ఈ మాట అనిండేదెవరో కాదు సాక్షాత్తు మా నాన్నే! అదీ నా జిగ్రీ దోస్తుల ముందు. నా ఇజ్జత్ ఇంత ఘోరంగా తీసేందుకు ఆయన కూడా పూనుకునేకి...మా దోస్త్‌గాళ్లే కారణం. లేకపోతే చదువుల్ని చాప చుట్టినట్టు చుట్టేసి పక్కన పెట్టేసింది కాకుండా... నాటకాలాడుతున్నామంటే ఎవరికి మాత్రం కోపం రాదు. ఇంతకు ఎప్పుడనిండాడో చెప్పలేదు కదా...ఆ రోజు రాత్రి 9గంటలప్పుడు బద్రీ మరికొందరు కమానులో మా ఇంటికాడ వచ్చి నాకోసం వచ్చిండారు. అయినా వచ్చేటోళ్లు కాస్త వెనకాముందూ చూసుకోవాలి కదా...అలాంటిదేమీ లెకుండా బేఫికర్‌గా ఇంటిముందు వచ్చేసిండారు. సరిగ్గా అప్పుడే నాన్న కట్టపై కూర్చొని ఉండాడు. ఏందిరా రోజూ రాత్రి యాడకో పోతుండారు ఏంటి కత అని అడిగేసరికి..లేద్సార్ కాలేజీ డేకి డ్రామా వేస్తున్నాము అని ఒకడు పిత్తినాడు. ఇంక ఆయప్పకి కోపం మామూలుగా కాదు...అసలే నేను కొంపలో ఉండట్లేదని చిరాకుపరాకుగా ఉంటుండాడు. ఇప్పుడు ఈ విషయం తెల్సినాంక ఊర్కే వదులుతాడా...కానీ సారు కదా సానా కూల్‌గా ఏం డ్రామా ఆడుతుండార్రా అని ఆరా తీయడం సురు చేసిండాడు. ఎదుటోళ్లు ఎట్టా మాట్లాడుతుండారు...కువ్వాడంగానా ...నిజంగానా అని తెలుసుకునే శానేతనం ఉండాలి కదా! మావోళ్లు దానికి సానా దూరం. అమాయకంగా కొండంత ఉత్సాహంతో మనోడే రాసిండాడు సార్ ‘ఈ సినిమా ఆపేయండి...’ అని మొదలు పెట్టిండారో లేదో నాన్న గబాలున అడ్డుకుని ‘ఆహా అలాగా...రేయ్ నేనింకో డ్రామా చెబుతాను అది వేయండ్రా బాగుంటాది అన్నాడు. ‘ఏం డ్రామా సార్’ అనగానే ఇంకేముంది ‘ఈ చదువు ఆపేయండి...’ అని ఉండాదిలే. వాడికి పన్లేదు...మీకూ పన్లేదు వెళ్లండి వెళ్లండి...డ్రామా అంట డ్రామా...అయినా రోజూ మీరే వేస్తుండేది అదే కదా అంటూ హూంకరించే సరికి అందరూ గప్‌చుప్‌గా జారుకునిండారు. కొంతలో కొంత మర్యాద ఏమైనా ఉండాదంటే ఆరోజు ఆ సీన్‌లో నేను లేకుండ ఉండటమే!
అసలు నాకు ఈ డ్రామా పురుగు ఎక్కించిండేది పాతూరి నాగరాజు. మేమిద్దరం కూర్చుని అదీ ఇదీ మాట్లాడు కుంటున్నప్పుడు వాడు ఉన్నట్టుండి...కాలేజీడేకి డ్రామా వేయాలి...నువ్వు రాయి అనిండాడు. డ్రామానా నేనేడ రాసేదిరా నాయనా అనుకునిండాను. కానీ పైకి మాత్రం చూద్దాం అని ఊరుకున్నా. ఇంక వాడు వదిలిపెట్టలేదు. మూడు నాల్గు రోజులయ్యాక మళ్లీ సురు చేసుకునిండాడు...డ్రామా రాద్దామా అని. నాకు ఇదేదో నెత్తిపైకి వచ్చేలా ఉండాదనుకుని ...లేదులేరా నాగరాజు నావల్ల కాదు గానీ వదిలెయ్...పోనీ నువ్వే రాయొచ్చు కడా అని ఎదురు తిరుక్కొనిండాను. వాడు నవ్వుతూ...నేను రాయలేక కాదులే గానీ నువ్వే రాయాలి. రాస్తావు...అదీ సూపర్‌గా ఉంటుందిలే అని...అనిండాడు. నాగరాజు ఇట్టా ఎందుకినాలా? అంటే నా కాడ బదులు లేదు గానీ ఎందుకో వాడు ఏది చెప్పినా నాకు బలేగా ఉండేది. తెలుగులో వాడి ఆసక్తి నాకు చాలా ఇస్టం. చాలా చురుకుగా ఉండేవాడు. నాగరాజు వాళ్లు మొదట్లో మా పక్కన చింతకుంట గేరిలో ఉండేవాళ్లు. చింతకుంట మధు వాళ్లింట్లో. నాగరాజు వాళ్ల నాన్న సీతారామాంజనేయులు సారు మునిసిపల్ పెద్దస్కూలులో తెలుగుపండిట్. వాళ్లమ్మ వరలక్ష్మమ్మ మా పిలగాళ్లని చాలా చక్కగా పలకరించేది. అసలు వరలక్ష్మమ్మ వాళ్లిల్లు అంటేనే అందరూ గుర్తుపట్టేవాళ్లు. చింతకుంట మధు వాళ్లమ్మ... సరజోమ్మకు తెలుగు అంతంతే ...వరలక్ష్మమ్మకు కన్నడం అంతంతే ... కానీ వీళ్లిద్దరూ గంటలతరబడి ఎట్టా మాట్లాడుకుంటారో మాకైతే తెలిసేదే కాదు. నాగరాజు అన్న బాబు సానా ఇంటెలిజెంటని అందరి నోటమాటగా ఉండేది. నాగరాజు నాకు క్లోజ్ అయిండేది మాత్రం చింతకుంట వీధి వదలి కమాను వెనకాల కసెట్టి వాళ్లింటికాద చేరుకున్నప్పుడే. నాటకం అంతా తనే రాసినంతపని చేసి ...అబ్బా ఏం రాసిండావురా అన్నప్పుడు గానీ...అందరికీ డప్పుకొట్టి ఈడు నాటకం రాసిండాడు అన్నప్పుడు గానీ నేనేం అనలేక పోయిండాను. సరే అందులో నా ప్రమేయం రొవంతౖయెన ఉండాదిలే ఏం చేద్దాం ఈ నాగు నాకు పుసాటు పేరు వచ్చేలా చేసిండాడని గమ్మునుండిపోయాను.
అప్పటికే ఇంటర్‌లో నాకు ఈ రచనల పిచ్చి కొంచెం సురు అయింది. ఎట్టా పరిచయం అయ్యాడో విజయేంద్ర ప్రసాద్...వాడు కార్టూన్లు...పత్రికలకు ఉత్తరాలు...చిన్నచిన్న కతలు తెగ రాసేవాడు. ఓ రకంగా చెప్పాలంటే వాడో పెద్ద అయిస్కాంతంగాడు. ఒక్కసారి కలిస్తే చాలు ఎవరూ వదిలిపెట్టలేరు. అలాంటిది ప్రసాద్‌తో నా దోస్తీ చాలా తీవ్రస్థాయిలో ఉండేది. కాలేజీ క్లాసుల్ని ఎగ్గొట్టి...క్యాంటీన్లలోనో... హోటళ్లలోనో...మిద్దెపై ఉన్న వాడి రూములోనో కూర్చొని అదీ ఇదీ అంటూ కతలకు...ప్లాన్లు వేస్తుండేవాళ్లం. ప్రసాదు అంటే నాకు పిచ్చి పెరగడానికి మరో కారణం...వాడు రాసినవన్నీ పత్రికల్లో వచ్చేవి. ఓ రోజు ఉన్నట్టుండి ఏదో యువచర్చావేదిక అంటూ నలుగురి అభిప్రాయాలు రాసుకునిండాడు. నేనేదో వాగితే దాన్ని నాల్గుముక్కలుగా రాసి నా ఫొటోతో సహా ఆంధ్రభూమి వారపత్రికలో వచ్చేలా చేసిండాడు...ఇంకేముంది వాడికి ఫిదా అయిపోయిండాను. చివరికి పడుకోవడం...ఒకటికి...రెంటికి పోవడం మినహా మిగిలిన కాలమంతా నాతోనే గడిపేవాణ్ని. మేమిద్దరం జంటకవుల్లా తిరగడం అప్పట్లో ఊరు ఊరంతా అనుకునేవారు. అప్పట్లో సానామంది మిగిలిన నాదోస్తులు...రేయ్ కాస్త కాలేజీ కత కూడా చూసుకోరా సామీ...మర్యాద పోయేలా ఉండాది...అంటుంటే నేను ఆ మేం ఇట్టా తిరిగేది సయించక అంటుండారంతే అనుకునేవాణ్ని. గాలికి వాన జతయినట్టు....నాగరాజు తెలుగు సాహిత్యంపై నాతో రోజూ మాట్లాడ్డం సురు చేసుకోగానే...నా ప్రపంచమే మారిపోయిండాది. అప్పుడే వాడు యువచైతన్య వాహిని ప్రారంభించాడు. రాయడం అనే పిచ్చి ఉన్నోళ్లందరినీ జమవేసిండాడు. టీజీఎల్ హై స్కూలులో ప్రతి ఆదివారం అందరం కలుసుకునేవాళ్లం. కవితలు...కతలు రాసుకొచ్చినోళ్లందరూ ఆడ చదివి వినిపించేవారు. గెస్టుగా వచ్చిన పెద్దమనిషులు అందులో తప్పొప్పులు తేల్చి చెప్పేవాళ్లు. అంతటితో ఆగకుండా ఇద్దరం కల్సి ఏకాఎకిన నవల రాయాలని తీర్మానించుకునిండాము. రోజూ రైల్వే స్టేషను పట్టాలు పట్టుకుని నడుస్తూ ఎట్టా రాయాలా అని డిస్‌కసన్ పెట్టుకునేవాళ్లం. ఓసారి నేను వాడూ అట్టానే నడుస్తుంటే...ఓ కుక్క మనిసి తలపట్టుకుని ఊపుకుంటూ వస్తుండాది. ఇంక అంతే వెంటనే మీటింగ్ బంద్ చేసి ఇంటికి జారుకునిండాము. మా ఇద్దర్ని రాయడం అనేది బలే కలిపేసిండాది.
.నాగరాజు..నేను..డ్రామా ...ఈటి ఎనకాల ఇంత కత ఉండాది. చివరికి కిందామీదా పడి పూర్తి చేసిండాము. నీ ప్రయత్నమే ఎక్కువుండాది కాబట్టి నువ్వే ఇది రాసినట్టు....అంటుంటే ఆ పోనీలే ఏమైతే అదవుతుందని నాకు నేను సర్దిచెప్పునిండాను. ఈ నాటకానికి పేరు మాత్రం వాడే డిసైడు చేసిండాడు. ఈ సినిమా ఆపేయండి అని పెడదాం కొత్తగా ఉంటుంది అని. నాకు అదే బాగనిపించింది. సినిమాల్లో కతలు సరిగా ఉండటం లేదు...సినిమా కేవలం వినోదమే కాదు...అంతో ఇంతో సమాజానికి మేలు సేయాలని నాటకం ఇతివృత్తం. యువ రచయిత సినిమా కత రాయాలనుకున్నప్పుడు అందులో ఒక్కో పాత్ర వచ్చి ఇలా రాయి...అలా రాయి...అని వాడితో మాట్లాడతుంది. చివరికి నిర్మాత...డైరెట్రు ఛీ...ఇది సినిమా కత కాదు అంటూ ప్రేక్షకులు మొహంపై కొడతారు ఇలా తీస్తే అంటుంటే...ఆ ప్రేక్షకుడే వచ్చి ఇలాంటి సినిమాలు మమేమీ తీయమనలేదు...ఆపేయండి అంటాడు. బద్రీ,నాగరాజు, నేను, సుధీ మరికొందరు ఇందులో వేషం వేసేందుకు రెడీ అయిండాము. నేను రచయిత అవతారం ఎత్తాల్సి వచ్చింది. నాగరాజేమో అరవ యాసలో మాటాడే ప్రొడ్యూసర్. పనిచేసేవాడి పాత్రలో బద్రీగాడు. వాడు అప్పటికే పెద్ద తోపుగాడు. కాలేజీ లైబ్రెరీ సారు సుబ్రమణ్యం, నర్సిమ్ములు సార్ల జట్టులో నాటకాలు వేసేవాడు. సుబ్రమణ్యం సారుకు నాటకాలంటే మామూలు పిచ్చి కాదు. యండమూరి కుక్క, రుద్రవీణల్ని రోటరీక్లబ్ స్టేజిపై వేసి ఊరిని ఊపేసిండారు. ఇంక ప్రాణేశ వాళ్ల అన్న మంచి నటుడిగా పేరుంది. వీళ్ల మధ్యన ఏబీసీడీలు రాని నేను.
నాటకాన్ని సుబ్రమణ్యం సారు చూసి ఓకే చేసినాంక...కాలేజీ కల్చరల్ వాళ్లకి మా పేర్లు ఇచ్చిండాము. వాళ్లు ఆడ రచ్చ చేసిండారు...మీరు రాసింది ఎట్టా వేస్తారు...పేరున్నోళ్లది వేస్తే బాగుంటుందని. ఈ విషయంలో తెలుగు లెక్చరర్ మరేగౌడ సారు ‘సూడండప్పా మరి వాల్లంతా అట్లన్నాక...’ అంటుంటే మేం అదెట్టా కుదురుతుంది సార్..సుబ్రమణ్యం సారు కూడా ఒప్పుకునిండాడు. బాగుండాదంటున్నాడు. చాన్సు ఇచ్చితీరాలా అని మొండికేసుకునిండాము. ‘అయ్...ఆ సారు బాగుందంటే ఇంక వద్దనేదెవరు...’ అని మరేగౌడ సారు తీర్పిచ్చినాంక లైను క్లియరయిండాది. ఇంక అప్పట్నుంచి రిహార్సల్సు మొదలు. ఎప్పుడు సందు దొరికితే అప్పుడు..కాలేజైతే కాలేజీ ఇంటి ముందైతే ఇంటి ముందు జోరుగా రిహార్సల్సే రిహార్సల్సు! దీంతోపాటు టంచనుగా రోజూ రాత్రి 9గంటలకు విశ్వహిండూపరిషత్తు ఆఫీసులో ఇదే పనే! అందరికీ మాటలు చెప్పీ చెప్పీ ...నాగరాజుకు నాకూ నాటకం నోటికొచ్చేసిండాది. అన్నీ సరే గానీ చివర్లో వచ్చే ప్రేక్షక పాత్రకు ఎవరైతే బాగుంటారో అని సానామందిని పరిశీలించిండాము. ఒక్కరూ సెట్ కాలేదు. దీనికింత రామాయణం ఎందుకంటే...చివర్లో ఈ ప్రేక్షకుడు జనం మధ్యలోంచి ‘ఆపేయండి...’ అని అరుసుకుంటూ పైకి రావాల. ఆయప్ప అట్టా వస్తాడని ఎవరికీ తెలియకూడదదు. అందుకే డ్రామాలో ఆ పాత్ర ఉండాదని ఎవరికీ చెప్పలేదు. సీక్రెట్‌గానే ఉంచిండాము. నా వరకు చివర్లో అట్టా స్టేజి పైకి వస్తేనే ఈ డ్రామా సక్సస్ అయ్యేదనిపించింది. ఒకటి రెండ్రోజులంటే పర్వాలేదు. కానీ రోజూ రాత్రి డ్రామాకోసం కలిసేదంటే ఇబ్బందే కదా. నేనైతే ఇంట్లో ఈ విషయమే చెప్పలేదు. మిద్దెపైనే పడుకునే వాణ్ని కాబట్టి రాత్రి ఈ పని చేస్తున్నట్టు నాన్నకి తెలిసేది కాదు. అమ్మ మాత్రం ఏందిరా రోజూ రాత్రి ఇట్టా రోడ్లు పట్టుకుని తిరుగాడుతుంటే ఏమైనా బాగుంటాదా నీవే ఆలోచించు...అన్నా అవేవి చెవికెక్కేవి కాదు. ఈ నాటకం ఎట్టా ఉంటుందో...అని చాలా ఉత్సాహంగా ఉండేది. నా కాలేజీ దోస్తులందరూ ఏందిరా కాలేజీ డేకి డ్రామా వేస్తుండారంటా...నిజమేనా అంటుంటే చెప్పలేనంతా మజా. నాగరాజు పట్టుబట్టి డైలాగులు అందరికీ నేర్పించేవాడు. బద్రిగాడు...పనివాడి డైలాగులు బలే చెప్పేవాడు...‘అణ గారిన జాతి అగ్గిలా లేస్తుందని చెప్పు దొరా...’ అంటూ ఎన్ని సార్లు అన్నా... అన్ని సార్లూ నాకు వెంట్రుకలు నిక్కబొడుచుకునేవి. ప్రాణేశ చెప్పాల్సిన అవసరమే లేదు. కాలేజీడే నాల్గురోజు లుందనంగా ...సుధిగాడు కనిపించాడు. గాయత్రి డాక్టరు క్లినిక్ వెనకాల వాళ్లిల్లు. నాగరాజు, నేను ఓకే చేసినాంక...వాడు కూడా రిహార్సల్సుకు వచ్చాడు. డైలాగులవీ బాగానే చెప్పేవాడు కానీ మా టెన్షన్ అంతా తన కేరెక్టర్ ఎక్కడ లీక్ చేస్తాడో అని. అందుకే వాణ్ని రేయ్ సామీ అసలు నువ్వీ నాటకం వేస్తున్నట్టే ఎవరికీ చెప్పరాదు అని కండిసన్ పెట్టినాంకే జట్టులోకి పిలుచుకునిండాము.
కాలేజీ డే సాయంత్రం మా జట్టోళ్లందరికీ ఒకటే గాబరా...మాలో చాలా మంది స్టేజి ఎక్కి ఎరుగరు. పైగా ఆ కంగారులో డైలాగులు మర్సిపోతే ఇజ్జత్ ఢమాలే! ఈ డ్రామాలేందిరా అని అమ్మ ఎన్నితిట్లు తిట్టినా...కమానులో కొందర్ని వెంటేసుకుని డ్రామా చూసేకి వచ్చిండాదని మా ఫ్రెండు వచ్చి చెబితే నా టెన్షన్ ఇంకా పెరిగిపోయిండాది. లోపల సుబ్రమణ్యం సారు ఆధ్వర్యంలో అందరూ ముఖానికి రంగు పూసుకుంటుంటే...అప్పుడే పిడుగులాంటి సమాచారం...మన ప్రేక్షకుడు సుధికి ఎవరితోనో గొడవైందని. చచ్చాంరా దేవుడా అనుకున్నాం. ఒక్కసారి గాలి తీసేసినట్టయ్యిండాది. ఈ డ్రామాలో ఏదైతే ఉండి తీరాలని కలలు కనిండామో...దానికే ఎసరు పెట్టిండాడు సుధిగాడు. అయినా నాటకం పెట్టుకుని వీడు గొడవెందుకు పెట్టుకునిండాడు? అంటూ తలపట్టుకుంటే...నాగరాజు మరికొందరు పోతే పోయింది ...ఆ పాత్ర లేదనుకునుందాం. మిగిలిందంతా వేద్దామని ధైర్యం చెప్పిండారు. సరే ఏదైతే అదయ్యిండాది...ఇంత దూరం వచ్చినాంక తగ్గేది ఎవ్రుకీ మంచిది కాదనుకునిండాము. నాటకం సురు అయిండాది. స్టేజిపైకి మేము కనిపించగానే ఒకటే ఈలలు కేకలు...మా ఫ్రెండ్సు రెచ్చిపోతుండారు. స్టేజి పక్కనున్న సుబ్రమణ్యం సారు...ఏందిరా మీ దోస్తులు...ఆ అరుపులేంది...నాటకం చూసేకి వచ్చిండారా...ఎగిరేకి వచ్చిండారా అని అంటుంటే...మేం పోన్లే సారు కాలేజీ డే కదా సర్దుకోండి అంటూ మా వంతు రాగానే మళ్లీ స్టేజెపైకి పోయేవాళ్లం. ఇంక అంతా ముగుస్తుందనంగా
‘ఆపండి...’ అంటూ సుధిగాడు జనం మధ్యలోంచి వేగంగా స్టేజి ఎక్కిండాడు. జనాలు అందరూ తలలు తిప్పి వాడి వంక సూస్తునే ఉండారు. ఒక్కక్షణం నిశ్శబ్దం...అంతే ఇంక సూస్కోండి అదిరిపోయేలా చప్పట్లు ఈలలు..కేకలు వేస్తునే ఉన్నారు. వాడు పైకి వచ్చి ధనాధనా డైలాగులు దంచికొట్టిండాడు. తుస్ అవుతుందనుకున్న డ్రామా ఈ సీన్‌తో సూపర్ సక్సస్ అయిండాది. డ్రామా పూర్తయిందో లేదో...పక్కనే ఉన్న సుబ్రమణ్యం సారు మమ్మల్ని గాఠిగా పట్టేసుకుని...అబ్బబ్బా ఏం చేసిండార్రా అని ఒకటే పొగడ్డం. నేనైతే ఇది నిజమా అని పదిసార్లు గిచ్చి చూస్కునిండాను. ఈ డ్రామా అయినాంక ఉంటాది ఆ సుధిగాడి పని అని పండ్లు నూరుకున్న మేమే ...వాణ్నే పైకిఎత్తేసి...వార్నీ ఏమొచ్చిండావు...ఏం డైలాగులు దంచిండావురా’ అంటుంటే వాడు కాలెగరేసుకుని నవ్విండాడు.
ఏందిరా సుధిగా ఇట్టా సేసిండావు. కాద్రా ఈడ నాటకం పెట్టునిండాము...నువ్వేమో గలాటలు సేసుకుంటే ఎట్టా? మాకైతే ఎంత టెన్షన్ అయిండాదో తెల్సా...పోన్లే సామీ చివర్లో వచ్చిండావు...నీకో టెంకాయ కొట్టాల అంటుంటే ..వాడు నవ్వడం తప్ప మరేం చేయలేదు. ఈ నాటకంతో మా గుంపు లెవల్ యాడనో వెళ్లిపోయిండాది. నాగరాజు పుణ్యమా అని నాటకం రాసిన నాకు బోల్డెంత పేరు. అయితే అప్పుడే మరో విషయం కూడా ఇంట్లో వాళ్లకి అర్థమయ్యిండాది...ఈడు బాగా దారి తప్పిండాడు...సదువు సంతకెళ్లినట్టే...డిగ్రీ గట్టెక్కితే సాలు ...అదే వీడు సేసుకున్న పుణ్యం అని!!
అసలు నాకు ఈ డ్రామా పురుగు ఎక్కించిండేది పాతూరి నాగరాజు. మేమిద్దరం కూర్చుని అదీ ఇదీ మాట్లాడు కుంటున్నప్పుడు వాడు ఉన్నట్టుండి...కాలేజీడేకి డ్రామా వేయాలి...నువ్వు రాయి అనిండాడు. డ్రామానా నేనేడ రాసేదిరా నాయనా అనుకునిండాను. కానీ పైకి మాత్రం చూద్దాం అని ఊరుకున్నా. ఇంక వాడు వదిలిపెట్టలేదు. మూడు నాల్గు రోజులయ్యాక మళ్లీ సురు చేసుకునిండాడు...డ్రామా రాద్దామా అని. నాకు ఇదేదో నెత్తిపైకి వచ్చేలా ఉండాదనుకుని ...లేదులేరా నాగరాజు నావల్ల కాదు గానీ వదిలెయ్...పోనీ నువ్వే రాయొచ్చు కడా అని ఎదురు తిరుక్కొనిండాను. వాడు నవ్వుతూ...నేను రాయలేక కాదులే గానీ నువ్వే రాయాలి. రాస్తావు...అదీ సూపర్‌గా ఉంటుందిలే అని...అనిండాడు. నాగరాజు ఇట్టా ఎందుకినాలా? అంటే నా కాడ బదులు లేదు గానీ ఎందుకో వాడు ఏది చెప్పినా నాకు బలేగా ఉండేది. తెలుగులో వాడి ఆసక్తి నాకు చాలా ఇస్టం. చాలా చురుకుగా ఉండేవాడు. నాగరాజు వాళ్లు మొదట్లో మా పక్కన చింతకుంట గేరిలో ఉండేవాళ్లు. చింతకుంట మధు వాళ్లింట్లో. నాగరాజు వాళ్ల నాన్న సీతారామాంజనేయులు సారు మునిసిపల్ పెద్దస్కూలులో తెలుగుపండిట్. వాళ్లమ్మ వరలక్ష్మమ్మ మా పిలగాళ్లని చాలా చక్కగా పలకరించేది. అసలు వరలక్ష్మమ్మ వాళ్లిల్లు అంటేనే అందరూ గుర్తుపట్టేవాళ్లు. చింతకుంట మధు వాళ్లమ్మ... సరజోమ్మకు తెలుగు అంతంతే ...వరలక్ష్మమ్మకు కన్నడం అంతంతే ... కానీ వీళ్లిద్దరూ గంటలతరబడి ఎట్టా మాట్లాడుకుంటారో మాకైతే తెలిసేదే కాదు. నాగరాజు అన్న బాబు సానా ఇంటెలిజెంటని అందరి నోటమాటగా ఉండేది. నాగరాజు నాకు క్లోజ్ అయిండేది మాత్రం చింతకుంట వీధి వదలి కమాను వెనకాల కసెట్టి వాళ్లింటికాద చేరుకున్నప్పుడే. నాటకం అంతా తనే రాసినంతపని చేసి ...అబ్బా ఏం రాసిండావురా అన్నప్పుడు గానీ...అందరికీ డప్పుకొట్టి ఈడు నాటకం రాసిండాడు అన్నప్పుడు గానీ నేనేం అనలేక పోయిండాను. సరే అందులో నా ప్రమేయం రొవంతౖయెన ఉండాదిలే ఏం చేద్దాం ఈ నాగు నాకు పుసాటు పేరు వచ్చేలా చేసిండాడని గమ్మునుండిపోయాను.
అప్పటికే ఇంటర్‌లో నాకు ఈ రచనల పిచ్చి కొంచెం సురు అయింది. ఎట్టా పరిచయం అయ్యాడో విజయేంద్ర ప్రసాద్...వాడు కార్టూన్లు...పత్రికలకు ఉత్తరాలు...చిన్నచిన్న కతలు తెగ రాసేవాడు. ఓ రకంగా చెప్పాలంటే వాడో పెద్ద అయిస్కాంతంగాడు. ఒక్కసారి కలిస్తే చాలు ఎవరూ వదిలిపెట్టలేరు. అలాంటిది ప్రసాద్‌తో నా దోస్తీ చాలా తీవ్రస్థాయిలో ఉండేది. కాలేజీ క్లాసుల్ని ఎగ్గొట్టి...క్యాంటీన్లలోనో...