చెప్పుకుంటే చేటంత చెడ్డీ!! - -రాజేష్ యాళ్ళ

cheppukunte chetamta cheddee

"హాయ్ వెల్కం టూ దివాలీ స్పెషల్ 'చెప్పుకుంటే చేటంత చెడ్డీ!' ప్రతి ఆదివారం ఉదయం ఎన్నెన్నో చెడ్డీలను మీకు కానుకగా తెచ్చే మీ ఫేవరెట్ ప్రోగ్రాం ఈ రోజు దీపావళి స్పెషల్ గా మీ ముందుకొచ్చింది. ఈ పండుగ రోజు మీ కోసం రకరకాల చెడ్డీలు... రంగురంగుల చెడ్డీలు, పెద్దపెద్ద చెడ్డీలు, చుక్కల చుక్కల చెడ్డీలు, చారల చారల చెడ్డీలు ఎన్నో ఎన్నెన్నో రడీగా ఉన్నాయి. మరి ఇంకెందుకాలస్యం.... వెంటనే 112233 నంబర్ కి డయల్ చేసి అద్భుతమైన చెడ్డీలను మీ సొంతం చేసుకోండి! అన్నట్టు దివాలీ స్పెషల్ గా చెడ్డిలను గెలుచుకున్న ప్రతి ఒక్కరికీ రెండేసి ఎలాస్టిక్స్ పండుగ స్పెషల్ గా మీకు అందిస్తున్న వారు... పీకే చెడ్డీల కంపెనీ! మరి కాల్ వస్తోంది తీసుకుందామా?!"

"హలో..."

"హలో చెప్పుకుంటే చేటంత చెడ్డీ ప్రోగ్రామేనాండీ?"

"హలో అవునండీ... వెల్కం టూ చెప్పుకుంటే చేటంత చెడ్డీ ప్రోగ్రాం!"

"కెవ్వ్... కెవ్వ్!"

"అంత కెవ్వ్ కెవ్వ్ ఎందుకండీ... హలో..."

"హలో చెప్పుకుంటే చేటంత చెడ్డీ ప్రోగ్రామేనా?!"

"ఇదేంటి గొంతు మారింది... ఇందాక ఎవరో లేడీ కదా చేసారు?"

"ఆ... నేను ఆవిడ భర్తని. మీ లైన్ దొరగ్గానే ఆ ఆనందంతో మా ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. దానికేమైనా అవ్వాలి... అప్పుడు స్టూడియోకి వచ్చి నీ అంతు చూస్తా!"

"వామ్మో బ్రేక్!"

మరో మూడు నిమిషాల తర్వాత...

"వెల్కం బేక్ టూ చెప్పుకుంటే దివాలీ స్పెషల్ చేటంత చెడ్డీ ప్రోగ్రాం! కాలర్ రడీగా ఉన్నారు మాట్లాడదామా.... హలో..."

"హలో... నేను కాకినాడనుండి కాంతమ్మను మాట్లాడుతున్నా."

"ఓ వెరీ గుడ్ కాంతమ్మ గారూ... మీరు మా ప్రోగ్రాం రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా?"

"అవునండీ ప్రతీ ఆదివారం చెప్పుకుంటే చేటంత చెడ్డీ ప్రోగ్రాం చూసాక కానీ నేను వంట మొదలుపెట్టనండీ!"

"అబ్బ చాలా సంతోషం కాంతమ్మ గారూ! మా ప్రోగ్రాం అంటే మీకెందుకు అంత ఇష్టం?!"

"మిగతా ఛానెల్స్ లా అందరూ ఇచ్చేవి కాకుండా మీరు చెడ్డీలను బహుమతులుగా ఇవ్వడం మాకు చాలా నచ్చిందండీ! ఎందుకంటే శరీరానికి ఎంతో అవసరమైన చెడ్డీ ఇంపార్టెన్స్ ని మీరే ముందుగా గుర్తించి ఇలా ఓ ప్రోగ్రాం చెయ్యడం నిజంగా దేశసేవేనండీ! ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు మీకు నిజంగా థ్యాంక్సండీ!

పైగా ఇవ్వాళ దీపావళి కానుకగా బహుమతి గెల్చుకున్న వారికి రెండు ఎలాస్టిక్స్ ఇవ్వడం మరీ మరీ నచ్చిందండీ!"

"వావ్ భలే చెప్పారు కాంతమ్మ గారూ... సరే ప్రోగ్రాం స్టార్ట్ చేద్దామా?! జాగ్రత్తగా మీరు సమాధానం చెబితే ఈ అందమైన చెడ్డీ నిజంగా మీ సొంతమైపోతుంది. రడీనా?!"

"అబ్బ! ఎంతబావుందోనండీ మీరు చూపిస్తున్న రంగురంగుల చెడ్డీ! ఏ చీరకైనా ఇట్టే మేచ్ అయిపోతుంది."

"అదేనండీ ఈ చెప్పుకుంటే చేటంత చెడ్డీ ప్రోగ్రాం స్పెషాలిటీ కాంతమ్మ గారూ! మరి ప్రశ్న వెయ్యనా?"

"ఆ...ఆ... త్వరగా అడగండి కుసుమ గారూ... ఆ చెడ్డీని దూరం నుండి చూస్తుంటేనే నా ఒళ్ళు పులకరించిపోతోంది... దాన్ని బహుమతిగా గెలుచుకుని ఎప్పుడెప్పుడు త్వరగా తొడుక్కుంటానా అని."

"సరే మీ ప్రశ్న.... జాగ్రత్తగా వినండి. ఒక్క చెడ్డీలో ఎన్ని కాళ్ళు పడతాయి?"

"ఒక్క చెడ్డీలో.... ఎన్ని కాళ్ళు... చాలా కష్టమైన ప్రశ్న అడిగారు కుసుమ గారూ!"

"లేదండీ... కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే చెప్పేస్తారు... ఆలోచించండి."

"ఎంత ఆలోచించినా తెలియడంలేదండీ.... ఆ తెలిసింది... ఒకటే చెడ్డీ కదా, ఒకటే చెడ్డీ పడుతుందండీ!"

"అయ్యో కాంతమ్మ గారూ... జస్ట్ కొద్దిపాటి తేడాతో మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండీ... బై!"

"ఓ మై గాడ్ నా ఆన్సర్ తప్పా? అయ్యో... వా....."

"చూసారుగా కాంతమ్మగారు చెడ్డీని బాగా ఇష్టపడ్డారు కానీ పాపం జస్ట్ మిస్సైపోయారు... మరి మీరూ వెంటనే మా చెప్పుకుంటే చేటంత చెడ్డీ దివాలీ స్పెషల్ కి ఫోన్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగితే ఈ అందమైన చెడ్డీ మీ వంటి మీదే అతుక్కుని కళకళలాడిపోవచ్చు... కాబట్టి వెంటనే డయల చెయ్యండి! ఆ మళ్ళీ రింగవుతోంది... ఎవరో ఆ అదృష్టవంతులు చూద్దాం. హలో..."

"హలో... హలో...."

"హలో అండీ... వెల్కం టూ చెప్పుకుంటే చేటంత చెడ్డీ"

"కుసుమగారేనాండీ? చెప్పుకుంటే చేటంత చెడ్డీ ప్రోగ్రామేనా?"

"అవునండీ... నేను కుసుమనే. మీరు చేసింది చెప్పుకుంటే చేటంత చెడ్డీ ప్రోగ్రాంకే!"

"హమ్మయ్య.... థ్యాంక్స్ కుసుమగారూ.... ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తుంటే ఇన్నాళ్ళకు లైన్ దొరికిందండీ!"

"ఓ అవునా ఇవాళైనా దొరికింది సంతోషించండి. చెడ్డీల కోసం చాలామంది వెర్రి వెర్రిగా ట్రై చేస్తూ ఉంటారు కదండీ! ఇంతకూ మీ పేరూ ఊరూ చెప్పలేదు"

"నేను పాలకొల్లు నుండి పాపాయమ్మను మాట్లాడుతున్నానండీ!"

"చాలా సంతోషం పాపాయమ్మ గారూ... మా చెప్పుకుంటే చేటంత చెడ్డీ ప్రోగ్రాం మీకు నచ్చిందా?"

"నచ్చడం అన్నది చాలా చిన్నపదమండీ... నాకే కాదండీ మా కాలనీ మొత్తం మీ ప్రోగ్రాముని పడి పడి మరీ చూస్తామండీ! సండే వచ్చిందంటే చాలూ మా టీవీలు ఫోన్లూ ఈ ప్రోగ్రాంతోనే బిజీ అయిపోతాయండీ! ఈరోజు ఈ స్పెషల్ ప్రోగ్రాం కారణంగా దీపావళికి పిండివంటలు వండటం మానేసి మరీ అందరం మీ ప్రోగ్రాం మీదే దృష్టి పెట్టామండీ!"

"హబ్బ చాలా హ్యాహీ అండీ... పాపాయమ్మగారూ! మా ప్రోగ్రాం మీకంత నచ్చడానికి కారణమేంటండీ!"

"ఎందుకంటే మీరు గిఫ్టుగా ఇచ్చే చెడ్డీలన్నీ భలే బావుంటాయండీ కుసుమగారూ! ఒక వారం ఇచ్చిన చెడ్డీ మరొక వారం ఇవ్వకుండా రకరకాలుగా కలర్స్, డిజైన్స్ మారుస్తూ మాకు పిచ్చెక్కిచ్చేస్తూ ఉంటారండీ. ముఖ్యంగా త్రీ సండేస్ బేక్ నవాబుపాలెం నవ్యగారు గెలుచుకున్న చెడ్డీ అయితే సూపర్బ్ అండీ! నల్ల చెడ్డీపై ఎర్ర చుక్కల డిజైన్ మాకెంతో నచ్చిందండీ. వీలైతే అలాంటి చెడ్డీనే మాకూ గిఫ్టుగా ఇప్పించకూడదూ? ప్లీజ్ కుసుమ గారూ!"

"ఓ.. సారీ పాపాయమ్మ గారూ ఒకసారి చూపించిన చెడ్డీనే మళ్ళీ చూపించడానికి కానీ గిఫ్టుగా ఇవ్వడానికి కానీ మా రూల్స్ ఒప్పుకోవండీ. ఇప్పుడు మీరు చూస్తున్న చెడ్డీ కూడా మంచి చెడ్డీనే! పైగా ఫ్రీ సైజ్ కూడానూ! దీని కలర్స్ చూడండి ఎంత ఎట్రాక్టివ్ గా ఉన్నాయో!"

"సరేనండీ కుసుమగారూ... పోనీ ప్రశ్నైనా కొంచెం ఈజీగా అడగండి ప్లీజ్!"

"ఓకే మీరేమీ కంగారు పడకండి పాపాయమ్మగారూ...జాగ్రత్తగా ఆలోచించి జవాబు చెప్పండి. నేను మీకు హెల్ప్ చేస్తాను కూడా! మీ ప్రశ్న... ఒక చెడ్డీకి ఎన్ని బటన్స్ ఉంటాయి?"

"ఓ కుసుమగారూ... అయ్యో... చాలా కష్టంగా అడిగేసారండీ! నాకు చెడ్డీ గెలుచుకునే యోగం లేదనుకుంటాను!"

"అంతలోనే అంత డిజప్పాయింట్ అయిపోతే ఎలా పాపాయమ్మగారూ... నేను హెల్ప్ చేస్తా అన్నాగా? క్లూ ఇస్తాను కదా!"

"చాలా థ్యాంక్స్ కుసుమగారూ.... ఆ క్లూ ఏదో చెప్పండీ...ప్లీజ్ ప్లీజ్!"

"మీరు చాలా టెన్షన్ పడిపోతున్నారు పాపాయమ్మ గారూ... క్లూ ఏంటంటే చెడ్డీకుండే బటన్స్ రౌండ్ ఫిగర్లో ఉంటాయి."

"రౌండ్ ఫిగర్.... అంటే...జీరోనాండీ?!!"

"వావ్ పాపాయమ్మగారూ ఇలా క్లూ ఇచ్చానో లేదో అలా చెప్పేసారు. మీరు చాలా తెలివైనవారండీ! మీలాంటి తెలివైన చురుకైనవారి కోసమే మా చెప్పుకుంటే చేటంత చెడ్డీ ప్రోగ్రాం! సూపర్బ్ ఆన్సరండీ! ఇందాకటినుండీ మన ప్రేక్షకులనందరినీ ఊరిస్తున్న ఈ రంగురంగుల చెడ్డీ ఇప్పుడిక మీ సొంతమయింది! దీపావళి సందర్భంగా స్పెషల్ గా ఆఫర్ చేస్తున్న రెండు ఎలాస్టిక్స్ కూడా గిఫ్టుగా మీరందుకుంటారు!! కంగ్రాట్స్ పాపాయమ్మ గారూ!!"

"ఓ థ్యాంక్యూ సో మచ్ కుసుమగారూ... మా ఇంట్లోనూ కాలనీలోనూ ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటాను! మీ చెప్పుకుంటే చేటంత చెడ్డీ ప్రోగ్రాం ద్వారా ఒక్క చెడ్డీ అయినా గెలుచుకోవాలని ఎన్నాళ్ళుగానో కలలు కంటున్నా... పైగా ఆ కలను నెరవేర్చుకోవడానికి చాన్నాళ్ళుగా చెడ్డీలు కొనడమే మానేసాను!! చాలా చాలా హ్యాపీ అండీ!! చెడ్డిలతో పాటు అదనంగా మీరు అందించిన రెండు ఎలాస్టిక్స్ బహుమతితో నాకు పట్టరాని ఆనందంగా ఉంది. ఈ సంతోషంలో నేనేమైపోతానో నాకే తెలీడంలేదండీ!! థ్యాంక్స్ ఎగెయిన్!!"

"వావ్ వెరీ నైస్ పాపాయమ్మగారూ... మీ పంతం నెరవేర్చుకున్నందుకు చెప్పుకుంటే చేటంత చెడ్డీ టీమంతా మీకు మనసారా కంగ్రాట్స్ చెబుతోంది!! అభినందనలండీ!!”

"పాపాయమ్మగారూ.... ప్రేక్షకులందరినీ కట్టి పడేస్తున్న మన పీకే కంపెనీ చెప్పుకుంటే చేటంత చెడ్డీ ప్రోగ్రాం ఇంకా ఎట్రాక్టివ్ గా చెయ్యడానికి మీరిచ్చే సూచనలేమైనా ఉన్నాయా?!"

"తప్పకుండా కుసుమగారూ... నా మనసులోని మాటను మీరే అడిగేసారు!! ఈ ప్రోగ్రాం ఇప్పటికే ఎంతో ప్రజాదరణ పొందుతోంది. ఇంకా సక్సెస్ కావడానికి నా దగ్గర కొన్ని ఆలోచనలున్నాయండీ. మొదటిది అవేంటంటే మీరు గిఫ్ట్సుగా అందిస్తున్న వైడ్ రేంజ్ లో భాగంగా కంపెనీ వారిని రిక్వెస్ట్ చేసి వర్క్ చెడ్డీలను కూడా లాంచ్ చెయ్యించండి! అదే విధంగా అందమైన బుటాలున్న చెడ్డీలూ, మా ప్రేక్షకుల స్పందన బట్టి డిజైనర్ చెడ్డీలను కూడా తయారుచెయ్యించి ఇక్కడా గిఫ్ట్సుగా అందిస్తే మన చెప్పుకుంటే చేటంత చెడ్డీ ప్రోగ్రాం ఇంకా అదిరిపోవడంతో పాటు ఛానెల్ టీఆర్పీ రేటింగ్సూ, పీకే కంపెనీ సేల్సూ, మా అందరి ఆదరణా తప్పకుండా పెరిగిపోతాయండీ!!"

"వావ్ పాపాయమ్మ గారూ ఎంత చక్కని సలహాలు ఇచ్చారండీ! మా చెప్పుకుంటే చేటంత చెడ్డీ టీం తప్పకుండా మీ అమూల్యమైన సలహాలను దృష్టిలో పెట్టుకుంటుంది. చాలా థ్యాంక్సండీ! చూసారా వ్యూయర్స్... మన పంతం పాపాయమ్మగారిలా చెడ్డీలను గెలుచుకోవాలంటే కొనకండి... జస్ట్ మా చెప్పుకుంటే చేటంత చెడ్డీ ప్రోగ్రాంకి డయల్ చెయ్యండి... మరి మరెన్నో రంగురంగుల కొత్తకొత్త డిజైన్లతో అలరించే సరికొత్త చెడ్డీల కోసం వచ్చే ఆదివారం ఎదురుచూడండి! మరోసారి మీ అందరికీ హ్యాపీ దివాలీ!!" ***

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు