నీ దుంప తెంచుతా! - కోలపల్లి ఈశ్వర్

nee dumpa thenchuthe telugu story

'ఆడియో వరల్డ్' ముందు నుంచి వెళుతుంటే ఆ పాట నన్ను అమితంగా ఆకర్షించింది

నాది చాలా షార్ఫ్ బ్రెయిను.

అందుకే - నాగస్వరం చెవినబడ్డ నాగుపాములా ఠక్కున నిలబడిపోయాను.

'వెయ్యిదయ్యాలు' ఒకేసారి అరుస్తున్నట్టు చాలా వికృతంగా ఉందా పాట.

ఒకింతసేపు చెవులు దిక్కరించి ఆలకించిన మీదట అప్పుడర్ధమైంది నాకు - అది తెలుగు పాటేనన్న సంగతి.

తెలుగుని ఇంత భయంకరంగా కూడా పాడొచ్చన్నమాట అనుకున్నానాశ్చర్యంగా.

ఒంటి మీద జర్రులు పాకుతున్నట్టు... గుండెకాయ మీద మరిగిన నూనె చుక్కలు పడుతున్నట్టు... శరీరంలోని నరాలన్నిటినీ బ్లేడుతో కొస్తున్నట్టు... నవరంధ్రాల్లోనూ సిరెంజితో నువాక్రాన్ ఎక్కిస్తున్నట్టు... ఎలాగో... ఎలాగో... అనిపించింది నాకా పాటని వింటుంటే.

ఓర్నాయనోయ్... ఎంత ఘోరంగా ఉందీ పాట!

ఎవడు స్వరపరిచాడో గానీ నిజంగా వాడికి సాగిలపడి మొక్కినా తప్పులేదు.

ఎవడు రాశాడో గానీ, నిజంగా వాడికి గండపండేరం గొంతుకి తొడిగినా తప్పులేదు.

ఇంతనీచమైన పాట ఏ సినిమాలో దయ్యుంటుందబ్బా?

దీనికి ఏనర భయంకరుడు కుప్పిగంతులు వేసుంటాడబ్బా?

ఏ సినిమాలోదైతే ఏం? కుప్పిగంతులు వేసింది ఎవడైతే ఏం?

ఆ వివరాలన్నీ అనవసరం! ఆడియో... ఆడియో ముఖ్యం గాడి మల్లబోయిన మనసుని రైట్ ట్రాక్ లో పెట్టి, చకచకా ఆ షాపులోకి దారితీశాను.

"ఆ సి.డి కావాలి?" అడిగాను షాపువాడిని.

"ఏ సి.డి సార్?" ఎదురుప్రశ్న వేశాడతను.

"ఆ వినిపిస్తున్న పాటే..." అన్నాను నవ్వుతూ.

బహుశా నాది చాలా పూర్ టేస్టని వాడనుకున్నాడో ఏమో - నాకేసి అదోలా చూశాడు.

చూసి "అలాగే సార్" అన్నాడు వినయంగా...

"ఇంతకీ అది సినిమా పాటేనా?

"అవున్సార్! నటవీర కిశోరం గారి రెండొందల పదో సినిమా 'నీ దుంప తెంచుతా!' ఇంకా రిలీజ్ కాలా! కానీ ఆడియో మాత్రం అప్పుడే ఫట్టయిపోయింది... సారీ... సారీ... సార్... హిట్టయిపోయింది..." ఒక ర్యాక్ లోంచి ఆ సి.డి ని బైటకు తీస్తూ చెప్పాడు షాపువాడు.

"మిగతా పాటలన్నీ కూడా ఇలాగే ఉంటాయా?"

"ఇంతకన్నా ఇంకా అసహ్య... కాదుకాదు... శ్రావ్యంగా ఉంటాయ్..." చెప్పాడు షాపువాడు మధ్యలో ఓ మారు నాలుక్కరుచుకుని.

అతనలా నాలుక్కరుచుకున్నందుకు నాకు నవ్వొచ్చింది.

అసలు నాకు ఆపాట నచ్చింది - అది అసహ్యంగా ఉండబట్టే కదా! మిగతా పాటలు అంతకన్నా అసహ్యంగా ఉండేట్టయితే అంతకన్నా కావాల్సింది ఏముంది?

"ఎంత?" అడిగాను సి.డి ని అతని చేతిలోంచి అందుకుంటూ.

"ముప్పయ్యారు"

"ఓస్... ఇంతేనా?" అంటూ ఆ సి.డి ని ఫ్యాంట్ జేబులో పడేసుకుని, షర్ట్ జేబులోంచి ఓ యాభై నోటు తీసి అతని కందించాను.

అతను సొరుగులోంచి చిల్లర తియ్యబోతుంటే "అక్కర్లేదు... ఉంచేసుకోండి..." అని చెప్పి హుషారుగా ఈల వేసుకుంటూ ఆ షాపులోంచి బయటపడ్డాను.

నేను వెనక్కి తిరిగి చూడలేదు గానీ, బహుశా అతను నాకేసి చాలాచాలా ఆశ్చర్యంగా చూసుంటాడు.

**** **** **** ****

"అప్పుడే వచ్చేశారేంటి? శంకర్రావు దగ్గరికి వెళ్ళలేదా?" నన్ను చూసి ఆశ్చర్యంగా అడిగింది మా ఆవిడ.

మా ఇల్లు నల్లకుంటలో - శంకర్రావు వుండేది ఆల్వాల్ లో... ఎంత లేదన్నా అక్కడికి వెళ్లి రావడానికి మూడు గంటలైనా పడుతుంది.

అలాంటిది అరగంటైనా కాకముందే తిరిగొచ్చేశానూ అంటే. "అప్పు" కోసం శంకర్రావు దగ్గరికి వెళ్ళలేదనేగా అర్ధం.

"లేదు..." అన్నాను చిన్నగా నవ్వి వెళ్లి సోఫాలో కూలబడుతూ.

"మరి డబ్బెలా? వాళ్లింకా ఓ పదిహేను రోజులు ఉండేలా ఉన్నారు..." అంది మా ఆవిడ గాబరాగా.

"ఉండరు! అది సరే గానీ... ఇంతకీ వాళ్ళంతా ఏరీ?" అనడిగాను. ఇల్లంతా బోసిగా ఉండటం గమనించి.

"బిర్లామందిర్ చూసొస్తామంటూ వెళ్లారు..." మా ఆవిడ ఇంకా చెబుతూనే ఉంది - అంతలోనే ఇంటిముందు మూడు ఆటోలు ఆగాయ్.

ఆగిన ఆటోల్లోంచి పొలోమంటూ క్రిందకు దిగారు. గత పదిహేనురోజులుగా మా ఇంట్లో తిష్టవేసుక్కూర్చున్న చుట్టాలందరూ.

వాళ్ళని చూస్తుంటే నాకు మేకల మంద గుర్తొచ్చింది.

నేను వెంటనే మా డి.వి.డి ప్లేయర్ దగ్గరికి పరుగుతీసి "నీ దుంప తెంచుతా" సి.డి ని అందులోకి ఇన్ సర్ట్ చేశాను.

**** **** **** ****

ఓ ఇరవై నాలుగంటల పాటు "నీ దుంప తెంచుతా" పాటలు మా ఇంట్లో అవిశ్రాంతంగా మోగాక...

నేనూహించినట్టే మా చుట్టాలంతా మూటా ముళ్ళు సర్దుకుని - "అప్పుడేనా?" ఇంకో నాల్రోజులుండొచ్చుగా? మనకి అందుబాటులోని 'థియేటర్లు' రెండింటిలో కొత్త సినిమాలు "గంపలోన గంగ ప్రేమికుడు, గత్తర పెట్టిన తత్తర బిత్తరగాడు" వస్తున్నాయ్. చూసుకొని పోవచ్చుగా?" అని మేం బ్రతిమాలుతున్నా వినిపించుకోకుండా ఉడాయించేశారు.

ప్రస్తుతం రాహుకాలం అన్నా ఆగలేదు.

ప్రస్తుతం యమగండం అన్నా వినలేదు.

"నీ దుంప తెంచుతా" కి సంగీతం సమకూర్చిన, ఆ పాటలు పాడిన - ఆ మహానుభావులు...

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ