‘ఇప్పుడే ఆరయితా ఉండాది...ఈ మహాతల్లి ఎప్పుడు లేస్తుందో...ఏం వేస్తుందో...’లోపలికి...బైటికీ తడవకోమారు కాలుగాలిన పిల్లిలా అమ్మ తిరుగుతుండానే ఉండాది. పొద్దున్నే లేసి...ఇంటిముందు అంతా ఊడ్సి...పేడలికి ముగ్గులేసేకి సిద్ధం చేసింది. రాత్రే పాలుపోసే మంగమ్మ ఇంట్లోంచి పేడ తెచ్చుకుని చిన్న చిన్న గొబ్బెమలు చేసి...దానిపై ఉంచాల్సిన పూలు,,గుమ్మడికాయ ముక్కలు అంతా రెడీ. ఇంక ముగ్గొకటే బాకీ! అయితే ఆడనే అంతా స్లోమోషన్ అయిపోతుండాది. రాత్రి నుంచే పొద్దున్నే ముగ్గేయాలా...అంటూ సాధ్యమైనంత సౌమ్యంగా చెబుతూ వస్తునే ఉంది. అయితే ఎప్పట్లాగే పొద్దెక్కిపోతున్నా...మా ఇంటి ముందు ఇంకా ముగ్గు మొదలే కాలేదు.
చాలా ఇండ్ల ముందు ముగ్గులు మొగ్గవిచ్చుకుంటున్నాయి. కొందరైతే తెల్లారుజామున నాల్గుగంటలకే లేచి ఇంటిముందు బల్బులు పెట్టుకుని మరీ ముగ్గులేస్తుండారు. పుస్తకంలో రాసుకున్న చుక్కలు లెక్కలు సరిచూసుకుంటూ...తప్పు పోతుంటే వేలితో చెరిపేస్తూ కొందరు.. పసుపు, కుంకుమతో రంగులు నింపే పనిలో కొందరు. అందరూ బిజీ...బిజీ. డ్రాయింగు పరీక్షలో పిల్లల్లెక్కన సీరియస్‌గా ముగ్గుల పనిలో పడిండారు. అమ్మ మటుకు టెన్షన్ పడే పనిలో ఉంది. నెల్రోజుల్నుంచి అక్క రకరకాల ముగ్గులు ప్రాక్టీసు చేసుకుని ...ఈ రోజు వీధిలో దింపేకి సిద్ధమైందని అనుకుంటుంటే... ఆయమ్మ మటుకు కప్పుకొన్న దుప్పటి తీయకుండా ఉంటే ఎవ్రుకి టెన్షన్ ఉండదు.
ఏడాది పొడుగునా ఏ రోజు కూడా ఇంటి ముందు ఏముందో కూడా చూడని అక్క...సంక్రాంతి వస్తేమటుకు చేతిలో కప్పు పట్టుకుని రెడీ అయిపోతుంది. అమ్మ కూడా ఆమెను దినామూ ముగ్గులేయమని అడగదు. అసలు ఇంట్లో బండెడు పనులో ్లమునిగి సస్తుంటే.. రోజూ ఇంటిముందు అందంగా ముగ్గులేసేంత ఓపికా...తీరికా ఎవరికి ఉంటుంది. పొద్దున్న లేయంగానే బరబరా కసువు నూకి...ఇనుప బకెట్లోంచి ప్లాస్టిక్ చెంబులో నీళ్లు రప్ రప్ అంటూ కొట్టడం... రెండు గీతలు ముగ్గుపిండితో లాగడం. మా ఇంట్లో పని ఇంక సురువయిండాదని చెప్పకనే చెప్పేందుకే ముగ్గేయడం! అందుకే ఎవరింటి ముందైనా...పొద్దెక్కినా నీళ్లు చల్లకుంటే...ఏమక్కా సానా లేటయినట్టుండాది. పనులు సురు చేసుకోలేదా అని అడగడం ఖాయం. ఇంతకు మించి ముగ్గుకు పెద్ద ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. కానీ సంక్రాంతి వస్తుందంటే మటుకు మా కమానులో ఓ నెల ముందునుంచే ముగ్గుల దుకాణం మొదలయితాది. దేవుడి మంటపం పక్కన గూడులో దాచిన పాత ముగ్గుల పుస్తకం అప్పుడే బైటికొచ్చేది. అక్క...విశాలాక్షమ్మక్క కూతురు శకుంతల... పార్వతమ్మక్క ..ప్రతి రోజూ ఈ ముగ్గులు ప్రాక్టీసు చేస్తూ...ఎవరైనా కొత్తవి తెస్తారేమోనని చూసేవారు. పాత ముగ్గుల పుస్తకంలోని ముగ్గులే ప్రతీ సారీ ఏసేందుకు నామోషీ అనుకునే వారు. ఆంధ్రప్రభ... పత్రిక... ఆంధ్రభూమి వారపత్రికల్లో ముగ్గులున్నాయని తెలిస్తే ఎట్టాగోలా ఆ బుక్కులు తెచ్చుకుని చుక్కల లెక్కలు తేల్చేవారు. ‘అది చూసిండారా 21 చుక్కలు..ఇదేమో 17చుక్కలు... ఇన్ని వరసలు...1 వచ్చేదాకా వేయాలి...’పక్కనోళ్లు తలలు పట్టుకున్నా అర్థం కానీ ముగ్గల భాషలో మాట్లాడుకునేది కేవలం ఈ పండగ రోజుల్లోనే!
అందరూ కల్సి చర్చించుకున్నా...ఎవరి ప్రాక్టీసు వారిదే! అక్క ఈ విషయంలో సానా హుషారు. ఎక్కువగా మాట్లాడకుండా...చివరాఖర్న ఏదో కొత్త ముగ్గు దిగేలా ప్లాన్లు వేసేది. అయితే ఎవరికి వాళ్లు రహస్యంగానే వ్యవహారం నడపడంతో...ఏ ఇంటి ముందు ఏ ముగ్గు మెరుస్తుందో ...సస్పెన్స్ సినిమాలా భలే మజా ఇచ్చేది. అక్కకు ఈ తెలివితేటలుండాయి కాబట్టే ఈ నెల్రోజులు ఆమెకు ఎక్కడ్లేని మర్యాదలు దక్కేవి. మామూలు రోజుల్లో అయితే నానారకాలు సాధిస్తూ ‘చదువుకుంటుం డామంటే...పనులు చేయొద్దని కాదుకదా...’ ‘ఏనాడైనా కసువు ఊడ్సిండావా...అంతా నేనేకదా చేస్కోవల్సింది...నా ప్రాణానికొచ్చిండాది’ ‘ఇట్టాగే సేయి...పోయినోళ్లింట్లో మర్యాద చేస్తారు’ రకరకాలుగా సాధిస్తున్నా..అక్క నోటివెంట ఒక్కమాట వస్తే ఒట్టు! అనీ అనీ విసిగిపోయిన అమ్మ ‘నేనిట్టా వడవడా వాగుతుండాను..ఏమైనా పట్టిందా..ఎట్టుందో చూడు ’ అంటున్నా సరే అక్కనోటివెంట మాట ఊడిపడదు అంతే! అయితే సంక్రాంతి సమీపిస్తుండాదంటే సాలు వాతావరణంలో మార్పులు. తిట్లు బాగా తగ్గిపోతాయి. అయినదానికీ ...కానీదానికీ అక్కను మెచ్చింది మెచ్చిందే! ఆమె అప్పుడు కూడా నోరు తెరిచేది కాదు.
పండగ దగ్గరయ్యేంత దాకా బరిలో దింపే పందెం కోడిని బాగా చూసుకున్నా...అదెక్కడ సరిగా ఆడదో అన్న గాబరా కూడా ఉంటాది కదా! ఈడ కూడా అంతే! నెల్నాళ్లు నోరెత్తి ఓ మాట అనకుండా ...నడుములు విరిగేలా పనులు తనే సేసుకుంటున్న అమ్మకి ఒకటే ఆశ...ఇంటి ముందు ముగ్గు బాగుండాలి...కళకళలాడి పోవాలి అని! కమానులో అందరూ కళ్లింత చేసుకుని...ముక్కుపై వేలేసుకుని చూడాలి అదీ ఆమె లెక్క! అక్క కూడా ప్రతిసారీ అంచనాలకు మించే ముగ్గులు వేసేది. రంగంలో దిగేంతదాకే నిదానం. ఒక్కసారి ముగ్గు కప్పు పట్టుకు నిండాదంతే అంతే. ముగ్గుల్లో నింపేకి రంగుల్ని తయారు చేసేటపుడు మాత్రం నేనే కలుపుతానని గొడవ చేసటోణ్ని. పసువు... కుంకుమ... ఎరుపు... వంకా య... పసుపు రంగుల్ని ముగ్గుల్లో కలిపి సిద్ధం చేసేవాళ్లం. కమాను వెనకాల నగరేశ్వర గుడి కాడ ముగ్గుల రంగులు చిన్న చిన్నప్లాస్టిక్ ప్యాకెట్లలో అమ్మేవాళ్లు. మరికొన్ని అంగళ్లలో ఇనుప గంపల్లో రాసి పోసి తులం...గ్రాముల లెక్క తూచి పేపరు పొట్లం కట్టిచేవాళ్లు . ఎగస్ట్రాగా దగదగా మెరిసే చెమ్కీరవలు తేవాల్సిందే! రంగుల్ని నింపాక...వాటిపై చెమ్కీరవలు వేసేవాళ్లం. ముగ్గు లైన్లు గీసేవరకే అక్క పని. ఆ తర్వాత రంగులు నింపేపని మాకు అప్పగించేది.
ఆమె ఇంత హడావుడి చేస్తుంది కాబట్టే అమ్మ భయంకరంగా వేడుకుని ముగ్గులోకి దింపేది. కప్పుకున్న దుప్పటి మెల్లగా తీసి..లేచాక ముఖం కడుక్కొని బైటకొచ్చిన అక్క మొదట చట్టుపక్కల ముంగిళ్లు నింపాదిగా చూసేది. అంటే ఆటగాడు తన ఆట సురు చేసుకునే ముందు చూసినట్టన్నమాటా! శకుంతలక్క అప్పుడే సగం దాకా వచ్చేసిందని...సీతమ్మ కక్కి ముగ్గు వేసేసి ఇంట్లోకి వెళ్లిపోయింని, పార్వతమ్మక్క కూడా ముగ్గులేసి రంగులు కూడా నింపేసిందని...సాటి పోటీదారుల పరిస్థితిని కళ్లకు కట్టినట్టు అమ్మ చెప్పినాంక అక్క... సరే చూద్దాం. మళ్లీ బాగా రాలేదని అనొద్దు మరి...అంటూ వార్నింగులు ఇచ్చుకుంటూనే పనిలోకి దిగేది. ముగ్గు వేశాక... అటూ ఓసారి...ఇటు ఓసారి తిరిగి చివరికి తృప్తిగా తలాడిస్తూ వెళ్లిపోయేది. ఆమె అటు వెళ్లిందో లేదో...వంటింట్లోంచి బైటకొచ్చిన అమ్మ ముగ్గు ఎగాదిగా చూసి...అప్పుడే లొపలికెళితే ఎలా? ఓ సారి ఇలా రా అని పిలిచేసరికి ‘అంతా అయ్యింది కదా మళ్లీ ఏమొచ్చింది?’ విసుక్కొంటున్న అక్కను ‘మరి హ్యాపీ పొంగల్’ రాయాలి కదా అనేది. అబ్బా నేనింకా ఏం చెడిపోయిందో అని కంగారు పడ్డాను....అంటూ వెళ్లి హ్యాపీ పొంగల్ అని రాసేసింది. అది రాస్తే తప్ప అమ్మకు తృప్తి ఉండదు. అదీ ఇంగ్లిష్‌లోనే రాయాలి.
ఇండ్ల ముందర ఎవ్రు ముగ్గుతో నిల్సున్నా...పక్కనున్నోళ్లు మూగేసేవాళ్లు. ఒక్కోసారి పెద్దముగ్గు అయితే...కనీసం నలుగురైదుగురు పక్కన నిలబడి ఆసక్తిగా చూస్తుండేవారు. అదెట్లా...ఇదెట్లా...ఎన్ని చుక్కలు...రకరకాల సందేహాలు తీర్చుకోవడంతోపాటు...ఆడ పువ్వు ఇంకా సరిగా రాలేదు సూడు...శంఖు కొస ఇంకా సన్నగా ఉండాల అంటూ రన్నింగ్ కామెంట్రీలు. ముగ్గు బాగా వచ్చిందంటే సగం సంక్రాంతి పూర్తయినట్టే! మా ఇంటి ముందే కాదు, అందరి ఇంటి ముందర దాదాపు ఇదే సీను రిపీటవుతుంటది. ‘అబ్బా బలే ఏసిండావే...ఎంతైనా శాంతమ్మక్కకేం...కూతురిందికదా ఏసి పెట్టేకి...’ అంటూ పొగిడే వాళ్లే పక్కకు వెళ్లినాంక ‘అంతేమీ బాగా రాలేదు కదా...ఆ ఎందుకొచ్చిన ఇరకాటం...బాగుంది అంటే మా సొమ్మేమన్నా పోతుందా...’ అనుకునే వారు. మేం కూడా తక్కువేం తినలేదు. గేరిలో విశాలాక్షమ్మ ఇల్లు మొదలు...బసమ్మక్క వాళ్లింటి దాకా...మళ్లా ఆడ నుంచి పార్వతమ్మక్క వాళ్లింటి దాకా వేసిన ప్రతి ముగ్గుపై మీటింగులు పెట్టి పెట్టి మాట్లాడుకోవాల్సిందే! అసలు ముగ్గులేయడం కన్నా...అవి ఎలా వేయాలి...ఎలా వేస్తే బాగుంటుంది...ఎవరైనా అనుకుంటుండారా...ఈ కతే సానా ఎక్కువగా ఉండేది. ఓ వైపు ఇది నడుస్తుంటే కమానుపిల్లలందరి చింతకుంట...కుంబార వీధి...బెళ్లుళ్లి ఓణి...అన్ని చోట్లా తిరిగి... యాడాడ ముగ్గులు బాగుండాయి...ఏమేం ముగ్గులేశారో తెల్సుకుని వచ్చి సమాచారం అందించేవాళ్లం. అర్ధరాత్రి దాటాకా లైట్లు వేసుకుని ముగ్గులేసిండేటోళ్లు...తెల్లారే వేసినోళ్లు...సమాచారం అంతా పక్కా సేకరించి ఇండ్లకొచ్చి ఊదేవాళ్లం. పొద్దున్నపొద్దున్నే గేర్లంబడి పడి తిరుగుతున్నా...ఈ మాటలేవో మోసుకొస్తుండాం కాబట్టి ఏం అనేవాళ్లు కాదు. ఆ వీధిలో సానా బాగుండాది అని చెబితే మాత్రం... ఇంక సాలుగానీ సదువుకో! తిరుగుడు సానా ఎక్కుయిండాది అని విసుక్కునేవాళ్లు.
ముగ్గులు తర్వాత సంక్రాంతి స్పెషల్ అంటే పొంగల్. మామూలుగా పండగలంటే తాకతు..ఒంట్లో ఓపికను బట్టి పిండి వంటలుంటాఇ. కానీ సంక్రాంతిలో మాత్రం అందరిళ్లల్లో పొంగలే! భోగీ రోజున సజ్జరొట్టెలు...గుత్తొంకాయ తప్పనిసరి. అమ్మ పొయ్యి ముందు కూర్చొని సజ్జరొట్టెలు చేస్తూ...కొన్ని పొయ్యి వెనకాల వేసేది. ఆ వేడికి అవి కరకరలాడుతూ...అప్పడాల్లా తయారయ్యేవి. అంటే డబల్‌రోస్ట్ రొట్టెలన్నమాట! నాన్న ఇలా కరకరలాడే సజ్జరొట్టెలంటే సానా ఇష్టం. అందుకే అమ్మ సజ్జరొట్టెలు చేస్తే మటుకు పొయ్యి వెనకాల కొన్ని తప్పనిసరిగా ఉండేలా చూసుకునేది. రొట్టెకి తీపిగా బర్త అని చేసేది. గుమ్మడి కాయల్ని బెల్లంతో కలిపి చేసే వంటకమే బర్త! బోగీ...సంక్రాంతి తర్వాత కరి అని చేసేవాళ్లం. ఆ రోజు తప్పనిసరిగా ఏదైనా వేపుడు ఉండాలి...కర్రీ కావచ్చు లేదా బజ్జీల...బోండలు ఏదైనా ఆ రోజు నూనె వంటకం తప్పనిసరి.
పండగ సాయంత్రం పిల్లలకు పండ్లు పోయడం... నువ్వులు బెల్లం కలిపి ...కనిపించిన ప్రతి ఒక్కరికీ ఇవ్వడం ప్రధాన కార్యక్రమాలు. ఊర్కే ఇవ్వడం కాదు..నువ్వులు బెల్లం తిని...తీయతీయగా మాట్లాడు అనాలి. రాన్రానూ..ఈ ఎళ్లుబెల్లం మిశ్రమంలో కలిపే వస్తువుల సంఖ్య పెరిగింది. జీరంగి పప్పరమెంట్లు...జీడిపప్పు పలకలు. ఆ తార్వత పండ్లుపోసే కార్యక్రమం చాలా ఇండ్లల్లో ఉండేవి. చుట్టుపక్కల ఏ ఇండ్లల్లో పిల్లలకు పండ్లుపోస్తారో మొదటే తెలుసుకుని...టంచనుగా ఆ టయానికి అక్కడ వాలిపోయేవాళ్లం. బారేపండ్లు..చెరుకు ముక్కలు...జీరంగి పిప్పరమెంట్లే కాకుండా... పైసలు కూడా కలిపి పోసేవాళ్లు. మా ఆరాటం...పోరాటం అంతా పిప్పరమెంటు...పైసల కోసమే! పండ్లు పోసేది తడవు ఒకరిపై ఒకరుపడుతూ లేస్తూ...పైసల కోసం వెదుక్కొనేవాళ్లం. అప్పటిదాకా ఏమీ అనని కొందరు ఇంటిపెద్దోళ్లు ...‘రేయ్ ఇంక సాలుగానీ ఇండ్లకు పాండి...ఉద్దర దొరుకుతుందంటే సాలు...వచ్చిడిస్తారు కరబేతి నాయాళ్లు అంటూ అరుస్తుంటే...పైసలు దొరకపుచ్చుకుని. .నిక్కర్లు దులిపేసుకుంటూ పరుగో పరుగు!!
స్వీట్లు మస్తుగా తినొచ్చని సంక్రాంతి కోసం మేం ఎదురు చూస్తే...అక్క...ఆమె ఫ్రెండ్సు మాత్రం తమ టాలెంటు చూపేకి కాచుక్కూర్చునేవారు. పోయిన సారి కన్నా బాగుండాలి...కొత్తగా ఉండాలి..అని నెలముందునుంచే ముగ్గుల్లో మునిగితేలేవారు. అమ్మకూడా ...మాట్లాడితే ముత్యాలు పడిపోతాయేమో అన్నట్టుండే అక్కను ఎట్టా బతిమాలాలో ప్లాన్లు వేసుకోవల్సి వచ్చేది. ఏడాది పొడుగునా ఎన్ని తిట్లు తిట్టినా...ఎంత విసుక్కున్నా... సంక్రాంతి వచ్చిందంటే మాత్రం అమ్మ దృష్టిలో మా అక్క...అశ్వినీ నాచప్పే!!
అందరూ కల్సి చర్చించుకున్నా...ఎవరి ప్రాక్టీసు వారిదే! అక్క ఈ విషయంలో సానా హుషారు. ఎక్కువగా మాట్లాడకుండా...చివరాఖర్న ఏదో కొత్త ముగ్గు దిగేలా ప్లాన్లు వేసేది. అయితే ఎవరికి వాళ్లు రహస్యంగానే వ్యవహారం నడపడంతో...ఏ ఇంటి ముందు ఏ ముగ్గు మెరుస్తుందో ...సస్పెన్స్ సినిమాలా భలే మజా ఇచ్చేది. అక్కకు ఈ తెలివితేటలుండాయి కాబట్టే ఈ నెల్రోజులు ఆమెకు ఎక్కడ్లేని మర్యాదలు దక్కేవి. మామూలు రోజుల్లో అయితే నానారకాలు సాధిస్తూ ‘చదువుకుంటుం డామంటే...పనులు చేయొద్దని కాదుకదా...’ ‘ఏనాడైనా కసువు ఊడ్సిండావా...అంతా నేనేకదా చేస్కోవల్సింది...నా ప్రాణానికొచ్చిండాది’ ‘ఇట్టాగే సేయి...పోయినోళ్లింట్లో మర్యాద చేస్తారు’ రకరకాలుగా సాధిస్తున్నా..అక్క నోటివెంట ఒక్కమాట వస్తే ఒట్టు! అనీ అనీ విసిగిపోయిన అమ్మ ‘నేనిట్టా వడవడా వాగుతుండాను..ఏమైనా పట్టిందా..ఎట్టుందో చూడు ’ అంటున్నా సరే అక్కనోటివెంట మాట ఊడిపడదు అంతే! అయితే సంక్రాంతి సమీపిస్తుండాదంటే సాలు వాతావరణంలో మార్పులు. తిట్లు బాగా తగ్గిపోతాయి. అయినదానికీ ...కానీదానికీ అక్కను మెచ్చింది మెచ్చిందే! ఆమె అప్పుడు కూడా నోరు తెరిచేది కాదు.
పండగ దగ్గరయ్యేంత దాకా బరిలో దింపే పందెం కోడిని బాగా చూసుకున్నా...అదెక్కడ సరిగా ఆడదో అన్న గాబరా కూడా ఉంటాది కదా! ఈడ కూడా అంతే! నెల్నాళ్లు నోరెత్తి ఓ మాట అనకుండా ...నడుములు విరిగేలా పనులు తనే సేసుకుంటున్న అమ్మకి ఒకటే ఆశ...ఇంటి ముందు ముగ్గు బాగుండాలి...కళకళలాడి పోవాలి అని! కమానులో అందరూ కళ్లింత చేసుకుని...ముక్కుపై వేలేసుకుని చూడాలి అదీ ఆమె లెక్క! అక్క కూడా ప్రతిసారీ అంచనాలకు మించే ముగ్గులు వేసేది. రంగంలో దిగేంతదాకే నిదానం. ఒక్కసారి ముగ్గు కప్పు పట్టుకు నిండాదంతే అంతే. ముగ్గుల్లో నింపేకి రంగుల్ని తయారు చేసేటపుడు మాత్రం నేనే కలుపుతానని గొడవ చేసటోణ్ని. పసువు... కుంకుమ... ఎరుపు... వంకా