“భార్యా మణీ! నువ్వెంత లీడింగ్ లాయర్ వైనా ఫైనల్ జడ్జిమెంట్ మాత్రం నాదే .నాకు అబ్బాయే కావాలి.”
“ అభ్యంతరము లేదు పదండి అనాధ శరణాలయం నుంచి అబ్బాయిని దత్తత తెచ్చుకుందాం .”
“అంత ఖర్మ నాకేం పట్టింది ? రేపు నీకు పుట్టబోయే బిడ్డ అబ్బాయే కావాలి.”
“అది మన చేతుల్లో వుందా?మన” క్రోమోజోమ్స్ “ ను బట్టి వుంటుంది.
“ఆ సంగతి నాకు తెలుసు . అందుకే టెస్ట్ చేసుకోమని చెప్పేది.”
“అంటే..మగబిడ్డ కాకపోతే చంపేస్తారా?”
“అంట పెద్ద మాటలు యెందుకుగానీ అబార్షన్ చేయించుకుంటావ్..థట్స్ ఇట్.”
“నాకు అలా చేయడం యిష్టం లేదు.అమ్మాయి అయినా అబ్బాయి అయినా నా దృష్టి లో ఒకటే.”
“యిక్కడ నీ దృష్టి గురించి గానీ నీ అభిప్రాయం గానీ డిస్కస్ చేయడం లేదు. నేను నా ఫైనల్ డెసిషన్ చెపుతున్నాను. అర్ధమవుతోందా?”
“యిందులో అర్ధం కాక పోవడాని కేముంది ?మీరు మీ ఫైనల్ డెసిషన్ చెప్పారు. నేను దానితో ఏకీభవిఒచాలన్న రూలేమీ లేదుగా.”
“అయితే నా మాట వినవన్న మాట?”
“అదేమిటీ ఇందాక డెసిషన్ అన్నారు ..యిప్పుడు మాట అంటున్నారు.యిప్పుడు దేనిని నేను వినాలి ? మీ డెసిషన్ ప్రకారం నా గర్భస్త శిశువు అమ్మాయి అయితే చంపుకోవాలి..అదే మీరు చెప్పినట్లు అబార్షన్ చేయించుకోవాలి. ఇక పోతే మాట అన్నారు. మాట్లాడుకుందాం ..మీ డెసిషన్ మారొచ్చు.”
“చస్తే మారదు. మార్చుకోను కూడా .”
“ఓకే స్వామీ !మీరు మారొద్దు ..మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు.అయినా నా సందేహాన్ని తీర్చు కోవడం కోసం అడుగుతున్నాను. అమ్మాయికీ అబ్బాయికి తేడా ఏమిటి?”
“యిది కూడా చెప్పాలా ? అమ్మాయి అంటే మైనస్. పెంచాలి చదువు చెప్పించాలి కట్నాలు ధారపోసి అల్లుడిని కొనాలి.అదే అబ్బాయి అయితే? పెంచాలి చదువు చెప్పించాలి..అంతే.. కట్నాలు కానుకలతో కోడలు వస్తుంది. పైగా వీడు జాబు చేసి సంపాదిస్తాడు. యిదంతా ప్లస్ కదా ?”
“అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదా ?”
“అమ్మాయి సంపాదన అల్లుడి పరం .మధ్యలో సీమంతాలు కాన్పులు ..అంతా మైనస్సే. ఈ మైనస్ అంతా మనమీదే . అర్ధమయ్యిందా?”
“అయ్యో! యిందులో అర్ధం కాక పోవడాని కేముంది.తెలుగులో జడ్జి మెంట్ ఇచ్చినంత క్లియర్ వుంది.అయితే నాదో స్మాల్ డౌట్. అసలు అబ్బాయిలకు పెల్లిళ్ళు అవడమే గగనమై పోతున్న ఈకాలంలో కట్నాలు కానుకలు తెచ్చే కోడలు ? అబ్బాయి వుద్యోగం చేసి జీతం తెచ్చి అమ్మా నాన్నల దోసిళ్ళలో పోస్తాడు అనే మీ వూహ బాగానే వుంది కానీ వాడి పెళ్ళాం సంగతేమిటీ ? ఒకవేళ మీరన్నట్లు కట్నాలు కానుకలతో వీడిని కొనుక్కున్న కోడలు మీదోసిట్లో జీతం పోస్తుంటే చూస్తూ వూరుకుంటుఒదా?”
“నీకు లక్ష అనుమానాలున్నా నా అంతిమ తీర్పు మారనుగాక మారదు.”
“తీర్పు మార్చుకోమని చెప్పడం లేదు. లోకం తీరు గురించి మాట్లాడుతున్నా .”
“సరే ఇంతకీ చెకింగ్ కు వెళుతున్నావా ?లేదా?ఓకే అంటే నా డాక్టర్ ఫ్రెండ్ కు చెప్పాలి.. వాడసలే బిజీ.”
“చెప్పండి.వెళ్తాను.రిజల్ట్ వచ్చాక కదా మన ఘర్షణ .”
“మళ్ళీ నన్ను అనొద్దు .అమ్మాయే అని తేలితే అబార్షన్ మాత్రం తప్పదు యిప్పుడే చెపుతున్న.”
“ముందు టెస్ట్ అవనివ్వండి . టెస్ట్ అవగానే నేను కోర్ట్ కెళ్ళి సాయంత్రం వస్తాను. అప్పుడు మాట్లాడుకుందాము.”
లాయర్ అపూర్వ మరో మాటకు అవకాశఒ యివ్వకుండా బయలుదేరి పోయింది .
సిటీ లో పేరు మోసిన బిల్డర్ మోహన్ రావు భార్య వెళ్ళిన వైపు చూస్తూ తన మాటే నెగ్గినందుకు గర్వంగా ఫీలైపొతూ మీసాలు దువ్వేసుకున్నాడు.
******
సాయంత్రం ఆరు దాటి పోయింది.
హడావుడిగా ఆత్రుతగా వచ్చిన మోహన్
“పూర్వా..అపూర్వా !వేర్ అర్ యూ?”
గట్టిగా షౌట్ చేసుకుఒటు హడావుడి పడిపోతున్న భర్తను కూల్ గా చుస్తూ
“పది దాటితే గాని ఇంటి ముఖం చూడని మీరు ఆరింటికే వచ్చేసారంటే అమ్మాయిని చంపాలనా అబ్బాయిని పెంచాలనా?”
“జోకులాపి విషయం చెప్పు తల్లీ!కాయా పఒడా?”
“కాయంటే ఏమిటి..పండంటే ఏమిటీ ?”
“కాయంటే అమ్మాయ్.. పండంటే అబ్బాయ్. “
“అబ్బోతమరి కి చాలా కోడ్ భాషలొచ్చే ..అయితే నేనూ అదే భాషలో చెపుతా..మ్మా.”
“అర్ధం కాలేదు.”
“కాకపోవడాని కేముఒది మహాశయా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మూడే అక్షరాలు. మొదటి చివరి అక్షరాలు సేమే ..
మధ్యలో వున్న అక్షరాలే తేడా . అమ్మ అనిపిఒచేది అమ్మాయి.అబ్బా అనిపించేది అబ్బాయి.”
“సోదాపి సూటిగా చెప్పు ..అంటే అబార్షనా?”
“కాదు కాదు కానే కాదు.”
“మరీ?మ్మా అన్నావు..అంతే అమ్మాయి అనేగా ?”
“ఔను అమ్మాయే అన్నాను..అబార్షన్ అనలేదుగా ?”
“మార్నింగే నేను చెప్పాగా ?”
“నేను కాదన్నానా?చెప్పింది మీరు నేను కాదుగా?”
“అంటే?అమ్మాయినే కంటానంటావ్?”
“అబ్బా నా మనసు చదివినట్లు యెంత కరెక్ట్ గా చెప్పారో థాంక్స్ అండీ”
“అంతా నీ యిష్టమే నన్నమాట? మొగుడి మాటకు విలువ లేదా ?”
“కోర్టులో జడ్జిగారు మేము చెప్పింది అంతా వింటారు. విలువ చేసే మాటకే విలువిచ్చి తీర్పు యిస్తారు. యిదీ అంతే .మీరు చెప్పారు .విన్నాను .మాటలో విలువ వుఒటే విలువ యిస్తాను.లేదంటే లేదు.”
“అంతే యిప్పుడు తమరు జడ్జి అన్న మాట ?”
“నా విషయాలలో ఎప్పుడు నేనే జడ్జిని. ఇది నా విషయం . నాకు పుట్టబోయే నా బిడ్డ విషయం .”
“అయితే ఈ విషయంలో నేను కూడా జడ్జినే ..నన్ను నామాటను ఖాతరు చేయని నీతో ..”
“కలిసి వుండడం సాధ్యం కాదు అంటారు.సూపర్ జడ్జిమెంట్ సర్. ఐ అప్రిషియేట్ యువర్ వేల్యూబుల్ జడ్జిమెంట్ సర్.”
“నేనేదో జోక్ చేస్తున్నానని అనునుకుఒటున్నావా?ఐ మీనిట్”
“నేనేమీ ఆషామాషీగా తీసుకోవడం లేదు.లాబ్ లో రిజల్ట్ వినగానే మీ తీర్పు ఈ క్లైమక్స్ సీన్ వూహిఒచేసుకున్నాను. “
“అయితే యింకా ఆలస్యమెఒదుకు ?”
“ఆలస్య మఒటు ఏమీలేదు. మీ తీర్పు రాగానే మావాళ్ళకు మెసేజ్ యిచ్చాను. వాళ్లు రాగానే నా సామానుతో నేను వెళ్ళిపోతాను. కేవలం సామానే.మీకు మా నాన్న గారు ధారపోసిన కట్నం అడుగుతానని కంగారు పడకండి.వేసిన ముష్టి చేసిన దానం తిరిగి తీసుకునేంత అల్పురాలిని కాదు. అయితే వెళ్ళేముందు చిన్న మాట ..చిన్న సలహా ..వింటే వినండి లేదా మర్చిపోండి. మీకు విడాకులుయెప్పుడు కావాలంటే అప్పుడు రండి.సంతకం పెట్టేస్తాను. పునర్వివాహం చేసుకోండి.కానీ కన్య ను కాదు. రేపు ఆ అమ్మాయికీ నాలాగే అమ్మాయే పుడితే మళ్ళి యిదే క్లైమక్స్ . యెంత అద్భుతమైన క్లైమక్స్ అయినా రెండోసారి బోరింగ్. అందునా యిలాంటి క్లైమాక్స్ అయితే పరమ నీచంగా వుంటుంది.అందుకని అబ్బాయిని కని భర్తను కోల్పోయిన ఓ అమ్మాయిని చేసుకొని అబ్బాయికి తండ్రిని అనిపించుకోండి.మీ జీవితాశయం నెరవేరుతుంది..ఓ అభాగ్యు రాలికి అండ దొరుకుతుంది. యెందుకు చెపుతున్నానంటే మీరు మీ జీవితంలో అబ్బాయికి తండ్రి కాలేరు కాబట్టి.అదిగో మా వాళ్ళు వచ్చేసారు . సాయంత్రం నాలుగు గంటలకే వచ్చి నా సామాను సర్దుకొని “నా” సారీ మీ యింటి వెనుక వరండాలో పెట్టించాను.ఇక సెలవు భర్త గారూ !
సారీ మాజీ భర్త గారూ.!
హుందాగా బయటికి అడుగులేసిఒది ..లాయర్ అపూర్వ.
********
“అరే మోహన్ ! నేన్రా డాక్టర్ సందీప్ ని .ఎలావున్నావ్ ! ఒన్నియర్ తెర్వాత నిన్ననే స్టేట్స్ నుంచి వచ్చాను. రేపు మా హాస్పిటల్ యానివర్సరీ.ఫంక్షన్ వుంది. సాయంత్రం నువ్వు నీ లాయర్ భార్య తో రావాలి.అన్నట్లు మీ వంశోద్దారకుడిని మాత్రం మర్చి పోకు. అన్నట్లు ఏమి పేరు పెట్టావు. త్వరలో సెకండ్ బర్త్ డే వచ్చేస్తుంది కదూ? నేను తప్పకుండా వస్తాను. బై రా మోహన్ .”
*******
“రండి ! మీరు వస్తారని ఒన్నియర్ నుండి యెదురు చూస్తున్న ఆ రోజునే మూచువల్ అగ్రీ మెంట్ డివోర్స్ పేపర్ మీద సైన్ చేసి ఆఫీసులో ఫైల్ లో పెట్టి ఉంచాను.వన్ మినిట్.”
“నేను దానికోసం రాలేదు.”
“ఓ సారీ ఇన్విటేషన్ యివ్వడానికొచ్చారా?కంగ్రాట్స్ .”
“అపూర్వా! నన్ను యెందుకు మోసం చేసావు?యెందుకు అబద్దం చెప్పావు? డాక్టర్ సందీప్ ఫోన్ చేసాడు. ఆరోజున నీకు పుట్టబోయే బిడ్డ అబ్బాయని చెప్పాడా లేదా ?మరి అమ్మాయని నాకు యెందుకు చెప్పావు?”
“ఓ అదా? అవును ...డాక్టర్ అబ్బాయనే చెప్పారు. అన్ని టెస్ట్ లూ వంద శాతం కరెక్ట్ కావాలన్న రూలేమీ లేదుగా? రేపు పొరపాటున అమ్మాయి పుడితే ? పరిస్థితి ఏమిటి ? పుట్టిన బిడ్డను పురిటిలోనే చంపేసి..మీ పురుష అహంకారాన్ని చూపిఒచుకునే వారు కదా ? ఆ భయంతోనే అలా చెప్పాను.అందుకే మీకు దూరంగా వచ్చేసాను. యిప్పుడు డాక్టర్ చెప్పిన టెస్ట్ రిపోర్ట్ విని ఎందుకు నన్ను మోసం చేసావు అని అడగడానికి వచ్చారన్న మాట సెహభాష్!”
“అపూర్వా ! అయిపొయిందేదో అయిపొయింది. యిప్పుడు గతాన్ని తవ్వుకోవడం అవసరమంటావా? తప్పు చేయక పోయినా నేనే సారీ చెపుతున్నాను. నాతో వచ్చేయ్ .”
“వెరీ గుడ్ చేంజ్ ..తప్పు చేయ లేదు .అయినా సారీ చెపు తున్నానని మీకు మీరే కాండక్ట్ సర్టిఫికెట్ యిచ్చేసుకుని మీ వీపు మీరే చరిచేసుకుంటున్నారు. మీరన్నట్లు గతం తవ్వుకోవడం వేస్ట్. ఐ టూ అగ్రీ .ముష్టి ఐదుసంవత్సరాల గతం. మరి భవిష్యత్తు?అరవై డెబ్బై సంవత్సరాలు.యిప్పుడు తమరు వచ్చింది నాకోసం కాదు వంశోద్దారకుడవుతాడని ఓ సారీ ప్లస్ అవుతాడని నమ్ముతున్న అబ్బాయికోసం? యామై కరెక్ట్? మరి రేపు అమ్మాయి నా కడుపున పడితే ? భ్రూణహత్య?నేనీ హత్య చేయలేను.నన్ను మన్నించి నన్ను వదిలేయఒడి.”
చేతులెత్తి దండం పెట్టింది అపూర్వ.
“మరీ అంత దారుణంగా యెందుకు ఆలోచిస్తావు? రేపు నీకు అమ్మాయి పుట్టినా నాకు సంతోషమే.”
“పుడితే సంతోషం ..అసలు పుట్టనిస్తేకదా? హాస్పిటల్లో పుట్టిన బిడ్డలు అమ్మ ఒడిలోనుఒడే మాయమైపోతున్నారు. అమ్మాయిలు నర్సుల మాయతో అబ్బాయిలైపోతున్నారు. రేపు నా కూతురిని మాయ చేయడం మీకో లెక్కా?”
“మరీ యింత దారుణంగా మాట్లాడుతావనుకోలేదు.” మోహన్ అవేశ పడిపోయాడు.
“మరి ఏమనుకున్నారు? బిస్కట్ చూపిస్తే తోక వూపుకుఒటు వచ్చే కుక్క పిల్లలా వచ్చేస్తాననుకున్నారా? వ్యక్తిత్వం చచ్చిన తల్లిననుకున్నారా ?నా బిడ్డ జీవితం లో స్వంత బిడ్డల్ని చంపుకునే కిరాతక మనస్తత్వమున్న నీలాంటి నీచుల నీడ కూడా పడడానికి నేను అంగీకరించను. రేపు నా బిడ్డ మీ కుళ్ళిపోయిన చెత్త భావాలతో పెరిగి మీ లాగే అమ్మాయిలను చంపుకునే మృగాడుగా మారితే వాడి మూలంగా మరో మగువ జీవితం కూడా యిలాగే నా జీవితం లానే అయిపోతుంది కదా ?ఆ పాపం నేను మూట కట్టుకోలేను.
అమ్మాయిల్ని కంటున్న భార్యలు కూడా అమ్మాయిలే కనుక వాళ్ళు చీరలో నగలో అడిగితే వాళ్ళను కూడా మైనస్ క్యాటగిరీ లో లెక్కించి చంపేయ రన్న భరోసా వుందా? అయినా రాక్షస మనస్తత్వ మున్న కంసుడి వారసులు మీరు. పసి పాపల ప్రాణాలు తీసే శిశు హంతకులను ఉరికంబం ఎక్కించాలి . అమ్మకీ అమ్మాయికీ ఒక్క అక్షరమే తేడా. నిన్ను కన్నతల్లి అమ్మాయే .అమ్మాయిని చంపుకుంటే అమ్మను హత్య చేసినట్లే ..పఒదులకు పన్నీరు పరమ అసహ్యంగా వుంటుంది. కంపుకొట్టే మురుగే ...మీలాంటి పందులకు ఇంపు ..ఇంకా అర్ధం కాలేదా?
మీకు వచ్చిన దారి గుర్తుఒటే యెలాంటి గొడవా ఉండదు.
నేను చూపిస్తే మాత్రం కిడ్నాప్ కేస్ లో అరెస్ట్ చేయబడి పోలీస్ లాటీ దెబ్బలు తిని స్టేషన్ సెల్ చువ్వలు ఇంచక్కా లెక్కబెట్టుకోవచ్చు బిల్డర్ గారూ! ఊహించు కోఒడి.
లాయర్ని కాబట్టి సలహా నాది..క్లైంట్ కాబట్టి ఛాయిస్ మీది మై డియర్ మాజీ హస్బెండ్. “
మరో మాటకు తావు లేకుండా మాయమైపోయాడు శిశు హంతకునిగా మారాలనుకున్న మో..హ..న్..దేభ్య ముఖఒతో.
“యింత నిక్రుష్టుడా నా మాజీ ..వీడితోనా తను యింతకాలం కాపురం చేసింది? ” విరక్తిగా నవ్వుకుంది లాయర్ అపూర్వ.