తప్పు - అశోక్ కుమార్ అనుముల

tappu

అవినాశ్ పదోతరగతి చదువుతున్నాడు; ఆఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి మూడు రోజులవుతూంది. ఆరోజు మాథ్స్ ఎగ్జామ్. స్టూడెంట్స్ అందరూ సీరియస్ గా ఎగ్జామ్ రాస్తున్నారు. అవినాశ్ ఫ్రెండ్ ఆకాశ్ కి పేపర్ చూసి ముచ్చెమటలు పట్టాయి. మాథ్స్ లో తను వీక్. మార్కులు తక్కువ వచ్చి తను ఫెయిల్ అయితే నాన్న వీపు చీరేస్తాడు. వెంటనే తన కాలర్ వెనుక దాచిన చీటి తీసి వడి వడిగా రాయసాగాడు. ఆకాశ్ ప్రక్కన రెండు సీట్ల తరువాత కూర్చున్న అవినాశ్ ఈ తతంగం అంతా చూస్తున్నా, ఎందుకు ఎగ్జామినర్ కి చెప్పడం, ఫ్రెండ్షిప్ దెబ్బతింటుంది అని మిన్నకుండిపోయాడు. ఆకాశ్ బార్డర్ మార్కులతో గట్టెక్కాడు.

*************

రోజులు వడి వడిగా సాగిపోయాయి. ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. ఒకరోజు సాయంత్రం, “ అనన్యా , ఏంటే గోడల నిండా క్రేయాన్స్ తో ఆ పిచ్చి గీతలు?” అరవసాగింది అవినాశ్ వాళ్ళ అమ్మ. అనన్య, అవినాశ్ చెల్లి; LKG చదువుతూంది. ఇద్దరి మధ్య గాప్ పది సంవత్సరాలు ఉండడంతో చాల గారాబంగా పెరిగింది. “ ఒరేయ్ అవినాశ్ నువ్వు పెద్దవాడివి చూస్తూ అలా కూర్చున్నావేరా? చెప్పాలి కదా అది గీతలు గీస్తుందని. రేపొద్దున్న మనం కొత్తింట్లోకి వెళ్ళినా అది అలానే గీస్తుంది కదా; మళ్ళీ రంగులు వేయాలంటే ఎంత ఖర్చు, “తప్పు చేయడమే కాదురా, చూస్తూ చెప్పకుండా ఉండడం కూడా తప్పే”. ‘సారీ మమ్మీ’ చెప్పాడు అవినాశ్.

ఇంతలో ఈరోజు మాథ్స్ ఎగ్జామ్ కదా, ఆకాశ్ ఎలా రాసాడో కనుక్కుందాం అని ఫోన్ చేసాడు అవినాశ్. పదోతరగతి కావడం వల్ల ఇద్దరూ వేరు, వేరు సెంటర్లలో ఎగ్జామ్స్ రాసారు. ఫోన్ అవతలి వైపు నుంచి ఒకటే ఏడుపు. ఈ రోజు కూడా చీటీ తీసి కాపి కొడుతుంటే ఎగ్జామినర్ పట్టుకుని డిబార్ చేసాడ్రా. ఒక సంవత్సరం వేస్ట్ అయినట్లే, మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు, ఏడవసాగాడు ఆకాశ్. వెంటనే అవినాశ్ కి తల్లి అన్న మాటలు గుర్తొచ్చాయి. ‘తప్పు చేయడమే కాదు, చూసి చెప్పకపోవడం కూడా తప్పే’. ఆరోజు తను వాడు ఆఫ్ ఇయర్లీ ఎగ్జామ్‌లో కాపి కొడుతుంటే, సర్ కి చెప్పుంటే గట్టిగా దండించేవారు. ఇంట్లో వాళ్ళ నాన్న కూడా శ్రధ్ధగా చదివించేవారు. అప్పుడు వాడు కష్టపడి చదివి, కాపి కొట్టకుండా పాస్ అయ్యేవాడు. జరిగినదాంట్లో తన తప్పు కూడా ఉంది అని తనలో తను కుమిలి పోయాడు అవినాశ్.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు