అమ్మ..నాన్న..ఓ సాఫ్ట్ వేర్ అమ్మాయి - సుంకర వి హనుమంతరావు

amma naanna o software ammaayi

“సారీరా… రీనీకన్నా!” కూతురి ముఖం చూడలేనట్లు తల దించుకుని అపాలజీ చెపుతున్న తల్లిని ఆనందంగా చూస్తూ... రేపటి ప్రోగ్రాం తన్నేసిందా ? చేతులు పట్టుకుని వూపేస్తూ అడిగింది ధరణి వురఫ్ రీనీ ..ద బ్యూటిఫుల్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆఫ్ గూగుల్ ఇండియా

“అవును. మీడాడీ ఫోన్ చేసారు..” నీరసంగా చెప్పింది రీనీ తల్లి వాణి.

హేట్సాప్ టు డాడీ..గెంతులేసింది ధరణి.” తలపట్టుకుంది వాణి. ఎన్ని విధాల కన్విన్స్ చేసి ఈపెళ్లి చూపులకి ఒప్పించగలిగారో గుర్తుకు తెచ్చుకుంది.

“అమ్మా..నాన్నా! మీకోదండం..పెళ్లిచూపులకోదండం..నాకుయిష్టం లేదంటే వినరే?

ఇప్పుడు నా ఏజ్ ఎంతని ? నాపేరు ప్రమోషన్ లిస్ట్ లో వుంది . తొక్కలో పెళ్లిచూపులని పేరంటాలనీ డుమ్మాలు కొట్టుకుంటూ పోతే ప్రమోషన్ కాదు ఉద్యోగమే ఊడిపోతుంది! ధరణి ఆవేశపడిపోయింది. తను కూడా ఆవేశపడిపోతుంటే అ ప్పుడు వాళ్ల నాన్న కలిగించుకున్నారు ,” తల్లీ రీనీ ! ఐథింక్ యు నో యువర్ డాడ్ . సంజయ్ నా క్లోజ్ ఫ్రెండ్ రఘురాం కొడుకు . మాఇద్దరిదీ ఒకే వూరు ఒకే స్కూలు. వాడి సర్వీసంతా కర్నాటకలో గడచిపోయింది .ఈమధ్యే ట్రాన్స్పరై వచ్చాడు. వాడేమిటో నాకు నేను ఏమిటో వాడికి పూర్తిగా తెలుసు .మనలాగే ఆడంబరాలు ఆర్బాటాలు లేని కుటుంబం వాడిది . కట్నాల కతీతంగా ఇద్దరబ్బాయిల పెళ్లిళ్లు చేశాడు. సంజయ్ ఆఖరి వాడు.నాతో వియ్యమందాలని వాడి ఆశ. ముందు మా రీనీ యస్సనాలన్నాను. వాడు దానికి యస్సన్న తర్వాతే నేనీ ప్రోగ్రాం ఏర్పాటు చేసాను. మీ అమ్మ వూహించినట్లు పెళ్లిచూపులు కాదు.. పరిచయ వేదిక మాత్రమే. సంజయ్ వాళ్లు రావడానికి ఇంకా చాలా రోజులు టైముంది. ఈలోగా ఫేస్ బుక్ స్టడీ చెయ్. ఫోన్ లో మాట్లాడు. నువ్వు ఓకే అంటేనే ప్రోగ్రాం.”అంటూ రకరకాలుగా కన్విన్స్ చేయడానికి భర్త పడిన పాట్లు ఆమె కళ్ల ముందు కదిలాయ్. పడిన కష్టమంతా ఒక్క పోన్ కాల్ తో కకావికలై పోతున్నాయని తాను బాధపడుతూ వుంటే ఇదేమో ఆనందంతో గంతు లేస్తోంది ! వాటే జనరేషన్ ? అనుకుంటూ వాణీ తెగ బాధ పడిపోతుంటే.. “తొక్కలో ప్రోగ్రాంకోసం రెండు రోజులు సెలవుపెట్టాను. రానీమీ వార్ని..మా డాడి ఆవకాయ్ జాడీని..దులిపేస్తా..ఏదో అందంగా వున్నాడు..అమ్మా నాన్నల్ని వదిలి విదేశాలకు పోనన్నాడని..పోన్లే పాపం అని యస్సంటే ..యిలా

చెయ్యిస్తాడా ? దేఖేంగే..ధిఖాయేంగే ..అమ్మాయిలంటే యింత అలుసా? ఫైవ్ సిక్స్ హైటూ ఫిఫ్టీసిక్స్ వెయిటూ జాస్మిన్ వైటూ వున్న నన్నే ఇగ్నోర్ చేస్తాడా ? అసలు దీనికంతా కారణం మీ ఆయన కదూ.? .వస్తారుగా రానీ బేంక్ మేనేజర్ ..రంగనాయకమ్మగారి స్వీట్ హోం హీరో..”అంటూ రాబోయే వాళ్ల నాన్ననీ ..రావడంలేదని ఫోన్ చేసిన సంజయ్ నీ సహస్ర నామాలతో అభిషేకంచి అలిసిపోయి అందినవన్నీ లాగించేసి ముసుగు తన్నేసింది … ..అలనాటి సత్యభామ లెవెల్లో …ధరణి ద మోష్ట్ బ్యూటిఫుల్ సాఫ్ట్ వేర్ యింజినీర్.

****** ****** *****

ఉదయం పదైపోయింది .ఇంటిముందు జరుగుతున్న కోలాహలానికి లేచి కళ్లు నులుముకుంటూ బాల్కనీలోకొచ్చి కనిపించిన దృశ్యాన్ని చూస్తూనే అందమైన ప్రతిమలా ఫ్రీజై పోయంది ధరణి ! ఇన్నోవాలోంచి దిగుతున్న సంజయ్ ని అతని ఫ్యామిలీ మెంబర్స్ ని గుర్తుపట్టి గాబరాపడిపోయి ఒక్క గెంతులో బాత్ రూంలోకి జంపై పోయింది .

****** ****** ******

“అంకుల్ ! నిన్నమేమంతా ..ఇవాల్టి ప్రోగ్రాం గురించి మాట్లాడుకుంటుంటే ..జానకిరాం అంకుల్ వచ్చారు. విషయమంతా విని పకాపకా నవ్వేసారు !

పెళ్లిచూపులేంట్రా పిచ్చోడా..ఆ రోజు అపోలో హాస్పిటల్లో నా ప్రాణదాత..మాఆపీస్ అమ్మాయి అని చెప్పాను గుర్తుందా ? ఎంగ్ అండ్ ఎనర్జిటిక్ మరో మదర్ థెరీసా అని కూడాచెప్పాను.!.ఆ అమ్మాయే ఈ అమ్మాయని చెప్పారు.

ఆ రోజు అంకుల్ కి హార్ట్ ఎటాక్ రావడం..తనే అపోలోలో అడ్మిట్ చేయించి వారం రోజులు కంటికి రెప్పలా చూసుకోవడం చెప్పి ..మరో మాటన్నారు...” ఆగిపోయాడు సంజయ్, ధరణి హార్ట్ బీట్ పెరిగి పోయంది. రాత్రంతా తను సహస్ర నామాలతో తిట్టి పోసిన వ్యక్తి నోటి మాటకోసం ఆతృత పడిపోవడం వింతగా అనిపించంది .చెప్పుబాబూ.. చెప్పు,,మనసు లోనే మదనపడిపోయింది

సంజయ్ ఓసారి ధరణి వంక చిలిపిగా చూశాడు.

లబ్..డబ్ లు మరింత లౌడై పోయాయి ..

“ఔన్రా..అన్నాను..యిప్పుడూ అంటాను..పెళ్లిచూపులు ఆ అమ్మాయకి కాదు..నీకు ఏర్పాటు చేయమని మీ డాడీని రిక్వెస్ట్ చెయ్..ఆ అమ్మాయి నిన్ను చూసి ఓకే అంటే నిన్ను మించిన అదృష్టశాలి ఈ ప్రపంచాన మరొకడుండడు..అన్నాను. అంతేకాదు ..మరో మాట కూడా అన్నాను..గుర్తుందా ? సంజయ్ ని సూటిగా చూశారు జానకిరాం.

ఆ మాటెలా మర్చిపోతానంకుల్ ? మరింత మిశ్చివస్ గా నవ్వాడు.

నవ్వులాపి అదేంటో త్వరగా చెప్పుబాబూ,,మనసులోనే మననం చేసుకుంది రీనీ..

“అరే రఘురాం..నీ దోస్త్ బుచ్చిబాబుగారిని అడుగు..నా ముద్దుల కూతురు ఫేస్బుక్ హీరోయిన్ స్రవంతినీ ఛాటింగ్ హీరో ప్రవీణ్ ని తీసుకుని ఇన్ ఎక్చేంజ్ ధరణిని యిస్తారేమోనని.

ఆయన ఓకే అంటే సంజయ్ ని నేనే అల్లుడిగా చేసేసుకుంటా..”

ఇదేగా అంకుల్ మీరన్న మాట? అందుకే అమ్మాయిని చూసే ప్రోగ్రాం కేన్సిల్ చేసేశాను.

మీ మాట ప్రకారం నా పెళ్లిచూపుల కార్యక్రమం డిఫరెంట్ గా వుండాలని అంకుల్నిబ్రతిమాలి ఇక్కడ ఏర్పాటు చేసుకుని బంధుమిత్ర సపరివారంగా వచ్చేశాను.

నన్ను చూసి మీ అమ్మాయి యస్ అంటే మీ యిద్దరిలో ఎవరికైనా అల్లుడినైపోవడానికి నేను రెడీ అతి వినయంగా చెప్పిన సంజయ్ మాటలు వింటూనే అందరూ థ్రిల్లై పోతే ..ట్విస్ట్ ను అర్దం చేసుకుని లైట్లు వెలిగించుకున్న ధరణి “డాడీ” అని అరవబోయి..ముసిముసి నవ్వులు పూయించేసింది !

“ అంకుల్ ! మీ అమ్మాయి ఏదో ఒకటి చెప్పేస్తే మేం స్టారో మూనో ఏదో హోటల్ కి షిఫ్టయిపోతాం ..ఆకలి దంచేస్తోంది . ఇక్కడ కతికితే అతకదంటారుగా.. అందుకని..”

అమాయక చక్రవర్తిలా అభినయిస్తున్న సంజయ్ ని చూస్తూ “..సిగ్గుపడడానికే సిగ్గుపడే చినదాని బుగ్గల్లో సాఫ్ట్ గా సిగ్గులు పూయించేశావ్, పెదాలు విప్పకుండానే మనో రాగాలు పలికించేలా చేశావ్ ..స్టారు ఫుడ్డుతోబాటు తతంగాల హెడ్ కూడా మరో గంటలో మనముందుంటారు . రండి అన్నయ్యగారూ..మనమలా మేడమీద కెళ్లి వీళ్లకో యుగళగీతానికి ఛాన్స్ యిచ్చేద్దాం ”అంటూ చిలిపిగా మాట్లాడుతూ కదలబోతున్నతల్లిని కౌగిలించేసుకుని ముద్దుపెట్టేసి ..బుచ్చిబాబురాణీ నాటకాలవాణీ..రాత్రికిచూపిస్తా నాబాణీ ..అంటూ చెవి కొరకేసి.. అందరినీ చిరునవ్వుతో పలకరించి వినయంగా నమస్కరించి

“పెళ్లిచూపుల్ని స్వయంవరంగా రూపు దిద్దిన మిష్టర్ సంజయ్ అండ్ డాడీ మమ్మీల చతురతకు వెల్కం చెపుతూ సంజయ్ మీద నా అభిప్రాయాన్ని యుగళ గీతాల ఐమీన్ యుగళ బాతాల పిమ్మట మనవి చేస్తానని మనవి చేస్తున్నాను”

సీతా స్వయంవరంలో రాముడు శివధనుస్సును విరిచినప్పుడు సభాసదుల గుండెలు గుభిల్లు మన్నట్లు ధరణి సంధించిన వాక్కుల బాణం వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తే సంజయ్ హార్ట్ మాత్రం సడన్ గా ఆగిపోయి తిరిగి స్టార్టయింది.

****** ******

“మమ్మీ ! క్లైమాక్స్ లో కరెంట్ పోయినట్లు ఈ డైరీలో మిగతా పేజీలన్నీ బ్లాంక్ గా వున్నాయ్ . ఆ తర్వాత ఏమైంది మమ్మీ? “ ధరణిని ఊపేస్తూ గారాలు పోయింది ధరణీ సంజయ్ ల గారాల పట్టి కార్తిక. ముసిముసిగా నవ్వేసింది సంజయ్ ని ఓరకంట చూస్తూ ధరణి “సస్పెన్స్ తో చచ్చిపోతుంటే నవ్వులేంటి మమ్మీ ! ప్లీజ్ ప్లీజ్..” రిక్వెస్ట్ చేసింది కార్తిక .

ఇందులో సస్పెన్స్ ఏముందిరా ..మమ్మీ డాడీల పెళ్లి..పుట్టిందో డాలీ..దట్సాల్..

మమ్మీ ! మరీ నాకు సాఫ్ట్ వేర్ ఫ్లవర్స్ పెట్టకు . యుగళగీతాలో ..యుగళ బాతాలో తర్వాత ఏమైంది ?

ఓ..అదా నీ డౌటు..? వున్నారుగా మీ డాడీ ..అడుగు..చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్సూ గత స్మృతుల గంధాన్ని బుగ్గలకు బుక్కాలా చల్లేసుకుంది ..

“డాడీ ! గీతాలో..బాతాలో..బోల్ ..డాడీ..బోల్..” ఉక్కిరిబిక్కిరి చేసేసింది.

“సాహసంతో స్వయంవరానికి వచ్చాను కదాని ..చెమటలు పట్టించే చింతామణి ప్రశ్నలు సంధిస్తుందేమోనని

భయపడి పోతుంటే..జానకిరాం అంకుల్ మాటల్ని నిజంచేస్తూ ..మనం మన వూళ్లో..తాటాకు పందిరి క్రింద తలంబ్రాలు పోసుకోవాలి..నా పెళ్లికి మా డాడీ ఖర్చు పెడతానన్న బడ్జెట్ లో సగ భాగం నేను చదవుకున్నమన వూరి స్కూలు బాగుకోసం డొనేట్ చేయాలి..మనం ఆడంబరాలకు ..ఆర్బాటాలకు దూరంగా వుండాలి..”

ఇదేరా తల్లీ ..మీ మమ్మీ మాట..నా పాలిట బంగారు బాట..కోట్లు దుబారా చేస్తూ ..ఫేస్ బుక్ పోస్టింగులకోసమో ఫ్రెండ్ సర్కిల్ పోగడ్తలకోసమో..కన్నవారిని ..కష్టాలకు గురి చేస్తున్న నేటి యూత్ కు గుణపాఠంలా వున్నమీ మమ్మీమాటలు నా కు అమృత ధారలయ్యాయి..”

మరి స్కూల్ ? కార్తిక కంఠంలో క్యూరియాసిటీ.. “తాతయ్యలిద్దరూ ..టాయిలెట్స్ కట్టించారు..పేదపిల్లలకు ..యూనిఫామ్స్ కుట్టించారు..ఇంకా..” దట్ మీన్స్ కన్నవూరిని కన్న తల్లిలా చూసుకున్నారన్న మాట..ఐయామ్ ప్రౌడాఫ్యు ఆల్ డాడీ డాడీకి ముద్దు పెట్టి ,అమాంతం లేచి వెళ్లి..మమ్మీని చుట్టేసి..ముద్దుల వర్షం కురిపించేసి తల్లి ఒడిలో తల వాల్చేసి.”.నీ కూతురిగా పుట్టడం నా అదృష్టం మమ్మీ..ఐ విల్ ఫాలో ..యువర్ గోల్డెన్ ఫుట్ స్టెప్స్..ఇట్స్ మై ప్రామిస్..”

ఆనందంతో మాటలు రాక మూగ పోయింది ..కార్తిక,,లవ్ లీ డాటర్ ఆఫ్ ..ధరణి..ద సాఫ్టవేర్ అమ్మాయి

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు