ఉదయాన్నే వాకింగ్ చేయడం ఉదయ్ అలవాటు. తన స్వగ్రామంలో హాయిగా పొలం గట్ల వెంట చల్లని పైర గాలి పీల్చుకుంటూ తనకు ఇష్టమైన పాటలు’ హం’ చేసుకుంటూ కనీసం రెండు గంట లైనా నడిచే వాడు. ఆ కొబ్బరి తోటల్లో నడుస్తుంటే ఎంత హాయిగా ఉండేదో! కొబ్బరి మట్టలు గాలికి కదులు తుంటే వచ్చే శబ్దం ఎంత బావుంటుందో! తన చదువంతా తన గ్రామంలోనే ఉంటూ- టూ వీలర్ ‘లో కాలేజ్ కి వెళుతూ గడిచి పోయింది. తర్వాత పీ.జీ కోసం వెళ్ళిన రెండేళ్ళూ ఏదో పర దేశపు ఓపెన్ జైల్ లో ఉన్నట్లు ముళ్ల మీద గడిపి, ఈ ఉద్యోగంలో ‘ ఉద్యోగం పురుష లక్షణమని ‘తండ్రి సలహా మేరకు చేరాల్సి వచ్చింది. అప్పటి నుంచీ నడక కోసం ఈ కష్టాలు మొదలయ్యాయి. 'ఎలాగైనా ఈ చుట్టు పక్కల ఎంత దూరమైనా కానీ కొబ్బరి తోటలు ఎక్కడున్నాయో తెల్సు కుని వాటిలో వాకింగ్ చేయాలి, అప్పుడు కానీ తన మూడ్ బావుండదని పట్టు వదలని విక్రమార్కునిలా’ ప్రయత్నించి , చివరకు తన బ్యాంక్ కి వచ్చే కస్టమర్స్ నందరినీ అడిగి అడిగి ఇదో ఈరోజు ఈ కొబ్బరి తోటలకు 'అశోక వనం లో సీతమ్మను చూసిన హను మలా ' ఉబ్బిపోతూ బయల్దేరాడు.
ఉదయ్ ‘వాతావరణ కలుష్య నివారణ ’ పట్ల తీవ్రమైన ఆరాధనా భావం కలవాడు, దానికి తోడుగా మన ప్రధాని మోదీ గారి ప్రవచ నాలు బాగా మనసు కెక్కించుకుని’ స్వఛ్చభారత్ ‘అని స్మరిస్తూ, పలవరిస్తూ బ్యాంకునంతా చాలా శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు కూడానూ. అందుకే వంటరి గా ఎక్కడికి వెళ్ళినా సైకిల్ మీదే వెళతాడు. అలా వంటరిగా సైకిల్ మీద ఏదో తన కిష్టమైన పాట ' హం ' చేసుకుంటూ ఊరికి దూరంగా ఉన్న కొత్తగా పెరుగుతున్న కొబ్బరి తోటలోకి వెళ్ళాడు. తన సైకిల్ ఒక చెట్టుకు చైన్ వేసి తాళ మేసి , బ్యాంక్ తాళాలు జాగ్రత్తగా వేయడంలో మహా నేర్పరి గనుక , తాళం చెవి ఒక సేఫ్టీ పిన్ తో మొల త్రాటికి వేసు కుని , హాయిగా ఆ చెట్లమధ్య’ భారత్ ను జయించిన అలెగ్జాండర్ ‘లా సంతోషంగా ఎగురుతున్నట్లే నడువ సాగాడు. గంట సేపు నడిచాక ఆ ఆనందం గుండెలు నిండగా కొంత సేపు ఒక చెట్టు మొదట్లోకూర్చుని వెంటతెచ్చుకున్న సీసాడు నీరూ త్రాగేసి ' ఇంత కాలానికి తన నిరీక్షణ ఫలించి కొబ్బరి తోట దొరకడం, మూడు మార్లు అమేరికా వీసా కెళ్ళి చివరకు ఎలాగో ఒబామా కృప వల్ల దొరికి నట్లు మహదానందంతో హృది నిండగా సైకి లెక్కి తోటంగా నాల్గు రౌండ్లేసి , ఇంటి రోడ్డెక్కాడు. ఎంత కాలానికి తిరిగి కొబ్బరి మట్టల చప్పుడుకు గుండె అరలు లయ బధ్ధంగా కదుల్తుండగా హాయిగా ఊపిరి పీల్చుకుంటూ , ఇలా వంటరిగా కాక తన స్టాఫ్ నంతటినీ, ఇంకా వీలుంటే తన అపార్ట్ మెంట్ సహ కుటుంబాల వారి నందరినీ ఆ తోటకు వాకింగ్ కు తెచ్చి, ఈ పచ్చ పచ్చని కొబ్బరి తోట లో వాకింగ్ చేయించి స్వఛ్ఛమైన ప్రాణ వాయువును వారి చేత పీల్పించి, వారి జీవన ప్రమాణాన్ని, వీలైనంత పెంచాలని దృఢ నిశ్చయుడయ్యాడు. ఉదయ్ ఏదన్నా అనుకుంటే సాధించే వరకూ నిద్ర పోడు, తోటి వారిని నిద్ర పోనివ్వడూ, అందుకే సైకిల్ తొక్కుతూనే పధకాన్ని ఎలా నడపాలో బాగా ఆలోచించి ప్లాన్ చేశాడు, అందుకే ఇంటికెళ్ళ గానే భార్యామణి ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ, తను చించేసిన ఆలోచనలను ఆమె ముందుంచగా ఆమె, " మీ ఆలోచనలు ఎప్పుడూ అద్భుత మండీ ! మీ శ్రేయస్సే కాక మీ తోటి మానవుల శ్రేయస్సూ మీ కెప్పుడూ ఎరుకలో ఉంటుంది, ఇంకేం ఆచరణలో పెట్టేయండి. " అంటూ ప్రోత్సహించింది. వెంటనే ఆ రోజు ఆదివారమూ, ‘కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతా ‘ డన్నట్లుగా, ఆరోజు అపార్ట్ మెంట్ మీటీంగూ ఉండటాన గబగబా తయారై బయల్దేరాడు
మన హీరో. ముఖ్యంగా రానున్నరోజుల్లో ‘స్వఛ్ఛ భారత్ ‘క్రింద అపార్ట్ మెంట్ కుటుంబాలన్నీ మూడు డస్ట్ బిన్స్ కొనుక్కుని, చెత్త మూడు బండ్లలో తీసుకెళ్ళే వారికి గుర్తుగా ఉండేలా మూడు రంగులు అదరివీ ఒకేలా ఉండాలి కనుక అపార్ట్ మెంట్ మేమేజి మెంట్ కొని ఇస్తుంది, ఊరికే కాదు, దానికైన డబ్బు ముక్కు పిండ కుండా నే, మెయింటె నెన్స్ లో కట్టించుకుని మరీనీ,’ అవన్నీ తీసుకెళ్ళే వారికి కొంత ఎక్కువ పైకం కట్టాల్సి ఉంటుంది. అని ఈ రిజల్యూషన్ కు అంగీకారమేం అవసరం లేదు కనుక వర్కింగ్ కమీటీ పాస్ చేసింది. అంతా ముఖాలు ముడుచుకున్నారు , ఎక్కువ మైన్ టెనెన్స్ కట్టాల్సి రావడం వల్ల. ఇదేమంచి సమయం అని భావించి, మన హీరో మహోత్సాహంగా, " కోరుకున్నవారికి కోరుకున్నంత ప్రాణ వాయువు ఉచితం" అంటూ అనౌన్స్ చేసేసి , అందర్నీ ఆకర్హించను ప్రయాస పడి ఆతర్వాత నిదానంగా తన ప్రొపో జల్ వినిపిం చాడు ' ఓస్ ఇంతేనా ' అని అంతా అనుకుంటుండగా ,”అక్కడ కావల్సినంత చోటుంది ముందుగా మనం అక్కడ ఒక పిక్నిక్ పార్టీ ఏర్పాటు చేసుకుందాం. ఆ కొబ్బరి తోట మీకంతా నచ్చితే ఆ తర్వాతే అందరం ఎవరి వెహికిల్స్ లో వారంతా కల్సి వాకింగ్ కెళ్ళి స్వఛ్ఛ భారత్ లో స్వఛ్ఛ ప్రాణ వాయువు పీల్చుకో వచ్చును. ఏమంటారు, వచ్చేది లాంగ్ వీకెండ్ కనుక అంతా పాట్ లక్ లా ఏర్పాటు చేసు కుని వెళ్దాం . దీనికై ఒక మహిళా కమిటీ ఏర్పడి, ఆధరువులను నిర్ణయించి ఆ ఏర్పాట్లకు ముందుకు వస్తే , మిగతా ఏర్పాట్లు మేం చూస్తాం." అన్నాడు. అంతా రోజు వారీ రొటీన్ లో విసిగి పోయి ఉన్నందున, ఉదయ్ ప్రొపోజల్ కు మూజువాణీ ఓటేశారు. అంతే పిక్నిక్ రెడీ. అంతా పిక్ నిక్ ఎంతో ఆనందంగా గడిపారు. ఆ కొబ్బరి తోట అందరికీ ఎంతగానో నచ్చే సింది.
దాంతో ఇహ ప్రాతః కాల నడక మొదలైంది, ముందు పురుషులు మాత్రమే ఆర్భాటంగా , లేడికి లేచిందే పరుగన్నట్లు తలో సైకిల్ కొని కొద్ది రోజులు వెళ్ళారు. ఆ తర్వాత సైకిల్స్ పడేసి కార్లలో బయల్దేరారు. ఒక్కో కార్లో ఐదు మంది చొప్పున కార్ పూరింగ్ చేసుకుంటూ, రెండు కార్లు, నలుగై, నల్గు ఎనిమిదై ,ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రెట్టింపు రెట్టింపుగా పెరిగి పోయాయి కార్లు. వాకిం గ్ శాల్తీలూ పెరిగాయి. వారినంతా చూసి ఉదయ్ మనసు వందెకరాలంత విశాలమైంది. అంతా తనను పొగుడు తుంటే. షుమారుగా యాభై మందయ్యారు. అది వాపో, బలుపో తెలీడం లేదని అపార్ట్ మెంట్ అంతా అనుకో సాగారు. ఆదివారాలప్పుడు, అప్పుడప్పుడూ మహిళలూ’ మేమేం తక్కువ !’అన్నట్లుగా స్పెషల్ వాకింగ్ డ్రెస్ కొని తొడిగి వాకింగ్ లో కలుస్తున్నారు. కార్లన్నీ కొబ్బరి తోట పక్కనే ఉన్నమట్టి రోడ్డు మీద పార్క్ చేసేసి హాయిగా నడకలు సాగిస్తున్నారు. ఆ కొబ్బరి చెట్లకు కొంచెం పక్కనే ఒక లేబర్ కాలనీ ఉంది. రేకుల ఇళ్ళూ, పూరిళ్ళూ, చుట్టు గుడిసెలూ లాంటివి. ఆ ఇళ్ళలోని వారంతా ముఖ్యంగా మహిళలు ఇలా వాకింగ్ కు తెల్లార గట్లనే వచ్చే వారిని తలుపు కొంచెం తీసి చూసి తిరిగి లోపలి కెళ్ళడం గమనించ సాగడు ఉదయ్.' వీరెప్పుడూ ఇంత మంది నడవడం చూసినట్లు లేదు వింతగా చూస్తూ, మళ్ళా ఏమనుకుంటామోని కాబోలు లోని కెళుతున్నట్లుంది, పాపం 'అను కున్నాడు. ఆపాపం ఎవరికో అతడికా సమయంలో తెలిసే అవకాశమే లేదు. అంతా బాగానే సాగితే ఇహ అనుకునే దేముంది! ఉన్నట్లుండి ఉపద్రవం చెప్పాపెట్టకుండా ముంచుకొచ్చి పడింది, నడక రాయుళ్ళ ముందు.
ఒక రోజున కార్లలో వెళ్ళే సరికి మట్టి రోడ్డుకు అడ్డంగా రాళ్ళు పెట్టే సున్నాయి, ఒక కిలో మీటరు దూరం లోనే. ఇదంతా అల్లరి పిల్లల పనై ఉంటుందని ,అంతా దిగి రాళ్ళన్నీ తీసి పక్కన పడేసి ముందుకు సాగారు. ఆ మరు నాడు అదే ప్రాంతంలో కర్రలను అడ్డం గా కట్టేసి ఉండటం చూసారు. ఆ కొబ్బరి తోట యజమాని పనై ఉంటుందని భావించి, మొదలయ్యాక ఆగేది లేదని అంతా ఆకర్రలను విప్పేసి లోనికి సాగారు. ఆమరునాడు రోడ్డు మో చేతి లోతున అడ్డంగా త్రవ్వి ఉండటం చూశారు.అంతే ఉదయ్ కి ఎక్కడ లేని కోపం ముంచు కొచ్చింది. 'ఏదో స్వఛ్ఛ ప్రాణ వాయువు పీల్చుకోను వస్తుంటే ఇదేం వింత ! 'అనుకుని ఇద్దర్ని వెంట తీసుకుని నడుచు కుంటూ ముందుకు సాగాడు, టార్చీ లైట్ వేసుకుంటూ. ఒక పది నిముషాలు నడవ గానే కొబ్బరి తోట చివరి పంట కాలువ హద్దు వద్ద వరు సగా తలలు కనిపించాయి, టార్చ్ లైట్ ఆపేసి మెల్లిగా ముందుకు సాగాడు తానొక్కడే, తనతోటి వాళ్లను అక్కడే ఆగమని సూచించి. ఉదయ్ కు చిన్నప్పటినుండీ సాహస కృత్యాలంటే అమిత ఇష్టం. గలివర్స్ ట్రావెల్స్ పుస్తకం తెగ చదివే వాడు. ఇంకా సింద్ బాద్ సాహ స యాత్రల పుస్తకాలన్ని వెతికి వెతికి వంద సార్లు చదివి కొంత సాహసం వంట బట్టించుకున్నాడు ఎలాగో. ఆసాహసం తోనే 'అవి దయ్యాల తలలా! మరేంటో ‘ తెల్సుకోవాలని ఆత్రంగా, అడుగులో అడుగేసు కుంటూనూ. దగ్గరి కెళ్ళాక అవి ఆడ వాళ్ల తలలని వెను క భాగంలోని జుట్టు చూసి తెలి సింది. అంత మంది అక్కడ ఉదయాన్నే ఇంకా తెల్లారక ముందే ఎందుకు కూర్చోనున్నారో తెలీ లేదు. మరి కాస్త ముందుకు నిశ్శబ్దంగా వెళ్ల గానే అతడి అడుగులు అక్కడి ఎండు ఆకులపై పడి శబ్దమై చివుక్కున ఒక మహిళ వెనక్కు తిరిగి చూసి, వెంటనే లేచి నిల్చుంది. అంతే ఆ ఇరవై మందీ ఒక్క సారిగా గబుక్కున లేచారు. వారందరి చేతుల్లో నీళ్ల చెంబులు, డబ్బాలూ, సీసాలూ.. ఉదయ్ గబుక్కున వెనక్కు తిరిగి పరుగు లంకించు కున్నాడు. కార్ల దగ్గరికి వచ్చి ఆగి కాస్త మంచి నీళ్ళివ్వ మని సైగ చేసి , సీసాడూ త్రాగేసి. రొప్పుతూ వెనక్కు వెళ్ళదామని సైగ చేసి తన సైకి లెక్కాడు. అపార్ట్ మెంట్ కు వచ్చి ఆగా డు.
స్వఛ్ఛ భారత్ ఎంత బావుందో అర్ధమై బాధేసింది. ఒక సాధారణ పౌరునిగా తాను చేయ గలిగేదేమైనా ఉందాని తెగ ఆలోచించాడు. ఆరోజు అర్జెంట్ మీటింగ్ కాల్ఫార్ చేసి "స్వఛ్ఛభారత్ అంటూ మనం మన ఇళల్లో చెత్త కూడా డబ్బు మిగుల్చు కోను తీసు కెళ్ళి ఆ కొబ్బరి తోట పక్కనే ఉన్న గుంటల్లో పోస్తున్నా అక్కడ నివసించే వారు మనల్ని పల్లెత్తు మాట అనలేదు. వారి గురించీ మనం అస్సలు పట్టించుకోనే లేదు. వారు తెల్లారు గట్లనే తలుపులు తెరిచి మనల్ని చూసి, మళ్ళా లోపలికి ఎందుకు వెళుతున్నారో ఊహించ లేక పోయాం, వారికి ఎంతో ఇబ్బంది కలిగించాం. రాళ్ళూ, కర్రలూ, తీసేసి వెళ్ళాం, చివరకు మనల్ని ఆపను గుంతలు త్రవ్వి నా మనం వారి ఇబ్బందేంటో తెల్సుకో లేక పోయాం. మనం వారికి కలిగించిన ఆసౌకర్యానికే పాపం ఎంత బాధ పడ్డారో ఊహించు కుంటుంటే బాధేస్తున్నది" అంటూ తన బాధ వెలిబుచ్చి, శ్రీమతి ద్వారా మహిళలకు విషయం వివరించాడు ఉదయ్. అంత తేలిక కాపోయినా తమ అపార్ట్ మెంట్ వారితో కలసి వెళ్ళి ఒక సేవా కార్యక్రమంలా, ఓపికతో ఆ కాలనీ వారికంతా బ్యాంక్ లోన్స్ ఇప్పించి దగ్గ రుండి శౌచాలయాలు కట్టించి , తమ బ్యాంక్ సిబ్బందిని, కూడగట్టి ఆ విరాళంతో ఒక బోర్ వేయించి, నీటి సౌకర్యం కల్పించి, తిరిగి యధా ప్రకారం వాకింగ్ సాగించాడు కొబ్బరి తోటలోకి ఉదయ్! తననొక 'శ్రీమంతుడ 'ని అంతా పొగుడు తుంటే, తన వంతు ' స్వఛ్ఛభారత్ ' సేవ చేసినందుకు పొంగిపోతూ .