పచ్చిగడ్డి పడక - కైపుఆదిశేషారెడ్డి

pacchigaddi padaka

రేగడి చేను డొంక వైపున అలికిడి కావడంతో తలెత్తి చూశాడు కాశీ.

కంప గేటు తొలగించుకొని చక చక నడచి వస్తోంది రత్తాలు.

‘అమ్మో దీని సిగ తరగ వచ్చేస్త్తోంది. యిక నా పని అయినట్లే..’అనుకుంటూ రత్తాలును చూడనట్లుగానే

తలొంచుకొని పనిలో పడి పోయాడు. కాలి పట్టీలు చప్పుడు చేసుకుంటూ, చేను గట్టుమీద నదచుకుంటూ

తనని దాటి పోతున్న రత్తాలును వెనక వైపు నుండి ఓరగా చూశాడు. సన్నటి నడుము,

కాస్త రంగు తక్కువే అయినా కత్తిలా వుంది. వెనక నుండి కాశీ తనను చూస్తూంటాడని తెలుసేమో.. నడుము మరింతగా వూపుతూ..

వయ్యారంగా నడుస్తోంది రత్తాలు. చూస్తున్న కాశీకి గుండె లయ తప్పుతోంది. పై చేను దగ్గర నిలబడి

వార కంట వెనక్కి చూసి, జీరాడే చీర కుచ్చిళ్ళు పైకెత్తి.. బొడ్డు దగ్గర దోపింది. వంగి కొడవలితో పచ్చిగడ్డి కోయసాగింది. “ పచ్చి గడ్డి కోసేటి పడచు పిల్లోయ్ .. నీ పైట కొంగు జారిందే గడుసు పిల్లా ..! ” హుషారుగా పాడుతూ..మెల్లగా తలెత్తి

రత్తాలు వంక చూశాడు కాశీ. వంచిన తలెత్తకుండా పర పరా గడ్డి కోస్తుందామె.

తన పాటకు ఆవిడ స్పందించక పోయే సరికి .. ‘ యిదేదో మా అందగత్తె మాదిరి పేద్ద ఫోజు..’ అనుకుంటూ మట్టి పెళ్ళలు నలగ్గొట్టి మడవ మార్చుతూ అనుకొన్నాడు. కాసేపు యెవరి పనిలో వారు నిమగ్నమై పోయారు. గడ్డి కోయడం పూర్తయ్యాక

తాళ్ళతో మోపు కట్టింది. అటూ యిటూ చూసి.. “ బావా ఓ కాశీ బావా ..! ఓ మారు యిటొచ్చి గడ్డి మోపు నెత్తికెత్తవా .. ! అవతల యెండెక్కి పోతావుంది.

యింటికెళ్ళి కూడూ కూరా వండాలి..”అంటూ కేకేసింది రత్తాలు చేతిలో పార పక్కనేసి రత్తాలు వైపు నడవ సాగాడు. ఒంటి మీద లుంగీ తప్ప మరొకటి లేదు.చొక్కా లేని అతని ఛాతీ మీద కండరాలు చేవ పట్టినట్లు మిస మిస లాడుతున్నాయి.

తన వైపే వస్తున్న కాశీని తదేకంగా చూస్తోన్న రత్తాలు గుండెల్లో గుబులెక్కింది. నడుస్తూనే రత్తాలునోకంట గమనిస్తున్నాడు కాశీ.
మోకాలి దాకా ఎగ కట్టిన చీర వల్ల బలిసిన నల్లటి పిక్కలు కొట్టొచ్చినట్లు కన్పిస్తున్నాయి.

నల్లటి కాళ్ళకు తెల్లగా మెరిసి పోతున్న వెండి పట్టీలు.

బలమైన యెద శిఖరాలు, పై బరువులు మోయ లేనంత సన్నగా నడుము. అప్పటి దాకా గడ్డి కోయడం వల్ల ముఖం మీద,

మెడ మీద ముత్యాల్లా మెరుస్తూ క్రిందికి జారి పోతున్న స్వేద బిందువులు.

“ కానీ తొరగా ..” అంటూ మోపు యెత్తడానికి వంగాడు.

“ తొక్కుడు లడ్డూ లాంటి పిల్ల. మిట్ట మద్దేనం ఒంటరిగా మోపెత్తమని పిలిస్తే .. అలా తొందరేంటి బా..వా..!”

యెకసెక్కంగా అంటూ తానూ వంగింది మోపును పైకి లేపడానికి. అలా వంగగానే ఆమె పైటకొంగు జారిపోయింది.

బరువైన గుండె గిరులు తన్నుకొచ్చి వూగిస లాడటం కాశీ కంట పడింది. అతని ఒళ్ళు జలదరించింది.

“ యిందాకేంటి బావా… పాట పాడావు. యిదిగో నీ గుండె యిక్కడ చిక్కుక పోయిందేమో చూడు ..”

ముని పంటితో క్రింది పెదాన్ని నొక్కుతూ, ఎద లోయను క్రీగంట చూపుతూ అంది.


ఒసేయ్ రత్తాలూ.. యిదేనే నీతో వచ్చిన యిబ్బంది. ఒకదాని కోసం పిలుస్తావ్..యేదేదో వాగుతావ్.

నన్ను రెచ్చ గొట్టకు. నేనసలే మంచోణ్ణి కాదు ..”

“ ఓ యబ్బో మా చెడ్డోడు.. యిరగ దీసి పోగులు పెడతాడు..” బుంగ మూతిని అటూ యిటు ఆడించి..

నాలుక బయట పెట్టింది వెక్కిరింతగా. .! “యేటే వాగుతున్నావ్ ..! నన్ను చూస్తే నీకెలా వుందే…నాయాల్ది..

నాతో పెట్టుకోకు. మిట్ట మద్దేనం దద్దోజనం తినిపిస్తా ..యేవనుకున్నావో ..” అంటూ యెత్త బోతున్న గడ్డి మోపును వదిలేసి రెండు చేతుల్తో రత్తాలు భుజాల పట్టుకొని వెనక్కి తోశాడు.

ఆ వూపుకు నిల దొక్కుకో లేక వెనక్కి వెల్లికిలా పడి పోయింది రత్తాలు. ఉలిక్కి పడి పైకి

లేవ బోయిన రత్తాలును అలాగే అదిమి పెట్టాడు. వదిలించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో .. “ యిదేంటి బావా.. యేదో సరదాగా అంటే.. పులిలా పైన పడ్డావ్..! ” అంది. యిద్దరి పెనుగులాటలో గడ్డి మోపు కట్లు వూడాయి. గడ్డంతా చెల్లా చెదరై.. మెత్తటి పడకగా మారి పోయింది.

“ నా మానాన నేను పని చేసుకుంటూంటే .. పిలిచి ఉడికించావ్.. అనుభవించు..” అంటూ ఆమె గింజుకుంటూన్నా పట్టించుకోక . . తన కాళ్ళతో గట్టిగా అదిమి, రెండు చేతులతో దగ్గరకు లాక్కున్నాడు. రత్తాల్లో బెట్టు సడలి..

వద్దు వద్దంటూనే .. అతని కౌగిట్లో నలిగి పోసాగింది.

హాయిగా .. ఆనందపు టంచులలోకి లాగి, మత్తెక్కిస్తున్న అతని చర్యను యే మాత్రం ప్రతి ఘటించ లేదు.

ఆమె యిచ్చిన చొరవతో విజృంభించాడు. బుస కొట్టె సర్పాల్లా.. యిద్దరూ ఆ పచ్చి గడ్డినే

శృంగార సమర వేదికగా మార్చుకున్నారు.

అలసి పోయిన తనువులు తృప్తిగా పచ్చి గడ్డి
పడక మీద వాలి పోయాయి.

“ నాతో పెట్టుకోకు…” మీసం మెలేస్తూ ఆమె వంక గర్వంగా చూశాడు కాశీ. లేచి చెదరిన వలువలు,

కురులు సరి చేసుకుంది. ఈ లోగా గడ్డి మోపును సరి చేసి ఆమె నెత్తి కెత్తాడు కాశీ.

తల మీద పచ్చి గడ్డి మోపుతో వయ్యారంగా నడిచి పోతున్న రత్తాలును వెనక వైపు నుండి తృప్తిగా చూస్తూ …“

నాయాల్ది కసురున్న గొడ్డే.. ” అనుకున్నాడు మనసులో కాశీ. పిండార బోసినట్లుంది.

వూరు వూరంతా నిద్రలోకి జారుకో బోతూంది. ఆవిడ మాత్రం ఇంటెనక మల్లె పందిరి పక్కన మంచం మీద నిద్ర రాక అటూ యిటూ దొర్లుతూ వుంది. విర బూసిన మల్లెల సువాసనలు నాసికా రంధ్రాలను స్పృశిస్తూ మత్తెక్కిస్తున్నాయి.

భర్త రావడం గమనించి అతన్ని ఆట పట్టించాలని ..అటు తిరిగి నిద్ర పోతున్నట్లు గుర్రు పెట్ట సాగింది.

మంచం దగ్గరకు వచ్చి నిల్చొన్నాడతను. సన్నటి నవ్వు అతని పెదాలపై కదిలింది.

మెల్లగా వంగి ఆమె పెదాలపై సున్నితంగా ముద్దిచ్చి , “నాకు తెలుసు లేవే దొంగ నిద్రని..” అన్నాడు.

“అయ్య గారికి వీధిలో పెత్తనాలు అయితే గాని నేను గుర్తుకు రాను..” లేచి కూర్చుంటూ అందామె.

తెల్లని వెన్నెల, చల్లటి గాలి, మల్లెల వాసన మరులు గొల్పుతుంటే ..“ రత్తాలూ ..!” అని మత్తుగా పిలుస్తూ,

పడక మీదికి చేరాడు కాశీ. “వెన్నెల్లో ఇరగ దీస్తావేటి..” అంది రత్తాలు కిలకిల నవ్వుతూ.

“ యిరగ దీసే మగాడికి వెన్నెలైనా … ఎండైనా ఒకటేనే పిచ్చి మొకమా ..” అన్నాడు కాశీ.

“ బావా.. మద్దేనపు పచ్చిగడ్డి సీను బలేగుంది కదా..” నవ్వుతూ అడిగింది.

“ నీకు బాగా నచ్చిందా .. అంతగా కావాలంటే… రేపెళ్ళి మళ్ళీ ఓ మారు ఆ సీన్ తిరగేద్దాంలే..

యిప్పటికిలా సర్దుకుపో..” అంటూ ఆమె లోని అందాలను ఆక్రమించుకోడానికి సిద్దమయ్యాడు.

తనేం తక్కువ కాదన్నట్లు ఆమె కూడా ఎదురు దాడికి దిగింది. ఆ వేడుక చూడ్డానికి వెన్నెల, మల్లెలు పోటీ పడ్డాయి.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు