సరోజిని దేవి, ప్రసాద్ రావు గారు చాల హడవిడిగా పనులు చేస్తున్నరు, ఆ ఇంటి పని మనిషి శాంతమ్మకి ఆమె కూతురు కల్పనకి అయితే క్షణం ఖాళీ లేదు. ఎల్లుండి వాళ్ళ అబ్బాయి కిరణ్ పెళ్ళి. కూతురు సుధ ఆమెరికా నుంచి వచ్చే టైము అయింది వాళ్ళ అనందానికి అంతే లేదు చాల రోజుల తర్వతా అమ్మాయి వస్తుంది పెళ్ళి కళతో ఇల్లంతా కళ కళలాడిపోతుంది. ప్రసాద్ రావు గారి తల్లి సరస్వతమ్మ ఎనభైల వయసు అయినా మనవడి పెళ్ళి ఉత్సాహంతో అన్ని పనులు పురమాయిస్తూ సందడి చేస్తోంది.
ప్రసాద్ రావు గారిది సంపన్న కుటుంబం, వాళ్ళకి చాలా వ్యాపారాలు ఉన్నాయి, తరతరాల నుంచి తరగని ఆస్థి. దేనికీ లోటు లేదు పిల్లలు కూడా బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చారు కూతురు సుధ ఆమెరికాలో డాక్టరు. పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు. ఇక ఆఖరి వాడు కిరణ్ అమెరికాలో చదువుకొని వచ్చి ఇక్కడ వాళ్ళ నాన్న గారి వ్యాపారాలు చుసుకుంటున్నాడు, ఇప్పుడు పెద్దలు ఆకాంక్షతో పెళ్ళి నిర్ణయించారు.
ఆ ఇంట్లో తరతరాలనించి రంగయ్య కుటుంబుం పని చేస్తుంది, అయన ఒక్కగానొక్క కూతురు శాంతమ్మ అమె కూతురు కల్పన. కల్పన చాల చురుకైన పిల్ల చాల అందంగా ఉంటుంది వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు, శాంతమ్మ ఒప్పుకోకున్న ఆడపిల్లకి చదువు ఎందుకని అన్నా సరోజిని దేవి, సరస్వతమ్మ చదివిస్తున్నరు. వాళ్ళకి ఆ పిల్ల అంటే ప్రాణం. చాలా బాగా చుసుకుంటారు, చెప్తే తప్ప ఎవరూ ఆ ఇంట్లో పనివాళ్ళనుకోరు. వాళ్ళని చూస్తే అందరూ బంధువులు అనుకుంటారు. సుధ, వాళ్ళ ఆయన పిల్లలు వచ్చారు, తర్వత రెండు రోజులకి అందరి బంధువుల సమక్షం లో అత్యంత వైభవం గా కిరణ్ ఆకాంక్షల పెళ్ళి జరిగిపోయింది.
ఆకాంక్ష ఆ ఇంటికి వచ్చినప్పటినుంచి తనకి ఆ ఇంట్లో కల్పన కి ఇస్తున్న విలువ చూసి తట్టుకోలేకపోతుంది అన్నిటికీ కల్పన కల్పన అని సరస్వతమ్మ గారు, సరోజిని దేవి పిలవటం ఆ పిల్లతో చనువుగా ఉండటం తనకి అస్సలు నచట్లేదు. ఒకటి రెండు సార్లు కిరణ్ తో చెప్పి చూసింది కాని , అతను వాళ్ళు ఆ ఇంట్లో చాలా సంవత్సరాలనుంచి ఉన్నారు అని కొట్టి పారేసాడు. ఆకాంక్ష తమతో కల్పనని సమానంగా చూడటం తట్టుకోలేకపోతుంది.
ఒకరోజు ఆదివారం అందరు ఏదో పెళ్ళికని తయారయ్యారు. ఆకాంక్ష పట్టు చీర నగలతో మెరిసిపోయింది, తయ్యారు అవుతుంటె కల్పన గదిలోకి వచ్చింది కాఫీ తీసుకొని, పట్టు చీరలో ఉన్న కల్పన ని చుసి అశ్చర్య పొయింది , కోపంతో కల్పనని తిట్టింది, పనిపిల్లవి ఎవరూ లేకుండా చూసి పట్టుచీర దొంగతనంగా కట్టుకుంటావా అని మీద చెయ్యి ఎత్తింది , వెంటనే సరోజిని దేవి అడ్డుకోపొతే , పనిపిల్లకి అంత విలువేమిటి మనతో సమానంగా చుడటం ఎంటి ?అంటే వెంటనే ఆవిడ ఆకాంక్ష వైపు కోపంగా చూస్తూ తను పనిపిల్ల కాదు, మా ఇంటి జీవనజ్యోతి అన్నారు. వెంటనే పదిహేను సంవత్సరాల క్రితం జరిగింది కళ్ళనీళ్ళతో చెప్పుకుంటూ వచ్చారు.
సరోజిని దేవి, ప్రసాద్ రావు గారికి కిరణ్ తర్వాత చాలా సంవత్సరాలకి ఒక అమ్మాయి పుట్టింది ఆఖరి సంతానం జ్యోతి అని పేరు పెట్టుకొని ముద్దుగా పెంచుకోసాగరు, జ్యోతి పుట్టాక ఆ కుటుంబానికి బాగా కలిసివచ్చింది. అదే సమయం లో శాంతమ్మ కి కల్పన పుట్టింది పాపం పుట్టుకతోనె ఆ అమ్మాయికి గుండెల్లొ లోపం , చూపు సరిగ్గా లేదు. శాంతమ్మ కల్పన ని తలచుకొని బాధ పడని రోజు లేదు, ప్రసాద్ రావు గారు ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ఆ అమ్మాయికి పరిస్థితేం మెరుగవలేదు. జ్యోతికి నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకసారి స్కూల్ లో పరిగెత్తుతు మెట్ల మీద నుండి పడి తలకి బలమైన దెబ్బ తగిలింది, వెంటనె ఆసుపత్రికి తీసుకుని వెళ్ళేసరికే ఆ అమ్మయి కొమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్లు పరీక్షించి ఇక లాభం లేదని చెప్పారు...అంత బాధలో కూడా ప్రసాద్ రావు గారికి ఒక అలోచన వచ్చింది తమ జ్యోతి వెళ్ళితోందిది కనీసం తనని కల్పనలో చూసుకోవాలనుకొని వెంటనే డాక్టరుతో మట్లాడారు. శాంతమ్మని ఒప్పించి కల్పనని ఆసుపత్రికి తీసుకోని వచ్చారు అలా జ్యోతి కళ్ళు , గుండె కల్పనకి అమర్చారు. అప్పటి నుండి వాళ్ళు కల్పన కళ్ళలోనే జ్యోతిని చూసుకుంటున్నారు. అలా జ్యోతివాళ్ళ మధ్య లేకపోయినా కల్పన రూపంలో జీవనజ్యోతి అయ్యింది.
సరోజిని దేవి గారు ఆ విషయం చెప్పగానే అందరి కళ్ళు చెమర్చాయి, ఆకాన్క్షకి వాళ్ళ మంచితనం తెలిసివచ్చింది. కూతురు ఇంక లేదు ఎప్పటికీ రాదు అన్నంత భాదని భరిస్తూ ఇంకొకళ్ళకి సహాయం చేసిన వాళ్ళ గొప్ప మనసుకి దణ్ణం పెట్టి క్షమాపణ కోరుకుంది.
కల్పన అశ్చర్యపోయింది ఇన్నిరోజులు వాళ్ళు తమకి బ్రతుకు తెరువు చూపిన వాళ్ళు అనుకుంది కాని- తనకి జీవితమే ఇచ్చారు అని తెలుసుకొని వెంటనే వచ్చి ఇద్దరి కాళ్ళకి దణ్ణం పెట్టింది , వెంటనే ప్రసాదు రావు గారు " అప్పుడే దణ్ణం పెట్టే స్తే ఎలా? ఇంకా మేము మా చిన్న కూతురు పెళ్ళి బాధ్యత పూర్తి చేయాలిగా " అన్నారు నవ్వుతూ...
అందరి కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది.