ఓ పేరు మోసిన ఎం.ఎస్.సి .కంపెనీలో అసిస్టంట్ మేనేజెర్ పోస్ట్ ఇంటర్వ్యూకై వెళ్ళి హడావిడిగా తన సర్టిఫికెట్లను తిప్పుతూ కూర్చున్నాడు మూర్తి .ఇది దాదాపు పదిహేనవ ఇంటర్వ్యూ ఎం.బి.ఏ లో ఫస్ట్ క్లాస్స్ లో పాస్ అయినా ఓ మంచి ఉద్యోగం లేక దాదాపు నాలుగు సంవత్సలుగా ఉద్యోగానికై అల్లాడుతూ తిరుగుతున్నాడు.
“సర్ ! మిమ్మల్ని ఎమ్.డి. గారు రమ్మన్నారు” అని వచ్చి చెప్పాడు ప్యూన్ . లేచి షూను, టైను అడ్జస్ట్చేసుకొని ఠీవిగా లోపలికి నడిచాడు మూర్తి.ఎదురుగా ఉన్న నాలుగు సీట్లలో మద్యలో సీట్ ఖాళీ.మిగితా మూడు సీట్లలో బాగా తలపండిన అనుభవస్తులు కూర్చొని ఉన్నారు. ‘మూర్తికి సీట్ ఇచ్చి ఇంటర్వ్యూ మొదలు పెడదామా?’ అన్నట్టు ఒకరినొకరు చూసుకుంటున్నారు.
అప్పుడే సైడ్ డోర్ను లోపలికి తోసుకుంటూ “ ఎక్స్ క్యూజ్ మీ “ అంటూ వచ్చిఆ ఖాళీ సీట్లో దర్జాగా,అందంగా కూర్చుంది దేదీప్య.ఆమెను చూడగానే వెన్నులో వణుకు మొదలైంది మూర్తికి.కాని ఆమె మాత్రం మూర్తిని చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా హాయిగాకూర్చుంది. అన్ని మామూలు ప్రశ్నలే. అర్ధగంట తర్వాత ప్రశ్నల భారీ నుండి మూర్తిని వదిలిపెట్టారు ‘వారం రోజుల తర్వాత ఫలితాలు తెలుపుతామంటూ’.
పరధ్యానంగా మూర్తి తన సర్టిఫికేట్లతో నిరుత్సాహంగా బస్సు ఎక్కాడు ఎలాగు తనకీ ఉద్యోగం రాదనీ.మూర్తి స్మృతులు వెనక్కు వెళ్ళనారంభించాయి .
* * * * *
ఎం.బి.ఏ. ఫ్రేషేర్స్ పార్టీలో కలిసిన అమ్మాయి దేదీప్య, తను చాలా గోప్పింటివాళ్ళ అమ్మాయి అని అందరు అనేవారు.కానీ తను మాత్రం ‘డౌన్ టు ఎర్త్ అనవచ్చు’.చక్కని చుక్క,అందరితో చాలా కలివిడిగా ఉంటుంది. మూర్తి ఎప్పుడూ ఆమెను చూడాలనే అర్ధగంట ముందే జూనియర్స్ క్లాసురూం వైపు వెళ్ళికూర్చుని పలుకరించే వాడు.తన పరిచయాన్ని ప్రేమగా మార్చాలని మూర్తి తపన. రెండు మూడు సార్లు ఆమెను కాలేజీ క్యాంటిన్లో“బర్త్డే పార్టీ”అనో వేరే ఏదో నెపంతో పిలిపించి అవీ ఇవీ కొనిపెట్టేవాడు.అందరితో పాటు తను కూడా వచ్చేది.రెండు మూడు సార్లు “ఐ లవ్ యు” అని కొన్ని బహుమతుల మీద కూడా రాసి అందజేసే వాడు.కొద్ది కొద్దిగా తన పరిచయాన్ని ప్రేమగా మార్చుకునే ప్రయత్నం చేసాడు మూర్తి.తరుచుగా మూర్తి, దేదీప్య బీచ్ కు, గుళ్ళకు ,హోటల్స్ కు కలిసి మెలిసి వెళ్ళేవారు. ఓ సారి దేదీప్య తను ఇష్టపడి కొనుక్కొన్న పింక్ సారీని కట్టుకొని గుడికెళ్ళింది .
“మూర్తి, ఎలా వుంది చీర?” అని ఉత్సాహంతో అడిగింది మూర్తిని.
“నాకీ రంగు అస్సలు నచ్చలేదు, పిస్తా గ్రీన్ అయితే నీకు బాగుంటుంది” అని అన్నాడు చిన్నబోతున్న దేదిప్య ముఖాన్నిపట్టించుకోకుoడా.అదే లాగ హోటల్లో కూడా దేదీప్య తనకిష్టమైన పదార్థాలను ఆర్డర్ చేస్తే, వాటిని కాన్సెల్ చేసి తనకిష్టమై నవే తెప్పించేవాడు మూర్తి. చాలా సార్లు ఇవన్ని చూసి విసిగి పోయేది దేదీప్య కాని మూర్తి గుణం తెలుసు కాబట్టి పట్టించుకునేది కాదు.
ఓ రోజుహఠాత్తుగాదేదీప్యఅందరి ముందు తనకు తన అమెరికా రిటర్న్ బావతో పెళ్లి కుదిరిందని తెలియపరిచింది.ఓ ఫైవ్ స్టార్ హోటల్లో విందు ఇప్పించిoది.అందరితో పాటు బిక్క మొహం వేసుకొని విందుకు వచ్చి వెళ్ళాడు మూర్తి.ఓ రెండు రోజుల తర్వాత దేదీప్య ఒంటరిగా ఉన్న అదను చూసి “అదేంటి? దేదీప్యా , నేను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పాను , నువ్వేమో ఏ సమాదానం ఇవ్వకుండా “నా పెళ్లి” అంటూ విందు ఇస్తున్నావు.అయినా! నాకేం తక్కువ? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నిజంగా అదృష్టవంతురాలు.ఇంత వరకు డిస్టoక్షన్,పెళ్ళాన్ని చక్కగా చూసుకోబోయే మగాణ్ణి” ,నిజంగా నీవు మిస్సయ్యావు ! అని అన్నాడు చాల బాధతో.వెంటనే దేదీప్య “అదే నీ లోటు మూర్తి. నీవు నీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు చాటుగా ఉండి చాలా సార్లు గమనించా .నిజమైన ప్రేమలో అహానికి గర్వానికి చోటు లేదు.నీవో గొప్ప అహంబావివి,నీ గురించి, నీ మంచితనం గురించి ఇతరులు చెప్పాలి గాని నీవే నీ సొంత సుత్తి డబ్బా కొట్టు కుంటావ్ ఇంకా నీదగ్గర నాకు నచ్చని విషయాలు ఎన్నో ఉన్నాయి...పదిమందిలో అమ్మాయిలను , ద్వంద్వ బూతు అర్థాలతో మాట్లాడడం నాకు నచ్చ లేదు. ఈ రెండు సంవత్సరాలలో నా దగ్గర కనీసం ఒక వంద సార్లైనా మాట్లాడి ఉంటావు,ప్రేమ ఒలకబోసి వుంటావ్ ,కానీ ,ఎలా ఈ పసుపు చీర బాగా లేదు,ఎర్ర చీరైతేనే బాగుంటుంది,ఈ డ్రెస్ అస్సలు బాగా లేదు,నీవు తెచ్చిన షర్ట్ కలర్ బాగ లేదు,ఈ చాక్లేట్ట్ బ్రాండ్ నాకు ఇష్టం లేదు, ఈ నెక్లెస్ బాగా లేదు,ఆ అమ్మాయి లావుగా ఉంటుందని లేదా ,ఆ ఫ్రోపెసర్ వేస్ట్....” ఇలా ప్రతి చిన్న విషయo లో నీవేదో రారాజు అనుకోని ఎదుటి వ్యక్తి మనస్సును నీ సూటి పోటి మాటలతో ఎదుటి వ్యక్తుల భావాలను, అహాన్ని దెబ్బతీసే విధంగాగ ఓ పెద్ద ఆరితేరిన వాడినని నిన్ను నీవే అనుకుంటూ ,ఇతరుల విలువలకు ,మానసిక భావాలకు స్వేచ్ఛఇవ్వక మాట్లాడుతూ ఉంటావు. ఒక్కసారైనా ఇతరుల భావనలను,ఇతరుల ఇష్టా అయిష్టాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఒక ఫ్రెండ్ గానే నీకూ నాకు భావాల ఏకీకరణ లేనప్పుడు పెళ్ళేట్ల చేసుకుంటాను చెప్పు?పెళ్ళంటే నూ రేళ్ళ పంట .
ఇక నా బావ విషయానికి వస్తే నేను తనిని ప్రేమించానో లేదో కాని అతను నన్ను ఆరాధిస్తున్నాడు ఇంతవరకు ఎప్పుడు కూడా తను , నన్నూ,నా ఫీలింగ్స్ ని హర్ట్ చేయలేదు. నేనేదన్నా అతన్ని తిడితే కుడా మౌనంగ నవ్వి వదిలేస్తాడు. ఎన్నో సార్లు అతని మంచితనం చూసి నీనే సారీ అడిగే దాన్ని. మన ప్రేమ గురించి కూడా అతనికి చెప్పి ఉంచాను. “నీకు ఇష్టమైతే నచ్చుతే పెళ్ళాడు, నా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది” అన్న మంచి వ్యక్తి . తన స్నేహితుల ద్వారానే నాకో విషయం తెలిసింది ‘తను నన్ను గాఢoగా ప్రేమిస్తున్నాడని’. అమెరికాలో ఉంటూ కూడా నన్ను అభిమానిస్తున్నడని.ఒక్క సారి కూర్చొని బాగా ఆలోచించా .“పెళ్లికి ముందే అహoతో ఇన్ని ఆంక్షలు విధించే వాడివి,పెళ్ళైన తర్వాత ఎన్ని తిప్పలు పెడతా వో?” అని భయంవేసింది.వెంటనే జరిగిందంతా మా బావకు చెప్పేశా. బావ నవ్వుతూ “నీ ఇష్ట ప్రకారమే కాని” అన్నాడు.
“అదేంటి అన్ని లక్షల అధిపతివి, ఆరడుగుల అందగాడివి, అమ్మానాన్నల గారాల పట్టీ మరి నీకంటూ ఇష్ట ఇష్టాలు లేవా?”అని అడిగాను అమాయకంగా.దానికతను నవ్వుతూ “పిచ్చి దేదీప్యా !అవన్నీ బయట కనిపించే మబ్బు మేఘాలలాంటివి .నిజమైన ప్రేమంటే ఒకరినొకరు అర్ధం చేసుకుని ఎవరి మనస్సును నొప్పి పెట్టక అందరినీ సంతోష పెడుతూ సాఫీగా లాగే జీవితం,అదే నిర్మల ఆకాశం లాంటిది ” అని అన్నాడు నవ్వుతూ.
సాదారణంగా స్నేహమైన, ప్రేమైనా రెండు మనసుల భావాలు కలవాలి. “అయిన నేను నీతో హోటళ్లకు , పార్కులకు ఒంటరిగా తిరిగినా ఓ మంచి ఫ్రెండ్ లాగానే వున్నాను కానీ ప్రేమను ఒలకబోసి నీ మనసును మభ్య పెట్టలేదు.... అర్దమైందా?” అంది నవ్వుతూ.
* * * * * * *
“బస్ స్టాండ్ వచ్చింది, దిగండి” అన్న కండక్టర్ పిలుపుతో ఈ లోకానికి వచ్చాడు నారాయణమూర్తి. మరుసటి రోజు ఉదయం ఈమెయిల్ లో తన అప్పాయింట్ మెంట్ ఆర్డర్ చూసి సంతోషంగా ఎగిరి గంతేసి, ఆ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు.ఎక్కడో ఓ మూలలో దేదీప్య మనస్సులో తన పట్ల ప్రేమ ఉందేమోనన్న ఆశతో .
“సార్! ఎమ్.డి. గారు పిలుస్తున్నారు”అని అనడంతో, క్యాబిన్ వైపు నడిచాడు మూర్తి. “రండి మూర్తి గారు! ‘అల్ ద బెస్ట్ ఫార్ ది జాబ్’ నిజాయితిగా,ఆఫీసులో పని చేసీ మహిళలను గౌరవిస్తూ , ఓ మానవత్వం కల వ్యక్తిగా ఈ కంపెనీ పెరుగుదలకు తోడ్పడతారని ఎం.డీ గా ఆశిస్తున్నాను... నౌ యు మే గో...” అంటూ ఠీవిగా ఫైల్స్ మీద దృష్టి సారించింది ఎమ్.డి. మిసస్స్ దేదీప్య ఆనంద్ .”’ఓ.కే .మేడం ...అంటూ తన సీటు వైపు నడిచాడు మూర్తి .