పవిత్ర స్నేహం - వడ్డేపల్లి వెంకటేష్

pavitra sneham

ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక అందమైన నది. ఆ నదిలో ' బుద్ధిశీలుడు ' అనే ఒక తాబేలు నివసిస్తుండేది. అది ఒంటరిగా సంచరిస్తూ ఒక మంచి స్నేహితుని కోసం అన్వేషిస్తూండగా నది ఒడ్డున ఒక ఎండ్రకాయ కంపించింది.దానిని చూడగానే తాబేలుకు ఎందుకో గాని మంచి అభిప్రాయం కలిగింది. ఎండ్రకాయ దగ్గరకు వెళ్ళి " మిత్రమా ! సరైన స్నేహితుని కోసం అన్వేషిస్తున్నా, ఎందుకో నాకు సరైన స్నేహితుడివి నువ్వేనని అంపించింది. నాతో స్నేహం చేస్తావా ? " అంది తాబేలు. దానికి ఎండ్రకాయ " సరే మిత్రమా ! తప్పకుండా, ఈరోజునుంచీ మనం స్నేహితులం. కానీ నాకు ఆహారంగా ఏదో ఒక పదార్థాన్ని తీసుకురావాలి " అంది.

అందుకు బదులుగా తాబేలు " తప్పకుండా మిత్రమా ! ఈరోజునుండి ఓ స్నేహితుడుగా నీవు కోరినట్ట్లు చేస్తాను " అంది.

అప్పటినుండి వాటి స్నేహం అలా కొనసాగుతోంది.

స్నేహాన్ని, స్నేహితున్ని ఎంతగానో అభిమానించేది తాబేలు. స్వార్థం కోసమే స్నేహం నటించేది ఎండ్రకాయ.

వీటి స్నేహాన్ని గమనిస్తున్న ' దీర్ఘనాసికుడు ' అనే మొసలి, వీటి స్నేహంలోని నిజాయితీని పరీక్షించాలనుకొంది. ఎండ్రకాయ దగ్గరకు వెళ్ళి, " నీ స్నేహితుడు తాబేలును తినాలనుంది. నాకు ఆ తాబేలు జాడ చెబితే నీకు ఏది కావాలన్నా చేసి పెడతాను. " అంది మొసలి. అందుకు ఎండ్రకాయ, " ఓ తప్పకుండా...కానీ, నాకు చేపలు ఆహారంగా ఇవ్వాలి.." అంది.సరేనని ఒప్పుకుంది మొసలి.

ఎండ్రకాయ చెప్పిన జాడను వెతుకుతూ వెళ్ళింది మొసలి. తాబేలు ఎదురైంది, మొసలిని చూసి భయపడింది తాబేలు. అప్పుడు మొసలి ఇలా అంది., " నీ మిత్రుడు ఎండ్రకాయను నాకు తినాలనుంది. ఎండ్రకాయను తింటే కంటికి మంచిదని మా పెద్దవాళ్ళు చెప్పారు. ఎలాగైనా సరే ఎండ్రకాయ నీవద్దకు వచ్చే సమయం చెబితే,దానిని తినేస్తాను. అందుకు బదులుగా నీకు ఏమైనా ఇస్తాను " అంది.

అప్పుడు తాబేలు, " ఓ మొసలీ! నా మిత్రుడుని నువ్వు చంపొద్దు. కావాలంటే నన్ను చంపు..స్నేహం కోసం ప్రాణాలివ్వడానికైనా నేను సిద్ధమే " అని వలవలా ఏడ్చింది.

మొసలి ఆస్చర్యపోయింది. నిజంగా తాబేలుది ఎంతమంచిమన్స్సు అనుకుంది. తాబేలుని వదిలేసింది. " నీ మిత్రుడికి ఎటువంటి అపకారం చేయను " అంది. తాబేలు సంతోషంగా వెళ్ళిపోయింది.

ఓ రోజు మొసలి, ఎండ్రకాయను కలిసి, జరిగిన విషయం చెప్పి, తాబేలు మంచిమన్సౌను కొనియాడింది. ఎండ్ర్కాయ నీచబుద్ధిని తూలనాడింది. స్వార్థాన్ని వదిలి తాబేలుతో స్నేహాన్ని కొనసాగించమని చెప్పింది.

ఎండ్రకాయ సిగ్గుపడింది. తనలోని స్వార్థాన్ని పటాపంచలు చేసుకుంది. పవిత్రమైన స్నేహాన్ని తాబేలుతో కొనసాగించింది.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి