ఛీ!!?........ ఛీఛీ!!!!?? - ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్

chee..chee..

“ఏరా ఈరోజు ఏకాదశి కదా అలా గుడి వైపు వెళదాం వస్తావా ?” అని అడిగాడు రాఘవ ఉదయాన్నే ఫోన్ చేసి.

“అలాగేరా. ఏ మధ్య రిటైర్ అయ్యాక ఏమీ తోచడం లేదు.కాస్త కాలక్షేపంగానన్నా ఉంటుంది” అన్నాను నేను.

నాకు దేవుడు,దెయ్యం అంటే పెద్దగా నమ్మకం లేదు.అయినా రాఘవ కోసం గుళ్ళు, గోపురాలు తిరగడం అలవాటు చేసుకున్నాను.
నేను పది నిమషాలలో రాఘవ ఇంటి ముందు ఉన్నాను.అక్కడనుంచి బయలుదేరిన మేము పిచ్చాపాటి

మాట్లాడుకుంటూ , నడుచుకుంటూ గుడిని చేరుకున్నాం.

గుడి దగ్గర ఇసుక వేస్తే రాలకుండా జనం ఉన్నారు.

“బాగా రష్ గా ఉన్నట్టుంది మరలా వద్దామా!?” నేను అడిగేను నేను రాఘవని.

“మరలా ,మరలా రావడానికి ఇది ఏమైనా సినిమా అనుకుంటున్నావా !?...గుడి . ఉదయాన్నే

భగవంతుని దర్శనం చేసుకోవాలి.అంతేకాని పీకల దాక మెక్కి రోజులో ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళకూడదు దేవుణ్ణి దర్శించుకోడానికి “ అన్నాడు రాఘవ కోపంగా .

“జీవుణ్ణి హింస పెట్టి నన్ను పూజించవద్దు అని మీ దేవుడే ఎక్కడో చెప్పినట్టున్నాడు!!??” నా సందేహం వెలిబుచ్చాను.
“నోరు ముయ్యి. మెట్ట వేదాంతం నువ్వూను “కసురుకున్నాడు రాఘవ.

“అయినా మనసులో ఉండాలిగానీ......” అంటూ ఇంకా ఎదో అనబోయాను.

నా మాటలను మధ్యలోనే త్రుంచేసాడు రాఘవ.

“కాటికి కాళ్ళు చాపుకు కూచున్నావు. ఇప్పుడన్నా మారరా బాబూ .కాస్త పూజ పునస్కారాల వైపు మనసును మరల్చుకో.ఇహం, పరం ఉంటాయి.” రాఘవ మాటలలో కోపం తగ్గ లేదు.

నేను నవ్వుతూ”సరే సరే “ అన్నాను.

మేము మెల్లిగా ఆలయ శిఖరం దగ్గరకు చేరుకున్నాం.

లోపలకు నడవబోతుంటే ఎదో కలకలం వినిపించింది.

‘ఏమిటా!!??’ అని తల ఎత్తి చూసాం.

అక్కడ కనిపించిన దృశ్యం చూసి నివ్వెరబోయాం!!??

దేవాలయ గోపురం మొదటి అంతస్తులో దాదాపు ఇరువది సంవత్సరాల వయసు కల యువతి పూర్తిగా నగ్నంగా నిలుచుని ఉంది. గుడికి వచ్చిన జనం అంతా వింతగా అటు చూస్తూ నుంచున్నారు.

“ఛీ!!?” అన్నారు ఎవరో బిగ్గరగా.

క్రమేపీ అప్రదేశమంతా జనం తో నిండి పోయింది.

కొందరు విస్మయంగా చుస్తూ ఉంటే, కొంత మంది కోరికగా, ఆబగా చూస్తున్నారు.

అంతలో “సిగ్గు లేని దానా నువ్వు మనిషివా!!?? పశువ్వా !!??.ఇంత మంది ముందు అలా బరితెగించి నిలబడడానికి నీ మనసు ఎలా ఒప్పింది!!?? ఇది గుడి అనుకుంటున్నావా !? లేకపోతే మీరు తిరిగే పబ్ అనుకుంటున్నావా !!??” కోపంగా అరిచాడు ఒక ముసలాయన.
దానికి సమాధానంగా ఆ యువతి పకా పకా నవ్వసాగింది.

‘ఏమిటి ఈ అమ్మాయి కి మతి స్తిమితం లేదా !!??’ అని అనుమానం వచ్చింది నాకు. రాఘవతో ఆ మాటే అన్నాను.

రాఘవ భుజాలు ఎగురవేసి మూతి బిగించాడు.

మరు క్షణం నా అనుమానం పటా పంచలు చేస్తూ ఆ అమ్మాయి గంభీరంగా మాట్లాడ సాగింది.

“ఏమిటి మీరంతా అలా వింతగా చూస్తున్నారు!? అసలు మీరు వచ్చిన పని ఏమిటి!? చేస్తున్న పని ఏమిటి!?” అని ఇందాక మాట్లాడిన ముసలి అతని వైపు తిరిగి “నన్ను మనిషివా అని అడిగావు.ఏమయ్యా పెద్ద మనిషి నువ్వు అసలు ఏ జాతికి చెందుతావు!!?? నీ మనుమరాలు వయస్సు ఉన్న నన్ను కళ్ళు అప్పగించి చూస్తున్నావు.తల దించుకుని నీ దారిన నువ్వు పోవచ్చుగా!?” అంటూ తన కళ్ళల్లో నిప్పులు కురుపించింది.

అంతలో మిగతా జనం వైపు తిరిగింది..

“ఆయనంటే మూర్ఖుడు అనుకుందాం.మీకు ఎవ్వరికి జ్ఞానం లేదా!!??పేద్ద భక్తులం అంటూ గుడి కి వచ్చారు.కానీ మీ దృష్టి కించిత్ గూడా భగవంతుడి మీద ఉన్నట్టు లేదు.ఉంటే మీ దారిన మీరు దర్శనం చేసుకు పోయే వారు. ఒక స్త్రీ అది నిండు యవ్వనంలో ఉన్న స్త్రీ దిగంబరంగా నిలుచుంటే అలా నిర్లజ్జగా చూస్తూ నిలుచుంటారా!!?? మీరు ఎంత భక్తులో తెలయచేప్పాలనే ఈ పని చేసేను. మీరు భక్తులు కాదు. మనుసులు అంత కన్నా కాదు.కామ పిశాచాలు.ఛీఛీ!!??” అంటూ మా మీద ఖాండ్రించి ఉమ్మేసింది. అప్రయత్నంగా నేను ముఖం తుడుచుకున్నాను.

ఆశ్చర్యం గా ఆ యువతి క్షణం లో కను మరుగు అయిపోయింది. నిండు వస్త్ర ధారణతో ఇంకొక అమ్మాయి నడుచుకుంటూ వచ్చింది.
ఆ అమ్మాయి మాకందరికీ ఒక షాక్ ఇచ్చింది. అంత వరుకు జరిగింది కంప్యూటర్, లేసర్, మరి కొన్ని పరికరాల సాయంతో ఒక యువతి రూపాన్ని సృస్టించి,మమ్మల్ని అది నిజమే అనేలా భ్రమింపచేసారుట. అయితే ఎదో లోకంలో ఉన్న మాకు ఎవ్వరికి అది గ్రహించే శక్తి గాని, ఆసక్తిగాని లేవని తెలిసిందట.

మాలోని లేకి తనాన్ని బయట పరచడం వాళ్ళ ఉద్దేశ్యంట.

ఏ వయసు వారన్నా, ఏ పని మీద ఉన్నా , మగవారి బుద్ధి ఇలాగే ఉంటుందని ఋజువు చేస్తానని ఆమె తన స్నేహితులతో పందెం కాసిందట.

“నేనే గెలిచాను “ అని దరహాసంతో విజయ సంకేతం చూపిస్తూ కనుమరుగు అయిపోయింది ఆమె. ఆ క్షణంలో నా శరీరం భూమి మీద ఉన్నా మనస్సు ఊహించని లోతులకు క్రుంగి పోయింది. నా వేపు చూసిన రాఘవ పరిస్థితి భిన్నంగా ఉందని నేను అనుకోను#

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు