కాలేజీలో ఫెస్ట్ జరుగుతోంది...
అందరూ మంచి ఉత్సాహంగా మ్యూజికల్ నైట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మొదటిసారి జ్యోత్స్న , శ్రీ ముద్దు పెట్టుకోవడం చూసా. అప్పుడే అర్థం అయ్యింది నేను రెండు నెలలుగా విన్నదంతా నిజమని. ఒక్కసారిగా ఆ గోల అంతా నిశ్శబ్ధంగా అనిపించింది. ఆ వింత విద్యుత్ దీపాలలో కూడా చీకటి కనపడింది. నన్ను అడగకుండానే కళ్ళ నుండి కన్నీళ్ళు వర్షించాయి. నా ప్రమేయం లేకుండానే మనసులో అంతర్యుద్ధం మొదలైంది. మనం విడిపోదాం అని తాను నాతో అంటే, కొంచెం గ్యాప్ కోసమేమో అనుకున్నా, కానీ, ఇది నేను అస్సలు ఊహించలేదు. శ్రీ, జ్యో ల విషయం ఎంతమంది చెప్పినా నేను వినలేదు. ఆ ప్రదేశం అంతా స్వార్థం, కుళ్ళు తో పేరుకుపోయిన నరకంలా కనపడుతోందు. అక్కడి మనుషుల కేరింతలన్నీ రాక్షసుల హాహాకారాలుగా వినపడుతున్నాయి.
ఈ గోల నుంచి బయటకి వచ్చాను. ఏవేవో ఆలోచనలు..ఎన్నెన్నో జ్ఞాపకాలు నా కళ్ళముందు కదలాడుతున్నాయి. సరిగ్గా అదే సమయానికి ఒక తీయటి గొంతు తో ఎవరో నా పేరు పిలిచారు.
" హలో విజయ్ గారూ "
" విజయ్ గారా? ఎవరు నువ్వు..?" నన్ను గారు అని పిలవడంతో ఆశ్చర్యంగా చూసాను.
ఓహ్హ్..నాపేరు సత్య, మీ జూనియర్ ని."
" మరీ అంత మర్యాద అవసరం లేదు, నా పేరు నీకెలా తెలుసు?"
" మీరు, సారీ, నువ్వు కాలేజ్ ఆన్యువల్ మాగజైన్ లో రాసిన కవిత చదివాను....అది నాకు చాలా చాలా నచ్చింది. అందులో యూత్ లో కలిగే లవ్, ఎమోషన్స్ ని బాగా రాసారు."
" ఓహ్హ్...ఇంకా కవితలు చదివేవాళ్ళు ఉన్నారా, నైస్, !! అంతలా నచ్చింది అంటున్నావు, నువ్వెవరినైనా లవ్ చేసావా?"
" లేదు లేదు, కొన్ని విషయాలు అనుభవించాల్సిన అవసరం లేదు. అర్థం తెలిస్తే చాలు. అవును, దిన్నర్ స్తర్ట్ అయినట్టుంది, పదండి, జాయిన్ అవుదాం, "
" హా, పాండి, దానికోసమే వచ్చినట్టున్నారు..."
ఆ రాత్రి సత్యతో చాలా విషయాలు మాట్లాడాను. తన చిలిపి మాటలఓ నేను ఉన్న పరిస్థితిని మొత్తం మర్చిపోయా. మా మొబైల్ నంబర్స్, సోషల్ మీడియా సమాచారాలు మార్చుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు.
తర్వాతి రోజు పొద్దున్నే ఫేస్ బుక్ లో హాఇ అని మెస్సేజ్ తో మొదలైన మా బాతాఖానీ రాత్రికి ఫోన్లో బై, గుడనైట్ తో ముగిసింది. నా ప్రేమ విఫలానికి సంప్రదాయంగా ఏ మందో సిగరెట్టో మొదలుపెట్టాల్సిందిపోయి మళ్ళీ అదే ప్రేమ పుస్తకాన్ని మొదలు పెట్టాను. నాకిక కాలేజ్ లో మిగిలింది రెండు నెలలే. ఇలాంటివి వద్దు అనుకున్నా కానీ, అన్నీ అనుకున్నట్టు జరిగితే దీనెమ్మ దీన్ని జీవితం అని ఎందుకంటారు? చాలా అంటే మాట్లాడేసుకున్నాం. చిన్ననాటి చిన్నచిన్న సంగతుల నుంచీ, కలలలోని పెద్దపెద్ద విషయాల వరకూ మాట్లాడుకున్నాం. మా మాటలు ఫోన్ ల నుండి నేరుగా రోడ్లమీదకి, అటునుండి కాఫీ షాప్ దాకా వెళ్ళాయి.
జ్యో నేను కూర్చునే అదే కాఫీ షాప్ లొ అదే టేబుల్ మీద సత్య కోసం వెయిటింగ్. మనసులో ఎన్నో ఆలోచనలు. మళ్ళీ నేను ఇలా ఉన్నానంతే కారణం సత్యనే. పగిలిన ఈ హృదయానికి తనకు తెలియకుండానే ఓదార్పునిచ్చింది. అసలే ట్రాక్ తప్పిన ట్రైన్ మళ్ళీ పట్టాలు ఎక్కించడం తప్పో-ఒప్పో తెలియడం లేదు. ఇన్ని భిన్న ఆలోచనల మధ్య నేను మునిగి తేలుతుండగా సత్య వచ్చింది.
" సారీ, లేట్ అయ్యింది, ఆర్డర్ ఇచ్చావా??"
" ఇచాను, మనకి అదే ముఖ్యం కదా, మనుషులు అవసరం లేదు.."
" అబ్బా, సరే ఏదో చెప్పాలన్నావ్? "
" అదే, నేను ఇంకోపది రోజులలో క్యాంపస్ నుంచి వెళ్ళిపోతున్నాను కదా, నిన్ను ఒకటి అడగాలి.."
" ఏంటి? ఎగ్జాంస్ కి ఏదైనా హెల్ఫ్చెయ్యాలా, లేక అప్పేమైనా కావాలా? "
" ఎహే, అది కాదు, "
" లవ్ చేస్తున్నావా? నన్నేనా? లేక మా ఫ్రెండ్ నెవరినైనానా?"
" పర్లేదు, నేననుకున్నంత తింగరిదానివి కాదు..!! అయినా నేను చాలా చెప్పాలి అనుకుని వచ్చా. ఫస్ట్ టైం ది ఎలాగూ పోయింది కనుక సెకండ టైం ది అయినా బాగా చెప్పాలి అనుకున్నా...నేను నోరు జారిన సంగతి అర్థం అయ్యి.
అయ్యో, నువ్వు సెకండ్ హ్యండా? మా పద్దు అంటూనే ఉంది...నాలుగేళ్ళు ఖాళీగా ఎందుకుంటాడే? అని, ఇంతకీ ఎవరు తాను?"
" మా బ్యాచ్ లో జ్యోత్స్న తెలుసుగా, "
" ఓహ్హ్.... తన తేనే కళ్ళు, చొట్ట బుగ్గలు, ఉంగరాల జుట్టు..."
"ఎస్...తనే....."
" ఏం జరిగిందసలు?"
" నాకు ఈ విషాద గాధ సాగదీయడం ఇష్టం లేదు చిన్నగా చెప్పేస్తా...సెకండ ఇయర్ సమ్మర్ హాలిడేస్ లో రెండు నెలలు కేరళలో ఇండస్ట్రియల్ ట్రిప్ కి వెళ్ళిన బ్యాచ్ లో మేము ఇద్దరమే తెలుగు వాళ్ళం. దాంతో బాగా కలిసి తిరిగాం. ఒక బలహీనమైన క్షణంలో మణిరత్నం సినిమాల్లో లాంటి లొకేషన్ లో ఇళయరాజా రీరికార్డింగ్ లో మేము లవ్ చేసుకోవడం స్టార్ట్ అయ్యింది. ఒక సంవత్సరం బాగానే గడిచింది. ఆ తర్వాత మాకు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ మొదలయ్యాయి. ఎప్పుడూ తన వెంట పడే శ్రీ కి బెంగళూరులో ఒకే కంపెనీలో జాబ్ వచ్చింది. ఇంకేముంది, ఇక్కడ బ్రేకప్ అక్కడ ప్యాచప్...అన్నీ నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. ఈ విషయం మా ఫ్రెండ్స్ అందరికీ తెలిసాక చివరకు నాకు తెలిసింది..ఇదీ జరిగింది.."
" అంతేనా? ఇంకేమీ జరగలేదా?"
" అంతేలే, మీ అమ్మాయిలకి ఇవన్నీ బాగా అలవాటేగా? " అంటూ కాఫీ షాప్ నుండి బయటికి వచ్చాము.
" మీ అబ్బాయిలకి ప్రతిదానికీ అమ్మాయిలందర్నీ ఒక్కటి చేఇ మాట్లాడటం అలవాటు..."
" ఇప్పుడు నువ్వు చేసింది ఏమిటొ....సర్లే, ముందు నేను చెప్పిందాని గురించి ఆలోచించు..."
" బాబూ...ఇప్పుడు నువ్వు ఏం చెప్పలేదు, తెలుస్తుందా..."
" అర్థం అయ్యాక మళ్ళీ చెప్పడం ఎందుకు?"
" నీకు ఇంకో విషయం తెలుసా, నాకు ఈ జ్యోతి సంగతి ముందే తెలుసు."
" " అంటే , నా గురించి ఎంక్వైరీలు కూడా చేస్తున్నావన్నమాట. మరి తెలిసీ ఎందుకు అడిగావు?"
" నువ్వు విషాద ప్రేమ కథని ఎలా రిసీవ్ చేసుకున్నావో అని..."
ఇంతలో సత్య ఫ్రెండ్ పద్మ వచ్చింది.
నేను తనకి బై చెబుతూ " సర్లే, నా కథ వదిలేసి మన కథ గురించి ఆలోచించు..." చూస్తుండగానే ఆ పదిరోజులూ అవడం, స్టూడెంట్ కార్డు పోయి ఎంప్లాయ్ కార్డు రావడం చకచకా జరిగిపోయాయి. తనకి క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో బెంగళూరులో జాబ్ వచ్చింది. అంతా బాగానే వుంది అనుకున్న సమయానికి తను బెంగళూరు వెళ్ళినప్పటినుండి ఒక కాల్ లేదు, ఒక మెస్సేజ్ లేదు, నేను ఎప్పుడైనా చేసినా, అప్పుడప్పుడు ఎత్తడం ఏదేదో రాంగ్ కాల్ అన్నట్టుగా అరాకొరా మాటలు మాత్రమే. నాకు ఇక్కడ పిచ్చెక్కిపోతున్నట్టుండేది..ఎంత ప్రయత్నించినా సమాధానం దొరికేది కాదు. నా ఆత్రం అనుమానం గా మారింది. బెంగళూరు వెళ్ళాలనే నిర్ణయించుకున్నా.
తన ఫ్రెండ్ ద్వారా తన కంపెనీ అడ్రెస్ తెలుసుకుని నేరుగా అక్కడికే వెళ్ళి తనని పిలవమని రిసెప్షన్ లో వెయిట్ చేస్తూ ఉన్నా....ఇంతలో తను రానే వచ్చింది. తను మొత్తం మారిపోయింది. తన నడక, తన చూపు, వైఖరి అన్నీ కొత్తగా ఉన్నాయి. నాకు తెలిసిన సత్య కాదు తను.....నన్ను చూసిన ఆనందం కానీ, ఆశ్చర్యం కానీ ఆమె కళ్ళల్లో కించిత్ లేదన్న విషయం గ్రహించడానికెంతోసేపు పట్టలేదు నాకు.
" ఎంకొచ్చావ"న్నట్టుగా కళ్ళతోనే సైగ చేసింది....
ఇక్కడ కాదు, అని కాఫీ షాప్ కి తీసుకుని వెళ్ళాను. తననలా చూస్తూనే ఉన్నాను. ఇన్ని రోజులూ ఎందుకు మాట్లాడలేదు అని నిలదీయాలనుంది..
" ఇంతలో సత్య, " ఎందుకొచ్చావో త్వరగా చెప్పు, నాకు టైం లేదు." అంది.
" నేను కాదు చెప్పల్సింది, నువ్వే అనుకుంటా?"
" సరే, నాకు ఇంకా లేట్ చేయాలని లేదు, ఇంకో రెండు వారాలలో నా మారేజ్."
" ఏమన్నావ్?" తాను అన్నది నాకు నిజంగానే వినపడలేదు.
" ఓకే, స్ట్రెయిట్ గా పాయింట్ కి వచ్చేస్తా. వచ్చే వారం కి పై వారమే నా పెళ్ళి. నువ్వు నాకు ప్రపోజ్ చేయకముందే నాకు ఎంగేజ్ మెంట్ జరిగిపోయింది. మా డాడీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి రోహిత్ తో. నాకూ రోహిత్ చిన్నప్పట్నుంచీ తెలుసు. ఎప్పటి నుంచో అమెరికా వెళ్ళాలి అన్నది నా డ్రీం. రోహిత్ వాళ్ళ ఫామిలీ అమెరికాలోనే స్తిరపడ్డరు. నీకు మొత్తం అర్థం అయ్యిందనే అనుకుంటున్నాను."
తాను అలా చెప్తూంటే నా కళ్ళల్లో కన్నీళ్ళకి బదులు మొహంలో నవ్వొస్తోంది...తాను చెప్పిందంతా అర్థం అవుతోంది అయినా సరే, ఏమీ మాట్లాడలేకపోతున్నా. శరీరమంతా తేలికగా మారినట్లనిపిస్తోంది.
ఆ తడబాటులోంచే తెలివి తెచ్చుకుని " మరీ ఇంతా తెలిసి నన్నెందుకు ఈ కథలోకి లాగావు?" అని అడిగా.
అప్పటికి రెడీగా ఉంచుకున్న సమాధానం వదిలింది...సులభంగా..." నేను నిన్ను ఫ్రెండ్ లాగానే చూసానుగానీ నువ్వే ఎక్కువ ఊహించుకున్నావ్. నేను కూడా క్యాంపస్ లో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉండడం చూసి టెంపరరీగా నిన్ను వాడుకున్నా...ఈ రోజులలో ఇవన్నీ కామనే కదా...."అంటూ ఇంకా ఏదేదో చెబుతోంది...
ఇంకా నా వల్ల కాలేదు, తెలియకుండానే కాఫీ బిల్లు అక్కడ పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా నడవడం మొదలుపెట్టాను. చుట్టొ వెలుతురున్నా, కళ్ళు కనిపించడం లేదు. ఒక్క క్షణం తాను చెప్పింది అబద్ధం అయితే బాగుండు అనుకుంటున్నా కానీ కాదు. తన కళ్ళల్లో ధైర్యం, మాటల్లో తెగింపు చూస్తే ఎవ్వరికీ అది అబద్ధం అనిపించదు. సత్య నాకు చేసిన దానిమీద ఎందుకో కోపం రావటం లేదు. తాను నా ముందు చేసింది అంతా నటన అంటే ఆశ్చర్యంగా ఉంది. బుర్రలో ఎవరో శూలాలు దింపుతున్నట్టు ఉంది. ఈ జీవితం మనకెంతో చెపుతుంది. అందులో ఎన్నో కథలు దుఖంతో అంతమయ్యేవే... మనతో ఏ వస్తువు గానీ మనిషి గానీ పరిపూర్ణంగా వుండరు. ఏడుపుతో మొదలై, ఏడుపుతో ముగిసేదే మన జీవితం. అందుకే మనం అందులోనే ఆనంద క్షణాలని మాత్రమే గుర్తుంచుకోవాలి.