నిజమైన కొడుకు (మరోకేసబియాంక) - చిత్రవెంకటేష్.

nijamaina koduku

కొయంబత్తుర్ ఉడ్ లాండ్స్ హోటల్ లో ఉన్నాను. నా చేతిలో విస్కీతో నిండిన గ్లాసు ఉంది. గంటముందు హోటల్ లో దిగాను. గదిలోకి రాగానే మందు బాటిల్ ఓపన్ చేశాను. గ్లాసులో పోసుకుని తాగటం మొదలుపెట్టాను. నేను ఎన్నో బిజినెస్ పనిమీద కొయంబత్తుర్ వచ్చాను. బజినెస్ డీల్ పూర్తయిన తరువాత మందు తీసుకోవటం నాకు అలవాటు. దాదాపు పాతిక సంవత్సరాలనుంచి ఆ అలవాటు కొనసాగుతోంది. కాని ఈ రోజు ఆ అలవాటుకు స్వస్తి పలకవలసివచ్చింది. దానికి ముఖ్యమైన కారణం ఉంది. సరిగ్గా రెండుగంటలకు ముందు నాకు లండన్ నుంచి కాల్ వచ్చింది. నా ఒక్కగానొక్క కూతురు స్వాతి చేసింది. తన ఆఖరి పరీక్ష ముగిసిందని మరో రెండురోజులలో ఇండియా తిరిగి వస్తున్నానని చెప్పింది. అంతే కాదు వచ్చిన వెంటనే బిజినెస్ తన చేతులలోకి తీసుకుంటానని కూడాచెప్పింది. ఆ శుభవార్త వినగానే నేనుసంతోషంతో ఊగిపోయాను. శరీరం దూదిపింజలా గాలిలోకి ఎగురుతున్న అనుభూతి కలిగింది.

ఈ తియ్యని వార్త కోసమే నేను చాల కాలం నుంచి ఎదురుచూస్తున్నాను. ఆది ఈరోజు నెరవేరింది. ఈ సంతోషాన్ని సెలిబ్రేట్ చేసుకోవాలనిపించింది. అందుకే గదిలోకిరాగనే విస్కీ సీసా తెరిచాను. మరో పది నిమిషాలలో జాన్ వస్తాడు. ఇద్దరి మద్య వ్యాపార డీలింగ్ జరుగుతుంది. అది పూర్తి అయిన వెంటనే ఇద్దరు మందు కొడ్తాం. కొన్ని గంటలు తాగుతూ ఎంజాయ్ చేస్తాం.జాన్ నా బిజినెస్ అసోసియేట్. అంతే కాదు నాకు మంచి స్నేహితుడు కూడా. చాల సంవత్సరాలనుంచి మేము వ్యాపారం చేస్తున్నాం. అయిన ఇంతవరకు మా మద్య ఎలాంటి ఆపార్ధాలు రాలేదు. దానికి కారణం మా మనస్తత్వం. ఇద్దరం వ్యాపారాన్ని వ్యక్తిగత స్నేహాన్ని వేరువేరుగా చూస్తాం. బజినెస్ డీలింగ్ చేసేటప్పుడు పక్కా వ్యాపారస్ధుల్లా ఉంటాం. ఆలాగే ఆలోచిస్తాం.అన్ని రూల్స్ ప్రకారం చేసుకుంటాం. వ్యాపారం అయిపోయిన తరువాత స్నేహితుల్లా మారిపోతాం. చిరకాల మితృలు ఎలా ఉంటారో అలా ఉంటాం. మనస్సు విప్పి మాట్లాడుకుంటాం. ఒకరి విషయాలు ఒకరు దాచుకోకుండ చెప్పుకుంటాం. ఈ లక్షణమే మా ఇద్దరికి మనస్పర్ధలు రాకుండ కాపాడిందని అనుకుంటు ఉంటాం. జాన్ నాకు ఫాక్టరికి కావల్సిన ముడిసరుకు సప్లయ్ చేస్తాడు. నేను ఆ సరుకుతో ఫినిష్డ్ ప్రొడక్ట్ తయారుచేస్తాను. అతనికి కూడా ఒక్కడే కొడుకు. అతను అమెరికాలో యంబి.ఏ చదువుతున్నాడు. అతని చదువు కూడా ఈసంవత్సరం పూర్తవుతుందని విన్నాను.

అప్పుడే తలుపు మీద చప్పుడయింది. నా ఆలోచనలకు బ్రేక్ వేసి తలుపు తెరిచాను. ఎదురుగా జాన్ నవ్వుతూ కనిపించాడు. నా చేతిలో ఉన్న విస్కీ గ్లాసు చూసి ఆశ్చర్యపోయాడు.

“అదేమిటి బ్రదర్ అప్పుడే దుకాణం తెరిచావ్. నా గురించి మరచిపోయావా”

ఈ రోజు నాకు చాల సంతోషంగా ఉంది జాన్”అన్నాను

“ఎందుకు”ఆశ్చర్యంగా అడిగాడు జాన్.

ఇద్దరం కూర్చున్నతరువాత అంతా వివరంగాచెప్పాను.

“ఇదే నాది ఆఖరి బజినెస్ డీలింగ్”అన్నాను.

“అంటే వ్యాపారం ముసేస్తావా.”

`ఈ వ్యాపారం నాకు అన్నం పెట్టింది. సంఘంలో హోదా కల్పించింది. అంతకంటేముఖ్యంగా నా కూతురికి విదేశాలలో చదవుకునే అవకాశం కల్పించింది. ఈ వ్యాపారం వల్ల బాగా డబ్బు సంపాదించాను. ఆస్ధి సంపాదించాను. అలాంటిది ఈ వ్యాపారాన్ని ఎందుకు మానేస్తాను. నా ఉద్దేశం అదికాదు. నీతో నేను చేస్తున్న చివరి డీలింగ్ ఇది. తరువాత ఈ వ్యాపారాన్ని నా కూతరికి అప్పగిస్తాను. ఇకనుంచి నువ్వు ఆమెతో డీల్ చెయ్యాలి” చాల సంతోష అన్నాడు జాన్ తరువా అలవాటు ప్రకారం మా మద్య బజినెస్ వ్యవహారం నడిచింది. పది నిమిషాల తరువాత ఇద్దరం అగ్రిమెంట్ మీద సంతకం చేశాం.తరువాత ఇద్దరం తాగాం. రెండు రౌండ్స్ తాగిన తరువాత జాన్ వెళ్ళిపోయాడు. నేను కూడా దుకాణం సర్ది టైం చూశాను. సమయం పన్నెండుగంటలు కావస్తోంది. అయిదు గంటలకు నాకు హైదపరాబాదు ఫ్లైట్ ఉంది. రెండు గంటలకు ముందు నేను ఏయిర్ పోర్ట్ చేరుకోవాలి. క్యాబ్ కంపెనికి కాల్ చేసి రెండు గంటలకు రమ్మని చెప్పాను. తరువాత మంచంమీద వాలిపోయాను. సరిగ్గా రెండుగంటలకు లేచి తయారయ్యాను. సామానులు తీసుకుని రిసప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. బిల్ పేచేసి బయటకు వచ్చాను. గుమ్మం ముందు క్యాబ్ సిద్దంగా ఉంది.

అరగంట తరువాత ఏయిర్ పోర్ట్ చేరుకున్నాను. క్యాబ్ కు డబ్బు ఇచ్చి సెక్యురిటి చెకింగ్ పూర్తిచేసుకున్నాను. ప్రయాణికలు వెయిటింగ్ హాలులో కూర్చున్నాను. పావుగంట తరువాత రన్ వే మీద విమానం వచ్చింది. అదే నేను ప్రయాణం చెయ్యబోతున్న విమానం. మిగత తతంగం పూర్తయిన తరువాత విమానంలో కూర్చున్నాను. నా పక్కన ఎడం వైపు ఒక చిన్న అబ్బాయి కూర్చున్నాడు. వాడికి ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి. క్రయాన్స్ తో ఏవో బొమ్మలు గీస్తున్నాడు. నా కుడివైపు ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆవిడకు నలబై సంవత్సరాలు ఉంటాయి. మొదటి సారి విమానంలో ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది. కళ్ళు మూసుకుని తనని క్షేమంగా గమ్యస్ధానం చేర్చమని దేవుడిని ప్రార్ధిస్తోంది.

ఇంతలో మైక్ లో విమానం బయలుదేరబోతున్నదని అందరు సేఫ్టిబెల్ట్ కట్టుకోవాలని తియ్యగా అనౌన్స్ చేసింది ఏయిర్ హోస్టెస్. నేను బెల్డ్ కట్టుకుంటు పక్కకు తిరిగి చూశాను. అబ్బాయి అంతకుముందే కట్టుకుని రెడిగా ఉన్నాడు. బహుశా ఆ అబ్బాయి తరుచు విమానం ప్రయాణం చేస్తాడని తెలుస్తోంది.

ఒక నిమిషం తరువాత విమానం బయలుదేరింది. మెల్లగాటేకాఫ్ అందుకుని గాలిలో దూసుకుపోయింది. నేను సీటు వెనక్కి వాలి కళ్ళుముసుకున్నాను. నా కళ్ళముందు స్వాతి రూపం గోచరిస్తోంది. ఆమెతో నా భవిష్యత్తును సుందరంగా ఊహించుకుంటున్నాను. ఇంతలో ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా విమానం అల్లాడిపోయింది. ఎవరో బలవంతంగా ఊపినట్టు అటుఇటు ఊగిపోయింది. నోస్ డైవ్ చేసింది. ఊహించని పరిణామానికి అందరు భయపడ్డారు. కొందరు గట్టిగా ఏడ్చేశారు. మరికొందరు కనిపించని దేవుడిని గట్టిగా ప్రార్దిస్తున్నారు. ప్రయాణికులందరు అన్ బాలెన్స్ అయ్యారు. ముందుకు తూలిపడ్డారు. నేను వెళ్ళి ఎదురుసీటుకి గట్టిగా గుద్దుకున్నాను. నా తలదిమ్మెక్కి పోయింది.నుదుటి మీద బొప్పి కట్టింది.

ఒక్క క్షణం పాటు అందరం ప్రాణభయంతో అల్లాడిపోయాం. తరువాత విమానం యధాస్దితికి వచ్చింది.ఏయిర్ హోస్టెస్ కంగారుగా మా దగ్గరికి వచ్చింది. చిన్న సాంకేతిక లోపం వల్ల అలా జరిగిందని ప్రయాణికులు భయపడవలసిన అవసరం లేదని అందరిని క్షేమంగా గమ్యస్ధానం చేరుస్తామని హామీ ఇచ్చింది. జరిగిన సంఘటనకు ఆపాలజి కూడా చెప్పింది. విమానంలో దాదాపు నూటయాభై మంది ప్రయాణం చేస్తున్నాం. అందరం భయంతో వణికిపోయాం. కాని నా పక్కన కూర్చున్న అబ్బాయి మాత్రం కొంచం కూడా భయపడలేదు. కనీసం కంగారుపడలేదు.తన మానాన తాను బొమ్మలు గీయ్యటంలో బజిగా ఉన్నాడు. ఆ అబ్బయి మొహంలో కొంచం కూడా ఉద్వేకం కనిపించలేదు.

నాకు చాల ఆశ్చర్యం వేసింది.

“బాబు నీకు కొంచం కూడా భయం వెయ్యలేదా”అడిగాను.

లేదు అంకుల్. ఈ విమానం పైలెట్ మా నాన్నగారు. నన్ను క్షేమంగా ఇంటికి తీసుకువెళ్తానని ప్రామిట్ చేశారు”అన్నాడు.

ఆ బాబు మాట్లాడింది ఒక వాక్యం మాత్రమే. కాని అందులో ఎంతో జీవిత సత్యం కనిపించింది. ముఖ్యంగా తన తండ్రి మీద అ అబ్బాయికి ఉన్న నమ్మకం తెలియచేస్తుంది. ఆ నమ్మకం అతని భయాన్ని డామినేట్ చేసింది. విమానం ఎంత ప్రమాధానికి గురిఅయిన తండ్రి తనను క్షేమంగా ఇంటికి చేరుస్తాడని ఆ అబ్బాయి మనసా వాచా నమ్మాడు. అందుకే అతనికి కొంచం కూడా భయంవెయ్యలేదు.

అప్రయత్నంగా చిన్నతనంలో చదువుకున్న కేసిబియాంక కధ గుర్తుకువచ్చింది. కేసిబియాంక ఒక నావికుడి కొడుకు. ఒకసారి అతన తండ్రి కేసబియాంకను తీసుకుని ఓడలో వెళతాడు. మద్యలో ఒక చోట ఓడ అగుతుంది. ఏదో పని మీద కేసిబియాంక తండ్రి నగరంలోకి బయలుదేరుతాడు. వెళ్ళేటప్పుడు తను వచ్చేంతవరకు ఓడలో ఉండమని చెప్తాడు. అతను వెళ్ళిపోయిన తరువాత అకస్మాతుగా ఓడకు నిప్పుఅంటుకుంటుంది. ఓడ సిబ్బంది నిప్పును ఆపటానికి ఎంతో ప్రయత్నిస్తారు. కాని ఏం లాభం లేకుండ పోతుంది. అంతకంతకు మంటలు ఎక్కువవుతుంది. ఇక చేసేది లేక ఓడ సిబ్బంది అందరు ఓడను విడచిపెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళేముందు కేసబియాంకాను కూడారమ్మని చెప్తారు. కాని అతడు వెళ్ళడు. తన తండ్రి మాటను జవదాటలేనని అంటాడు. ఓడ సిబ్బంది అతని కర్మకు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కొంచంసేపయిన తరువాత ఓడ పూర్తిగా కాలిపోతుంది. దాంతో పాటు కేసబియాంక కూడా కాలిపోతాడు.

ఇప్పుడు ఈ అబ్బాయిని చూస్తుంటే నాకు మరో కేసబియాంక గుర్తుకువచ్చాడు. పెద్దయిన తరువాత ఈ అబ్బాయి సెంటిస్ట్ అవుతాడో లేదో తెలియదు. ఐఏయస్ ఆఫీసర్ అవుతాడో లేదో తెలియదు. పెద్ద రాజకీయనాయకుడు అవుతాడో లేదో తెలియదు. కాని మంచి పౌరుడు అవుతాడు. సంస్కారవంతుడు అవుతాడు. పెద్దవాళ్ళను గౌరవించే గొప్ప నాగరికుడు అవుతాడు. అంతకంటే తన తల్లి తండ్రులను చక్కగా ఆప్యాయంగా చూసుకునే నిజమైన కొడుకు అవుతాడు. వాళ్ళమాటను పూర్తిగా నమ్మే కొడుకవుతాడు. ఇది మాత్రం నిజం.
నా కెరీర్ లో నాకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. కాని ఈ అనుభవం మాత్రం నేను ఎప్పుడు మరచిపోలేను. నా జీవితాంతం ఇది ఒక మధుర స్మ్రుతిగా మిగిలిపోతుంది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు