ఇంట గెలిచాకే రచ్చ గెలుపు - గంగాధర్ వడ్లమన్నాటి

inta gelichake  raccha gelupu

వృద్దాశ్రమ ప్రారంభోత్సవంలో పాల్గున్నాడు శేఖరం .ముందుగా చేసిన ఏర్పాట్ల ప్రకారం,అందరికీ అతనే స్వయంగా బట్టలూ,పళ్లూ ,పంచుతున్నాడు.వాళ్ళ కళ్ళలో ఎంతో తృప్తి.అంత పెద్ద వ్యాపారవేత్త.పెద్ద మనిషి.నేడు తమ కోసం వచ్చాడు.కొంత డబ్బు విరాళరంగా పంపిస్తేనో లేదా చెక్కు రూపంలో ఇస్తేనో సరిపోతుందీ ,అదే గొప్ప సంఘ సేవ అనుకోకుండా ,స్వయంగా తానే వచ్చాడు.అదీ కాక ఇంతసేపు అందరితోనూ మామూలు వ్యక్తిలా కలిసిపోయి ఇంత ఓపికగా గడుపుతున్నాడు.గొప్ప మనిషి.అనుకున్నారు వాళ్ళలో వాళ్లే.ఇంతలో శేఖరం ఫోన్ మోగింది.లిఫ్ట్ చేసి,ఆ సరితా,ఆ అర్ధమైంది.వస్తాను.ఇక్కడ,నేను,అదే వచ్చేస్తాను.చెప్పి ఫోన్ పెట్టేశాడు.

అక్కడున్న వృద్దులూ,వికలాంగులూ తమ అవసరాలూ,ఇబ్బందులూ,కష్టాలూ చెప్పుకుని తేలిక పడ్డారు.శేఖరం కూడా అన్నీ ఓ కాగితం పై రాసుకుని ,తన పి.ఏ కి అందజేశాడు.మళ్ళీ అతని ఫోన్ మోగింది.ఆ సరితా వస్తున్నా.చెప్పానుగా ఇది నాకు ముఖ్యమైన పనని.అర్దం చేసుకోకపోతే ఎలా చెప్పు.సరే,సరే,ఉంటాను.అంటూ అవతలి నుండి తన భార్య మాట మొదలు పెట్టేలోపే ఫోన్ పెట్టేశాడు.ఇదిగో పి.ఏ .ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయి.ఇంకా మనం అనాధ శరణాలయం ,తర్వాత అన్నదానాల కార్యక్రమంలో పాలుగుంటే చాలు ఈ రోజుకి .తృప్తి పడుతుంది నా ఆత్మ.చెప్పాడు.తర్వాత మీడియా సమావేశం ముగించుకుని,కారులో ఇంటికి బయల్దేరాడు.ఇంటికి వెళ్తుండగా,ఫోన్ మోగింది.లిఫ్ట్ చేసి హలో పి.ఎ.చెప్పు.

సార్.మీ ఫోన్ కి చేస్తే అని ఏదో చెప్పేంతలోనే ,హలో,హలో ,సరే విషయానికి రా.ఇందాక మీరు మీడియా సమావేశంలో ఉండగా ,మీ పనిమనిషి ఫోన్ చేసింది అమ్మగారికి హై ఫీవర్ రావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లిందట.అని మళ్ళీ మరేదో చెప్పేంతలో .ఆ,అది సరే కానీ,ఆ విలేకర్లందరికీ డబ్బు కవర్లు ఇమ్మన్నాను.ఇచ్ఛావా.రేపు మన సేవా కార్యక్రమాలు న్యూస్ పేపర్ ఎడిషన్ ఫస్ట్ పేజీలో స్తాయిగా. అడిగాడు.ఆసక్తిగా.

మనీ కవర్లు ఇచ్చాను సార్.ఇద్దరు ముగ్గురు తప్ప అంతా తీసుకున్నారు.అలాగే మీ సేవ కార్యక్రమాలు కూడా యూట్యూబ్ లో పెట్టేయమన్నాను.అలాగే మనం నియమించిన నలబైమందీ ఆల్రెడీ వాట్సప్ .ఫేస్ బుక్ ,ట్విట్టర్ లలో మీ వీడియోలు,ఫోటోలు పోస్ట్ చేసేశారు.మీ పేరుపై రక్తదానం లాంటివి నిర్వహించమని కూడా కొంతమందిని పురమాయించాను సార్.ఈ సారి మీకు ఆ ప్రముఖ పార్టీ వాళ్ళు, ఎం .ఎల్.ఏ టికెట్ మీ పాదాల దగ్గర పెడతారు. మీరు.హాపీ గా ఉండండి.చెప్పాడు పి.ఎ ఉత్సాహంగా.

సరే.ఉంటాను.అని ఫోన్ పెట్టేశాడు.అంతలోనే ఇల్లు రావడంతో దిగి,లోనకెళ్లబోతుండగా, పనిమనిషి ఎదురొచ్చి అయ్యగారూ, అమ్మ గారూ, నేను ఇప్పుడే ఆసుపత్రికి వెళ్లొచ్చాం.అమ్మగారికి జ్వరం ఎక్కువవడంతో ఫిట్స్ వచ్చాయి.పాపిస్టిదాన్ని.నేనూ పనికి గంట ఆలస్యంగా వచ్చాను.తడి గుడ్డ పెడదామని తలుపు తీస్తే అమ్మగారు కింద పడిపోయి ఉన్నారు.వెంటనే డ్రైవరు ని పిలిచి ఆసుపత్రికి తీసుకెళ్లాo.సెలైన్,రక్తం ఎక్కించి,సూది మందు ఇచ్చి,తలకి కట్టు కట్టి ఇంటికి పంపేసారు.అని ఆమె చెప్తుండగానే –

సరి,సర్లే.నువ్వు వెళ్ళు.అని లోపలికి నడిచి వెళ్ళి,బెడ్రూo తలుపు తీసి,ఏమనుకుంటున్నావ్ నువ్వు.అన్ని సార్లు ఫోన్ చేయాలా.ఖర్మ.నేనెంత బిజీగా ఉంటానో తెల్సా.నీ బోడి జ్వరం కోసం నేను ఉన్న పళంగా వచ్చేయాలా.అయినా జ్వరం ఉంటే టాబ్లెట్ వేసుకుని పడుకోవాలి.ఇలా అటూ,ఇటూ తిరిగి ఫిట్స్ తెచ్చుకొని కింద పడిపోయి దెబ్బలు తగిలించుకోవాలా.నీకు ఏమైనా జరిగుంటే నాకు ఎంత చెడ్డ పేరు.భార్యని పట్టించుకోలేదని మీడియా నాపై వార్తలు రాస్తుంది.తెలుసా.అడిగాడు అసహనంగా.

ఆ మాటలకి,ఆమె కన్నీరు తుడుచుకుంటూ,బయట పెద్ద సంఘసంస్కర్త.కానీ ఇంట్లో భార్యని భోజనo చేశావా అని కూడా అడగని మనిషి.అవును. నాకు సేవ చేస్తే ,నాకు సాయం చేస్తే,ఏ మీడియా కవర్ చేస్తుంది.సోషల్ మీడియా ఎందుకు పట్టించుకుంటుంది.యూట్యూబ్ లో వీడియోస్ ఎవరు పెడతారు.అని మనసులో అనుకుని,అలా కోపం తెచ్చుకోకండీ.నేను ఫోన్ చేసింది నా జ్వరం పెరిగిందనో ,మిమ్మల్ని రమ్మని పిలవడానికో కాదు.మీ ఫోన్ కి బదులు కంగారులో నా ఫోన్ పట్టికెళ్లిపోయారు,అది చెపుదామనే.కష్టమే అయినా,ఆ నీరసంతోనే మన హాల్ వరకూ నడిచి వచ్చి , లాండ్ లైన్ లోంచి ఫోన్ చేశాను.మీ ఫోన్ లో కాల్స్ రిసీవ్ చేసుకోవడమే కానీ,కాల్స్ చేద్దామంటే పాస్వర్డ్ అడుగుతోంది.అలా హాలు వరకూ నాలుగు అడుగులు వేయగానే, నీరసంతో కళ్ళు తిరిగి, కొంచెం ఫిట్స్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయానoడీ.
అయితే?ఫోన్ మరిచిపోతే మాత్రం ఏం కొంపలు మునిగాయని.

అలా కాదండీ.పార్టీ పెద్ద ఎవరో డెల్లి నుండి హఠాత్తుగా వచ్చారట.మీ ఎం.ఎల్.ఏ టికెట్ గురించి మాట్లాడాలట.తాజ్ హోటల్ లో గంట వరకే ఉంటారట.మీరు వదిలివెళ్లిన ఫోనుకి మాటి ,మాటికీ చేసి అదే చెప్పారు.అందుకే నేనే ఒంట్లో బాగాలేకున్న లేచి,మీకు ఫోన్ చేశా.మీరు వినకుండా, సరే సరే అని,తర్వాత స్విచ్ ఆఫ్ చేసేశారు.మీ పి.ఏ నెంబర్ కలవలేదు.చెప్పిందామె.

ఆ మాటలు విన్న శేఖరం కాళ్ళ కింద నేల రెండడుగులు కిందకి క్రుంగిపోయినట్టైంది.ఓ క్షణం నిశ్చలంగా చూస్తుండిపోయాడామె వంక.ఇంతలో అతని ఫోన్ మోగింది.

ఆ, పి.ఏ . చెప్పవయ్యా.

సార్.ప్రముఖ పార్టీకి మీరు ఇన్నాళ్ళు సేవ చేసినా, మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్టూ ,చేస్తున్నట్టూ బిల్డప్ ఇచ్చినా,మీకు ఎం.ఎల్.ఏ. టికెట్ ఇవ్వలేదు సార్.ఆ రంగనాథానికే ఇచ్చారు.పైగా మీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదట.చేయగా,చేయగా మీ శ్రీమతి ఎత్తారట. మీ లాండ్ లైన్ కి చేస్తే మీ భార్య గారికి బాలేదనీ,అయ్యగారికి తెలిసినా రాలేదన్నట్టుగా మీ పనిమనిషి పీనుగు చెప్పిందట.ఆ విషయమే మన కార్యకర్తలనడగగా,ఎప్పుడూ నా కుటుంబాన్ని మీ కోసం వదిలేశా,వదిలేస్తా అంటారని ,రంగనాథ్ గారు మాత్రం నా కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తానో అలా నా నియోజకవర్గ ప్రజల్ని కూడా చూసుకుంటా అంటారని చెప్పారట.దాంతో, ఈ వచ్చిన వాడు , హై కమాండ్ కి ఇంట గెలవలేని వాడు రచ్చ ఎలా గెలుస్తాడు.పదవి కోసం,కుటుంబాన్ని పక్కన పెట్టినవాడు,పదవి వచ్చాక పార్టీకి విధేయుడిగా ఉంటాడని నమ్మలేo.విలువలు ఉన్నవాడికే టికెట్ ఇస్తే మంచిది అన్నట్టు రిపోర్ట్ ఇచ్చాడట.అలాగే మనం ఇప్పటికిప్పుడు వేరే పార్టీలో చేరి టికెట్ అడగలేo.ఇండిపెండెంట్ గా నిలబడితే,ప్రముఖ పార్టీ ప్రభంజనం ముందు,మనకి డిపోసిట్ కూడా రాదు. చెప్పడంతో నిల్చున్నచోటే కూలబడ్డాడు శేఖరం.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు