అపోహ - వై.శ్రీ రంగలక్ష్మి

apoha

"అమ్మా!సిరి,రాహుల్ విడాకులకు అప్లై చేశారట!"అన్నాడు బయట నుంచి వచ్చిన విజయ్.

"ఎందుకట."అన్నాను.

"ఏముందీ!అమెరికా,అమెరికా అని ఊరేగుతారుగా!అక్కడ అందరూఊ అంతేనటగా!"తనకు తెలిసీ తెలియని విషయాన్ని అక్కసుగా వెళ్ళగక్కారు అక్కడే ఉన్న మా అత్తగారు.

మా అబ్బాయి విజయ్ కూడ అమెరికా లోనే ఉంటాడు.మూడు వారాల సెలవులో వచ్చాడు.వాడికి ఇద్దరు పిల్లలు.వాళ్ళ కోసమని నేను మావారు 3,4 సార్లు అమెరికా వెళ్ళాము.ఆవిడ మా దగ్గరే ఉంటుంది.మేము మళ్ళా ఎక్కడ వెళతామో తనేక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తోందో అని ఆవిడ భయం.అందుకే వీలున్నప్పుడల్లా అమెరికాను తిడుతూ ఉంటారు.ఒక్కగానొక్క కూడుకుని అంత దూరం పంపించామని మామ్మల్నీ సణుగుతూ ఉంటారు.వాళ్ళ స్నేహితులందరూ వెళ్ళారు తను కూడా వెళ్ళాలని ఉత్సాహ పడ్డాడు.వాడి ఆశాల్ని,కోరికను మేము ఎలా కాదనగలం.

సిరి మా బావ గారి అమ్మాయి.పెళ్ళై రెండు సంవత్సరాలే అయ్యింది.రాహుల్ ఎం ఎస్ చేసేటప్పుడే అక్కడ ఒకమ్మాయిని ప్రేమించాడట. తల్లిదండ్రుల బలవంతం తో ఇండియా వచ్చి సిరి మెళ్ళో మూడు మూళ్ళు వేశాడు కాని అక్కడకు వెళ్ళిన దగ్గర్నుంచి నరకం చూపిస్తున్నాడట.అలా జీవితాంతం గడిపేకంటే విడాకులు తీసుకోవడమే మంచిదేమో.

పెద్దావిడ మాటలతో క్రితం సారి మేము అమెరికా వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.

అమెరికాలో ఉన్న వారు చీటికీమాటికీ విడిపోతారనుకోవడం అపోహే.మేము క్రితంసారి అమెరికా వెళ్ళినప్పుడు మా అబ్బాయి మనవరాలి పుట్టినరోజని ఒక ఇండియన్ రెస్టారెంట్ కు తీసుకు వెళ్ళాడు. మేము వెళ్ళిన కాసేపటికి ఒక అమెరికన్ జంట వచ్చి మా పక్క టేబుల్ దగ్గర కూర్చున్నారు.ఇద్దరూ బాగా పెద్దవారు.బహుశా 90కి దగ్గరగా ఉన్నారని అనిపించింది. వాళ్ళిద్దరే వచ్చారు.ఆసక్తిగా అనిపించడంతో వారినే గమనిస్తున్నాను.ఒక దోసె,వడ తెప్పించుకున్నారు.వాటితో పాటు చట్ణీ,సాంబారు ఇచ్చారు.వెయిటర్ మాటిమాటికి వారి దగ్గరికి వెళ్ళి సూచనలు ఇస్తున్నాడు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు ఆయనే ఎక్కువ మాట్లాడుతున్నారు.ఆమె చిరునవ్వుతో వింటోంది.ఇద్దరూ ఎంత ప్రేమగా ఉన్నారు.బహుశ చట్నీ,సాంబారు తో తినాలని చెబుతున్నాడేమో!నిదానంగా మాట్లాడటం వలన తెలియలేదు.టిఫ్ఫిన్ ముగించి వెళ్ళడానికి సిధమయ్యారు.ఆయన గబగబా వాకర్ తీసుకువచ్చి చెయ్యి ఇచ్చి ఆమెను లేపి సపోర్టుగా నిలబడి వెయిటర్ సహాయం తో కారెక్కించాడు.

మా కుతూహలాన్ని గమనించి వెయిటర్ దగ్గరకు వచ్చి వాళ్ళు 6,7 సంవత్సరాల నుంచి ఇక్కడకు వస్తున్నారు.నేను మూడు యేళ్ళ నుంచి పనిచేస్తున్నాను.అంతకుముందు చేసినతను 3,4 యేళ్ళ నుంచి వస్తున్నారని చెప్పాడు.వారం లో ఒక రోజు తప్పనిసరిగా వస్తారు.వచ్చినప్పుడు మరుసటి వారం ఏరోజు వచ్చేది చెప్పి టేబుల్ రిజర్వ్ చేసుకుంటారు.ఆమె బాగా నడ్డవలేదు ఆయిన జాగ్రత్తగా నడిపించితీసుకువస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడ మాన లేదు."అని చెప్పాడు

నాకు చాలా ఆశ్చర్యం ,సంతోషం కలిగాయి.అంత పెద్ద వయసులో భార్య రాలేదని తెలిసినా ఒక రోజైనా బయటకు తీసుకురావాలనే ఉధ్ధెశ్Yఅం తో ఒపిగ్గా,స్రధ్ధగా తీసుకువస్తున్న ఆయన్ని చూసి సంతోషం కలిగింది.మన దగ్గర భార్యను అంత ఓపిగ్గా తీసుకు వెళ్ళే భర్తలు ఎంత మంది ఉంటారు.వివాహ బంధానికి కట్టుబడటం అనేది మనుషుల్ని బట్టి ఉంటుంది కాని దేశాన్ని బట్టి ఉండదు.ఇప్పుడు మన దగ్గర కూడా సర్ధుకుపోవడం తగ్గి ప్రితిచిన్న కారణానికి విడాకుల దిశెగా ప్రయాణిస్తున్నారు.అమెరికన్లేమో భారతీయ వివాహ వ్యవస్థ పట్ల ఆకర్ష్తులు అవుతున్నారు.నిఝంగా గొప్ప కదా!

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు