“బాస్! పోయినవారం హైటెక్ సిటీ లో జరిగిన నీరజ ఆత్మహత్య సిటీ లో చిన్న అలజడి క్రియేట్ చేసింది. మీకు గుర్తుండే వుంటుంది. యిప్పుడు నీరజ అమ్మా నాన్న మిమ్మల్ని కలవాలని వచ్చారు.శిరీష వివరాలు నోట్ చేస్తోoది. మీరు ఓకే అంటే?”
“వైనాట్? ఆస్క్ స్టెల్లా టు బ్రింగ్ దెం.”
దైన్యానికి ప్రతీకల్లా వున్న నీరజ తల్లి తండ్రుల్ని చూడగానే కని అల్లారుముద్దుగా పెంచి కట్నకానుక లిచ్చి పెళ్లి చేసిన అమ్మానాన్నల బ్రతుకు యింత దారుణంగా ఉంటుందా?
బాలీ ఆలోచనలను డిస్టర్బ్ చేస్తూ
“బాలీ గారూ! నాపేరు రామారావు. ఈమె నాభార్య రుక్మిణి. ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్న నీరజ మా పెద్ద కూతురు.కట్న కానుకలిచ్చి దాని జీవితం బాగుంటుందని పోయిన సంవత్సరమే పెళ్లి చేసాము. అల్లుడు సాఫ్ట్వేర్ ఇoజినీరని పొంగిపోయాము. నీరజ యెమ్బీయె చేసి బ్యాంకు లో ఉద్యోగం చేస్తోంది.యిలా అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడిoది అంటే మేము నమ్మలేక పోతున్నాము.”
కన్నీళ్ళు పెట్టుకున్నాడు రామారావు.
“రామరావు గారూ ! హత్య చేసారని మీరు నమ్ముతున్నారా?”
“అవును బాలీ గారూ!వంద శాతం నమ్ముతున్నాను.నా కూతురు పిరికిదికాదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు వేదిస్తున్నారని తల్లితో చెప్పేది. నేను సాధ్యమైనంత వరకు వాళ్ళను సంతృప్తి పరిచే వాడిని. అందరికీ బియ్యం పప్పు పండ్లు కూరగాయలు నేనే తీసుకెళ్ళి యిస్తుoడేవాడిని.”
“నీరజ అత్తామామాలతో కలిసి ఉండేదా?”
“కాదు బాలీగారూ..మామ బ్యాంకుమేనేజర్. బ్యాంకు దగ్గర ఫ్లాట్లో వుంటారు.ఆఫ్లాట్ కు యెదురుగానే నీరజ వాళ్ళ ఫ్లాట్. “
శిరీష.. పేపర్ కటింగ్స్ పెన్ డ్రైవ్ అoదిస్తూ
“బాస్ !ఇవి ఈ కేసు తాలూకు పేపర్ కటింగ్స్ .వీడియో క్లిప్పింగ్స్ పెన్ డ్రైవ్ లో లోడ్ చేశాను.”
“వెల్దన్ శిరీషా .. స్టెల్లా ..టేక్ దెం..స్టడీ అండ్ ప్రిపేర్ నోట్స్. ఫోన్ టు జాకీ అస్క్ హింటు రిపోర్ట్ ఇమ్మీడియట్లి.”
“రామారావు గారూ! నేను నీరజ కేసు తీసుకుంటున్నాను.ఏతల్లికీ తoడ్రికీ యిలాంటి కష్టం రాకూడదు . “
“పెళ్ళయిన ఏడు సంవత్సరాల్లో వధువు ఆత్మహత్య చేసుకున్నా అది డౌరీ హెరాస్ మెంట్ క్రిందకి వస్తుంది ..భర్తతో బాటు అత్తామామలని కూడా అరెస్ట్ చేస్తారు ..కానీ నీరజ సూయ్ సైడ్ నోటు చూసి పోలీస్ అరెస్ట్ చేసుండరు. మీరన్నట్లు యిది హత్య అని తేలితే హంతకుల్ని వదిలిపెట్టను.మీరు అడ్రస్ మానీరజ కిచ్చి వెళ్ళండి. మీరు ఈ కేసుకు ఫీజు యివ్వనవసరము లేదు.”
********
“బాస్ ! పీయస్ లో ఎంక్యైరీ చేశాను. నీరజ తన సెల్ల్ఫోన్ ద్వారా భర్తకిచ్చిన మెసేజ్ ఆధారంగా ఇది డౌరీడెత్ కాదు ఆత్మహత్యని పోలీస్ నిర్ధారించారు “
“జాకీ ! ఆత్మహత్య జరిగిన ఫ్లాట్ మీద అత్తా మామల ఫ్లాట్ మీద నిఘాపెట్టు. రెండు ఫ్లాట్ల వాచ్మెన్ లను విచారించు.నీరజ అత్తా మామల అపార్ట్మెంట్లో మన ఫ్రీలాన్సర్ రాధికను ఏదో ఒక ఫ్లాట్లో కుక్ లేదా మెయిడ్ గామారిపొమ్మని చెప్పు. ఫుల్ డేటా తో స్మార్ట్ ఫోన్ యూజ్ చేయమని చెప్పు.”
“ఎస్ బాస్ !నేను చూసుకుంటాను.”
********
అవినాష్! శాండిల్యసర్ కీ ఫోన్ చేసి నీరజ ఫ్లాట్ చెక్ చేయాలని తనను కూడా రమ్మన్నానని చెప్పు.ఆఫ్లాట్ లో పోలీస్ సీజ్ చేసిన అనుమానాస్పద వస్తువుల్ని పరిశీలించే ఏర్పాటు చేయించమని చెప్పు. పోలీస్ మూసేసిన కేసు.మనం తిరిగి ఓపెన్ చేస్తున్నామని తెలిస్తే ఫీలవుతారు.ఇప్పటికే కోట్లు కోటలు దాటుoటాయి.”
“బాస్ !వస్తువుల్ని సీజ్ చెయ్యలేదట. నీరజ హేంగ్ చేసుకున్న ఫ్లాట్నే సీల్ చేసారట. మూసేసిన కేసిది రూంఓపెన్ చేయడం ప్రొబ్లెం కాదంటున్నారు. సాయంత్రం ఆరుగంటలకు అక్కడ వుoటానన్నారు.”
“ఓకే !బిరెడీ ..సెన్సార్ మెజర్ మెంట్ డివైసును తీసుకొని రాజారాం ని లొకేషన్ లో వుండమను.యిది చాలా ఇoపార్టెంట్. ”
*******
మధురానగర్.
భవ్యా అపార్ట్ మెంట్స్. ఫోర్త్ ఫ్లోర్.
“బాస్ ! దీని ఎదురుగా వున్న నవ్య అపార్ట్ మెంట్ నీరజ మామగారు ఉంటున్న అపార్ట్ మెంట్. రాజారాం కూడా ఆన్ దవే.”
శాండిల్య అనుమతితో కానిస్టేబుల్ డోర్ ఓపెన్ చేసాడు.
నీరజ భర్త వాళ్ళ మమ్మీడాడీలతో నవ్య లోనే ఉంటున్నాడు.
“ఓకే !మనం యిక్కడ చూసుకొని నవ్యకు వెళదాం.”
అoదరూ నీరజ వురేసుకున్న రూంలోకీ అడుగు పెట్టారు.
“బాస్ !ఆల్రెడి పోలీస్ గాలించారు.మనకు ఫింగర్ ప్రింట్స్ దొరకవు.”
“అవినాష్ ! మనకు కావలసింది ఫింగర్ ప్రింట్స్ కాదు.శాండిల్య సర్ కొన్ని ఫోటోలు యిస్తారు. స్టడీ చెయ్యి. సెల్లో ఫోటోలు తీసి స్టూడియోలో కాపీలు ప్రింట్ చేయించు.
మిస్టర్ రాజారాం ! ఏమికావాలో అవినాష్ చెపుతాడు. కేలిక్యులేట్ చేసి పుట్ ఇట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్.
శాoడిల్యా లెటజ్ హవె లుక్.”
త్రీబెడ్ రూoఫ్లాట్ అది. ఇది నీరజ బెడ్ రూమ్ అయ్యుంటుంది.నీట్ గా సర్ది వుంది. ఓ కార్నర్ లో చిన్నరీడింగ్ టేబుల్ ముందో చిన్న రోలర్స్ వున్న కంప్యుటర్ చైర్. టేబుల్ మీద వైఫై రౌటార్ హెచ్ పీ.. లాప్టాప్ తప్ప మరేమీ లేదు.
“శాండిల్యా ! నీరజ హ్యాండ్ బాగ్ సెల్ లాంటివి ?” వున్నాయి ..ఆబెడ్ మీదే వదిలేసారు. ఒక్క బాడీని మాత్రమే తరలించారు. సెల్ మాత్రం లేబ్ కు పoపించారు. ఈపాటికి ల్యాబ్ నుండి మనిషి బయలు దేరే ఉంటాడు..విత్ కాల్ డేటా అండ్ ఫొటోస్. ఫ్యాన్ కు వురేసుకోవాలంటే హైటున్న స్టూల్ కావాలి.అలాంటిది లేదు. మచం పైన వుంది ఫ్యాన్ .మంచమెక్కి వురేసుకుందని మా నిపుణుల అంచనా .”
“రాజారాం మీవర్క్?”
“అయిపొయింది బాలీ సర్. హైటాఫ్ దటాప్ ట్వెల్వ్ ఫీట్ టుఇంచెస్ . లాస్ట్ ఫ్లోర్లో వేడికి తట్టుకోలేక చాలామంది ఫాల్స్ రూఫ్ వేయించుకుంటారు. ఫాల్స్ రూఫ్ తర్వాత హైట్ తక్కువ అనిపించకుండా బిల్డర్స్ చేసే మేజిక్ .అందుకే యింత హైట్ “ “మిస్టర్ రాజారాం ..ఐ ఐవాంట్ యాక్యురసి ..విత్ సెంటీమీటర్స్”
“అవినాష్ చెప్పారు.నేను వాడిన ఎలక్ట్రానిక్ డివైస్ పేరు..టిఎస్టి..టోటల్ స్టేషన్ ధియోడోలైట్.. [total station theodolite] నా లాప్టాప్ తో కనెక్ట్ చేశాను చూడండి. మిల్లీమీటరు కూడా వేరియేషన్ వుండదు.కాట్ హైట్ విత్ బెడ్ త్రి ఫీట్ ఫైవ్ ఇంచెస్. ఫ్యాన్ టాప్ నుంచి బ్లేడ్స్ వరకు ఒన్ ఫీట్ . బెడ్ లేoపుతో కలిసి వన్ అండ్ హాఫ్ వుంది.”
“అంటే..ఫ్లోర్ టు ఫ్యాన్ ఎండిoగ్ పదిఅడుగుల ఎనిమిది అంగుళాలు.”
“ఎస్ సర్..”
“ ఫ్యాన్ బ్లేడ్స్ స్టార్టింగ్ నుంచి..లెవెన్ ఫీట్ టు ఇంచెస్ ?”
ఎస్ సర్!
“కాట్ హైట్ విత్ బెడ్ త్రి ఫీట్ ఫైవ్ ఇంచెస్.”
“కరెక్ట్ సర్”
*****
నవ్యఅపార్ట్మెంట్. నీరజ అత్తామామల ఫ్లాట్. చాలా పోష్గా వుంది.కాస్ట్లీ ఫర్నిషిoగ్స్..ఇంపోర్టెడ్ ఫర్నిచర్ తో.
“సర్!నాపేరు సత్యనారాయణ నవీన్ ఫాదర్ని.తను నాభార్య ప్రమీల . ఇంకా మావాడు రాలేదు. వచ్చేస్తాడు.”
“ఓకే! నీరజ మరణం గురించి మీఅభిప్రాయం?”
“నాఅభిప్రాయం ఎందుకు సర్. ఉరేసుకుని ఆత్మహత్యచేసుకుందని ఎంక్వయిరీ చేసి పోలీస్ కేసు మూసేసారు.”
“అది నాకు తెలుసు.నీరజ మీతో ఎలా బిహేవ్ చేసేది?”
“మాతో చాలా బాగుండేది.పెళ్ళైన తర్వాత రెండు నెలలు మాతోనే వున్నారు.అందరితో కలిసిపోయె స్వభావం .”
“ఐసీ ..పెళ్ళైన తర్వాత ఎన్ని సార్లు పుట్టింటికి వెళ్ళింది?”
“ఐదారు సార్లు.”
ప్రమీల జవాబు చెప్పింది.
“వన్నియర్లో అన్నిసార్లా ?”
“ఇంటిమీద బెంగ అంటే తప్పదు కద సర్.”
“నవీన్ లాంటి భర్తని మీలాంటి అత్తామామల్ని పొంది కూడా జీవితాన్ని పొందలేక పోయింది. మీ అబ్బాయికి కార్ వుందా?”
“వుంది సర్.”
“అబ్బాయి కష్టమా ?మామగారి కట్నమా?”
ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు.
“ఓకే ఐ కెన్ అండర్ స్టాండ్. అవినాష్ ! మనoబయలుదేరుదాము. అన్నట్లు రోజూ మీవాడు లేటుగానే వస్తాడా? యివ్వాళేనా?”
“ఆఫీసు లో పనినిబట్టి.”
“ఓకే !సీయూ.”
********
“బాస్ !నిన్న సాయంత్రం మనం నవ్యలో ఉండగానే నవీన్ మరో అమ్మాయితో కలిసి కారులోవచ్చి మాఫ్లాట్ కు యెవరు వచ్చారని వాచ్ మేన్ని అడిగి మనంవున్నoత వరకూ పార్కింగ్ లోనే వుoడి పోయాడని రాధిక రిపోర్ట్. నవీన్ ఆఅమ్మాయి వీడియో కూడా పంపించింది. జాకీకి ఫార్వర్డ్ చేశాను. జాకీ డీటెయిల్స్ సంపాదించి ఉంటాడు.”
“అవినాష్! నీరజ ఫోన్ ఓపెన్ చేయాలంటే ఫిoగర్ ప్రింట్ కావాలి . పోలీస్ కాల్ డేటా సంపాదిoచారు. శాoడిల్యకు ఫోన్ చేసి ఎస్ ఎంఎస్ వాట్స్ యాప్ డేటాలు సంపాదించు . అలాగే నీరజ మరణించిన టైo కూడా ఎవిడేన్సే. పోస్ట్ మార్టంరిపోర్ట్ స్టడీ చెయ్.
రేపు..ఈ కేసు క్లోజ్ చేస్తున్నాం. రేపు టేన్నో క్లాక్కి ప్రెస్ మీట్ “
“బాస్! అంటే యిది హత్యేనని డిసైడ్ అయిపోయారా?”
“ఇన్ని క్లూలు దొరికాకకూడా నీకులైట్లు వెలగలేదంటే ..ఐపిటి మైబాయ్.”
అవినాష్ రెండుచేతులతో జుట్టుపీకేసుకోవాలన్న కోరికను బలవంతాన ఆపేసుకొని నుదురు రుద్దేసుకున్నాడు.
****
శాండిల్యఆఫీస్.
“డియర్ ఫ్రెండ్ మీరు ఆత్మహత్యని క్లోజ్ చేసిన కేస్ ఇన్వెస్ట్ గేట్ చేసాము.భయంకరమైన నిజం బయటపడింది. ఇది ప్రీప్లాన్డ్ మర్డర్.కానీ మీడిపార్టుమెంటు క్లోజు చేసిన కేసు.”
“బాలీ !మేము క్లోజు చేసిన ఎన్నో కేసులు మీరు సాల్వ్ చేశారు. ఈ కేసులో కాళ్ళపారాణి ఆరకుండానే నీరజ ఆహుతయిపోయింది. ఈ దేశంలో ఎంతోమంది మహిళలు కట్నాల వేధిoపులకు , మగవాడి దాష్టీకానికి బలైపోతున్నారు.నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. గోఎహెడ్..డిపార్టుమెంటు విషయం నేను చూసుకుంటాను.”
“థాంక్స్ ఏలాట్..రేపు ప్రెస్ మీట్ పెట్టి ..”
అక్కడా ఇక్కడా ఎందుకు? కమీషనర్ గారి ఆఫీస్ లోనే . నువ్వన్నా నీ డిటెక్షనన్నా అయనకు చాలా యిష్టం నమ్మకం.”
“ఓకే అండ్ ఒన్స్ఎగైన్ థాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్.”
*******
మీటింగ్ హల్లో డిపార్టుమెంటు అధికారులతో బాటు ప్రెస్ జనాలు..నవీన్ ఫ్యామిలీ మెంబర్స్ ..నీరజ అమ్మానాన్నలు బాలీ కోసం ఎదురు చూస్తున్నారు.
కమీషనర్ ..శాండిల్యతో కలిసి వస్తున్న బాలీబృందాన్నిచూస్తూనే తమ హర్షాన్ని వ్యక్తపరిచారు.
బాలీ మైక్ అందుకున్నాడు.
“నా పేరు బాలీ ..థర్డ్ ఐ డిటెక్టివ్ ఏజెన్సీ మీఅందరకూ పరిచయమే.
నీరజ తల్లితండ్రులు మా ఆఫీసుకొచ్చి మాఅమ్మాయిది ఆత్మహత్యకాదు హత్యేనని ..అదనపు కట్నంముసుగులో అత్తా మామలు హత్య చేసివుంటారని ఏడ్చేశారు. డిపార్టుమెంటు క్లోజ్ చేసిన కేసు. తల్లిదoడ్రుల ఆవేదనకు చలించిపోయి కేసు తీసుకున్నాను.
నీరజ హత్యచేసుకున్న ఫ్లాట్ లోకి అడుగుపెట్టగానీ అర్ధమైపోయింది నీరజ వురేసుకోలేదని వురేసారని.”
హాల్లో అందరి ముఖాల్లో ఆచ్చర్యం ..ఆందోళన.
“డియర్ ఫ్రెండ్స్ ! ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి.”
బాలీ సంజ్ఞ చేయగానే జాకీ అందరికీ ఫోటోలు అందించాడు.
“ నీరజ ఫ్యాన్ కు వురేసుకుందన్న అభియోగం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్.
ఫ్యాన్ కు నాలుగు అంగుళాల దూరంలో నీరజ హెడ్ వుంది.పోనీ ఆరు అంగుళాలు అనుకుందాము.అంతేగా?”
“అవును ...అంతే దూరంలో వేలాడుతోంది.”
“ఆత్మహత్య చేసుకున్న గది హైటు పన్నెండు అడుగుల రెండు అంగుళాలు. ఇవి టేపుతో తీసిన కొలతలు కావు. టీఎస్ టీ అనే ఎలక్ట్రానిక్ డివైస్ తో తీసినవి.
పోతే ఫ్యాన్ కిందున్న మంచం మీద యెక్కి చీరతో వురేసుకుంది అన్నారు. నిజమే.మంచం ఎత్తు బెడ్ తో కలిపి మూడు అడుగుల ఐదు అంగుళాలు.
నీరజ ఎత్తు అయిదడుగుల మూడు అంగుళాలు .
మంచం మీద నిలబడినప్పుడు ఆ అమ్మాయి ఎత్తు త్రి పాయింట్ ఫైవ్ ప్లస్ ఫైవ్ పాయింట్ త్రి. టోటల్ ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుళాలు.యింతవరకు కరెక్ట్ అంటారా?”
“ఎస్ ఎస్ ..ప్లీజ్ ప్రొసీడ్ సర్”
చానెల్స్ జనాలు సస్పెన్స్ తట్టుకోలేకే ముక్త కంఠంతో చెప్పేశారు.
“యా..కమింగ్ టు ద పాయిoట్ .
ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తు నుంచి పదకొండు అడుగుల రెండు అంగుళాల యెత్తులో వున్నఫ్యాన్ రాడ్ కి చీర ఒకఅంచు ముడేసిoది. రెండోఅంచు తనమెడకు ముడేసుకుంది.యిందులో అనుమానిoచేది ఏమీలేదు.
ఎనిమిది అడుగుల ఎనిమిది అoగుళాల్లో తలకొలత తొమ్మిది అoగుళాలు మైనస్ చేస్తే మెడ వుంటుంది. అంటే యేడు అడుగుల పదకొండు అంగుళాల ఎత్తులోoచి నీరజ శవం వేలాడుతూ వుండాలి.ఒక్కసారి ఫోటోలు జాగ్రత్తగా చూడండి. రూఫ్ నుండి అడుగు పది అంగుళాల దూరమునుండి హేంగ్ అవుతోంది. దట్ మీన్స్ పది అడుగుల నాలుగు అంగుళాల హైట్ నుండి అన్నమాట.
యేడు అడుగుల పదకొండుఅంగుళాల యెత్తులో వేలాడ వలసిన శవం రెండు అడుగుల ఐదు అంగుళాలు జంపై వేలాడుతోంది”
హాలంతా నవ్వులతో నిండిపోయింది.
“సర్!మీరు శవాలు నడుస్తాయని నమ్ముతారా?”
ప్రెస్ జనాలు ప్రశ్నలు సంధించారు.
“నడుస్తాయో లేదో తెలియదుగానీ జంప్ చేయగలవని డిపార్ట్మెంట్ స్వయంగా తీసిన ఫోటోలు నిరూపించాయి.”
అప్పటికే నవీన్ కుటుంబం జoపై పోవాలన్న ప్రయత్నాని గమనించిన కమీషనర్ ఆర్డర్ ఇచ్చేశారు.
“అరెస్ట్ దెం”
“కమీషనర్ సాబ్ !కొంచం టైం యిస్తే శవం రెండడుగులఐదు అoగుళాలకు ఎలా జంప్ అయ్యిందో అమ్మాయి నిండుజీవితాన్ని బ్లాస్ట్ చేసిన ఆరడుగుల బుల్లెట్ వివరిస్తాడు. వీడి మామగారు మా అల్లుడు ఆరడుగులని పొoగిపోయారు.
మీరు నీరజ ఆఖరి సారిగా యిచ్చిన మెసేజ్ ఆధారంగా ఆత్మహత్యని కేసు క్లోజ్ చేశారు.అది యెంత ఫేకో యెలా మేనేజ్ చేసాడో బుల్లెట్ చెప్పక పోతే బుల్లెట్ తోనే కక్కిద్దాం .”
దోషుల్లా నిలబడ్డ నవీన్ ఫ్యామిలీ మెంబర్స్ ను అసహ్యంగా చూస్తూ..
“చెప్పరా ..పిచ్చి ..”
ఆవేశంతోవూగి పోయాడో జర్నలిస్ట్ .
సిగ్గుతో ముఖం చూపిoచలేక తలదించుకుని..
“మేరేజ్ అయిన మూడు నెలల నుండి మీఅమ్మానాన్నలు అదనంగా కట్నం తేవాలని బలవంతం చేస్తున్నారు. నేను ఆరు సార్లు మా ఆమ్మానాన్నల్ని కలిసాను. పoటలు పండక మేమే ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పారని చెప్పేది. నిన్న మీ అమ్మానాన్నా కట్నం తేకపోతే చంపేస్తామని బెదిరించారు.అదంతా నా ఫోన్లో రికార్డు చేశాను.నేను వుమన్ ప్రొటెక్సన్ సెల్ కు రిపోర్ట్ చేస్తాను. ఇంటికి ఆలస్యంగా వస్తానని మెసేజ్ పెట్టింది.నేను భయపడిపోయి అలా చెయ్యొద్దని నేను మానెజ్ చేస్తానని మాట్లాడితే కన్విన్స్ అయ్యి ఇంటికొచ్చింది.అమ్మానాన్నలతో చెప్పాను.చంపేద్దామని లేకపోతే మనం జైలుకు వెళ్ళాల్సి ఉంటుందని నన్ను ఒప్పించారు.నేను ఆరుగంటలకే ఇంటికొచ్చాను. అమ్మానాన్నల సాయంతో గొంతు పిసికి చంపి వురి తీసాము.”
“నీరజ పెట్టిందన్న ఆఖరి మెసేజ్?”
“వురితీసాక ఫోన్ గుర్తోచ్చి నాఫింగర్ ప్రింట్ తో ఓపెన్ చేసి తన మెసేజ్ లన్నీ డిలిట్ చేసి నేనుపెట్టాను.ఈఫోను ఐదుఫింగర్ ప్రింట్స్ తో ఓపెన్ చేయవచ్చు.తనతో బాటు నా ఫింగర్ ప్రిoట్ కూడా ఫీడయ్యివుంది.”
“ఆరున్నరకు ఉరితీసి ఏడుంబావుకు మెసేజ్ పెట్టావు.మీరు ఉరితీసిన బెడ్ రూం చూడగానే యిది ఆరడుగుల అల్లుడి నిర్వాకమని అర్ధమైపోయింది.డెత్ టైముకూ మెసేజ్ టైముకూ నలభైఐదు నిమిషాల గేప్ వుంది.అంటే చనిపోయిన నీరజ నలభైఐదు నిమిషాల తర్వాత బ్రతికొచ్చి మెసేజ్ పెట్టింది కదూ?
అందుకే మెసేజ్ క్లిప్పింగ్స్ డేటా తెప్పించాను.
రేపు చానెల్స్లో క్లిప్పింగ్స్ చూపిoచాలంటే మీకు ఉపయోగపడతాయి. నీరజ రికార్డు చేసిన వీడి అమ్మానాన్నల భాగోతం కూడా వుంది.*