కె జీ నుండి పీజీ వరకు కలిసి చదువుదామని అనుకున్నాం. నా దగ్గర నీకు సిగ్గేంటి"

"అందుకే కదా నీకు తప్ప ఎవరికి చెప్పగలను ఇలాంటి విషయాలు. నీకు నాకు ఇంకెవరు లేరు. మనకి మనమే కదా"

"ఇప్పుడు అసలు విషయం చెప్పు"

"లవ్ మాటర్"

"ఏంటి నువ్వు లవ్ లో పడ్డావా" అని కొంచెం షాక్ తిన్న గీత రామ్స్ పై తన కున్న ప్రేమను మనసులోనే అణచుకుంది.

"అవునే"

"నేను తప్ప నీకు వేరే అమ్మాయిలు ఎవరు తెలియదు కదరా, నాతో తప్ప ఏ అమ్మాయితో మాట్లాడడానికైనా సిగ్గు పడతావు కదా"

"అదీ నిజమే"

"మరి ఎలా మొదలయ్యింది నీ ప్రేమ"

"మన అపార్ట్ మెంట్ లోకి కొత్తగా దిగారు చూశావా"

"అవును రమణ మూర్తి అంకుల్ వాళ్ళు దిగారు, వాళ్ళ అమ్మాయితో కూడా నేను మాట్లాడాను"

"ఆ అమ్మాయే"

"ఆ అమ్మాయా"

"ఏం ఎందుకు అలా అడిగావు"

"ఆ అమ్మాయి నీకు సెట్ కాదేమో రా"

"పరవాలేదే నేను అడ్జస్ట్ అవుతాను"

"సర్లేరా ఇంతకీ ఆ అమ్మాయితో పరిచయం చేసుకున్నావా" అని అడుగుతుంది

"లేదే"

"సరే నువ్వు ఆ అమ్మాయితో పరిచయం చేసుకో ఆ తరువాత ఈ విషయం ఆలోచిద్దాం"

"ఏంటి ఆలోచించేది, ఆ అమ్మాయితో పరిచయానికి నీ సహాయం కావాలి"

"సరే, గ్రాంటెడ్" అనగానే గీతని రామ్స్ ఎత్తుకుని గిర గిరా కొంత సేపు తిప్పుతాడు.

ఇంట్లోకి అడుగుపెడుతున్న గీత తండ్రి తన కూతురిని ఎత్తుకుని తిప్పుతున్న రామ్స్ వైపు నవ్వుతూ చూస్తూ

"చిన్ననాటి స్నేహం" అని లోపలికి వెళ్ళిపోతాడు.

***

ఎత్తరా ఫోన్, ఎంత సేపు వెయిట్ చెయ్యాలి అనుకుంటూ ఉండగా రామ్స్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు

"ఒరేయ్ రామ్స్"

"చెప్పు గీత్స్"

"ఆ అమ్మాయితో ఇవాళ మాట్లాడనురా"

"నా గురించి చెప్పావా"

"ఉండరా...నీ తొందర కొంచెం పక్కన పెట్టు"

"చెప్పవే ఆ అమ్మాయితో నా గురించి చెప్పావా"

"ఆ విషయానికే వస్తున్నా, ఆ అమ్మాయి నీకు సెట్ కాదేమో రా"

"ఎందుకు సెట్ కాదే"

"ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ రా, అల్ట్రా మోడరన్ కూడా, తన డ్రెస్సింగ్ స్టైల్ గమనించావా"

"ఓహ్ అవునా"

"అవున్రా, నీ మంచి కోరి చెబుతున్నా"

"నువ్వు నిజంగా నా ఫ్రెండ్ వి అయితే నాకు ఆ అమ్మాయితో పరిచయం చెయ్యి"

"సర్లేరా నీకు ఎంత చెప్పినా అర్ధం కాదు"

"సరేనే నువ్వు తప్ప నాకేవరున్నారు. నా మీద కోపం తెచ్చుకోకు"

"నాకూ అంతే కదరా"

"గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్"

"గుడ్ నైట్"

ఆ రాత్రంతా గీత రామ్స్ గురించే ఆలోచిస్తుంది.

***

"హాయ్ అని"

"హాయ్ గీతా, రా లోపలి రా, నా రూం చూపిస్తాను"

అని గీతని తన రూం కి తీసుకెళుతుంది

రూం అంతా అందం గా ఉంటుంది. షి ఈజ్ వేరి ట్రెడిషనల్ అండ్ సెంటిమెంటల్ ఫెల్లో అని ఆ గది గోడలపై ఉన్న పెయింటింగ్స్ ఇంకా అపురూపంగా సేకరించబడిన కొన్ని దేవుడి చిత్రాలను చూసి అనుకుంటుంది గీత.

నిజానికి అని డ్రెస్సింగ్ మోడరన్ గా ఉన్నా ఎక్కడా వల్గర్ గా ఉండదు.

గీత డ్రెస్సింగ్ సినిమాలోని హీరోయిన్ ని ఇమిటేట్ చేసేటట్టు ఉంటుది. అప్పుడప్పుడు శృతి మించుతుంది కూడా.

కూతురంటే అతి గారాబం చేత గీత వాళ్ళ అమ్మా నాన్నా ఏమి అనరు.

"అనీ నువ్వు చూడడానికి మోడరన్ గా ఉన్నావ్ కానీ నీ రూం మాత్రం ఎంతో కళాత్మకంగా ట్రెడిషనల్ గా ఉంది" అని ఇంకా ఏదో చెప్పబోయే లోపు

"యా ఐయాం మోడరన్ బట్ మై థాట్స్ ఆర్ కంప్లీట్లీ ట్రెడీషనల్"

"నువ్వు ఇంత పాష్ గా ఉంటావు కదా నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా"

"ఐ హావ్ మెనీ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ లో అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు. బట్ వాట్ డు యు మీన్ బై బాయ్ ఫ్రెండ్స్"

"అదే సినిమాలలో చూపిస్తారు కదా బాయ్ ఫ్రెండ్స్ అంటే పబ్బులకి షికార్లకి వెళ్తారని, డేటింగ్ అవి ఇవి చేస్తారని"

"గీతా, యు ఆర్ సో ఇన్నోసెంట్, అవన్నీ ఒక లక్ష్యం లేని వాళ్ళ కాలక్షేపాలు. నాకున్న ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒకటి సాధించాలనే తపన ఉన్నవాళ్లు. మా అందరిదీ పవిత్రమైన స్నేహబంధం. అఫ్ కోర్స్ మేము కూడా సినిమాలకి ఇంకా ఔటింగ్స్ కి వెళ్తాం కానీ వి నో అవర్ లిమిట్స్. ఒక వేళ మాలో ఎవరికైనా ఎవరిమీదనైనా ప్రేమ పుడితే కచ్చితంగా చెప్పుకుంటాం. ఎందుకంటే లోపల ఒక ఫీలింగ్ బయట ఫ్రెండ్షిప్ అని ఎందుకు పవిత్రమైన స్నేహాన్ని పాడుచేయ్యటం."

".........."

"అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. సినిమాలు చూసి అడా మగా స్నేహం అని చాలా మంది చెడిపోతున్నారు. స్నేహం చెయ్యడం లో తప్పు లేదు. బట్ ఆ స్నేహానికి చెడ్డ పేరు తీసుకు వచ్చే పనులు చెయ్యకూడదు. ఈ ఇంట్లో దిగినప్పటి నుండి నిన్ను ఇంకా ఆ అబ్బాయెవరు ఎప్పుడూ నీతోటే ఉంటాడు కదా"

"రామ్స్"

"యా రామ్స్ ని అబ్సర్వ్ చేస్తూనే ఉన్నాను. మీ అమ్మానాన్నల ముందే మీరు హగ్స్ ఇచ్చుకొవడం లాంటివి చేస్తున్నా వాళ్ళు మిమ్మల్ని అదుపు చెయ్యలేదని కూడా గమనించాను. కనీసం వాళ్లైనా మిమ్మల్ని అదుపులో పెట్టి మంచి విషయాలు చెప్పి ఉండుంటే అత్తెసరు మార్కుల నుండి మీకు మంచి మర్కులైనా వచ్చేవి. జీవితం అంటే ఒక లక్ష్యం ఉండేది.

"బట్ అనీ వి ఆర్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్"

"స్టాప్ ఇట్ గీతా"

"అనీ"

"డోంట్ యు లవ్ హిం"

"అంటే"

"నిజం చెప్పు"

"యా ఐ లవ్ హిం సో మచ్"

"థట్స్ వై యు ఆర్ ఎంటర్టైనింగ్ హిం"

"తను నిన్ను లవ్ చేస్తున్నాడట"

"ఐ నో, మీరు మాట్లాడుకుంటుంటే అంతా విన్నాను. అందుకే ఇవాళ ఎంతో బిజీ గా ఉన్నా నువ్వు మాట్లాడతానంటే నేను ఒకే అన్నాను"

"మ్ చెప్పు"

"తను నిన్ను లవ్ చేస్తున్నాడట, ఈ విషయం నీతో చెప్పమన్నాడు"

"మరి నీ సంగతి"

"అడిగితే నేను జస్ట్ ఫ్రెండ్ అనే అంటాడు. నాకున్న ఫీలింగ్ అతనికీ ఉండాలని లేదుగా"

"ఇప్పుడర్ధమయిందా. చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అన్న పేరు ని ఉపయోగించుకుని తను నిన్ను తన జల్సాలకి వాడుకుంటున్నాడు. అఫ్ కోర్స్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అయిన అబ్బాయి అమ్మాయి టీనేజ్ లో కి వచ్చాక కూడా పవిత్రం గా స్నేహంగా ఉండటంలో తప్పులేదు. కానీ ఇలా రాసుకు పూసుకు తిరగడాలు, హగ్స్ ఇచ్చుకోవడాలు ఏంటి అసహ్యంగా. ఇంత కష్టపడినా అతనికి నువ్వంటే ప్రేమ ఏర్పడదు. కేవలం తన విలాసాల కోసం నిన్ను వాడుకుంటున్నాడని గుర్తుంచుకో. ఇప్పటికైనా బుద్ధిగా చదువుకో. ఐ యాం దేర్ టు హెల్ప్ యు ఇన్ స్టడీస్"

"థాంక్స్ అని"

"ఇంకో విషయం, ఈ బట్టలేంటి, ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ"

"రామ్స్, ఇలాంటి బట్టలలో నేను అనుష్కలా ఉంటానట"

"చూసావా, నీ మీద ఇతరులకి కూడా చెడు అభిప్రాయం కలిగేలా ఇలాంటి చెత్త బట్టలు వేయిస్తున్నాడు. బిల్ తనే పే చేస్తాడా"

"లేదు బయటకి ఎక్కడికి వెళ్ళినా బిల్ నేనే పే చేస్తాను"

"అనుకున్నాను వాడి వాలకం చూసి, నీ డబ్బులతో, నీతో వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు"

"అనీ నీకు రామ్స్ గురించి తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. తను చాలా మంచివాడు"

"మంచివాడా, తనకి నీ పైన ఏ అభిప్రాయం ఉందో నేను నిరుపిస్తాను. ఈ కాలనీలో ఉన్న పార్క్ కి నేను రమ్మన్నానని రామ్స్ కి చెప్పు".

"సరే అనీ"

***

"రామ్స్ గుడ్ న్యూస్, అనీ నిన్ను కలుస్తుందట"

"వాట్, నిజమేనా"

"అవున్రా, నిజమే"

"ఓహ్ ఎక్కడ కలుస్తుందట"

"ఈ కాలనీ లో ఉన్న పార్క్ కి నిన్ను సరిగ్గా ఇవాళ సాయంత్రం అయిదు గంటల కల్లా రమ్మంది"

"ఓకే, థాంక్ యు గీతా" అని ఫోన్ పెట్టేస్తాడు.

***

చెప్పిన సమయం కంటే అరగంట ముందుగా అనీ కోసం రామ్ పార్క్ కి వస్తాడు

అక్కడకి రెడ్ కలర్ చుడీదార్ లో వచ్చిన అనీ ని కళ్ళార్పకుండా రామ్ చూస్తూ ఉంటాడు

అనీ దగ్గరికి వచ్చి "హాయ్ రామ్స్, ఐ యాం అనీ" అని పరిచయం చేసుకుంటుంది.

"హాయ్ అనీ" అని షేక్ హ్యాండ్ ఇస్తాడు.

"నీ గురించి గీత నాకు చెప్పింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావట కదా"

కొంచెం సిగ్గు పడుతూ "అవును" అని చెప్తాడు.

"మరి నాకు నీ మీద అనుమానంగా ఉంది"

"నా మీద అనుమానమా"

"అవును, నువ్వు గీత చాలా క్లోజ్ కదా"

"క్లోజ్ ఏంటి, అదే నా వెంట పడుతుంది"

"వ్హాట్"

"అవును అదే నా వెంట పడుతుంది. ఎన్ని సార్లు చెప్పానో చూడు మనం చిన్ననాటి ఫ్రెండ్స్ అయినా ఇలా రాసుకు పూసుకు తిరగకూడదు అని"

"అవునా"

"అవును అనీ, అస్సలు వినదే అలాంటి అసహ్యకరమైన బట్టలు వేసుకుని తిరుగుతుంది. మా అమ్మా నాన్న అయితే గీతతో ఫ్రెండ్ షిప్ మానుకోరా అని నస."

"అలాగా రామ్స్. ఇప్పుడు నా సందేహం తీరిపోయింది" అని అక్కడే పార్క్ లో ఒక చెట్టు చాటుగా ఉన్న గీత కి అర్ధం అయ్యేటట్టు అంటుంది.

"రామ్స్ నా పెళ్లి కుదిరిపోయింది. ఈ విషయమే నీకు చెబితే నువ్వు టైం వేస్ట్ చేసుకోవని ఇక్కడికి పిలిపించాను" అని చెప్పి వెళ్ళిపోతుంది

***

అనీ ఇంటికి గీత వస్తుంది

"సారీ అనీ"

"ఎందుకు నాకు సారీ"

"నీ గురించి నెగటివ్ గా రామ్స్ కి చెప్పి నీ పై ప్రేమ ని పోగొట్టాలనుకున్నాను, కానీ నువ్వు నాకు జరుగుతున్న విషయాలు తెలియచేసి నా కళ్ళు తెరిపించావు, ఐ యాం రియల్లీ థాంక్ ఫుల్ టు యు"

"ఫ్రెండ్స్ మధ్య థాంక్స్ లాంటి ఫార్మాలిటీస్ ఉండవు"

అనగానే గీత అనీ చేయ్యపట్టుకుని కృతజ్ఞతాపూర్వకంగా నవ్వుతుంది.

***

ఆ మరునాడు రోజూలాగే తన స్కూటీ దగ్గర వెయిట్ చేస్తున్న రామ్స్ దగ్గరికి వచ్చి "రామ్స్ మేము ఈ మంత్ ఎండ్ వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాము, సో ఇవాళ్టి నుంచే నువ్వు కాలేజ్ కి బస్ లో రావడం అలవాటు చేసుకో" అని మరో మాట వినకుండా డ్రైవ్ చేసుకుంటూ కాలేజీ కి వెళ్ళిపోతుంది గీత.

తన మాటల వల్ల గీత లో వచ్చిన మార్పును గమనించిన అనీ సంతోషిస్తుంది.

***

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి