నిశ్చల - చిత్రవెంకటేశ్

nischala

నేను ఏయిర్ పోర్ట్ చేరుకునేసరికి విమానం ఇంకా రన్ వే మీద ఉంది. ఇంకా బయలుదేరలేదు. ఏదో సాంకేతిక లోపల వల్ల ఆగిపోయింది. పరుగులాంటి నడకతో లాడర్స్ చేరుకున్నాను. నా టిక్కెట్టు ఏయిర్ హోస్టెస్ కు చూపించాను. ఆమె నా సీటు చూపించి వెళ్ళిపోయింది. నా పక్కనే నా వయస్సు ఉన్న అమ్మాయి ఉంది. చక్కగా పట్టుచీర పట్టు జాకెట్టు వేసుని సంప్రదాయబద్దంగా ఉంది. చేతిలో పసిపాప ఉంది. పాప గాఢంగా నిద్రపోతుంది. ఉలకటం లేదు పలకటం లేదు. కనీసం చిన్నగా కదలటం కూడాలేదు. అంత గాఢంగా నిద్రపోతుంది.

నిన్నటితో నేను మలేషియా వచ్చిన పని పూర్తయింది. నా కంపెని అప్పగించిన పని విజయవంతంగా పూర్తిచేశాను. చెప్పిన సమయం కంటే పదిరోజులు ముందే ప్రొజెక్ట్ పని ముగిసింది. రాత్రి నా కొలిగ్స్ పార్టి అరెంజ్ చేశారు. మా క్లయింట్ సబ్యులు కూడా వచ్చారు. అందరం చక్కగా పార్టిని ఎంజాయ్ చేశాం. నా క్లయింట్స్ నన్ను అభినందించి వీడ్కోలు చెప్పారు. పార్టి ముగిసేసరికి రాత్రి పదకొండుగంటలైంది. అయిన సాకేత్ కు కాల్ చెయ్యటం నేను మరచిపోలేదు. సాకేత్ ఇండియలో నా కొలిగ్. నా కంటే సీనియర్. ఇద్దరం ప్రేమించుకున్నాం. పెళ్ళికూడా చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. మాకు నిశ్చితార్ధం కూడా ముగిసింది. ఇంకో నెలలో పెళ్ళిచెయ్యాలని మా పెద్దవాళ్ళు నిర్ణయించారు. అప్పుడే ఊహించని సమస్య వచ్చింది. ఆ సమస్య మా కంపెని యం.డి వైపు నుంచి వచ్చింది. మా కంపెనికి మలేషియాలో ఒక పెద్ద ప్రొజెక్ట్ దొరికింది. వందకోట్ల ప్రొజెక్ట్. ఆ ప్రొజెక్ట్ ను ఒక సంవత్సరం లోపు పూర్తిచెయ్యాలి. మేనేజ్ మెంట్ నన్ను ఎన్నుకుంది. నాకు సహయంగా ఇంకో అయిదుగురిని సెలక్ట్ చేసింది.

నాకేం చెయ్యాలో తోచలేదు. ఒక వైపు పెళ్ళి ఇంకో వైపు వృత్తి నన్ను అడకత్తెరలో పోకచెక్కలా నలిపేశాయి. సాకేత్ ను సలహ అడిగాను.అతను నన్ను వెళ్ళమని సలహ ఇచ్చాడు. పెళ్ళి ఈ రోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు. కాని ఇలాంటి ప్రొజెక్ట్ మళ్ళి మళ్ళి రాదు. పైగా ఇది నీ కెరీర్ కు ఎంతో ఉపయోగం అన్నాడు. గత్యంతరంలేక సరే అన్నాను. పదిహేను రోజుల తరువాత నా టీమ్ తో మలేషియా బయలుదేరాను. స్టాఫ్ తో పాటు నా తల్లి తండ్రి సాకేత్ తల్లి తండ్రి కూడా వచ్చారు. కన్నీటితో నాకు వీడ్కోలు ఇచ్చాడు సాకేత్.

మలేషియా చేరుకున్న తరువాత ఒక్క క్షణం కూడా నేను వేస్ట్ చెయ్యలేదు. నా టీమ్ ను బాగా మోటివేట్ చేశాను. వాళ్ళతో నేను ఒక నాయకురాలిగా ప్రవర్తించలేదు. స్నేహితురాలిలా ప్రవర్తించాను. నేను కూడా వాళ్ళతోపాటు కష్టపడ్డాను. అనుకున్నట్టుగానే ప్రొజెక్ట్ పని విజయవంతంగా పూర్తిచేశాం. నిన్నటితో నేను మలేషియా వచ్చిన పని పూర్తయింది. ఈ రోజు ఇండియా బయలుదేరుతున్నాను.

“నా పేరు మీనాక్షి”అంది నా పక్కన కూర్చున్న అమ్మాయి.

“నా పేరు నిశ్చల”అన్నాను ఆలోచనలనుంచి తేరుకుని.

“మీరు మలేషియాలో ఉంటున్నారా”అడిగింది మీనాక్షి.

“కాదు. ప్రొజెక్ట్ పనిమీద వచ్చాను. అది పూర్తయింది. ఇండియా బయలుదేరుతున్నాను”అన్నాను. ఆ తరవాత మా సంభాషణ ఉద్యోగం గురించి సాగింది.

“నేను కూడా బాగా చదువుకున్నాను. నాకు ఉద్యోగం చెయ్యాలని ఉంది. కాని మా వారు ఒప్పుకోలేదు.”

“ఎందుకు?

“నీకు ఉద్యోగం చెయ్యవలసిన అవసరంలేదు. ఆఉద్యోగం వల్ల నీకు అదనపు డబ్బు వస్తుంది అంతె. కాని అదే ఉద్యోగం ఒక మగవాడికి ఎంతో అవసరం. దానితో అతను తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఒక చిన్న కుటుంబం ఆ జీతంలో బతుకుతుంది”అన్నారు అంది మీనాక్షి.

“పాపకు ఏమైంది. వచ్చినప్పుటినుంచి నిద్రపోతుంది”అన్నాను.


“పాపకు ఒంట్లో బాగాలేదు. నిన్నటినుంచి జలుబు జ్వరం. నిన్నరాత్రి మా నాన్నగారికి బాగాలేదని తెలిసింది. వెంటనే రమ్మని చెప్పారు. మాములుగా అయితే పాపను ఆయన దగ్గర విడిచిపెట్టి నేను ఒంటరిగా బయలుదేరేదాన్ని. కాని ఆయన రెండురోజులకు ముందే వేరే ఊరికి వెళ్ళారు. పాపను నౌకర్ల దగ్గర విడిచిపెట్టటం నాకు ఇష్టంలేదు. అందుకే పాపతో బయలుదేరాను. బయలుదేరేముందు కొంచం సెడిటివ్ ఇచ్చాను. అందకే కదలకుండ మత్తుగా నిద్రపోతుంది”అంది మీనాక్షి.

నేను ఏదో చెప్పబోయాను. అప్పుడే విమానం భయంకరంగా ఊగింది. ఆ కదలికకు ప్రయాణికులందరు అల్లాడిపోయారు. అందరు తలో దిక్కుకి పడిపోయారు. నేను వెళ్ళి విసురుగా ఎదురుగా ఉన్న సీటుకు గుద్దుకున్నాను. నా కళ్ళు బైర్లు కమ్మాయి. కొంచంసేపు అచేతనంగా ఉండిపోయాను. మీనాక్షి కూడా నా పరిస్ధితి ఏర్పడింది. ఆమె చేతిలో ఉన్న పాప ఎగిరివెళ్ళి కింద పడింది. అదృష్టవశతు వెంటనే విమానం కంట్రోల్ అయింది. ఏయిర్ హోస్టెస్ వచ్చి అందరిని పరమర్శించింది. మీనాక్షి చేతులో ఉన్న పాపను పరీక్షించబోయింది. కాని మీనాక్షి ఒప్పుకోలేదు. దానికి కారణం నాకు మాత్రమే అర్ధమైంది. కొంచంసేపయిన తరువాత నేను టాయ్ లెట్ కు వెళ్ళాను. అక్కడ ఉన్న టిష్యు పేపర్ మీద కొన్ని వివరాలు రాసి రహస్యంగా ఏయిర్ హోస్టెస్ కు ఇచ్చాను. ఈ విషయం మీనాక్షి గమనించలేదు.

షెడ్యుల్ ప్రకారం విమానం హైదరబాదులో లాండ్ అయింది. కస్టమ్స్ కౌంటర్ దగ్గర మీనాక్షని పోలీసులు అడ్డగించారు. ఆమె చేతులో ఉన్న పాపను బలవంతంగా లాక్కున్నారు. అక్కడే ఉన్న డాక్టర్ పాప కడుపును కత్తితో కోశాడు. లోపల చాల వజ్రాలు కనిపించాయి. స్మగ్లింగ్ చేస్తున్నందుకు మీనాక్షిని పోలీసులు అరెస్చ్ చేసి తీసుకువెళ్ళిపోయారు.

“అసలు పాప కడుపులో డైమండ్స్ ఉంటాయని నీకు ఎలా తెలిసింది”అడిగాడు సాకేత్.

“పాపను చూసినప్పుటినుంచి నాకు ఎందుకో అనుమానం కలిగింది. పాప ఉలకదు పలకదు. ఎంత గాఢంగా నిద్రపోతున్న కొంచంమైన కదలిక ఉంటుంది. కాని పాపలో బొత్తిగా కొంచం కూడా కదలిక కనిపించలేదు. విమానం ఊగినప్పుడు పాప ఎగిరి కిందపడింది. అప్పుడే కూడా లేవలేదు. అంతెకాదు పాప కడుపు మీద ఆపరేషన్ చేసిన గుర్తులు కనిపించాయి. దాంతో పాప సజీవంగా లేదని అర్ధమైంది. అప్పుడే కొన్ని రోజులకు ముందు పేపర్ లో చదివిన వార్త గుర్తుకువచ్చింది. ఇటివల మలేషియ హైదరబాదు రూట్ లో విపీరతంగా స్మగ్లింగ్ జరుగుతోంది. పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా స్మగ్లర్స్ ను పట్టుకోలేకపోయారు. ఇందులో పోలీసుల తప్పు ఏం లేదు. స్మగ్లర్స్ చాల తెలివిగా ప్రవర్తిస్తున్నారు. చనిపోయిన పాప కడుపులో వజ్రాలు పెడుతున్నారు. తరువాత కడుపుని కుట్టేస్తున్నారు. ఒక పసిపాప శరీరంలో వజ్రాలు ఉంటాయని ఎవరు మాత్రం ఊహించగలరు.

దాంతో నాకు అంతా అర్ధమైంది. వెంటనే కాగితంలో నా అనుమానం రాశాను. మీనాక్షికి తెలియకుండ ఆ కాగితాన్ని ఏయిర్ హోస్టెస్ కు ఇచ్చాను. వెంటనే ఆమె ఈ సమాచారాన్ని ఏయిర్ పోర్ట్ అధికారులకు తెలిపింది. అంతె తరువాత ఏం జరిగిందో నీకు తెలుసు”అన్నాను ముగిస్తూ.

సాకేత్ ఏదో మాట్లాడబోయాడు. అప్పుడే నా సెల్ రింగ్ అయింది. కమీషనర్ ఆఫ్ పోలీస్ కాల్ చేశాడు. “మిస్ నిశ్చల. మీ తెలివి అద్భుతం. మీ సహయం వల్ల ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ ముఠాను పట్టుకోగలిగాం. డిపార్ట్ మెంట్ మీ సహయాన్ని ఎప్పటికి మరచిపోలేదు. అందుకే మిమ్మల్ని గౌరవించటానికి నా అఫీసులో ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశాను. మీరు తప్పకుండ రావాలి”అన్నాడు కమీషనర్. అలాగే అన్నాను.

“నువ్వు మాములు అమ్మాయివికాదు. ఫైర్ బ్రాండ్ వి. నీకు భర్త కాబోతున్నందుకు నాకు చాల గర్వంగా ఉంది”అన్నాడు సాకేత్ నన్ను దగ్గరికి తీసుకుని. నేను ఆనందంగా నవ్వాను .

సమాప్తం

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు