మర్డర్ ఇన్ చెన్నై ఎక్స్ ప్రెస్ - సుంకర వి. హనుమంతరావు

murder in chennai express

“ఆల్ ద పాసoజర్స్ హూ ట్రావెల్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ రిక్వెస్ట్ డ్ నాట్ టు లీవ్ ద స్టేషన్ .. అండ్ ఆల్ అర్ రిక్వెస్టెడ్ టు కం టు ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూం ఇమ్మీడియట్లీ.”

బయటకు బయలు దేరిన డిటెక్టివ్ బాలీ ప్రశ్నార్ధకంగా అవినాష్ ను చూసాడు.

“బాస్ !నేను వెళ్ళి ఎమర్జెన్సీ ఏమిటో చూసివస్తాను.మీరు స్టేషన్ మాస్టర్ కేబిన్లో వెయిట్ చేయండి.”

మరో మాటకు తావీయకుండా దూసుకుపోయాడు అవినాష్.

“ప్లీజ్ కమిన్ సర్. మిమ్మల్ని ఫోటోల్లో చూడ్డమే తప్ప ప్రత్యక్షంగా కలుసుకోలేదు.గ్లాడ్ టు మీట్ యు సర్.”

“గ్లాడ్ టు మీట్ యు ..వాట్ ఈజ్ దిస్ అనవున్స్ మెంట్?

“ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో ఓ హైదరాబాద్ పాసింజర్ ఫౌండ్ డెడ్. పోలీసులకు ఇన్ఫామ్..చేశాను. ఫార్మాలిటీస్ అయిపోగానే..”

“హైదరాబాద్ వ్యక్తా? కెన్ యూ టెల్ మీ ద నేమ్?“ప్లీజ్ వెయిట్ సర్ ! ఐ విల్ గెట్ హిజ్ ఫుల్ డీటెయిల్స్ .” అవినాష్ వచ్చేసాడు.

“బాస్ !చనిపోయిన వ్యక్తి మన పాత క్లైoట్ జగన్నాధంగారు.

రాత్రి మనం ట్రైన్ ఎక్కే టప్పుడు మనతో కలిసారు . మీరు కేస్ సాల్వ్ చేసాక నా ప్రాజెక్ట్ చాలా బాగుంది ..మార్నింగ్ కలుస్తానన్నారు యింతలో ..

“బాలీ సర్ !దిస్ ఈజ్ హిజ్ ఆధార్ నంబర్ .“ అoటు తన సెల్లు కొచ్చిన వాట్సప్ మెసేజ్ చూపిoచాడు.

“అవినాష్ మెసేజ్ శిరీషకు ఫార్వర్డ్ చేసి జాకీ స్టెల్లాల్ని కేస్ టేకప్ చేయమని చెప్పు .అవినాష్ ! ఐ వాంట్ టు సీ ద కూపె.” అచేతనంగా బెర్త్ మీద వున్న జగన్నాధం డెడ్ బాడీ ని చూస్తూ మూడీ అయిపోయాడు బాలీ.

అవినాష్ ! టేక్ క్లోజ్ ఫొటోస్ ..షుడ్ నాట్ లీవ్ మైనర్ థింగ్ అల్సొ .

“ సర్! మీరు స్టే చేస్తానంటే ఫస్ట్ క్లాస్ ఏసి సూట్ అరేంజ్ చేస్తాను. మా డిపార్టుమెంటు జీయం కోసం రెండు సూట్స్ రిజర్వు లో వుంటాయి యిది మర్డరో ఆత్మహత్యో ? మీకు తెలిసిన వ్యక్తే .మీరు మాతో వుంటే మాకు ధైర్యం. మీరు ఓకే అంటే నేను డిపార్టుమెంటు తో మాట్లాడి ...”

“ఓకే ..మిస్టర్ ..

“సెల్వరాజ్ సర్ “

“ఐ విల్ గోటు రిటైరింగ్ రూం .”

వెయిటింగ్ రూం మొత్తం పాసింజర్లు వాళ్ళ లగేజితో క్రిక్కిరిసి పోయింది. ప్రక్కనే వున్న టీసీ రూం లో సెటిలై పోయాడు బాలీ అవినాష్ తో.
అవినాష్.. ఏవన్ కంపార్ట్మెంట్ పాసెoజర్స్ లిస్టు బాలీ ముందు ఉంచాడు.

“బాస్ ! మర్డర్ జరిగిన కూపె లో మొత్తం సీట్స్ నాలుగు.నంబర్ త్రి బెర్త్ జగన్నాధంది.”

“ అవినాష్ !ఆ ముగ్గుర్నీ తీసుకురా . మిగతా వాళ్ళతో తర్వాత మాట్లాడుదాo .

“సర్ ! నా పేరు రవీంద్రనాథ్ ..నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను నా బెర్త్ నెంబర్ వన్”

“సర్ మై నేమ్ ఈజ్ రామనాధన్..మద్రాసీ .బెర్త్ నెంబర్ టు.”

“జీ !మేరా నామ్...లతీఫ్ హైదరాబాద్ సె ఆరుం. బెర్త్ నెంబర్ చార్.”

“మీరంతా జగన్నాధం గారితో కలిసి ట్రావెల్ చేశారు. మీతో ఆయన ఏమైనా మాట్లాడారా ? ఏదైనా స్పెషల్ అనిపించిన విషయాలు గమనించి వుంటే చెప్పండి.” అoదరూ మౌనంగా వుండిపోయారు.

రవీంద్రనాథ్ ఏదో చెప్పాలని ఆగిపోయాడు.

“మిస్టర్.రవీంద్రనాథ్ ! ఇది పోలీస్ కేస్.యిప్పుడు నాకు చెప్పక పోయినా రేపు పోలీస్ ముందు చెప్పక తప్పదు.నాపేరు బాలీ ప్రైవేటు డిటెక్టివ్ ని. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ లో మా థర్డ్ ఐ డిటెక్టివ్ ఏజెన్సీ ఆఫీస్ వుంది. “

“ విన్నాను బాలీసర్. ప్రత్యేకవిషయం కాదుగానీ ఆయన వచ్చినప్పటినుoడి కొంచెం టెన్షన్ లోనే వున్నారు.పడుకో బోయే ముందు వరకు కూడా ఫోనులో మాట్లాడుతూనే వున్నారు. “

“ఓకే !మిస్టర్ రవీంద్రనాథ్..ఆయన లగేజ్ మీకు గుర్తుందా ?”

సారీ సర్ !

“ సర్ !”అర్ధరాత్రి ..”

రామనాధం బాలీకి రహస్యంగా ఏదో చెప్పాడు.” బాలీ రింగ్ చేసాడు.

“అవినాష్ !జగన్నాధం లగేజ్ ట్రేస్ అవుట్ చేసారా?”

“ఎస్ బాస్ ! వన్ సూట్ కేస్ ..వన్ బాగ్..రైల్వే పోలీస్ భద్రం చేశారు.” ఆ ముగ్గురునీ చూస్తూ బాలీ ప్రశ్నించాడు.

“మీరు క్యాటరింగ్ కు ఆర్డర్ చేసారా? లేక “

“ఈ సాబ్ తప్ప మేము యిద్దరమూ డిన్నర్ ఆర్డర్ చేసాము . జగన్నాధం సర్ మాత్రం తనకు లైట్ గా ఉంటుందని కర్డ్ రైస్ ఆర్డర్ చేశారు .”
రవీంద్రనాథ్ చెప్పాడు.

“సర్ !మై నే ఘర్ సె చపాతి లాయా సాబ్.” లతీఫ్ చెప్పాడు.

“మిస్టర్ లతీఫ్ జగన్నాధం సర్ కి ఒక చపాతీ షేర్ చేశారు సర్. రామనాధం అల్సొ పికిల్ షేర్ చేశారు. నేను స్వీట్ ఆఫర్ చేయబోతే హెవీ అయిపోయిందని తీసుకోలేదు .” అవినాష్ వచ్చి..

“బాస్ ! బంజారా హిల్స్ లో జగన్నాధం యింటిని ట్రేస్ అవుట్ చేసి జగన్నాధం గారి భార్యతో మాట్లాడారట . ఆమె చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం నిన్నoతా జగన్నాధం గారు ఎస్బిఐ బంజారా హిల్స్ బ్రాంచ్ లో వున్నారట. ఆ విషయం బ్రాంచ్ మేనేజర్ తో మాట్లాడి ధృవీకరించు కున్నామని జాకీ రిపోర్ట్.”

“ఓకే !బ్రింగ్ క్యాటరింగ్ బాయ్.”

“నీ పేరు?”

“ననగె తెలుగు గొత్తిల్ల సర్ .స్వల్ప అంగ్రేజీ బరత్తే.”

“వాట్ ఈజ్ యువర్ నేమ్?”

“”హలేమనే సర్.”

“..ఓకే ..నైట్ యు ఓన్లీ సర్వేడ్ ద ఫుడ్ ?

“హౌదు సర్ ! నానే సర్వ్ మాడితీని . హలేమనే జవాబిచ్చాడు..

“బాస్! నిన్న జగన్నాధంగారు బ్యాంకు నుండి మనీ డ్రా చేసారట.

“ఓకే అవినాష్! గెట్ బ్యాంకు మేనేజర్ ఫుల్ డీటెయిల్స్ ..యెంత కాష్ డ్రా చేసారో తెలుసుకో. ట్రై టు గెట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ .డెత్ కారణం తెలియాలి.”

“బాస్ ! ఐ విల్ మీట్ మిస్టర్ శివకుమార్ .”

*******

స్టేషన్ మాస్టర్ ప్రోవైడ్ చేసిన ఎసి సూట్ లో అనినాష్ తో సెటిలై పోయాడు బాలీ

“బాస్! జగన్నాధంగారి మరణానికి కారణం విషప్రయోగం .”

“ఐ సీ ..అంటే ఈ కేసులో...”

“నెంబర్ వన్ సస్పెక్ట్ హలేమనే.

నెంబర్ టు పాంట్రీ కార్ జనాలు.

నెంబర్ త్రి బ్యాంకు మేనేజర్.

మిగిలింది ముగ్గురు జగన్నాధం కోపాసెంజర్స్.”

“బాస్! క్యాటరింగ్ హలేమనే తెచ్చిన కర్డ్ రైసులో డెలివరీ కంటే ముందే పాయిజన్ కలిసివుండాలి . ఇది ప్రిప్లాన్డ్ మర్డర్ అనుకుంటే పాoట్రీ లో కానీ పాంట్రీ టు కంపార్ట్మెంట్ డెలివరీ టైం లో కానీ జరిగుండాలి. లేదా కో పాసిoజర్స్ఇద్దరు జగన్నాధం గారికి ఆఫర్ చేసిన చపాతీ పికిల్స్ లో పాయిజన్ కలిపుoడాలి . కో పాసిoజర్స్ కూడా అనుమానితులే.”

“ఒక్కసారి జాకీని లైన్ లోకి తీసుకో.”

“జాకీ !నేను చెప్పింది అర్ధమైందా ? కాష్ విషయం అతనికొక్కడికే తెలుసు. ప్లాన్ చేసి వుండొచ్చు.నువ్వు బ్యాంకును మేనేజర్ ని కవర్ చెయ్. స్టెల్లా శిరీషలు మేనేజర్ యింటిని కవర్ చేసి నేను చెప్పిన వివరాలు వాట్సప్ లో పంపించాలి.”

“బాస్! సేల్వరాజ్ ఫోన్. హత్య జరిగిన కూపే లోని ముగ్గురుని తప్ప మిగతా ఫస్ట్ క్లాస్ పాసెoజర్స్ ని అడ్రస్ లు తీసుకొని పంపించేయాలని క్రైంబ్రాంచ్ ఎస్పీ శివకుమార్ ఆర్డర్ .మీకు చెప్పమని”

“ఓకే అవినాష్! వాళ్లు మన ఫైనల్ లిస్టులో లేరు. కానీ ఒక్కసారి నేను వాళ్ళను కలవాలి.

******

వచ్చిన వాట్సప్ క్లిప్పింగ్స్ లాప్టాప్ మానిటర్ కు అనుసంధానం చేసాడు అవినాష్. ఒక క్లిప్పింగ్స్ చూపీస్తూ అవినాష్ తో..

“అవినాష్ వీడే హంతకుడు. “ జాకీకి చెప్పు

“జగన్నాధం భార్య ని కూడా తీసుకుని అవైలబుల్ ఫ్లైట్ కు రమ్మను. నేను శివకుమార్ ను కలిసి వస్తాను. జాకీ వచ్చే టైం కే ఈ కేస్ క్లోజ్ చేయాలి. మన క్లైంట్ కు రేపు మీట్ అవుతామని మెసేజ్ పంపించు. నువ్వు ఏసిపిశాoడిల్యను కలిసి నేను చెప్పింది చెప్పు.

*******

వెయిటింగ్ రూం పోలీస్ ఫోర్స్ తో న్యూస్ ఛానళ్ళ జనాలతో జగన్నాధం భార్యతోవచ్చిన బంధువులతో నిండిపోయింది.

హలేమనే బిక్క ముఖంతో ఎడ్సేసాడు. ముగ్గురు పాసింజర్స్ భయంగా బాలీ ముఖాన్ని చూస్తున్నారు. శాండిల్య లైన్ లొకి వచ్చాడు.

“బాలీ !నువ్వు చెప్పిన లైన్లోనే ఇoటరాగేట్ చేస్తున్నాము.హేవే లుక్ ఇన్ యువర్ సెల్. “

“ఒన్ మినిట్ శాoడిల్యా ..అవినాష్ నా సెల్ మానిటర్ కు కనెక్ట్ చెయ్.అoదరూ చూడాలి. “ మానిటర్లో శాండిల్య క్యాబిన్.

“మీ మాటలు ఎలా నమ్ముతాను ?మీకూ జగన్నాధం గార్లకు మాత్రమే మనీ విషయం తెలుసు. డబ్బు కో సమే ఈ హత్య జరిగింది. మీరే ప్లాన్ చేసి వుంటారు? జగన్నాధం గారు అయిదు కోట్ల మనీ డ్రా చేసారని మీకూ మీ బ్యాంకు సిబ్బందికి తప్ప మరో వ్యక్తికి తెలిసే అవకాశo లేదు.మీకు తప్ప మరో వ్యక్తికీ మర్డర్ చేయవలసిన అవసరమూ లేదు. ఎవరితో మర్డర్ చేయించారు?”

“సర్ !నేను మర్డర్ చేయిoచలేదు .నన్ను నమ్మండి. నా స్టాఫ్ కు జగన్నాధం గారు చెన్నై ఎక్స్ ప్రేస్ లో చెన్నై వెళుతున్నారనే విషయం తెలియదు. జగన్నాధం గారు గత ముప్పై సంవత్సరాలనుండి మా బ్యాంకు కస్టమర్. నాకు చాలా క్లోజ్ .”

“అయినంత మాత్రాన మర్డర్ చేయకూడదన్న రూలేమైనా వుందా?” మేనేజర్ ఆoదోళనలో పడ్డాడు.

“ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యింది ఐదుకోట్ల డబ్బు.

ఓకే మీరు యిప్పుడు చెపుతారా ? పోలీస్ మర్యాదల తర్వాత చెపుతారా మీ యిష్టం.”

ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు మేనేజర్ .అతని భార్యా పిల్లలు అతన్ని చుట్టుకుపోయారు. పిల్లల ఏడుపులతో శాండిల్య కేబిన్ దద్దరిల్లి పోయింది.

మానిటర్ లో దృశ్యాలు చూస్తున్న అందరి ముఖాలూ బాధతో నిండిపోయాయి.

“కానిస్టేబుల్స్ టేక్ హిం టు కస్టడి.”

చేతిలో సంకెళ్ళతో వస్తున్న పోలీస్ ను చూస్తూనే మేనేజర్ భార్య స్పృహ తప్పి పడిపోయింది.చిన్న పిల్లలిద్దరూ అమ్మా! అమ్మా! అoటు తల్లిని చూస్తూ ఏడ్చేస్తుoటే వెయిటింగ్ రూం మానిటర్ లో చూస్తున్న ప్రేక్షకులంతా దాదాపు కళ్ళనీళ్లపర్యంతమైపోయారు. అందరూ

“అయ్యో పాపం ..ముక్కుపచ్చలారని పసిపాపలు. ఈ మేనేజర్ వెధవ పోయేకాలం వచ్చి ఈ హత్య చేసాడు. రేపటి నుండి ఆ ఇల్లాలు పసి పిల్లలతో ముష్టి ఎత్తుకోవాలి. ఛీ ! నీబ్రతుకు చెడ..”

దుమ్మెత్తి పోస్తుంటే ..అందరినీ తొసుకుoటు ఓ వ్యక్తి హటాత్తుగా బాలీ ముందుకొచ్చి

“ సార్ మా అన్నయ్య ను అరెస్ట్ చేయవద్దని చెప్పండి ప్లీజ్ ..నేనే దొంగతనo చేశాను. సృహ తప్పించాలనుకున్నాను కానీ చంపాలనుకో లేదు. నేనే హంతకుడిని. .నన్ను అరెస్ట్ చేయండి.” బాలీ పెదాలమీద చిరునవ్వు అలా మెరిసి యిలా అదృశ్యమై పోయిoది.

“అది నాకు తెలుసు ..ఎందుకు చేసావు ? ఎలా చేసావు?

“సర్ !నిన్న సాయంకాలం అన్నయ్య బ్యాంకు నుండి వచ్చాడు మాటల మధ్య.. “యేరా! ఇవ్వాళ నీ డ్యూటీ ఏట్రైన్ లో అనిఅడిగితే చెన్నైఎక్స్ ప్రెస్సు” లో అని చెప్పాను. మా క్లైంట్ జగన్నాధం గారు కూడా అదే ట్రైన్ లో వస్తున్నారు. ట్రైన్ లో కాష్ డేoజర్ అని చెప్పాను. నాకిది మామూలు విషయమే అన్నారు. అయినా ..కాలం బాగా లేదు. వీలయితే నువ్వు కొంచెం చూసుకో .. ఆయన మాకు మంచి క్లైంట్ అని చెప్పాడు. అప్పుడు నాలో దుర్బుద్ధి పుట్టింది.

అతన్ని స్పృహ తప్పించి డబ్బు కొట్టేసి డబ్బు సంపాదిoచి బెట్టిoగు గేoగు నుండి నా ఫ్యామిలీ ని రక్షించుకో వచ్చని అర్ధరాత్రి వచ్చి పెదాల మీద లిక్విడ్ పోశాను. మళ్ళీ వెళ్ళి బ్రీఫ్ కేస్ దొంగతనం చేసాను. ఎవరూ నన్ను పట్టుకోలేరని భావించాను.”

“ సర్ ! మా టిసి హంతకుడని మీరు ఎలా ?” సెల్వరాజ్ ప్రశ్నకు

“ మా టికెట్స్ చెక్ చేస్తున్నప్పుడు మీ టీసీ సెల్ ఫోన్ లో క్రికెట్ మేచ్ చూస్తూ చాలా అందోళనగా కనిపించాడు.

సర్ ! మీరేమైనా క్రికెట్ బెట్టింగ్ పెట్టారా ? అని మా అవినాష్ అడిగితే అందుకే కదా ఈ టెన్షన్ అని చెప్పి టికెట్స్ చెక్ చేసుకొని వెళ్ళి పోయాడు. మొన్నీమధ్య గుంటూరు లో క్రికెట్ బెట్టిoగులో మనీ పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న ఇరవై సoవత్సరాల యువకుడు గుర్తుకొచ్చాడు. క్రికెట్ బెట్టింగ్స్ గ్యాంగ్ ఆగడాల మూలంగా లో ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మావాళ్ళు మేనేజర్ హిస్టరీ తిరగేస్తుంటే యితని బెట్టింగ్ వ్యసనం తెలిసింది. పోతే హలేమనే. టెండర్ ఏజ్ ..పొట్టకూటి కోసం కర్నాటక నుండి వచ్చాడు. సామాన్యంగా ఆ ఏజ్ గ్రూప్ పిల్లలలో మర్డర్ చేయాలన్న ఆలోచన వుండదు.

పాంట్రీ కార్ సిబ్బందిని థరోగా చెక్ చేశాము.అందరూ తమిళియన్స్. బ్యాంకు మేనేజర్ తో సంబంధం సాధ్యంకాని సంగతి. ముగ్గురు కోపాసిoజర్స్ సమాజంలో వున్నత స్థానాల్లో వున్నారు. ముగ్గురి హిస్టరీని నా ఫ్రెండ్ ఏసిపిశాండిల్య చెక్ చేసారు. మా స్టెల్లా శిరీషలు పంపించిన మేనేజర్ ఇంటిలోని ఈ యిద్దరి ఫోటో వాట్సప్ లో చూడగానే టీసీ , మేనేజర్ బ్రదర్స్ అని గ్రహించాను.మనీ మేటర్ లీక్ అయ్యిందని అర్ధమైపోయింది ? అన్న జగన్నాధంగారి రక్షణ కోసం చెపితే..తమ్ముడు హత్యకు వుపయోగించుకున్నాడు.. స్టేషన్ మాస్టర్ తోవెళ్ళి నీబాక్స్ చెక్ చేస్తే బెడ్ షీట్లో దాచిన బ్రీఫ్ కేస్ దొరికింది.”

నేనే హంతకుడినని గుర్తించి కూడా మా అన్నయ్యను ఫ్యామిలీ ని ఎందుకు బాధ పెట్టారు సర్ ? వాళ్ళు నాకు తల్లితoడ్రులతో సమానం “
బేలగా అన్నాడు.

“మేము డైరెక్ట్ గా అడిగితే కధలు చెపుతావు. ఖాకీలు లాటీలతో ఆడుకుంటే అప్పుడు కక్కుతావు నిజాలు.అదే సెంటిమెంట్ అయితే ? ఎదురుగా అన్నావదినలు..చిన్నారి పాపలు. యెంతటి హంతకుడైనా బంధాలనుండి తప్పించుకోలేడు. అదే జరిగింది.

క్రికెట్ బెట్టిoగుల్లో పోగొట్టుకున్న డబ్బును సంపాదించాలన్న మోటివ్ తో హత్య చేసావు..

సాటి తెలుగు వాడిని తమిళ లాటీలతో కొట్టించడం యిష్టం లేకే ఈ నాటకం శాoడిల్యతో ఆడించాను.

రామనాధం బాత్ రూoకు వెళ్ళిన టైo లో కూపే లొకి వెళ్లావు ..కానీ ఆయన కూపే లోంచి వస్తున్న నిన్ను చూశానని చెప్పారు..అలాగే మరో సారి మరో వ్యక్తి బాత్ రూo కు వెళ్ళిన టైంలో బ్రీఫ్ కేస్ కొట్టేసావు.”అందరి కరతాళధ్వనుల మధ్య శివకుమార్ బ్రీఫ్ కేస్ జగన్నాధం భార్య కు అందించారు.

“ఒక్క రోజులో హత్య కేస్ సాల్వ్ చేసిన డిటెక్టివ్ బాలి గారికి మా డిపార్టుమెంటు తరఫున అభినందనలు.” స్టేషన్ మాస్టర్ సెల్వరాజ్ షేక్ హ్యాండ్ యిచ్చి కౌగలించుకున్నాడు *

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి