ఓల్డ్ ఏజ్ హోం వద్దుబాబూ - గంగాధర్.వడ్లమన్నాటి .

old age home vaddu baboo

ఆఫీసు అయిపోయాక బస్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ నిలబడ్డ మధుని ,అతని స్నేహితుడు వేణు కలిసి ,హాయ్ మధు ,నీకోసం ఇప్పుడే ఇలా అనుకుంటున్నాను.అధృష్టవశాత్తు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు భలే కనిపించావ్.చెప్పాడు ఉత్సాహంగా పళ్లికిలిస్తూ.
అవునా ఇంతకీ ఎందుకట నా కోసం వెతకటంనేను నీకీవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చేసానే.చెప్పాడు మధు ,ఆలోచిస్తున్నట్టు శూన్యంలోకి చూస్తూ .

అబ్బే అధికాదురా ,మొన్న నువ్విచ్చిన్నట్టే ,నేనూ ఈరోజు మా ఇంట్లో మన ఫ్రెండ్సoదరికీ మాంచి పార్టీ ఇద్ధామనుకుంటున్నాను.చెప్పాడు వేణు హుషారుగా.

అవునా.దేనికో అడిగాడు మధు,కొంచెం నీరసంగా.

ధేనికా,ఎప్పటినుండో పోరుతుంటే ,మా నాన్నగారు నిన్ననే హఠాత్తుగా ఓల్డ్ ఏజ్ హోంలో జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నారు.

దాంతో ఆయన్ని పొద్దున్నే అందులో పడేసి వచ్చేశాన్రా.దాంతో మా ఆవిడ చాలా హాపీగా ఉంది.కాకపోతే నాకే కొంచెం భాధగా ఉంది.ప్రతి నెలా మా నాన్న ఇచ్చే పెన్షన్ డబ్బు పోయింధే అని.చెప్పాడు కాస్త నిరాశ స్వరంతో.

అలాగా కానీ నాకు పార్టీ కి రావడం కుదరదురా.చెప్పాడు మధు.

అదేం .ఎందుకని.పైగా మొన్ననే నువ్వూ మీ నాన్నని ఓల్డ్ ఏజ్ హోం లో జాయిన్ చేసి అతని అడ్డంకి వదిలించుకున్నావుగా.అడిగాడు సందేహంగా.

లేదురా మళ్ళీ నేనే మా నాన్నని ఇంటికి తీసుకువచ్చేసాన్రా .ఛ ,చ .అన్నాడు మధు.

చిత్రంగా ఉందే .నువ్వే జాయిన్ చేసి మళ్ళీ నువ్వే తీసుకొచ్చేసావా .పోనిలే నాకాలంటి సెంటిమెంట్స్ ఏం లేవు.ఓ నవ్వు నవ్వాడు తేలిగ్గా.ఇంతలో తెల్లని లాల్చీ పైజమా వేసుకున్న ఓ పెద్దాయన మధుకి దగ్గరగా వచ్చి ,బాబూ మధూ ,పలకరించాడు చిన్నగా నవ్వుతూ.
అతన్ని చూసిన మధు ఓ క్షణంలోనే ముఖం మీదికి నవ్వు తెచ్చుకుని ,అరె అంకుల్ మీరా ఏంటీలా సడన్గా బస్ స్టాప్ లో ప్రత్యక్షమయ్యారు. ఎక్కడికైనా వెళుతున్నారా అడిగాడు మధు,ఆశ్చర్యంగా .

అవును మీ ఇంటికే వస్తున్నాను .చెప్పారు సదానందంగారు.

మా ఇంటికా .ఎప్పుడు మా నాన్నగారు రమ్మన్నా ఏదో పని ఉందనే వారు .బిజీగా ఉండేవారు.మరి ఇప్పుదేంటి ఇలా మీ అంతట మేరే రావాలనుకోవడం .ఏదైనా ముఖ్య విషయo చర్చించాలా మా నన్నతో , లేక మీ స్నేహితుడిపై హటాత్తుగా ప్రేమ పొంగిందా.అడిగాడు మధు చిరు నవ్వుతో.

రెండూ కాదయ్యా మధూ ,నిన్ను అభినందిచడానికే మీ ఇంటికి వస్తున్నాను.ఇంతలో నువ్వే కనబడ్డావు.చెప్పాడాయన మధు బుజం తడుతూ.నన్ను అభినందించడానికా ,దేనికంకుల్ .అమితాశ్చర్యంగా అడిగాడు.

మరీ అంత అమాయకంగా అడగకోయ్.నాకు తెలుసులే .మీ నాన్నని ఓల్డ్ ఏజ్ హోం లో జాయిన్ చేసినట్టే చేసి ,మళ్ళీ ఇంటికి తీసుకోచ్చేసావటగా .నువ్ గ్రేటయ్య .చెప్పాడు అభినందనగా చూస్తూ.

మీరు అంటుంటే నాకూ గర్వంగానే ఉంది కానీ ,నేనేం నా అంతట నేను తీసుకురాలేదు.అసలు ఆయన్ని ఒల్దేజీ హోంలో జాయిన్ చేసి ఫ్రెండ్స్ కి పార్టీ కూడా ఇచ్చాను.నేను పండగ చేసుకున్నాను.కానీ ఆ ఆనందం అంత త్వరగా ముక్కలౌతుందని మల్లె నేనే ఆయన్ని ఇంటికి తేవాల్సివస్తుందని నేనస్సలు అనుకోలేదు.చెప్పాడు అసహనంగా.

అదెంటయ్య అలా అంటావ్ .అంత ఇస్టమ్ లేని వాడివి మీ నాన్నని ఆ హోం నుండి ఇంటికి ఎందుకు తెచ్చినట్టు ,ఇలా ఎందుకు బాధపడుతున్నట్టు.అడిగాడయన.

భలే వారే అంకుల్ నేనేం నా అంతట నేనుగా తీసుకురాలేదు .తప్పక తీసుకురావాల్సి రావడంతో తీసుకొచ్చాను.చెప్పాడు మధు నిట్టూరుస్తూ.
తప్పక తీసుకొచ్చావా.అంత తప్పక తీసుకు రావాల్సిన పరిస్థితి ఎమొచ్చింది.అడిగాడాయన వ్యంగ్యంగా.

ఏం చెప్పమంటారు మా నాన్నని ఆ ఓల్డ్ ఏజ్ హోం లో జాయిన్ చేసిన మూడో రోజే ,ఆయన అలవాటు ప్రకారం ఓ సిగరెట్ తాగి,పరాగ్గా దాన్ని విసిరేస్తే ,అది పరుపు మీద పడి పది వేల రూపాయిల పరుపు , దానితోపాటు డబుల్ కాట్ కాలిపోయిందట.పైగా అదే రోజు భోజనంలో నీసు వండలేదని కుక్ ని కుక్క అని తిట్టారట.దాంతో అతను కోపంలో పని మానేసి వెళ్లిపోబోయాడట.అలాగే సాయంత్రం టీలో చక్కెర తక్కువైందని ఆ టీ ని,ఇచ్చిన వాడి ముఖం మీద ,కప్పుని నేల మీద కొట్టారట .తర్వాత ఆ రాత్రికి టివి లో ఫ్యాషన్ చానల్ రావడం లేదని ఆ వార్దెన్ని పిచ్చి తిట్లు తిట్టి అన్నం తినలేదట.

అరెరె .అంటే ఆ పూట పస్తు పడుకున్నాడా మరి.అడిగారు సదానందం.

అదేం కాదు అంకుల్ .ఆ ఓల్డ్ ఏజ్ హోం లో పని చేసే కుర్రాడికి వంద ఎక్కువిచ్చి చికెన్ దమ్ బిర్యానీ తెప్పించుకు తిన్నారట.అసలే ఆ హోం లో మాంసాహారం నిషేదమట.అందుకే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇవన్నీ చెప్పి,వారు చెప్పిన టైమ్ లోపు తీసుకెళ్లకపోతే నా సంగతి చెప్తామన్నారు.పైగా మా నాన్న చేసిన నష్టానికి ఇరవై వేలు కట్టించుకున్నారు.పైగా వేరే ఏ హోం లోనూ ఈయన్ని జాయిన్ చేసుకోకూడదని, ఓల్డ్ ఏజ్ హోంల అసొషియేషన్కి రిఫర్ చేసిందట.దాంతో నేనే మా నాన్నని నేనే మళ్ళీ కాళ్ళూ , గడ్డం పట్టుకుని ఇంటికి తెచ్చాను.చెప్పాడు మధు తల వాల్చేస్తూ.

అప్పటివరకూ ,అదంతా విన్న మధు ఫ్రెండ్ వేణు ,వెళ్తాను రా చెప్పాడు హడావుడిగా వెళ్లబోతూ.

ఏంటి తొందర .ఇప్పటివరకు ఉన్నవు ,విన్నావ్.ఇంతలోనే ఏమైంది.అడిగాడు మధు.

ఏం కాకూడదనేరా బాబూ .నువ్వు చెప్పింది విన్నాక నేనూ మా నాన్నని ఓల్డ్ఏజ్ హోం నుండి తీసుకు రావాలాని డిసైడ్ అయ్యాను. అంతే.చెప్పాడు వేణు కొంచెం బిత్తర చూపులు చూస్తూ.

ఏడ్చినట్టే ఉంది.మా కొంచెం నాన్న కొంచెం చాదస్తం మనిషీ ,పైగా మొండి కూడా.కాబట్టి అలా చేశాడనుకుందాం.కానీ మీ నాన్న కూడా అలానే చేస్తాడని ఎందుకనుకుంటావు.

ఎందుకంటే ,ఆయన్ని కూడా మీ నాన్నని జాయిన్ చేసిన హోం లోనే జాయిన్ చేశారా మధూ.మా నాన్న మీ నాన్నని ఆదర్శంగా తీసుకోకముందే నేనే వెళ్తే మంచిదనీ .చెప్పి ఆటొ పిలిచి డు ఎక్కాడు వేణు.అంతలోనే సదానందంగారు ఎక్కాల్సిన బస్ కూడా రావడంతో ,అంకుల్ మీరు మా ఇంటికి వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడుతూ ఉండండి ,నేను దగ్గరలో సూపర్ మార్కెట్ కి వెళ్లొచేస్తాను.చెప్పి ఆయన్ని బస్ ఎక్కించాడు మధు.

మధు వాళ్ళింటికి చేరిన సదానందం గారు ,మూర్తి గారిని కల్సి ,ఆయన గురించి అతని సుపుత్రుడు మధు చెప్పిందoతా చెప్పి,నువ్విలా ఆ ఓల్డ్ ఏజ్ హోం లో రచ్చ చేయడం నాకేం నచ్చలేదురా మూర్తీ.చెప్పారు సదానందం.

అతను చెప్పిందంతా విన్న మూర్తి గారు ,చిన్నగా చిరునవ్వు నవ్వేస్తూ,అదా! ఏం లేదురా సదానందం .అసలు విషయం ఏంటంటే , అలా అనాదలా ఓల్డ్ ఏజ్ హోం లో ఉండేందుకు వారానికే బాగా బెంగనిపించిందిరా నా మనుసుకి.ఈ వయసులో ప్రేమ,ఆప్యాతలకోసం ఏదో తెలియని తాపత్రయం.అలాగే నా మానవరాలితో ఆడుకోవాలని ,కోడలి చేతి కాఫి ,కొడుకుపై ఆ కొద్దిపాటి అజమాయిషీ చాలా,చాలా మిస్ అయినట్టు అనిపించిందిరా.కానీ నాకు ఇలా రాక రకాలుగా అనిపిస్తోందీ,బెంగగా ఉందీ ,నన్ను ఇక్కడినుండి దయచేసి ఇంటికి తీసుకెళ్ళారా అని వాడిని బ్రతిమాలడానీకి నా అహం అడ్డొచ్చింది. వాదంతట వాడే వచ్చి నన్ను తీసుకెళ్తే బావుండనిపించింది.కానీ ఆ వారం లో వాడు ఒక్కసారి కూడా ,నాన్న ఎలా ఉన్నావ్ అని ఓ ఫోన్ కాల్ కూడా చేయలేదు.అందుకే వాడంతట వాడే నన్ను తీసుకెళ్లడానికి గాను ఈ ప్లాన్ వేశాను.చెప్పారు మూర్తిగారు చెమర్చిన కళ్ళతో,చిన్న నవ్వుతో.

అవునా? నువ్వు చెప్పిందంతా బావుందిరా మూర్తీ .నీ గుండెల్లో బాధ కూడా అర్ధమైంది.కానీ నీ అవసరం నెరవేర్చుకోవడం కోసం ఆ హోం లోని మిగతా వారిని ఇబ్బంది పెట్టడం నాకు జీర్ణం కావడం లేదురా.మరే ఇతర ఆలోచనైనా చేయాల్సిందేమోరా .చెప్పారు సదానందం గారు కొంచెం తటపటాయిస్తూ .

ఓహ్ అదా! అని మళ్ళీ ఓ చిరు నవ్వు నవ్వి,అదంతా నిజం కాదురా సదా.మా వాడితో అలా చెప్పమని నేనే ఆ ఓల్డ్ ఏజ్ హోం వాళ్ళతో చెప్పమని చెప్పాన్రా. వారూ నా బాధ అర్ధం చేసుకుని అలాగే చెప్పి ,నేను ఇంటికి రావడానికి సహాయ పడ్డారు.చెప్పారు మూర్తిగారు.
అలాగా .మరి మీవాడు ఇరవై వేలు నష్టపరిహారం కట్టానన్నాడు.అడిగారు సదానందం గారు.

అదా.ఆ ఓల్డ్ ఏజ్ హోం లో మనలాంటి వారికి ఇంకొంతమందికి ఉపయోగపడుతుందని ,నేనే వాళ్ళకి ఆ ఐడియా ఇచ్చాను.మొదట ఒప్పుకోకపోయినా ,తర్వాత ఒప్పుకున్నారు.ఆ డబ్బు నా తరుపన డొనేషన్ గా స్వీకరించి ఉపయోగించమన్నాను.ఇప్పుడు చెప్పవోయ్ ఎలా ఉంధో నా ప్లాన్ .మళ్ళీ మా అబ్బాయి నన్ను నే పోయెవరుకు ఏ ఓల్డ్ ఏజ్ హోం లోనూ జాయిన్ చేయడు కదా.అంటూ పెద్దగా నవ్వేశారు కళ్ళజోడు సరిచేసుకుంటూ.ఇంత బాధని అంత పెద్ద నవ్వు మాటున దాచేయాలన్న ఆయన మనుసుకి లోలోన హాట్స్ ఆఫ్ చెప్పారు సదానందంగారు.

అప్పుడే వచ్చి ,ఆ సంభాషణంతా విన్న మధు కళ్ళు చెమర్చక మానలేదు.బాధతో ,పశ్చాత్తాపంతో.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు