పరివర్తన - ఆదూరి.హైమావతి.

parivartana

అనంతమ్మ ముద్దుల కొడుకు మురళి, చాలా తెలివైన వాడు, అందంగా ముద్దుగా ఉంటాడు. స్కూల్లో చెప్పింది చెప్పినట్లుగా అప్ప జెప్పేస్తాడు. ఆ ఏడాది బాలల దినోత్సవానికి ఎన్నో ప్రైజులు వచ్చాయి. అంతా వాడ్ని తెగ మెచ్చుకున్నారు. వాడికి కాస్త గర్వం తల కెక్కింది. గర్వం వల్ల పొగరు చేరింది. పొగరు వల్ల మంచితనం మరుగున పడ సాగింది.

మంచి తనం మరుగున పడగానే నిర్లక్ష్యం ఎక్కువైంది. నిర్లక్ష్యం వల్ల తన తోటి వారినంతా తక్కువగా చూడ సాగారు. అందర్నీ విమర్శించడం, హేళన చేయడం, నిక్ నేంస్ పెట్టి పిలవడం, శారీరక అవకరాలతో పిలవడం చేయ సాగాడు. తల్లి అనంతమ్మ " నాయనా! నీవేమి చేసినా సహించాను, కానీ ఇతరుల అవకరాలను ఎత్తి చూపేలా పిలవడం మాత్రం మంచిది కాదు నాయనా! అది మానసిక హింస, హత్య చేయడం కంటే పెద్ద పాపం."అని చెప్ప సాగింది. వాడు తలెగరేసాడే తప్ప తన స్వభావంలో మార్పు తెచ్చుకోలేదు. వాడి ఆరో తరగతిలో అవినాష్ అనే అవిటి బాలుడు వచ్చి చేరాడు.

అతడు కర్రల సహాయంతో నడుస్తూ స్కూల్ కు రాసాగాడు. మురళి అవినాష్ ను 'కుంటోడా' అని పిలవడం విన్న వాళ్ల క్లాస్ మాస్టర్ కోపించాడు. మాస్టర్ వెళ్ళాక మురళి "ఈ లడ్డు మాస్టర్ చెప్పేదేందీ!"అన్నాడు. తోటి బాలురు మురళి నోటికి భయపడి మౌనంగా ఉన్నారు. ఆ రోజు క్రికెట్ ఆడుతున్న మురళి బాలు క్యాచ్ చేయ బోయి పడ్దాడు, కాలు ఫ్రాక్చరైంది. వెంటనే వైద్య శాలకు తీసుకెళ్ళారు క్లాస్ మాస్టర్ తన స్కూటర్ మీద. మురళీ తల్లీ తండ్రీ కంగారుగా వచ్చారు. కాలికి కట్టు కట్టారు. మూడు వారాలు రెస్ట్, స్కూల్ లేదు. మురళి ఇంట్లో పడుకుని ఉండగా తల్లి అనంతమ్మ " ఒరే నాయనా! ఇతరులను హేళన చేయకురా !మానసిక హింస చాలా తప్పురా! అంటే విన్నావు కాదు. ఇప్పుడు చూడు కాలు విరిగి పడుకున్నావ్!" అంది.

ఆ రోజు సాయం కాలం మురళి కళ్ళు మూసుకుని పడుకుని తన తప్పుల గురించీ ఆలోచించుకుంటుండగా అవినాష్ కర్రలు పోటు వేసుకుంటూ వచ్చాడు."ఎలా ఉన్నావ్ మురళీ! ఇదో ఈ విబూది నుదుట పెట్టుకో ! నీ కోసం నేను బాబా గుడికెళ్ళి తెచ్చాను. త్వరగా తగ్గి పోతుంది. ఈ ప్రసాదం తిను, దేవుడు నీకు త్వరగా నయం చేస్తాడు" అంటూ ప్రసాదం తెచ్చి ఇచ్చాడు. అవినాష్ మాటలు విని వాడిని చూడగానే మురళి భోరున ఏడుస్తూ వాడి చేతులు పట్టుకుని" నన్ను మన్నించు అవినాష్ ! నిన్ను చాలా బాధించాను." అన్నాడు. అంతే అతడిలో పరివర్తన కలిగి ప్రతి వారినీ గౌరవించడం, స్నేహంగా మసలుకోవడం అలవర్చుకుని అందరిలో మంచిపేరు తెచ్చుకున్నాడు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు