ఆత్మస్థైర్యమంటే - డా.లక్ష్మి అయ్యర్

atma sthairyamante

బాబుతో బాటు కమల హడావిడిగా సెకండ్ ఏ .సి .కోచ్ లో దాదాపు పరుగు పెడుతూ వచ్చి సీటుపై హమ్మా అని కూల బడింది . ఏదో మీనా గారి చలవ వాళ్ళ ఎమర్జెన్సీ కోటా లో సీట్ కన్ ఫర్మ్ అయ్యింది.

అమ్మయ్య అంటూ బాబుతో కూర్చొని పేపర్ చదువుదామని తీసింది. అంతలో ఫోన్ మ్రోగడంతో తీసింది “ మేడం! నవీన్ మూడవ ఫ్లోర్ నుండి దూకి ఆత్మ హత్య చేస్కున్నాడండి,.” ఎం ఏ హిందీ అనిల్ గొంతు . “అదేంట్రా! మొన్న నేను క్లాసులో నుండి వచ్చేటపుడు ఇద్దరూ అమ్మాయిలతో తైతక్కలాడుతున్నారు గదరా? ఏమయింది ?" ఆవేదనతో అడిగింది కమల "నిన్న ఆన్ లైన్ లో రిజల్ట్స్ పెట్టారు మేడం. లాస్ట్ సెమిస్టర్ కదా, తప్పాడంట! కుటుంబ ఆర్ధిక పరిస్థితుల రీత్యా ఆత్మహత్య చేసుకుంటున్నానని లెటర్ రాసి ఉంచాడు మేడం !" అన్నాడు ."అదేం ! పోయేకాలంరా! ఎం .బి.ఏ. లో వున్న కుర్రాడు సెమిస్టర్ తప్పాడన్టే చస్తాడా? తల్లిదండ్రులకు ఏదన్నా సంపాదించి ఇవ్వొచ్చు, ముసలితనఒలో తోడుగా ఉండవలసిన వాడు కడుపులో చిచ్చు పెడతాడా?“ కోపంగా అరిచింది కమల ట్రైన్ లో ఉన్నానన్న సంగతి మరచి. .” "తెలియదు మేడం! మీకు చెప్పాలని ఫోన్ చేశాను, తర్వాత చేస్తాను వుంటానండి “ ఫోను పెట్టేశాడు . యూనివర్సిటీ, కాలేజి పిల్లలు ఏ రాష్ట్రమైనా ఒకే మనస్తత్వం కలవారు కాబోలు. ఈ కాలం పిల్లలకు వేగం ఎక్కువ, వివేకం తక్కువ. ఓటమిని భరించలేరు . తెలివి దండిగా వుంది. అహం అంతకంటే ఎక్కువ. వాళ్లకుండే సైన్సు పరిజ్ఞానంతో లోకాన్నే తన వైపు తిప్పుకోగలరు. “అదేంట్రా! అరియర్స్ పెట్టావ్ ! వళ్ళు వంచుకొని చదివితే దానంతట అవే పాస్ మార్కులు వస్తాయంటే ..”మేడం ! అరియర్స్ లేనివాడు అర్ధ మనిషండి “అని నవ్వే వాళ్ళు . ”మరి కంప్లీట్ మ్యాన్ అవ్వాలంటే రేమండ్ సూట్ వేసుకొని కాంప్లాన్ తాగాలా ? తను కూడా జోకులేసి తిట్టేది. మొన్న తనను చిరునవ్వుతో పలుకరించిన ఇరవై ఏళ్ల చిన్నారి ఈ రోజు లేడు..ఏమి లోకమో!” మనసు భాదతో ములిగింది.

బనారస్ స్టేషన్ లో బాబుతో సహా ట్రైను నుండి దిగినప్పుడు మిట్ట మధ్యాహ్నం రెండు. ఎండ బాగా దంచుచున్నది. ఆ ప్లాట్ ఫారం నుండి మెట్లు దిగి బయటకు వచ్చేలోపు అమ్మ కడుపులోఒచి వచ్చినట్లుంది . “’అయినా పాపం ముసలి వాళ్ళు ఎలా ఎక్కి దిగుతారు? మన ప్రభుత్వానికి అస్సలు బుద్ది లేదు. అన్ని రైల్వే స్టేషన్లలో ఎస్కిలేటర్స్ పెట్టి ఏడ్వచ్చుగా ! విసుగ్గా అనుక్కొంది మనసులో. ప్రీ పెయిడ్ ఆటోలో ఓ పెద్ద క్యూ..కానీ కౌంటర్ లో ఎవడూ లేడు. యు.పి అంటే ఉల్టా పుల్టా మేడం ! ఓ స్టూడెంట్ చేసిన కామెంట్ గుర్తుకు వచ్చింది. గంటసేపు తిప్పలు పడి ఆటోలో ఎక్కి బుకింగ్ చేసిన రూంకు దారి చెప్పింది. ఆటోలో వస్తున్నఒత సేపు అక్కడా ఇక్కడా పరికించి చూసింది.

ఇరవై సంవత్సరాలలో ఏమీ మారలేదు.అవే మురికి కాలువలు, సందులు, ఓపెన్ సెప్టిక్ ట్యాంకులు రోడ్డుపై ప్రవాహిస్తూ...అక్కడే అమ్ముతున్న పండ్లు. తిను బండారాలు...రామ..రామ! ఎంత రోత! “క్యోఒ ? భాయి సాహెబ్ !ఏ దేవ్ నగరి. అబ్ తక్ గన్దీ నగరీ హీ బనీ రహి| కోయి బదలావ్ న ఆయా! సర్కార్ తో బదల్ గయీ (అదేంటి అన్నా! దేవా నగరి మురికి నగర్ గానే వుండి పోయింది, ప్రభుత్వం మారినా ఏ మార్పూ రాలేదేంటి ?) అడిగింది ఆటో అతన్ని ఉండ బట్టలేక. “ జీ మేం సాహెబ్ ! ఉన్కేలియే వోట్ చాహియే, జనతా నహీ..అబ్ గంగా మైయా ఉసే బులాతీ నహీ ...అన్నాడు బాధతో, వ్యంగంగా. (వాళ్ళకు ఓట్లు కావాలి, ప్రజలు కాదు, ఇప్పుడు గంగా తల్లి పిలవ లేదు). స్వచ్చ భారత్ అని జగమంతా చాటి చేప్పే ప్రధాన మంత్రి దృష్టి పి.ఎం. గా నెగ్గించిన ఈ పట్నం పై ఎందుకు పడలేదు ? అనుకుంటే గంటకు నూరు మంది పని వాళ్ళను నియమించి మూడు రోజులలో స్వచ్చ కాశీ గా తయారు చేయవచ్చు గదా! అక్కడి ముస్లింల సందులు చూస్తే కంట్లో నీళ్ళు తిరుగుతాయి. వాళ్ళు మనుషులు కారా? అంత గలీజులో చిన్న చిన్న పాపాయిలు ఆడుకుంటూ కనిపించారు. ప్రభుత్వమేదీ పట్టించుకొనకుండా ఎందుకు వూరుకుంటుంది ? ఈ పట్టణాన్ని సరి చెయ్యలేదా? అనుకుంటూ భాధగా చూసింది కమల.

ఆలోచనల్లోనే రూము వచ్చేసింది. ఆటో వాడికి డబ్బులిచ్చి రూముకు వెళ్లి ఫ్రెష్ అయి సాయంత్రం బాబుతో బాటు “గంగా హారతి “ చూడడానికి నావ తీసుకొని ఆవలి వడ్డు దాక తిరిగసాగింది. పవిత్రమైన గంగా నదిలో తేలుతున్న శవాన్ని ఈడ్చుకుంటూ ఒడ్డుకెళ్ళే కుక్కలు, చెత్త కుండీ లో వేయవలసిన చెత్తా చెదారాలు, ఇంకా ఎన్నో సేవేజే ట్యాంకు పెద్ద పెద్ద గొట్టాలు, గంగలో కలిపి వేయబడి వున్నాయి. మొత్తం కాశీలోని మైలంతా గంగాకే సమర్పిస్తున్నారు జనులు . అక్కడ ఏ ఘాట్ లో వున్న ఇంటికి వెళ్ళాలన్నా ముక్కు మూసుకొని వెళ్ళాల్సిందే. చుట్టూ మురికి కాలువలు, చెత్త అన్నీ చిన్న చిన్న సందుల్లో వున్న ఇంటి ముందు వుంటాయి. ఏ ఇల్లైయినా అలాంటి దారే మరి. ఎంత మంది, ఎన్ని భాషల ప్రాంతాల వారు వస్తున్నారు. దాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అనుకుంది కమల. ఆ మాటే చెప్పినందుకు “కాశీలో చూసిన మురికిని కామెంట్ చేయరాదు. అంతా శివమయం అన్నాడో ఛాఒదసుడు. శివుని పరిసరాలను శుభ్రంగా ఉంచరాదని ఏ శాస్త్రంలోనన్నా,రాసివున్దా? ప్రజల అమాయకత్వాన్ని, భక్తి పేరుతొ ఆడుకొనే ధార్మికులు , ఓట్ల పేరుతో ఆడుకొనే రాజకీయ నాయకులపై కమలకు ఏవగింపు కలిగింది. తల్లికి 6వ నెల కర్మ కాండ తన బాబు చేతులతో జరిపించిన చోట కలసిన తెలుగు వంటావిడ వెంకట రమణమ్మ గారు. దాదాపు యాభై ఐదేళ్ళుఒటాయి. ఓ స్టిక్కర్ బొట్టు,రెండు రోల్డ్ గోల్డ్ గాజులు, ఓ పూసల దండ. పొట్టిగా, తెల్లగా వున్న రమణమ్మ గారు తెలుగు. తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషలు గడ గడా మాట్లాడడం చూసి విస్తుబోయింది కమల. ”అదేంటి ! మామీ! (అక్కడ అందరూ అలాగే పిలుస్తున్నారు)...ఇన్ని భాషలు మాట్లాడేస్తున్నారు, ఉండబట్టలేక అడిగేసింది. “అవునమ్మా! మా పూర్వీకం తూర్పు గోదావరి జిల్లా దగ్గర ఓ గ్రామం. ఇక్కడకు వచ్చి ముప్పై ఏళ్ల కఒటే ఎక్కువే అయ్యాయి! ఇక్కడే ఉండడంతో వంటలతో బాటు అన్ని భాషలు వాటంతట అవే వచ్చేశాయి..అంది ఆప్యాయంగా నవ్వుతూ. మరి మీ కుటుంబం..? ప్రశ్నార్థకంగా చూసింది కమల. ఇక్కడే ఓ అద్దింట్లో వున్నాను. నేను ఈ కాశీవిశ్వనాథుడే నా కుటుంబం ..అంది దృఢఒగా.వింటానంటే చెప్తాను నా గురించి అంది. అలాగే అంది కమల. మా అమ్మకు రాయడానికి ఫ్రీ గా ఓ కథ దొరికింది అన్నాడు బాబు కన్ను గీటుతూ.మామి తన గతం చెప్పనారంభించింది.

*** *** *** *** ***

నాకప్పుడు పదమూడేళ్ళు. పెళ్ళంటూ ఏమిటో తెలియని వయస్సులో చదువుని ఆపి, మా అమ్మకు నా పెళ్లి ఇష్టం లేకపోయినా, బలవంతంగా మా అత్త కొడుకుతో పెళ్లి చేయించారు మా నాన్నగారు. నా భర్త పచ్చి తాగుబోతు. సోమరి తాగి వచ్చి కొట్టేవాడు. ఎందుకీ విషయం దాచారని నా మేనత్తని అడిగాను .” పెళ్లి అయితే అంతా మారతాడనుకున్నాను. అందుకే చెప్పలేదు “ అంది. నన్ను గుంటూరు దగ్గర వున్న వాళ్ళ గ్రామానికి తీసుకెళ్ళింది. ఇంటికి సరిగా రాడు. ఇంట్లో సరుకులు వుండవు. ఎప్పుడో రాత్రికి తాగి తిరిగి వచ్చేవాడు. వాళ్ల అమ్మ అస్సలు ఇంటి పట్టున వుండేది కాదు. ఏదో బంధువుల ఇంటికని , గుడికనో వెళ్ళుతూ వుండేది.రోజూ కొట్టేవాడు, ఏదో కులం తక్కువదాన్ని వుంచుకున్నాడని చెప్పుకునేవారు. నాకా కొత్త వూరు, చిన్న వయసు, కొత్త జిల్లా . చుట్టు ప్రక్కల వాళ్ల ఇళ్ళు గూడ చాలా దూరంగా ఉండేవి. తెలుగుతో బాటు ఓ బావి, ఓ మర్రి చెట్టే నాకు స్నేహితులు ..తోడూ అన్నీ. అలా మూడేళ్ళు ఒంటరి జీవితం గడిపాను. అమ్మా నాన్నలను చూడాలంటే వెళ్ళనిచ్చేవాడు కాదు.వాళ్ళు వచ్చేవారు కారు. అమ్మ మాత్రం వారానికి ఓ జాబు రాస్తుండేది. నేనేదన్నా రాసేస్తానని నేను రాసే ఉత్తరాలన్నీ చదివి పోస్ట్ చేసేవాడు. భయంతో ఏమీ రాయను.

ఓరోజు నేను కళ్ళు తిరిగి పడిపోయాను.” నీ పెళ్ళాం గర్భంతో వుంది , జాగ్రత్తగా చూసుకో “ అని ఓ ముసలావిడ చెప్పడం విన్నాను.నెలలు పెరిగే కొద్దీ బలహీనత, తిండి పెట్టడు. అమ్మకూ ఈ సంగతి రెండు సార్లు రాస్తే వాళ్ళకేం చెప్పక్కర్లేదులే “అంటూ ఉత్తరం చించేశాడు. ఊరికి వెళ్ళనీయడు. తీర్థ యాత్రల పేరున అత్తమ్మ వెళ్లి పోయింది. ఆ రోజునుండి ఘోర నరకాన్ని ఇక్కడే ఈ లోకంలోనే అనుభవించాను! దైవ కృప వల్ల ఓ రోజు నన్ను చూడడానికి అక్క బావ గారితో వెదుక్కుంటూ వచ్చింది. ఎప్పటిలాగే నాకు తిండి పెట్టక, గదికి తాళం వేసి బయటకు వెళ్ళాడు నా భర్త. అక్క కిటికీలోంచి నన్ను చూసి “అదేంటే? లోపల వున్నావ్! బయట తాళఒ వేసి వుంది...అని అడిగింది. జరిగినదంతా పూస గ్రుచ్చినట్లు ఓ ఖైదీలా నిలబడి ఏడుస్తూ చెప్పాను.” పది రోజులనుండి తిండి లేదు ...నీళ్ళు మాత్రమే అక్కా! బాత్రూం కు కూడా పంపించి కాపలా కాస్తాడు, తను మాత్రం నా ముందే హోటల్ నుండి తెచ్చుకొని తింటాడు “ అని ఏడుస్తూ చెప్పాను. రాత్రికి ఎప్పటిలాగా తాగి వచ్చాడు. కోపంతో బావగారు దవడ పగిలేంత లెంపకాయ కొట్టి తాళం చెవి తీశారు.

ఆ తర్వాత అక్కతోను బావతోను అనంతపురం వెళ్లి పోయా! వాళ్ళ ఇద్దరు పిల్లలు, నాకు పుట్టిన పాపతో అక్క ఇల్లే గతియని పడి వున్నాను. అక్కా బావలంటే నాకు అమ్మా నాన్నలకంటే ప్రాణం. అమ్మ నాన్నగారు పోయిన తర్వాత వదినల పోరు పడలేక అక్క అంచెన చేరింది. బావగారి ఒక్క జీతం. మేమా 7మంది. అద్దె కొంప. అమ్మా, నేను చిన్నగా వంటలు చేయడం మొదలు పెట్టాం. ఇరుగు పొరుగు వారికి ఊరగాయలు, పచ్చళ్ళు. పొడులు, వంటలు చేసి ఇచ్చేవాళ్ళం. జీవితం సాఫీగా సాగడం మొదలు పెట్టింది. విధి మమ్మల్ని వెంటాడం అక్కడితో ఆపలేదు . బంగారంలాంటి బావగారి మీద ఏదో తప్పుడు లెక్కలు ఎవడో చూపించి ఉద్యోగం నుండి పీకించాడు. అప్పుడే ఇల్లు ఖాళీ చేసి నాలుగు మూటలతో దేవుడి మీద భారం వేసి విరక్తితో కాశీ వచ్చేశాం.

కొత్త ఊరు, ఎక్కడ ఉండాలా? ఇంతమందికి ఎవరు ఆశ్రయం ఇస్తారు? అని అనుకుంటుండగా ఎవరో హరిశ్చంద్ర ఘాట్ దగ్గర చుట్టు ప్రక్కల అడిగి చూడండి అన్నారు. అప్పుడే రామ బ్రహ్మ గణపాటిగల్, అదే మీచే కర్మ కాండలు చేయించిన పెద్దాయన మావద్దకు వచ్చి “’మీలో ఎవరన్నా బాగా వంట చేయ గలరా ? మాకో వంటావిడ కావాలి అని మంచి తెలుగులో అడిగారు. దానికి నేను “అమ్మా, నేను చేస్తామండి .కానీ మాకు ముందు ఉండడానికి కాస్త చోటు ఇప్పించండి అని “’ చేతులు జోడించాను. దానికి ఆయన ఈ మాత్రానికే అంత భాధ ఎందుకమ్మా ? అంటూ మా ఇంటి మేడపైన ఓ పెద్ద హాలు, చిన్న వంట గది, బాత్ లెట్రిన్ తో సహా వుంది. ఓ మెస్ పెట్టండి తర్వాత అన్నీ విశ్వనాథుడు చూసుకుంటాడు “ అని అన్నారు ఆప్యాయంగా. వెంటనే తన భార్యను పిలిచి “ ”సీతాలక్ష్మీ! ఇవా తెలుంగు బ్రాహ్మణా, పావం ఏళ్ళై, నంబ ఉదవలాం !(వీళ్ళు తెలుగు బ్రాహ్మలు, పాపం పేదవారు , మనం సహాయపడుదాం) అన్నారు. ఆవిడ చిరునవ్వుతో సరేనంది. వారిద్దరే మాకు ఆది దంపతులు. అమ్మా నాన్నా, దైవం అంతా. వాళ్ళ పిల్లలతో సహా మా పిల్లలు, మా వంటకాల రాబడి పెరిగింది. ఇక్కడే స్థిరపడ్డాం. అక్క కొడుకులు పై చదువులు చదివి అక్కను బావను కూడా తీసుకెళ్ళి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. నా కూతురికి కూడా తనే మంచి సంబంధం చూసి పెళ్లి చేయించింది. తను కూడా హైదరాబాద్ లోనే వుంది. ఇద్దరు పిల్లలు. అక్క పిలిచింది తనతో రమ్మని నేనే కాదన్నాను. ఆమెకు ఇంకా భారంగా వుండడం ఇష్టం లేక. ఓ పూట వంట చేస్తే ఇప్పుడు ఐదొందలు, అప్పుడు రెండొందలు. మూడు పూట్ల చేసేదాన్ని. కాశీలో నేను నా ముసలి తల్లి మిగిలాం. అమ్మా పోయి రెండు సంవత్సరాలు అయ్యింది. ఈ ఘాట్ లో గంగా లోనే కార్యాలు చేశాం. మా అక్క కొడుకే కొరివి పెట్టాడు. ఇప్పుడు నేనొక్కతనే ఇక్కడ మిగిలింది. ఇలా అన్నీ వంటలూ అందరికీ చేస్తూ అన్నీ భాషలు మాట్లాడుతూ జీవితాన్ని ఈడుస్తున్నాను ....అంది వెంకట రమణమ్మగారు గతం లోంచి తేరుకుంటూ.

“మరి మీ ఆయన ఏమయ్యాడు? ఎక్కడ వున్నాడు? ఏమన్నా తెలిసిందా? కుతూహలంతో అడిగింది కమల.” ’ఆ ఈ మధ్య భీమవరంలో ఆ కులం తక్కువ దాని ఇంట్లోనే పోయాడంట. అక్క బావలు వెళ్లి వచ్చారు,అందరికీ అత్త కొడుకేగా! నా కూతురు ,” ’ నా ముఖం కూడా చూడని తండ్రిని చూడడానికి ఇష్ట పడలేదని చెప్పేసింది ...అంది నిర్లిప్తంగా.” ’మీరు ?..సందేహంగా ప్రశ్నించింది కమల. “’లేదు! బంధుత్వమనేది కలసి ఉంటేనే తీగెలా అల్లుకుపోతుంది . తెగిపోతే ఏ సంబంధమన్నా తిరిగి అతుక్కోదు.” భార్యకు తిండి పెట్టని వాడు ఇప్పుడు భూమిపై లేడు. కానీ ఆవిడ రోజూ ఇపుడు పదిమందికి తన చేతులారా వండి పెడుతున్నది. ఏమి ! దైవ లీల! “అనుకుంది కమల. ఆవిడకో చీర కొనిపెట్టి, వందరూపాయలు ఇచ్చి అక్కడి నుండి కదిలింది కమల.

యాభై ఏళ్ల రమణమ్మ తన గతం చెప్తున్నప్పుడు కూడా కంట తడి పెట్టలేదు. ఎంతటి దృఢ సంకల్పం !! ఈవిడకున్న ధైర్యం. మనోస్తైర్యం, దృఢ నిశ్చయం, ఆత్మబలం , కఠిన పరిశ్రమ, నమ్మకం ఈ కాలం చదువుకున్న కాలేజి విద్యార్థులకెందుకు లేదు? ఊపిరుంటే ఉప్పు అమ్మి బతకొచ్చు అంటారే! పరీక్ష ఫెయిలయితే ప్రేమలో ఓడిపోతే వెంటనే ఆత్మహత్య చేసుకొని తల్లిదండ్రులకు కడుపు కోతెందుకు కలిగిస్తున్నారు? తనలో తానే ప్రశ్నించుకుంది కమల.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు