ఒకమారు ఒక అడవిలో జంతువులు సభ పెట్టుకున్నాయి.ఆసభకు అన్ని జంతువులతో పాటుగా ఒకదోమ కూడా తమ జాతి తరఫున వెళ్ళింది. దాన్నిచూసి జంతువులన్నీ ఎగతాళి చేశాయి.
"ఏంటీ నీవూ ఒక జంతువ్వే! ఏముఖం పెట్టుకుని మా సభకు వచ్చావ్? అసలు నీవు ఒక జంతువ్వని ఎలా అనుకుంటున్నావ్? ఎవరు ఆహ్వానించారు? మా పరువు తీయను వచ్చావా?, పక్షుల సభకు వెళ్ళు , ఎగిరే వన్నీ అక్కడ సభ చేసుకుంటున్నాయ్" అని మందలించాయి.
దోమ తలవంచుకుని ఎగురు కుంటూ పక్క అడవిలో పక్షుల సభకు వెళ్ళింది. పక్షులన్నీ దాన్నిచూసినవ్వా యి ." ఏంటీ! నీవూ ఓ పక్షివే! మాతో సమానమే! రెక్కలుండగానే సరా!నీవెలా పక్షివని మా సభకు వచ్చా వూ! మాకు అవమానం తేకు.కీటకాల సభకువెళ్ళు " అని గేలిచేశాయి. పాపం దోమ అవమాన భారంతో ఎగిరి పక్క ఊర్లో జరుగుతున్న కీటకాల సభకు వెళ్ళింది.
కీటకాలు దోమను ఆహ్వానించి ఉచితాసనం చూపాయి. దోమ " ఓ మిత్రులారా!నేను జంతువుల సభకు వెళితే వెళ్ళిపొమ్మ న్నా యి, పక్షుల సభకు వెళితే అవమాన పరిచాయి, ఇక్కడికి వచ్చాను. మీరు ఆహ్వానించారు, గౌరవించారు , ధన్యవాదాలు"అంది కీటకాల్లో పెద్దదైన సీతాకోక చిలుక" మిత్రమా! ఎవరి జాతిలోనే వారికి గౌర వం . స్థలము, కాలము,మారితే ఎవరికైనా గౌరవం దక్కదు.' మిత్రమా!నేను మానవులు వేసి పెంచుకునే పూల మొక్కల వద్దకూ, కూరగాయలు, పండ్లమొక్కల వద్దకూ మక రం దం కోసం వెళ్ళే ప్పుడు వారి మాటలు విని గుర్తు పెట్టుకున్నాను. అదేమంటే’ పరవస్తూ చిన్నయసూరి అనే ఒక మహాను భావుడు తన ‘ నీతిచంద్రిక ‘ లో ఇలాచెప్పాడుట, 'నరులు, నఖములు, కేశములు [మానవుడు, గోళ్ళు, తలవెంట్రుకలు] స్థాన భ్రంశమైన గౌరవం కోల్పోతారని.ఇహ మనమెంత! కనుక మనం ఎల్లప్పుడూ మనవారితోనే ఉండాలి. పెద్దవారితో, స్నేహ మూ విరోధమూ కూడా భీతిని కలిగిస్తాయి.వియ్యానికీ కయ్యానికీ కూడా సమానత్వం కావాలని మానవులు అనుకుంటుండగా విన్నాను. అందువల్ల మన కీటకజాతి అంతా ఐకమత్యంగా ఉందాం. "అంది. దానికి సమాధానంగా మిడత " మిత్రులారా! మన అవసరం కూడా అందరికీ ఉంది. ఐతే మన దోమ తాను జంతు జాతికి ఏదైనా సాయం చేస్తే అవి దోమ గొప్పదనాన్ని గుర్తిస్తాయి.అపుడు దోమకైన అవమానం తీరు తుంది. మనస్సు శాంతిస్తుంది." అంది.కీట కాలన్నీ నిజమన్నట్లు తతలూచాయి.
దోమ అలాగేని తలఊచి అవకాశం కోసం కాచుకునుంది.ఒకరోజున అడవిలోని పెద్ద ఏనుగు నిద్రపోతుండగా ఒక వేటగాడు దూరం నుంచీ రావడం చూసింది దోమ.వెంటనే తనసమూహాన్ని పిలిచింది. ఏనుగు చెవుల చుట్టూచేరి పెద్దగా రొదచేయసాగింది దోమల గుంపు.ఆరొదకు ఏనుగు కోపంతో లేచింది.ఎదురుగా ఉన్న వేట గాడిని చూసింది తన తొండంతో ఎత్తి కొట్టింది.ఆదెబ్బకు వాడు కాళ్ళు విరిగి కుంటుకుంటూ అడవి బయటికి వెళ్ళిపోయాడు.తనను నిద్రనుంచీ లేపి వేటగాని పాలబడకుండా కాపాడిన దోమల నాయకునికి కృతఙ్ఞత చెప్పింది ఏనుగు. అప్పుడు జంతువుల కంతా తెలిసివచ్చింది.'ఎంత చిన్నవారైనా ఏదో ఒక సమయంలో వారి సాయం అవసరమవు తుందని ' అన్నీ దోమకు ధన్యవాదాలు చెప్పి, క్షమాపణ కోరాయి.ఇహ మీదట అడవి లో నివసించే ఒక పున్నమిన కలసి సమావేసాం ఏర్పా చేసుకుందామని నిర్ణయించాయి.చూశారా! ఎవరికైనా ఏదోఒక సమయంలో ఎవరితోనైనా చిన్నవారుకావచ్చు, పెద్దలుకావచ్చు, ధనికులు కావచ్చు,పేదలుకావచ్చు అందరికీ అవసరం పడవచ్చు. అందుకే ఎవ్వరినీ తిరస్కరించక ,హేళనచేయక అందరినీ తగిన రీతిగా మన్నిం చడం మంచిది.
నీతి-- అందర్నీ గౌరవించి మన్నించడం మంచివారి స్వభావం.