మిస్సింగ్ మిస్టరీ - ..సుంకర వి. హనుమంత రావు

missing mistery

“బాలీ !శాoడిల్యా హియర్! మాజీఎంఎల్యే రామిరెడ్డి గారిని నీ ఆఫిస్ కు పంపిస్తున్నాను. పది రోజుల క్రితం తమ కూతురు మిస్సింగని మాకు కంప్లయిoట్ యిచ్చారు.మా డిపార్టుమెంటు అన్ని విధాలా ప్రయత్నించి చేతులెత్తేసింది.ఫైల్ క్లోజయ్యే స్టేజి .

రామిరెడ్డిగారి పోలిటికల్ ప్రెజర్ తట్టుకోలేక నీకు రిఫర్ చేస్తున్నాను . టైంచెపితే రెడ్డిగారు నిన్ను కలుస్తారు.”

“శాoడిల్యా ! నీకు టైం నేను యివ్వడమా? వాట్ ఏ జోక్.. యాజ్ యూ ప్లీజ్ ..”

“అయితే యిప్పుడే పంపిస్తాను..”

ఆరడుగుల ఎత్తు..ఖాదీ డ్రెస్సు ..అహంకారానికి ..దర్పానికీ అద్దంపట్టేలా క్లీన్ షేవ్ కోరమీసం తో తనముందు కూర్చున్న రామిరెడ్డిని చూస్తూ..బాలీ

“వివరాలు చెప్పండి. మేము ట్రై చేస్తాము.స్టెల్లా రికార్డు చెయ్.అవినాష్ ! జాకీని అర్జంట్ గా రప్పించు.”

“బాలీ సాబ్ ! నాకూతురు పదిహేను రోజులక్రితం తప్పిపోయింది. పదిరోజులు క్రిందట పోలీస్ లకు రిపోర్ట్ చేసాము.”

“ఐదురోజలు ఎందుకు వేస్ట్ చేసారు?”

“మావాళ్ళతో వెదికించాను. ఆచూకీ దొరకలేదు.అందుకే పోలీసు స్టేషన్ లో రిపోర్ట్ చేసాను.”

“అవన్నీ ఏసిపి గారు చెప్పారు. అమ్మాయి పూర్తివివరాలు యివ్వండి. “

“అమ్మాయి పేరు అనుష్కారెడ్డి.నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. యిది తనఫోటో.
మారెండో అమ్మాయి అవంతికా రెడ్డి కూడా అదే కాలేజిలో సెకoడియర్లో వుంది.”

“రెడ్డి గారూ! నేను కేస్ తీసుకుoటున్నాను. సాధ్యమైనంత త్వరలో కేసు సాల్వ్ చేస్తాము. రిసెప్షన్లో మాఅమ్మాయి శిరీష వుటుoది .తనతో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి.”

****

బాలీ ముందు కూర్చున్న అవినాష్ జాకీ స్టెల్లా శిరీషలు ఆయన సీరియస్ ముఖాన్నే చూస్తూ వుండిపోయారు.

“ఈ కేసును మనం డిఫరెంట్ యాంగిల్స్ లో పరిశోధిoచాలి.ఆల్రెడీ పోలీసులు ట్రైచేసి ఫెయిల్ అయిపోయారు అనుష్కారెడ్డి కోసం అన్ని రాష్ట్రాల్లో జల్లెడ పట్టేశారు. ఆ కోణాల్లో మనం మళ్ళి ప్రయత్నించడం వేష్టని నా అభిప్రాయం. క్రైం బ్రాంచ్ నుండి టోటల్ ఫైల్ మనకు ఫార్వార్డ్ చేస్తానని శాండిల్యసర్ చెప్పారు .అoదరూ స్టడీ చేయండి. లక్కీగా పోలీస్ టచ్ చేయని కోణం మనకు టచ్ అవుతుందేమో ? “

శిరీష తన స్మార్ట్ ఫోన్ లో వచ్చిన ఫైలును అందరి మెయిల్స్ కు ఫార్వార్డ్ చేసిoది.

“అవినాష్ ! మనం ఒకసారి ఎంఎల్యేగారి ఇంటికి వెళ్ళాలి . శాoడిల్యను కూడా రమ్మని చెప్పు. గర్ల్స్ మీరుకూడా రావాలి. అవంతికారెడ్డి మీటార్గెట్. అర్ధమైందా ?”

“ఎస్ బాస్!”

*****

“ రామిరెడ్డి సర్ పొలిటికల్ మీటింగ్ లో వున్నారు.ప్లీజ్ కమిన్.”

ఎంఎల్యే సెక్రటరీ వెల్కం చెప్పాడు.

“అవినాష్ ,జాకీ ! తోటమాలి డ్రైవర్ సర్వెంట్స్.. యువర్ టార్గెట్.నేను శాoడిల్యా సైట్ సీయిoగ్ ”

ఓకే బాస్ !

దాదాపు మూడు ఎకరాల్లో కట్టిన బిల్డింగది.

“శాoడిల్యా ! మన ఎంఎల్యే ఎక్స్ అయినా చాలా రిచ్ గా కనిపిస్తున్నాడు ..పెద్దలు యిచ్చిందా? పాలిటిక్స్ పంచిందా?”

“కట్టు బట్టలతో వచ్చి కార్యకర్తగా పనిచేసి రెండు మూడు జండాలు మార్చి భూకబ్జా దందాలతో ఈస్థాయి కొచ్చాడనేది జగమెరిగిన సత్యం.పోలీస్ స్టేషన్లలో చాలా కేసులు పెండింగ్ లో వున్నాయి.మొన్నటివరకు అధికారపార్టీ వాడు కాబట్టి బయటకు తీయలేదు.”

“వేషాన్ని మీసాల్ని బట్టి నేను వూహించాను.ఈ మూడు ఎకరాల స్థలం ఇల్లూ చూడగానే అర్ధమై పోయింది.”

“అర ఎకరంలో బిల్డింగ్ కట్టి మిగతా స్థలంలో గార్డెన్ పెంచాడు. కూతుళ్ళకోసం టెన్నిస్ కోర్ట్ .”

“అంతా ప్రజలసొమ్మే ..అయినా ఈనాటి రాజకీయ నాయకుల స్టైలేయిది .దొరకనంత వరకూ అoదరూ దొరలే . ఓకే శాoడిల్యా మనం ఒక్కసారి సెక్రటరీ తో మాట్లాడాలి . చిన్న డౌట్ క్లారిఫై చేసుకుంటే ఈ కేసుకు పనికొచ్చే క్లూ దొరుకుతుoదనిపిస్తోoది

******

“బాస్! అనూషారెడ్డి గురించి అంతా పాజిటివ్ ఇంఫర్మేషనే. అందరికీ యిష్ట మైన అమ్మాయి. తండ్రి గుణాలు ఒక్కటి కూడా రాలేదని కుక్ చెప్పి ఏడ్చేసింది.పోతే యిరవై రోజులనుండి తోటమాలి ఆబ్సెంట్. వూరిలో తనవారికి బాగోలేదని సెలవు పెట్టాడట. “

అవినాష్ రిపోర్ట్ పూర్తి అవగానే స్టెల్లా శిరీషలు తమ స్మార్ట్ ఫోన్స్ టేబుల్ మీదపెట్టి

“బాస్ ! అనుష్కారెడ్డి కి సంబంధించిన అన్నియాంగిల్స్ కవర్ చేసాము. శిరీష చెల్లి కి అవంతికారెడ్డి క్లాస్ మేట్ .పోలీస్ ఫైల్ కందని క్లూఒకటి సంపాదించాము. అనుష్కా మదర్ పదిహేను రోజులనుండి హాస్పిటల్లో వుంది. ఈ విషయo చాలా గోప్యంగా దాచారు.మాకు మదర్నిపరిచయం చేయమంటే శిరీషకు రహస్యంగా చెప్పింది.అనుష్కా సెల్ లోవున్న ఫోటో చూపించి అడిగితే భయపడుతూ మరో రహస్యం చెప్పింది.”

“స్టెల్లా ! ఈ ఫోటోలు ఏమిటీ ?చాలా క్లిక్ చేసావు.”

“బాస్! మీకు చెప్పాలంటే ..ఓకుక్కకధ అని మొదలుపెట్టి జీడిపాకం సీరియల్ చెప్పాలి.”

“చెప్పు ..ఏమో గుర్రం ఎగురుతుoదేమో ? కుక్కపిల్ల క్లూ యిస్తుoదేమో?”

“ఈ పప్పీ పేరు గొల్దీ. గోల్డెన్ రిట్రివర్ బ్రీడ్ .క్యూట్ గా వుంటుంది. ఫ్రెండ్లీ గా వుంటుంది. చాలా విశ్వాసం గలది. నెట్ లో వెదికి మరీ కొనుక్కుంది. రోజూ అక్కాచెల్లెళ్ళు టెన్నిస్ ఆడేవారట.అక్క పాయింట్ సంపాదించగానే గోల్డీ అనుష్క మీదెక్కి ముద్దు పెట్టిoచుకోనేదట. అవంతిక పాయింట్ సంపాదిస్తే ముడుచుకుపోయేదట. అనుష్క పెడితేనే తినేదట . అనుష్క బెడ్ మీదే నిద్ర పోయేదట. ఈ లక్షణాలన్నీ పప్పీల లక్షణాలే. కానైతే నాజీడిపాకంలో భయంకరమైన ట్విస్ట్ టెన్నిస్ కోర్ట్ నుండి ఎత్తుకొస్తున్న అవంతిక చెయ్యి కొరికి మళ్ళీ అక్కడికే పారిపోవడం..అవంతిక కోర్ట్ లో కాలు పెడితే భయంకరంగా అరిచి ఆమె మీద అటాక్ చేయడం .కోర్ట్ లో నేనూ శిరీషా ఎత్తుకుంటే తోక వూపిన గోల్డీ అవంతికను చూసి భయంకరంగా అరిచేసేది. వీడియో కూడా వుంది చూడండి.

ఇది అవంతికా లెఫ్ట్ హ్యాండ్.

బేoడేజ్ తో వున్న చెయ్యి క్లోజప్ లో కనిపించింది.

అనుష్క కనిపించని రోజు నుండీ గోల్డీ చాలా డల్ అయిపోయి ఇంట్లో కట్టేస్తే భయంకరంగా మొరుగుతూ వుంటే ఎంఎల్యే గారు దాన్నిగార్డెన్ లో వదిలేయండి అన్నారని వదిలేస్తే గోల్డీ తిన్నగా వెళ్ళి టెన్నిస్ కోర్ట్ లోనే సెటిలై పోయేదట. యెవరు ట్రైచేసినా ఇంట్లోకి వచ్చేదికాదట. పాపం అనిపించి అవంతిక బలవంతంగా ఎత్తుకు వస్తుంటే చెయ్యి కొరికేసి పారిపోయిoదట.

మేము టెన్నిస్ కోర్టులో తిరుగుతున్నప్పుడు అవంతిక ముఖంలో యెంత భయం కనిపించిందంటే..మీరే చూడండి చాలా క్లోజ్ లో వీడియో తీశాను. బాస్ మేము అవంతికతో గార్డెన్ లో తిరుగుతున్నప్పుడు ఎవరో బిల్దిండ్ పైనుండి బైనాక్యులర్స్ తో మమ్మల్ని గమనిoచారు.”
“వెల్డన్ గర్ల్స్.

“అవినాష్ ! ఈ సెల్ని బిగ్ స్క్రీన్ కీ క్రోంకాస్ట్ తో అనుసంధానం చెయ్యి.మనం చూసి అనలైజ్ చేద్దాం.

జాకీ ! దీన్ని నీసెల్లోకి డౌన్లోడ్ చేసుకో. కాలేజీకీ వెళ్ళు. ఇన్ఫర్మే షన్ సంపాదించు . ఈప్రాసెస్ అంతా సీక్రెట్ గా జరిగి పోవాలి. యిందులో ఏదో పొలిటికల్ గేం ఇన్వాల్వ్ అయి వుందని నాఅనుమానం. శాoడిల్యాసర్ హెల్ప్ తీసుకో. బికాషియస్ .” జాకీ వెళ్ళిపోయాడు.

“అవినాష్ ! జాకీ రిపోర్ట్ రాగానే మనం డిస్కస్ చేద్దాం .ముందు మన అమ్మాయిల వీడియోలు చూడాలి తర్వాతే ఏదైనా ..”
ఆఫీస్ బాయ్ జానీ పొగలు కక్కుతున్న కాఫీమగ్ లతో ఎంటరై పోయాడు.

అవినాష్ ! సెల్ల్ఫోన్ని క్రోంకాస్ట్ తో ఫిఫ్టీ ఇoచెస్ టీవీమానిటర్ కు అనుసంధానం చేసాడు.

ఫస్ట్ షాట్ ..ఎంఎల్యేబిల్దింగ్.

సెకండ్ షాట్ అనుష్కారెడ్డి స్టడీరూం .

థర్డ్ షాట్ అనుష్కా గోల్డీ ఫోటోలు.

ఆ తర్వాత ఛానల్ విడియోగ్రాఫర్లా ఇల్లంతా కవర్ చేసింది శిరీష

దాదాపు అరగంట ప్రోగ్రాం .

స్టెల్లా ఫోన్ కనెక్ట్ చేసాడు అవినాష్.

టెన్నిస్ కోర్ట్ ను కవర్ చేసిoది.

బాల్ బయటికి పోకుండా చుట్టూ నెట్ కట్టివుంది. కోర్ట్ కు నార్త్ ఈస్ట్ కార్నర్ లో నెట్ ను ఆనుకొనే రెండు క్యుబికల్ టైప్ మోడరన్ బాత్ రూమ్స్ .

“అవినాష్ ! పాస్ చెయ్. నేను గమనించి సెక్రెటరీ ని అడిగాను. బెంగులూరు నుంచి తెప్పించి పదిహేను రోజుల క్రితమే ఎరక్ట్ చేయించారట.ఓకే ప్రొసీడ్.”“బాస్ !జాకీ ఆన్ లైన్”

“ఓకే !జాకీ !

గుడ్ ఇన్ ఫర్మేషన్ . కం టుద ఆఫీస్.

నేను శాండిల్యసర్ ను కలిసి వస్తాను. నౌ ఎవ్విరిథింగ్ క్లియర్.

స్టెల్లా శిరీషా! కంగ్రాట్స్..మీ విడియోలతో క్రొత్త కోణం ఆవిష్కరించారు. బీరెడీ ఫర్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇన్ యువర్ జీళ్ళపాకం సీరియల్.”
బాలీ వెళ్లిపోతుంటే అమ్మయిలిద్దరూ అవినాష్ వంక ట్విస్ట్ నీకుఅర్ధం అయ్యిందా ? అన్నట్లు చూసారు.

“నోనోనో “ అన్నట్లు మూడు సార్లు మూడు రకాల ఎక్స్ ప్రెషన్స్ యిచ్చాడు అవినాష్..”

*****

“శాండిల్యా ! నీకు రామిరెడ్డి బాగా తెలుసా?”

“ఎమ్యెల్యే గా వున్నప్పుడు కలిసిన గుర్తు.కబ్జాల మీద కంప్లైంట్స్ వచ్చినా పొలిటికల్ ప్రెజర్ తో అవన్నీ వెలుగు చూడ లేదు. మళ్ళీ ఈ కేసులోనే కలిసాడు.”

“ప్రస్తుతానికి వస్తున్నాను.ఎంఎల్యే బిల్డింగ్ ఒక్కరోజు నాకు హ్యాండ్ ఓవర్ చేయగలవా?దట్ టూ ఇన్ ఎంప్టీ పొజిషన్?”

“సాధ్యం కాకపోవచ్చు. బయటికొస్తే ఆపార్టీ ఎమ్మెల్యేలు గొడవ చేస్తారు.”

“అఫిషియల్ గా అయితే నొ ప్రోబ్లం. కమీషనర్ తో మాట్లాడుతాను.”

“ పోనీ ఒకపని చేయగలవా?మార్నింగ్ టు ఈవెనింగ్ ఎమ్మెల్యేని కమీషనర్ ఆఫీస్ లో కదలకుండా చేసినా చాలు.”

“ఓకే ! పాత కబ్జా కేసు ఫైల్ ఓపెన్ చేయిస్తాను. నాఆఫీసుకే పిలిపిస్తాను.యిప్పుడు రూలింగ్ పార్టీ లో లేడు కాబట్టి నోప్రోబ్లం.”

“పోతే ఎమ్మెల్యే భార్య కిమ్స్ లో వుంది. డాక్టర్ ని మేనేజ్ చేసి చిన్న ఎమర్జెన్సీ క్రియేట్ చేయిస్తే అనీషా రెడ్డి డ్రైవర్ తో హాస్పిటల్ కు వెళ్తుంది. మిగిలింది సెక్రటరీ కుక్ సెక్యూరిటీ .”

“అది మా పోలీస్ చూసుకుంటారు . “

“గోల్డీవిషయం మాస్టెల్లా శిరీషలు చూసుకుంటారు. “

“ మన ఆపరేషన్ పూర్తి అయ్యేంతవరకు మేటర్ లీక్ కాకూడదు.ఎమ్మెల్యేకి విషయo అస్సలు తెలియకూడదు .”

“బాలీ ! ఒకవేళ తెలిసినా కేసు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయి వుంది కాబట్టి మా డిపార్టుమెంటు వాళ్ళు అనుమానంతో యాక్షన్ చేపట్టారని చెపుతాము. యూ ప్రొసీడ్. యింతకీ నీ అనుమానం అమ్మాయిని ఇంట్లో బoధించారనా?

“ఎస్ యూ కాచ్ మై పాయింట్.”

*****

కమీషనర్ ఆఫీస్ ..మీటింగ్ హాల్.

సాయుధులైన పోలీస్ ఆఫీసర్లతో హడావిడిగా వుంది. సెలెక్టెడ్ చానెల్స్ కు మాత్రమె ప్రవేశం .డయాస్ మీద పోలీస్ కమీషనర్ బాలీ శాండిల్య లతో బాటు ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకులు ఆసీనులయ్యారు. కమీషనర్ మైక్ ముందుకు వచ్చి అందరిని చూస్తూ.

“ఇది ఒక సంచలనాత్మక కేసు. మా డిపార్ట్ మెంటు తీవ్రంగా ప్రయత్నించి ఏమీ చేయలేక చేతులు ఎత్తేసింది. అటువంటిది మిస్టర్ బాలీబృందం మూడు రోజుల్లో పరిష్కరించారు. ఐ యాం వెరీ ప్రౌడ్ అఫ్ దెమ్. అంతేకాదు మా డిపార్ట్ మెంట్ తరఫున హృదయపూర్వక అభినందనలు.”
డిటెక్టివ్ బాలీ మైకు తీసుకున్నాడు.

“కమీషనర్ గారన్నట్లు ఈ కేసులో హీరోలం మేముకాదు.ఈ క్రెడిట్ మాది కాదు ” సభలో వున్నవారంతా విస్తుబోయి చూసారు.

“ఎస్ ఐ మీనిట్ .అసలు హీరోని మీకు పరిచయం చేస్తాను.”

పిన్ డ్రాప్ సైలెన్స్ .డయాస్ లెఫ్ట్ సైడ్ నుండి గోల్డీ తో వస్తున్న స్టెల్లా శిరీషల ను చూస్తూ

“ఈ అమ్మాయిలా హీరోలు ?“ అనుకుoటు విస్తుబోతున్న జనాలను మరింత కన్ఫూజ్ చేస్తూ

“హి ఈజ్ ద హీరో గోల్డీ “

అమ్మాయిల చేతుల్లోని కుక్క పిల్లను పైకెత్తి చూపుతూ

“మిస్సయి పోయిన అనుష్కారెడ్డి పెట్..మా కేసులో పెద్ద ట్విస్ట్.

మిస్టర్ శాoడిల్యా కేసును మాకు యిస్తూ ఒక్కమాటన్నారు. మేము అన్నికోణాలూ టచ్ చేసామని. పొలిటికల్ ప్రెజర్ మూలంగా టచ్ చేయని కోణాలే ఎక్కువ పోలీస్ కేసుల్లో .

అందుకే మేము మరో యాంగిల్ నుంచి ఫోకస్ చేసాము.

“రామాయణంలో పిడకలవేట” అనుకోకుండా ఈచిన్న కధ వినoడి .

“దాదాపు నాలుగు సంవత్సరాల క్రిందట ఎంసెట్లో ఓ ఆటో డ్రైవర్ కొడుకు మనతెలుగు వాడు ఆరో రేంక్ సాధించాడు.మీరంతా మీఛానళ్ళలో ఆకాశాని కెత్తేశారు.”
“అవును సర్ !నాకు గుర్తుంది ..పేరు సారధి ..పార్ధసారధి.”

అతన్నిఅతని తెలివి ఆకాశoలో నిలిపితే ..పేదరికం తక్కువ జాతివాడన్నచిన్నచూపు అతన్ని అధపాతాళానికి తొక్కేసాయి.”

“బాలీసర్! యిప్పుడు పార్ధసారధి విషయం ?”

“తప్పదుమరి .. అతనే మన కధలో రియల్ హీరో.”

దాదాపు అoదరూ ఆచ్చర్య పోయారు.

“ఇది మా పోలీసులకందని కోణం.”

“కాదు కమీషనర్ సర్ ! అందింది..కానీ తొక్కిపెట్టబడింది.”

అనుష్కారెడ్డి..కనిపిoచని అమ్మాయి.మనకు కనిపించేది కాదుగానీ గోల్డీకి ప్రతి క్షణం టెన్నిస్ కోర్ట్ లో కనిపించేది.”

“అదెలాసాధ్యం బాలీ సర్!”

“గోల్డెన్ రిట్రివర్ జాతి వేటగాళ్ళకు ట్రాక్ చేయడంలో..స్నిఫ్ చేసి వస్తువుల్ని పసిగట్టడంలో హెల్ప్ చేస్తాయి.అదే పద్ధతిలో భూమిలో పాతిపెట్టబడిన తన యజమానిని గుర్తించి అక్కడే ఉండిపోయింది.”

ఒక్కసారిగా హాహాకారాలు..

“అమ్మాయిని చంపి అక్కడపాతేసారా? షూట్ హిం ఎట్ సైట్?”

కమీషనర్ కోపం తో వూగిపోయారు.”

“కమీషనర్ గారూ ! పూర్తిగా వినండి. “

ఆ రోజు తప్పిపోయిన కూతుర్నివెదికిపెట్టమని ఒకడు ..ట్రిమ్ గా షేవ్ చేసుకొని అట్టహాసంగా కోరమీసాలతో సినిమా విలన్ లా ఆఫీస్ కొచ్చాడు. అప్పటికి కూతురు కనిపిoచకుoడాపోయి పదిహేను రోజులు.ముఖంలో ఆదిగులు కనిపించలేదు.

నేను ఏసిపి గారితో కలిసి తన ఇంటికి వెళి తే ముఖం చూపిoచడానికి భయపడిపోయి మీటింగ్ లో వున్నానని అబద్దం చెప్పించి టెన్నిస్ కోర్ట్ లో తిరుగుతున్న మా అమ్మాయిల్ని బైనాక్యులర్స్ తో గమనించాడు.మిస్టరీ టెన్నిస్ కోర్టులో వుందని వాడే చెప్పేసాడు.

అమ్మాయిని చంపి పాతిపెట్టిన చోట రెడీమేడ్ బాత్ రూoలు పెట్టించాడు.

ఆ ఘోరం చూసి షాకై పోయిన భార్యను హాస్పిటల్ లో జాయిన్ చేసి బ్రైబ్ చేసి బయటకు రాకుండా మేనేజ్ చేసాడు. కానీ నోరులేని గోల్డీని మరిచిపోయాడు.

కూతురి ప్రేమ విషయం తెలుసుకున్న వీడు కన్నప్రేమను మర్చిపోయి అహంకారాన్ని పరువు అనే పిచ్చి అపోహను నెత్తికెక్కిoచుకొని అబ్బాయిని పిలిపించుకొని నమ్మకంగా యిద్దరికీ విషం పెట్టి చంపి టెన్నిస్ కోర్ట్ ప్రక్కనే పాతిపెట్టి చేతులు దులిపేసుకొని ఆషాడభూతి లాగ తనే పోలీస్ లకు రిపోర్ట్ యిచ్చి ..ఇక ఈ కేస్ భూస్తాపితం అయ్యిందని నమ్మి ఏసిపి గారి ద్వారా మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు.

యిప్పుడు తెలిసిoదా పార్ధసారధి లింక్?

ఆటవిక భావాలతో అర్ధం లేని గొప్పల్ని వూహిoచేసుకొని పరువు హత్యలపేరుతొ మనిషి మృగంలా మారిపోతున్నాడు.
భూమిలోనుండి అనుష్క డెడ్ బాడీ ని బయటకు తీయగానే అరుచుకుoటు వచ్చి మట్టి ని కూడా లెక్కచేయకుండా అనుష్కారెడ్డి ముఖాన్ని నాకేసిన ఈ కుక్క పిల్లలో అమ్మ కనిపిoచింది గానీ ..జంతువుకాదు.”

మాటలు రాక మూగపోయిన డిటెక్టివ్ బాలీ ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ..

మాజీ ఎంఎల్యే ని తనగన్ పెట్టి షూట్ చేయాలన్న కోపాన్ని అణుచుకుoటు ..

“కన్నకూతుర్నికాల రాసిన హంతకుడిని అరెస్ట్ చేయండి “ ఆర్డర్ యిచ్చాడు కమీషనర్.*

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు