అమృతంగమయ - అనిల్ ప్రసాద్

amrutangamaya

"ఏంటమ్మా పొద్దున్నే హడావిడి?" పూజ చేస్తున్న తల్లిని అడిగాడు కొడుకు. మాటాడకుండా తన పని ముగించుకుని వచ్చి పక్కన కూర్చున్న ఆమె "ఈ రోజు తారీకు యెంతో గుర్తులేదా" అంది. గబుక్కున పేపర్ చూసి ఏప్రిల్ 12 అన్నాడు. 'మరీ మర్చిపోయావా? ఏడు ఈ రోజు నాన్నగారు చేసేవారు కదా, అందుకే ఈ సారి నేను చేస్తున్నా"
అవున్నిజమే కానీ ఎందుకు చేసేవారో ఎన్ని సార్లు అడిగినా చెప్పేవారు కారు. మరి ఇప్పుడు నువ్వెందుకు చేస్తున్నట్లు?"
"రాత్రి కలోకొచ్చి మర్చిపోతావేమోనే నేనెలా చేసేవాడినో అలాగే నువ్వు కూడా చెయ్యి అని గుర్తు చేసార్రా, అందుకే .."నవ్వి లోనికి వెళ్ళిపోయాడు కొడుకు.

ఇంట్లో వాళ్ళందరూ ఆఫీసులకీ , స్కూల్లకీ వెళ్ళిపోయాక ఆడాళ్ళు టిఫిన్ చేస్తుండగా మళ్ళీ కోడలు అడిగింది. "అప్పుడు మామయా గారు చాలా నిష్టగా చేసేవారట కదా అత్తయ్య. రోజంతా మౌన వ్రతం, ఉపవాసం కూడా వుండేవారట, మీ అబ్బాయి చెప్పారు"
"ఊ.."...ఇప్పుడు తనను కూడా ఉపవాసం చెయ్యమంటదా అని సాలోచనగా చెప్పింది పెద్దావిడ. "ఇంతకీ ఎందుకు ఈ రోజు పూజ?" తింటూనే అడిగింది కోడలు. తల ఎత్తి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పడం మొదలుపెట్టింది అత్తగారు.

**********************

నేను కాలేజీ చదివే రోజుల్లో తను నాకు పరిచయం అయ్యింది. పేరు ప్రియ. నేను మాత్రం "సుప్రియా" అని పిలిచుకునేవాడిని, వయసు వేడి చల్లారాక ఇద్దర్లోనూ ప్రేమ సెగ తగ్గింది. క్రమంగా దూరంకాసాగాము.

కాలేజీ విడిచాక మేము పూర్తిగా విడిపోయాము. అప్పుడప్పుడూ క్లాస్మేట్ల పెళ్ళిళ్ళలో కలుసుకోవడం తప్ప మా మధ్య సంబంధం కొరవడింది. అటువంటిది పెళ్ళిలయ్యి పిల్లలు పుట్టాక మదిలో ఎక్కడో పూడుకుపోయిన తొలి వలపు విత్తు మళ్ళీ చిగురులు తొడిగింది. అందుకు కాలం కూడా అనుకూలించింది. మా స్నేహితుడు ఒకడు ఆఫీసు పని మీద వచ్చి నన్ను కలసి ఆమె తన ఊరిలోనే , వాళ్ళింటికి దగ్గరిలోనే భర్తతో కాపురం వుంటుందని , ఆమెకు పిల్లాడని చెప్పాడు. మరోసారి వచ్చినప్పుడు ఆమె నన్ను అడిగినట్టు చెప్పి తన ల్యాండు లైను ఫోను నంబర్ ఇచ్చాడు.
వెంటనే నేను స్స్త్త్ద్ద్ బాణం సంధించాను, అది తన లక్ష్యం చేరింది. మాట్లాడుకున్నది 5 నిముషాలైనా మా మనసులు మరింత పెనవేసుకున్నాయి. సొంత వ్యాపారం చేసుకునే భర్త ఇంటివద్దనే వుంటాడని మరెప్పుడూ తను చేస్తే తప్ప కాల్ చెయ్యరాదని షరతు విధించింది. అప్పటినుంచి యూనివర్సల్ లవర్స్ కోడుకు అనుకూలించని మా ఆఫీసు ఫోను మోగితే చాలు గుండె ఝల్లు మనేది. నాకోసం ఏఫోను వచ్చినా తనే చేస్తుందేమో అని అనిపించేది. కానీ ఆమె నుంచి ఏనాడు కాల్ రాలేదు. ఆగలేక నేనే ఏ పనిమీద ఎక్కడకెళ్ళినా అక్కడి నుండీ వేరు వేరు నంబర్ల నుండి చేసేవాడిని. కాని ఎన్నడూ గురితగలలేదు.
ఆమెకు వీలు కుదిరినప్పుడు బహుశా ఆఫీసు టైము మించిపోతుందేమోనని అనుమానంతో ఇంట్లో ఫోను పెట్టిద్దామనుకున్నాను. అప్పుడే దేశం లోకి సెల్ఫోన్ల రాక మొదలయ్యింది. విదేశాల నుంచి వస్తూ చుట్టం ఒకాయన మొబైల్ ఫోనొకటి పట్టుకొచ్చి ఇచ్చాడు.
నేనూ అటువంటి సర్వకాల సర్వావస్థలలో అందుబాటులో వుండే దానికోసమే చూస్తున్నాను కనుక మొదటికాల్ ఆ స్నేహితుడికి చేసి నా నంబరు తనకు అందజెయ్యమన్నాను. అయినా పరిస్థితిలో మార్పు లేదు. నా స్స్త్త్ద్ద్ బాణం ఒకటి తగిలింది కానీ ఎక్కువ మాటాడే వీలు కుదరలేదు. అటువంటి పరిస్థితులలో ఒక రోజు నా మొబైలుకు ఒక మిస్స్డ్ కాల్ వచ్చింది. అప్పట్లో అటూ ఇటూ ఇరువైపు చార్జీలు పడేవి కనుక జనాలు ఇలా రింగ్ ఇస్తే ల్యాండు లైను నుంచీ చేసేవాళ్ళం. కానీ అది నాకు తెలియని నంబరు కావడంతో ఆ పని చెయ్యలేదు. కొంత సేపటికి ఆఫీసు ఫోనుకు కాల్ వచ్చింది. అదే ఆమె అక్కడికి నాకోసం చేసిన మొదటి, చివరి కాల్. ఆమె భర్త తనకు కూడా మొబైల్ కొనిచ్చాడట.
ఆఫీసు టైములోనే అని నేను, వరుసగా రెండు సార్లు మిస్స్డ్ కాల్ ఇస్తేనే చెయ్యాలి అని తను ఇలా ఆక్షలు ఇరు వైపులా అమలులో వుండేవి. అప్పుడప్పుడే లంకె సందేశాల ఒరవడి మొదలయ్యింది. ఉదయాన్నే శుబోదయం, రాత్రి శుభరాత్రి, వివిధ సందర్భాలకు తగు సందేశాలు నా కాల్ లిస్టు లో వున్న అందరితో సాగుతుండేవి. కానీ భర్తకు జడిసి తను మాత్రం ఏమి సందేశాలు పంపేది కాదు.

ఆ రోజు ఏప్రిల్ 11 ఏదో పండుగ సెలవు. ఉదయాన్నే శుభాకాంక్షల సందేశాల వెల్లువ మొదలయ్యింది. అన్నిటినీ చూస్తూ వారు పంపిన దాన్ని వారికి పంపిస్తూ కూర్చున్నాను. ఇంతలో సుప్రియ నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది. నేను చూసి ఊరుకున్నా. మరికొంత సేపటికి తన నుంచి ఇంకోటి వచ్చింది. నేను చూస్తుండగానే మరోటి వచ్చింది. నేను కాస్త సందేహిస్తూనే ఒక మెసేజ్ తనకు పంపాను. వెంటనే తను థాంక్స్ అని పంపింది. నేను ప్రశ్నార్ధకం పంపాను. ఆయన లేరని చెప్పి, ఇంట్లో ఏంటి స్పెషల్ అని అడిగింది. నా భార్య పిల్లలు గుడికి వెళ్ళి వుండటం తో నేను సంభాషణ కొనసాగించాను సరదాగా.
నాకు సెలవే నిన్న చెప్తే మీ ఊరు వచ్చేవాడిని కదా అన్నాను. ఇప్పుడైనా పర్లేదు వారం వరకూ రారు అనింది తను.

మీ వాడికన్నా ఏమి చేసి పెట్టేది లేదా? వాడిని అమ్మ తీసుకెళ్ళింది.
ఓ.. అయితే ఒక్కదానివే వున్నావా? ఊ...!
తోడు రానా మరి? నువ్వొస్టానంటే నేనొద్దంటానా?
నిజంగా వచ్చేస్తా. రమ్మనే చెప్తుంది.
ఇక ఆగలేక కాల్ చేసాను. తమది అపార్ట్మెంట్ కాబట్టి ఎవరూ పట్టించుకోరు అని అంది. నా మనసు ఉరకలేఏసింది. వెంటనే అర్జెంటు ఆఫీసు పని అని ఇంట్లో చెప్పి బయలుదేరాను. మధ్యాహ్నం ఒంటి గంటకి. తన ఊరు చేరేసరికి రాత్రి 9 అయింది. ఆటో తీసుకుని ఆమె చెప్పిన అడ్రస్ కి వెళ్ళాను. వాచ్మెన్ ఆపి వివరాలు అడిగాడు. ఆమె ముందుగానే చెప్పినట్లు తమ కింది ఫ్లాట్ పిల్లాడి ఫ్రెండు అని చెప్పాను. అతనికోసం ఎవరో ఒకరు వస్టుంటారట.

**************************************
ఎప్పుడో 8 ఏళ్ళ కిందట లేత యవ్వనపు తొలి సంధ్యలో జరిగిన పరిచయం మళ్ళీ ఇన్నాళ్ళకు ఇరువురం జీవితపు ప్రయాణం లో సగ భాగం దాటేసాక చిగురించింది. స్నానం చేసి ఒడిలో పడుకుని ఆమె చేతితో భోజనం చేస్తూ నాటి కబుర్లూ, నేటి పరిస్థితులు కలబోసుకునే సరికే అర్ధరాత్రి దాటేసింది. ముపటి ఆత్రం లేకున్నా ఎన్నాళ్ళకో తెలిసిన ఊరు వెళితే పరిచయస్తులు మనమెరిగిన ప్రదేశాల కొరకు వెదికినట్టు ఆమెను అణువణువునా తడుముతూ సెయ్య చేర్చాను. అప్పటి ఆకృతిని తలచుకుంటూ ఇప్పటి ప్రకృతిని ఆక్రమించుకున్నాను. పూర్తిగా నా వశం అయిన ఆమె తనూలతికకు నేను దేవేంద్రుడయ్యాను. రెండోరోజు ఆఫీసు పని వుండడంతో తెల్లవారుజామునే బయలుదేరి పోవాలని సెల్లులో అలారం పెట్టుకున్నా. అది మ్రోగిన వెంటనే లేచి స్నానానికి నీళ్ళు పట్టుకుని వచ్చి తన్మయత్వం లో నిద్రిస్తున్న ఆమెను లేపాను. పోవద్దని మారం చేస్తూ నన్ను తన మీదికి లాక్కుంది. ఈ సారి తనంతట తానుగా తనను నాకు అర్పించుకుంది. సమయాభావం వల్ల ఆటాడుచు బాత్రూం లోనే మొహం కడుక్కుని నేను బయలుదేరి వచ్చేసాను. ఒక్కత్తే వుండలేక తాను కూడా తెల్లావారాక టిఫిన్ చేసి అమ్మగారింటికి వెళ్తానంది. ఆ ఊరిలో సిగ్నల్స్ అందవని చెప్పి, వీలున్నప్పుడు తానే రెండు రింగులు ఇస్తానంది. మధ్యాహ్నానికి చేరుకున్న నేను ఆఫీసుకు వెళ్ళిన వెంటనే ఫోను చేసాను. ఆమె అందుబాటులో లేదని తెలుసుకుని పుట్టిటికి వెళ్ళి వుంటుందనుకున్నా.

*********************************************

మంచాన పడ్డాక ఎప్పుడూ ఏదో దిగులుగా వుంటున్న మీ మావగారిని "ఏంటి మీ బాధ?" అని అడిగితే ఆయన నాకు చెప్పిన విషయం అది, ఆయన మాటల్లోనే..."
"మంచిగా అనుభవించాక కూడా ఆరోజును బ్బాధగా తలుచుకునేవారంటే.. అక్కడ ఎదో జరిగి వుంటది" లేచి ప్లేటులు పట్టుకుని వెళ్ళబోతూ మూతి వంకర్గా పెట్టి అన్నది కోడలు.
"ఆ..! ఆమె ఆ రోజు చనిపోయింది" అయ్యో! ఎలా?" మళ్ళీ కూర్చుంటూ అడిగింది."గ్యాసు బండ పేలి" అంటే...?" అర్ధోక్తిగా ఆగిపోయింది కోడలు" "అవును! ఈయన నీళ్ళు పెట్టుకుని వెలిగించిన పొయ్యి విషయం మర్చిపోయి వచ్చేసారు. కొంతసేపటికి బాగా కాగిపోయిన నీళ్ళు బర్నర్ మీద పడి అది ఆరిపోయుంటది. కొంత సేపటి తరువాత ఆమెలేచి కిచెన్ లో లైటు వేసిందో , ఏమి చేసిందో గానీ పేలిపోయింది. చాన్నాళ్ళ వరకు ఎదురుచూసిన ఈయన ఇక ఆగలేక తన స్నేహితుడికి ఫోను చేస్తే విషయం తెలిసిందట"
"అరె! అందుకు బాధపడేవారా? అలాగే జరిగి వుంటదని ఎందుకనుకోవాలి? ఆమెకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి"
"ఆ రోజు అక్కడ బండ పేలడం నిజం. ఆమె మరణానికి కూడా అదే కారణం అని పోస్టుమార్టం రిపోర్టు తేల్చింది. అన్నిటికన్నా ముక్Yఅం ఆమె మరణ సమయం. ఈయన బయటకు వచ్చేసిన గంటలోపే అంటే అప్పటికి ఈయన ఆ ఊరి పొలిమేరలు కూడా దాటకముందే ఆమె... " మరింక పూర్తిచెయ్యలేదు అత్తగారు.
కొంతసేపటి తరువాత మళ్ళీ చెప్పనారంభించింది, "ప్రియ భర్త మళ్ళీ పెళ్ళి చేసుకోలేదుట. కొన్నాళ్ళు అమ్మమ్మ పంచన పెరిగిన త్తన కొడుకు ఆమె కూడా పోయాక హాస్టలుకు చేరాడట. ఈయన ప్రతి ఏడాది ఆ రోజున వాళ్ళింటి ముందుకు వెళ్ళి ఆ తండ్రి కొడుకులను చూసి వారి ఇల్లు విచ్చిన్నమవడానికి కారణం తనే అని బాధతో కుంగిపోయేరట. గుప్తంగా వారిరువురికీ ఎన్నో సహాయాలు చేసేవారుట, కానీ ఆయనకు మన్:శాంతి వుండేది కాదుట. కొన్నాళ్ళకు తాగుడుకు బానిసయ్యి తండ్రి కూడా పోగా అనాధ అయిన ఆ పిల్లాణ్ణి ఎక్కడో విదేశంలో పనిచేసే మేనమామ తనతో తీసుకుపోయాడట. అతని యోగక్షేమాలు తెలియని మీ మావగారు ఎక్కడ వున్నా తనుబావుండాలని ఆ రోజు మౌన వ్రతం, ఉపవాసం చెయ్యనారంభించారట" ఇరువురూ ఒక్కసారిగా నిట్టూర్చారు.

"నాకీ విషయం తెలియక ముందు ఆయనతో సహగమనం చెయ్యమంటే మారుమాట్లాడక దూకేసేదాన్ని, కానీ ఆయన చెప్పాక నేను ఇంతలా నమ్మిన మనిషి నన్ను నోసం చేసాడని చాలా బాధపడ్డాను. ఆయన మీద ఏదో తెలీని కసిగా వుండేది. అలాగని నేను ఆయన పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చూపించలేదు కానీ పరిపూర్ణంగా సేవ చెయ్యలేదని మాత్రం నా మనసుకు తెలుసు. అర్ధాంగిని నేనే సమ్యమనం చూపించలేకపోయాను ఇక ఈ విషయం తెలిస్తే పిల్లలు ఆయన పట్ల గౌరవ చూపించరి. అందుకే ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు కూడా నీకు నా కోడలిగా కాదు ఒక ఆడదానివిగా నా ఆవేదన అర్ధం చేసుకుంటావని ఆశతో చెప్పాను. దీన్ని నీ గుండెల్లో దాచుకుంటావో లేక ధర్మరాజు శాపానికి మరో నిదర్శనం గా నిలుస్తావో నీ ఇష్టం" అని చెప్పి లేచివెళ్ళిపోతున్న అత్తగార్ని ఓ నిర్ణయానికి వచ్చి తల ఆడిస్తూ చూస్తుండిపోయింది కోడలు.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ