రూం నెం 333. - -హైమాశ్రీనివాస్

room no. 333

అది టూ టౌన్ పోలీస్ స్టేషన్. డ్శ్ఫ్మనోహర్ ఓల్డ్ ఫైల్స్ ఉంచిన రూం లో ర్యాక్స్ వద్ద నిల్చుని, గబగబా వెతుకు తున్నాడు. ఒక్కోఫైల్ తీసి పక్కన పడేస్తున్నాడు."సర్! ఎక్ష్సూజ్ మీ!అది షుమారు ఐదేళ్ళక్రితం కేసుసర్! దాన్నెప్పుడో మూసేశారు. ఎందరో ఆఫీసర్స్ మారారు.ఆపాత ఫైల్స్ తెరవడం,తిరిగి తోడటం అసాధ్యం సర్!" ఎస్సై యాకూబ్ అన్నాడు.

" బట్ ఐ వాంట్ దట్ ఫైల్ . అసహాయులకు న్యాయం చేకూర్చనేనయ్యా మనముందీ. ఆఓల్డ్ మ్యాన్ ను చూస్తే నామనస్సు తరుక్కుపోయింది.అతడికి మాటిచ్చాను. అందుకే కదా పై అధికారులనుంచీ అనుమతి పొంది డిప్యుటేషన్ మీద ఇక్కడి కొచ్చింది!ఇఫ్ యూ హేవ్ టైం హెల్ప్ మీ!అదర్ వైజ్ ప్లీజ్ డోంట్ డిస్కరేజ్ మీ యాకూబ్ !" అంటూ సీరియస్ గా ఫైల్స్ వెతక డంలో మునిగి పోయాడు డ్శ్ఫ్ .మనోహర్ .

ఎస్సై యాకూబ్ కూడా ఫైల్ వెతకసాగాడు. ఇంతలో అతడికి ఫోన్ రావడంతో బయటి కెళ్ళాడు. సెంట్రీ కాఫీ తెచ్చి మనోహర్ కిచ్చాడు ." సార్ నన్ను సైదులంటారు.ఇక్కడ సెంట్రీని. మీకు సాయం చేయ వచ్చాసర్!" అని అడిగి మనోహర్ అనుమతి తో తానూ ఫైల్ వెతక సాగాడు. ఒక్కసారిగా సెంట్రీ "సార్ !ఇది గోండి సర్! ఆఫైల్ దొరికింది.” అంటూ అందించాడు, అతడికి యభై ఏళ్ళుంటై.

“సైదులూ! ధేంక్సయ్యా! నీకళ్ళు నాకంటే బ్రైట్ గా ఉన్నై."అంటూ ఫైల్ తీసుకుని తన సీట్ కొచ్చికూర్చున్నాడు మనోహర్ . దూరంగా తలుపు దగ్గర స్టూల్ మీద కూర్చుని మనోహర్ నే దీక్షగా చూస్తూ మధ్య మధ్యలో కళ్ళు తుడుచు కుంటున్నాడు సెంట్రీ. మనోహర్ ఫైల్ చదువుతూనే తలెత్తి సెంట్రీని చూసి , దగ్గరకు రమ్మని సైగ చేశాడు." ఎందుకు సైదులూ! అంతబాధ పడుతున్నావు?" అని మెల్లిగా అడిగాడు.

"సారూ! మీరు వెతుకుతున్న ఫైల్ లో లాగానే నాకూతురి ఫైలూ ఉందిసార్. నేను ఇక్కడ పని చేస్తున్నా నాకు న్యాయం జరగలేదు . మీలాంటి మనసున్న ఆఫీసర్స్ ఆనాడుంటే నాకూ న్యాయం జరిగేదని ఆశ పడుతూ జరిగిందానికి బాధపడు తున్నాను సార్." అన్నాడు

"ఏమైంది సైదులూ! చెప్పు.నా పరిధిలోదైతే తప్పక నీకు న్యాయం చేస్తాను , నన్నునమ్ము."అంటూ బుజ్జ గించాడు. సైదులు ఒక్క పెట్టున భళ్ళున పగిలిన కుండలా భోరున ఏడ్వసాగాడు. తానే స్వయంగా అతడికి మంచి నీళ్ళుతెచ్చిచ్చి " సైదులూ! ధైర్యంగా ఉండు. ఏమైందో చెప్పు , తప్పక నీకు న్యాయం జరిగేలా చూస్తాను. చెప్పు సైదులూ!" అనడిగాడు మనోహర్. సైదులు చెప్పింది విన్న మనోహర్ కు తార స్థాయిలో కోపం వచ్చింది. " ఓ.కే. నీవిక నిశ్చింతగాఉండు. ముందీ కేసు అంతు చూడనీ, ఆ వెంటనే నీ కేసు తెరుస్తాను. అవసరమైనపుడు నిన్ను వివరాలకోసం పిలుస్తాను. " అంటూ పంపాడు. మనోహర్ లాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటే న్యాయం దానంతట అదే బయట పడుతుంది. ఫైలంతా స్టడీ చేసాక మనోహర్ బయటి కొచ్చి జీప్ లో డ్రైవింగ్ సీట్లో కూర్చోబోయాడు. సెంట్రీ సైదులు వచ్చి , "సార్!మీజీప్ డ్రైవ్ చేసే భాగ్యం నా కివ్వండి సర్! ఇక్కడ మరో సెంట్రీ వస్తాడు.ఇక్కడ నా డ్యూటీ టై మైంది. ఇప్పుడు ఫ్రీ "అంటూ వచ్చాడు.సరేని మనోహర్ అతడికి డ్రైవింగ్ ఇచ్చివచ్చి ఎడంపక్క కూర్చున్నాడు. "ఎక్కడికి సర్?" అని అడిగాడు సైదులు."మరెక్కడికి ? ఈ ఫైల్ లో ఉన్న నేరస్తుల కూపీ లాగేందుకే సైదులూ!జీప్ ను ఆహోటల్ కు పోనీ" .అంటూఆహోటల్ పేరు చెప్పి , వెంట తెచ్చుకున్న ఆఫైల్ చూస్తూ కూర్చు న్నాడు. సైదులు డ్రైవ్ చేసే స్పీడ్ చూసి , మనోహర్ భయ పడ్డాడు.

“ సైదులూ! స్పీడ్ తగ్గించవయ్యా! నీకేసు చూసిందాకా నన్నా నన్నుబ్రతకనీ! "అన్నాడు.

"భయంలేదుసర్ ! నేను డ్రైవింగ్లో ఎక్ష్ పర్ట్ ను.ఈ ఉద్యో గంలో చేరకముందు డ్రైవింగ్ చేసేవాడ్ని. “

"ఆ తర్వాత ఈ ఉద్యోగంలో చేరావా?”

"ఔను సార్!"

"మీ అమ్మా నాన్నా ఎక్కడ ఉంటారు సైదులూ! నీకెంత మంది పిల్లలూ?"

" సర్!మానాయన కూలి చేస్తూ కష్టపడి నన్ను హైస్కూల్ దాకా చదివించాక ,ఇహ ఆయన కష్టం చూడలేక చదువు మానేసి డ్రైవింగ్ నేర్చుకున్నాసార్! మా అమ్మ ఎస్సై గారింట్లో పనంతా చేసేది. మానాయన ఎస్సైగార్ని నాకు ఉద్యోగం కోసం సాయం అడిగాడు. ఆయన చూద్దాం అన్నాక,ఆయన సొంత కారుకు, ఉచితంగా డ్రైవర్గా కొన్నాళ్ళు పని చేశానుసార్!ఆ తర్వాత ఈ ఉద్యోగం రాను ఆయన మాట సాయం చేశారు.అందుకే మా అమ్మా నాయనా ఆళ్ళింట జీతం లేకుండా ఊరికే పని చేసేవారు. నా పెళ్ళైనాక మా ఆవిడ చేసేది,అమ్మా నాయనా బదులు. నాకొక్కర్తే కూతురు సార్! ఆమెను బాగా చదివించి పెద్ద పోలీసా ఫీసర్ను చేయాలని కలలు కన్నాను సార్! కానీ అన్నీబుగ్గై పోయాయి.నాబిడ్డ నెవరో ఒకడు పెళ్ళి చేసు కుంటానని నమ్మిం చాడు. మోసపోయింది సార్!.మోసపోయింది. "దుఃఖం ఆపుకోలేక జీప్ పక్కన ఆపి చేతుల్లో ముఖం దాచుకుని పెద్దగా రోదించ సాగాడు సైదులు. సైదుల్ బాధ చూసిమనోహర్ కూ బాధేసింది.

"సైదులూ ! నెమ్మదించు ముందు ఈకేసు అంతు చూస్తాను. ఆతర్వాత నీకేసు చూస్తాను.అందుకేగా టూటౌన్కు తాత్కాలి కంగా వచ్చాను.నీ కేసూ అంతు తేల్చాకే వెళ్తాను. నీవు మొదటినుంచీ ఇక్కడే పని చేస్తున్నావా! ప్రెమోషన్ రాలేదా? " మనసు మరల్చను అడిగాడు మనోహర్

"అవునుసర్! ఇక్కడే పని చేస్తుంటి. నాకు ప్రెమోషన్స్ వద్దనీ, ట్రాన్స్ ఫర్ చేయవద్దనీ రిక్వెస్ట్ చేసుకున్నాను సర్! ఉన్నఒకే ఒక్క కూరుతు అర్ధాంతరంగా పోడంతో నా భార్య దిగులుతో పక్షవాతం వచ్చి మంచాన పడింది. ముసలి తల్లి దండ్రులను, ఆమె నూ, చూసుకుంటూ బ్రతుకు తున్నాను సార్!. మీరు ఈకేసు అంతుచూస్తే ఈ ఆఫీసొది లేసి వెళ్ళిపోతాను సార్ ! “

"అదేంటి సైదులూ! నీకింకా సర్వీస్ ఉందిగా?"

"వద్దుసార్ !ఇప్పటికే చాలా కాలంగా ఉంటున్నాను. ఇకెళ్ళిపోతాను సార్!"

" మరి జీప్ కదిలించు సైదులూ !వెళ్దాం."అన్న మనోహర్ మాటలకు ," సార్! జీప్ కదలడం లేదుసార్! ఏదో చిన్న ప్రాబ్లం, ఇంజన్ వేడెక్కిందేమో సర్! " అంటూ అటూ ఇటూ చూసి, "సార్ ! ఈ ఇంట్లోవాళ్ళు నాకు తెల్సు, ఉండండి సార్! ఇప్పుడే వస్తాను" అంటూ సైదులు ఆఇంట్లో కెళ్ళి పది నిముషాల్లో బయటి కొచ్చి," సార్! లోపలికి రండి సార్! ఈ ఇంటివాళ్ళు నాకు బాగా తెల్సు, ఒక టీ తాగి కూర్చోండి, నేను ఇంజన్లో నీళ్ళుపోసి ఇంజన్ చల్లార గానే వెళ్దాం సార్!" అంటూ లోపలికి తీసుకె ళ్ళా డు సైదులు. మనోహర్ తనచేతులో ఫైల్ పట్టుకుని లోపలికి నడిచాడు."సార్! ఈ ఫైల్ కూడా తీసుకోండి సర్! జీప్లో ఉంది. " అంటూ మరోఫైల్ అందించాడి సైదులు.

"అరే! సైదులూ! ఈ ఫైల్ నేను తేలేదే!ఎక్కడనుంచీ వచ్చింది?" ఆశ్చర్యంగా అన్నాడు మనోహర్.

"లేదు సర్! ఇదికూడా జీప్ లోనే ఉంది" అంటూ అందించి,లోపలి కెళ్ళి" మాసార్కు ఓ మంచిటీ ఏర్పాటు చేయండి! నేను జీప్ ఇంజన్లో నీళ్ళుపోసు కొస్తాను."అంటూ వెళ్ళాడు సైదులు. సైదులిచ్చిన ఫైల్లో చాలా ఫోటోలున్నాయి. ఒక యువతి టీ కప్పుతో వచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళింది.డెస్క్ ట్యాప్[కంప్యూటర్ ]ఓపెన్ ఐఉంది.మనోహర్ యధాలాపంగా అటుచూశాడు, ఒక్కక్షణంలో అలెర్టై ముందుకు వంగి దీక్షగా చూడసాగడు.అదేదో యూ ట్యూబ్ లా ఉంది ఫుల్ స్క్రీన్ మీద పిక్చర్ వస్తోంది. ఒక హోటల్ రూం. కొత్తగా పెళ్ళైన జంటలా ఉంది,మొదటిరాత్రిలా ఉంది. ఆ యువతిని ఎక్కడో చూసినట్లుంది. దీక్షగా చూడ సాగాడు. వారు ఇలాంటి సీన్స్ ఎలా వీడియో తీయించు కున్నారో అర్ధంకాక, అయోమయంగా చూడసాగాడు. కొంత సేప య్యా క, ఒక వ్యక్తి "నీవు నేను చెప్పినట్లు వినకపోతే నీ వీడియో మీనాయనకే కాక అందరికీచూపిస్తా. యూ ట్యూబ్ లోపెడ తా, ఒక్క మారు నేను చెప్పినట్లు విను, నీమంచికే! నీజీవితం హాయిగా ఉండాలంటే నామాట విను." అంటూ ఇంకా ఏదేదో చెప్పి బెదిరిస్తున్నాడు. ఆయువతి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఐనా ఆవ్యక్తి వినడంలేదు. చివరకు విధిలేక అంగీక రించినట్లుంది. మరొక వ్యక్తితో ఆమె గడపటాన్ని కూడా వీడియోలో బంధించారు.మళ్ళా ఆవ్యక్తి బెదిరింపు. ఆయువతి మరొకరితో. అంతా ఒక్కరోజే జరిగినట్లు లేదు, వారి వస్త్రాలను బట్టి, వేరు వేరు రోజుల్లో జరిగినట్లుంది.ఆతర్వాత ఆ యువతి వెక్కి వెక్కి ఏడ్పు. “ఇహ నీకీ రూమే జీవితం, నామాట వినకపోతే నీరోత బ్రతుకు వీధిపాలే!” ఆవ్యక్తి నవ్వు.

“ఈ రూంలో సీక్రెట్ కేమెరా ఉంది. నీలాంటి వాళ్ళను ఇలా ట్రాప్ చేస్తాం.పెళ్ళికాకుండానే వాడితో వచ్చావ్ చూడూ అదే మాకు మంచి అవకాశం. నేను చెప్పినప్పుడల్లా ఈ రూం కు రావాలి, లేకపోతే నీ బ్రతుకు ...తెల్సుగా?" వాడి వికృతపు నవ్వు. చివరగా ఆమె ఆరూంలో ఫ్యాన్ కు ఉరిపోసుకుని చనిపోడంతో వీడియో ఐపోయింది. ఆముఖం తానెక్కడ చూశాడు. ఒక్క మారు మనోహర్ తల విదిలించుకున్నాడు. గబుక్కున లేచి తల త్రిప్పి చూశాడు. టేబుల్ మీద టీ కప్పు అలాగే ఉంది.లేచి వంట గదిలోకి పరుగె త్తాడు.అక్కడ ఎవ్వరూలేరు." సైదులూ!సైదులూ !" అని అరుస్తూ బయటి కొచ్చాడు.తనజీప్ బయటే పార్క్ చేసి ఉంది.దాన్లో సైదులు లేడు."సైదులూ ఎక్కడికెళ్ళావు?" అని కేకలేసి చుట్టూచూశాడు. మరలా లోపలికెళ్ళి , ఆ కంప్యూటర్ లో వీడియోలన్నీ తన బ్యాగ్ లో ఉన్న థంబ్ డ్రైవ్ లో ఎక్కించుకుని ,ఆ వీడియోలింక్ తన మైల్ కు పంపుకుని, లోపలి కెళ్ళి మరోమారు ఇల్లంతా వెతికాడు , ఎవ్వరూ లేరు. ఆశ్చర్యంగా బయటి కొచ్చి సైదులుకోసం చూసి, "మనస్సు బావోలేక ఎక్కడికైనా వెళ్లాడేమోచూద్దాం!" అనుకుంటూ ,జీప్ తానే డ్రైవ్ చేసుకుంటూ తన గమ్యానికేసి అతివేగంగా డ్రైవ్ చేయ సాగడు మనోహర్. అర్ధగంటలో హోటల్ చేరే సరికి అక్కడ జనం గుంపుగా, గోలగా ఉండటం చూసి, జీప్ లోంచీ బయ టికి దూకేసి, "ఏమైంది? "అంటూ అడిగాడు.పోలీస్ ను చూడగా నే అంతా పక్క కు సర్దుకుని దారిచ్చారు. హోటల్ రిసెప్షన్ లో యూనిఫాం లో ఉండే వ్యక్తి ముందుకొచ్చి " సార్! మా హోటల్ మేనేజర్ ఉరిపోసు కుని ఆత్మహత్య చేసుకు న్నారు. కానీ అది ఆత్మహత్య కాదనీ, హత్యేనని మా నమ్మకం.ఆయనకు ఆత్మహత్యచేసుకోవాల్సిన అవసరం లేదుసర్ ! హోటల్ లాభాల్లో నడుస్తున్నది. అర్ధగంట ముందే తాను రెస్ట్ తీసుకునే గదిలో కెళ్ళారు .రోజూ ఆగదిలోనే ఒక్కగంట రెస్ట్ తీసుకుంటారు. పది నిముషాలు కాగానే పెద్దగా అరుపులు వినిపించాయి,'వదులు, వదులూ 'అని.ఆయనకుట్.వ్.పెద్ద గాపెట్టుకునే అలవాటుంది. అదేకాబోలని మారూం బోయ్ తలుపు తట్టలేదు.కానీ మరో ఐదునిముషాలు వినేసరికి ఆకేకలు మా మేనేజర్ వేనేమో అని పించి, లోపల ఆయనకేదన్నా ప్రమాదం జరిగిందేమోని నన్నుపిలిచాడు, నేను మాదగ్గరుండే డూప్లికేట్ కీ తీసు కొచ్చిరూం తలుపుతీసి చూసేసరికే ఆయన ప్రాణం పోయి ఉంది.వేంటనే పోలీస్ స్టేషన్ కు ముందుగా నేనే ఫోన్ చేశాను.ఇంతలోనే మీరు వచ్చారు." అని చెప్పాడు.

"ఏదీ శవం ఎక్కడ?" అన్నాడు మనోహర్.అతడు గబగబా రూం నెం 333 కి తీసుకెళ్ళాడు.శవం అలాగే ఫ్యాన్ కు వేలాడు తోంది.ఆశవాన్నిచూసి ఆశ్చర్యపడ్దాడు మనోహర్, ఆహోటల్ టూ టవున్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది . వెంటనే మనోహర్ ఆఎస్సైకి పోన్చేసి అవసరమైన వారందరితో రమ్మని చెప్పాడు. వేలి ముద్రల నిపుణుడూ, మరణాన్నినిర్ధారించను డాక్టర్ , ఫోటోగ్రాఫర్ అర్ధగంటలో వచ్చారు.యాంబులెన్స్ కూడా వచ్చింది.హోటల్ మేనేజర్ ఉరిపోసుకున్న చీర చూసి ఉలిక్కిపడ్డాడు మనోహర్. ఆచీర ఎక్కడ చూశాడో గుర్తు చేసుకోను తన అలవాటు ప్రకారం, తలవిదిలించుకుని , ప్రయత్నించాడు.

" యాకూబ్ గారూ! సైదులు స్టేషన్ కువచ్చాడా! నాజీప్ డ్రైవ్ చేస్తూ నాతో వచ్చాడు. జీప్ ట్రబు లిచ్చింది.నన్నో ఇంట్లో కూర్చో బెట్టి జీప్ ఇంజన్లో లో నీరు పోస్తానని వెళ్ళిన వాడు మళ్ళా కనిపించ లేదు.ఆ ఇంట్లో నాకు టీ ఇచ్చిన అమ్మాయీ కనిపించ లేదు."

" సార్ ఏంటి మీరంటున్నది ? సైదులు మరణించి ఐదేళ్ళైంది.వాడికూతురు పెళ్ళికాకుండానే ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని , అదిబయట పడుతుందని ,ఇదే హోటల్లో ఇదేరూంలో ఉరిపోసుకుని చచ్చింది. సైదులు ఆబాధ భరించలేక గుండె ఆగిచచ్చాడు. వాడి భార్యకు పక్షవాతం వచ్చి తీసుకుని తీసుకుని చచ్చింది.వాడి అమ్మ నాయనా చూసే దిక్కులేక చచ్చారు.ఆకుటుంబం అంతా ఆపాడు పిల్లవల్ల తుడిచి పెట్టుకు పోయింది.సైదులు మంచివాడు సార్! అమ్మనాయ నల్ని చూసుకోను ప్రెమోషన్ వద్దని,ట్రాన్స్ ఫర్ చేయొద్దనీ రిక్వెస్ట్ చేసుకుని ఇక్కడే పనిచేసేవాడు సెంట్రీగానే."అని చెప్తున్న యాకూబ్ మాటలు విని , ఫోటోలు తీస్తున్న ఆశవం మెడలోని చీరచూశాడు, అదీ తనకు టీ తెచ్చి ఇచ్చిన ఆఇంటి యువతి కట్టుకున్నదే! సందేహం లేదు.ఆహోటల్ మేనేజర్ ,ఔను ఆవీడియోలో ఆ అమ్మాయిని బెదిరించి లొంగ దీసు కున్నవాడే వీడు. అంటే !అంటే! యాకూబ్, ఆ అమ్మాయీ, నన్ను సాయంకోరిన ఆముదుసలి అంతా అంతా .... తమకు న్యాయం జరుగు తుందని నమ్మి, పగతీరగానే ....' మరి ఆలోచించ లేక పోయాడు మనోహర్.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు