నా ఓటు ఎవరికి? - సతీష్ కుమార్

naa otu evariki?

డాడ్ వాట్ ఫర్ దిస్ ఎలక్షన్స్? అడిగాడు మా పెద్ద బాబు, 4క్లాసు చదువుతున్నాడు వాడు

మీ క్లాస్ లీడర్ ఎవరు ? అడిగాను నేను.

వాడి ప్రశ్నకు నా ప్రశ్న ఏమిటి అనుకున్నాడేమో ముఖం చిట్లించి, ఫాట్ రమేష్ అన్నాడు

అంటే వాడి ఉద్దేశ్యం, లావు గా ఉండే రమేష్ అని.

హూ మేడ్ హిం ఏస్ యువర్ క్లాసు లీడర్? నేను అడిగాను

మై క్లాస్ టీచర్, అన్నాడు వాడు

మన ఏరియాకి లీడర్ ని చూస్ చేసుకోవడానికి ఇప్పుడు ఎలక్షన్సు అన్నాను.

ఓకే అని వాడు లోపలి వెళ్ళిపోయాడు

మా బామ్మగారు ఇంతలో వచ్చి అడిగింది ఒరేయ్ అబ్బిగా ! క్రింద ఏమైనా పెళ్లి జరుగుతోందా?

బాజా భజంత్రీలు వినపడుతున్నాయ్, ఇప్పుడు ముహూర్తాలు ఏమి లేని సమయంలో ఏ తల మాసిన వాడు పెళ్లి చేసుకుంటున్నాడు అని,
లేదే ఎలక్షన్లు కోసం పార్టీలు పెట్టిన మోత అది అన్నాను

అవునా అని ఆవిడ విసుక్కుంటూ లోపలికి నడిచింది నేను డ్రెస్ మార్చుకుని కూర్చున్నాను మళ్ళీ మా పెద్దాడు వచ్చి అడిగాడు పప్పా! వాట్ ఇస్ ఎలక్షన్? అని వాడి చేత నాన్న అని పిలిపించుకోవాలని నేను ఎప్పడినుంచో ప్రయత్నిస్తున్నాను,

డాడ్ అని పప్పా అని పిలవడం అయిపోయాక పిలుస్తానని అన్నాడు వాడు

వాట్ ఇస్ ఎలక్షను మళ్ళి అడిగాడు వాడు

మీ క్లాసు లీడర్న్ మీరు అంతా కలసి బాగే చదివే, మంచి కుర్రాడిని చూస్ చేసుకోవడం అన్నాను

వాడికి ఏమి అర్ధం అయ్యిందో నేను చెక్ చేదాం అని అనుకునే లోపు

ఎవరో మా ఇంటి తలపు కొట్టారు,

మేము వుండేది ౩ వ అంతస్తు దానికి లిఫ్ట్ లేదు, అందుకని మా ఇంటికి ఎక్కువగా ఎవ్వరూ రారు,

మెట్లు ఎక్కి ఆయాస పడాలని!

మా వాడు వెళ్లి తలుపు తెరిస్తే ఏనుగు గుర్తు వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్లారు, అది చూసి మావాడు ఏనుగు అంటే ఎవరు అన్నాడు
ఒరేయ్ ఒరేయ్ తెలుగు చదువుతున్నావు కదా ఏనుగు తెలీదా ? అరిచాను

ఓ గణేష్ కదూ అన్నాడు వెంటనే

సరే ఎదో ఒకటి అర్ధం అయినందుకు సంతోషిస్తూ కుర్చీలో కూలబడ్డాను

అదిగో అప్పడు వచ్చారు విజిల్ గుర్తు వాళ్ళు అప్పడికే మా చిన్నాడు పడుకున్నాడు అందుకని మళ్ళి మా పెద్దాడే తలుపు తెరిస్తే వాడి చేతిలో ఒక విజిల్ ఉంచారు వాళ్ళు.

ఇంకేం మావాడు ఊదుతూ లోపలికి వెళ్ళాడు.

***

పొద్దున్నే ఇంట్లో రామ రావణ యుద్ధం ఆ విజిల్ గురించి.

ఇక్కడ ఒక సంగతి చెప్పాలి మీకు చాలా రోజులనించి మా పిల్లలు కార్ కొనమని గొడవ చేస్తున్నారు.

రోడ్ పైన ఏ కార్ కనిపించినా ఇది కొను అని ఒకడు ఇది ఒద్దు అది కొను అని ఇంకొకడు గోల

దీనికి తోడూ ఒక్కడికే సైకిల్ వుంది రెండో వాడు దానికోసం గొణుగుతున్నాడు.

***

సరే ఆ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా పిల్లలు ఇద్దరూ వచ్చి నాన్న మనం కార్ కొనద్దు అన్నారు, అలాగే నాకు సైకిల్ వద్దు అన్నాడు ఇంకొకడు.

చాలా సంతోషం అని లోపలికి వెళ్లాను.

రెండు కొవ్వొత్తులు టేబుల్ మీద వున్నాయ్.

మా పిల్లలు అవి చూపించి, ఆ గుర్తు వాళ్ళు వచ్చి వెళ్ళారు, అన్నారు.

నాకు అర్ధం అయ్య అవనట్లు చూసి లోపలికి వెళ్లాను

కొద్ది సేపటికి బాట్ గుర్తు వాళ్ళు వచ్చారు

వాళ్ళు పేపర్ మాత్రమే ఇచ్చి పోయారు

మా పిల్లలు ఆలస్యం అయినా నిద్ర పోలేదు , మా ఇంటికి ఇంత మంది రావడం వాళ్లకు ఆనందంగా వుంది

అంతేనా చిన్నాడు పడుక్కుంటే, క్రితం రాత్రి వాడికి విజిల్ రాలేదు కదా అందుకని వాడు నిద్ర వచ్చినా పడుకోవడం లేదు. బలవంతంగా కళ్ళు తెరిచి చూస్తూ కూర్చున్నాడు

ఇంతలో నిచ్చెన గుర్తు వాళ్ళు వచ్చారు, చేయి కలిపి వెళ్ళారు

పేపర్ కూడా ఇవ్వలేదు

ఇంక పడుకుని నిద్రపొమ్మని గదమాయిస్తే అప్పడు లేచారు పిల్లలు కుర్చీలోంచి, వాల్లకి ఎప్పుడూ ఒకే కుర్చీలో ఇరికి కూర్చోడవడం అలవాటు.

ఆ రాత్రి అలా గడిచింది

నేను నా ఆఫీస్ పనిలో బిసిగా వుండి ఆ రాత్రి కొంచే ఆలస్యంగా ఇంటికి వెళ్ళాను

నేను వేల్లెప్పటికే చెట్టు గుర్తు వాళ్ళు వచ్చి వెళ్ళారని తెలిసింది, పిల్లలు అప్పుడే పడుకున్నారు

సరే అని నేను బట్టలు మార్చి, తిని అలిసిపోవడం తో కునుకేశాను ఆరాత్రికి. తరవాత సెలవు పెట్టి ఇంట్లో వుంటే మా శ్రీమతి చెప్పింది అసలు సంగతి!

మా పిల్లలు ఎందుకు కారు, సైకిల్ కొనద్దన్నారో ?

ఆ గుర్తులు కూడా ఎలక్షన్లలో ఉన్నాయి అని వాళ్లకి స్కూల్లో తెలిసింది అని.నాకు నవ్వు వచ్చింది.

వాళ్ళ అమాయకత్వానికి. విజిల్, కొవ్వొత్తులు వచ్చినట్లు కారు, సైకిల్ రావని వాళ్లకు ఎలా చెప్పాలో
నాకు అర్ధం కాలేదు.

ఆ సాయంత్రం సైకిల్ గుర్తు వాళ్ళు వచ్చి వెళ్ళారు పేపర్ మాత్రమె ఇచ్చారు.

మా పిల్లలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే నేను పట్టించుకోలేదు.

***

తరవాతి రోజు అపీసులో అలసిపోయి ఇంటికి చేరేసరికి మా పిల్లలు ఇద్దరూ చాలా కోపంగా వున్నారు

నాన్న నువ్వు ఇంక విజిల్ గుర్తుకే వోట్ వెయ్యి అన్నాడు మా పెద్దాడు నన్ను నాన్న అనడంతో ప్రేమ పొంగిపోయి దగ్గరికి తీసుకుని ఎందుకు అలా ? అని అడిగాను ఇంతలో చిన్నాడు వచ్చి ఎవ్వరికీ వోట్ ఇవ్వద్దు అన్నాడు నేను అయోమయంగా చూసి ఏమయ్యింది ? అన్నాను కారు, సైకిల్ ఏమి రాలేదు నాకు విజిల్ కూడా రాలేదు అన్నాడు వాడు గట్టిగా ఏడుస్తూ ?????

నాకు ఏమి అనాలో అర్ధం కాలేదు

మీరే చెప్పండి ఇపుడు నేను ఎవరికీ ఓటు వెయ్యాలో?!

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు