అమ్మే అలిగిననాడు - సుంకర వి. హనుమంతరావు

amme aliginanaadu

మాధాపూర్ ... సన్ షైన్ అపార్ట్ మెంట్స్ థర్డ్ ఫ్లోర్ త్రిజీరోత్రి ఫ్లాట్. ఆదివారం ..సమయం ఉదయం పదకొండు గంటలు.

“మమ్మీ! కాఫీ ..” బెడ్ రూఒలోంచి ఇంకా మత్తు వదలని నిద్రకళ్ళతో వస్తూనే కేక పెట్టింది ధరణి రావు పెద్ద కుమార్తె కార్తిక .

“ఇంకొంచం గట్టిగా కేక పెట్టరా అమరావతిలోవున్న మీ అమ్మకు వినిపించేలా .”

అప్పటికి తెప్పరిల్లిన కార్తిక

“ సారీ డాడీ! మర్చిపోయాను.మమ్మీ లేదుకదూ?”

“ఎందుకులేదు ?వుంది..యిక్కడకాదు..అమరావతిలో.”

లేప్టాప్ లో గూగుల్ వార్తలు చూస్తున్న ధరణిరావు కూతురికి కాఫీ కలపటానికి లేస్తుంటే ...

“ సారీ డాడీ..మీరు కూర్చోఒడి..నేను ట్రై చేస్తాను.”

“వద్దురా ..నువ్వు బ్రష్ చేసుకో..మైహూనా ..”

“సారీ డేడీ..మమ్మీకి ఫోన్ చేయండి..నెలరోజులు అయిపోయాయి.”

“తల్లీ!వెళ్ళింది తల్లిగారింటికి.వస్తుంది ..వచ్చేస్తుంది .”

“నెలరోజుల్నుండి యిదే డైలాగ్..చెప్తున్నారు..మీరు గట్టిగా మాట్లాడండి.”

“ నేనా?గట్టిగా మాట్లాడడమా?అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో మాట్లాడిన గుర్తు.”

“డాడీ..జోకులాపి ఫోన్ చేయండి.”

“చేస్తాను ..ముఒదు నీకు కాఫీ ..”

కిచెన్ లోకి వెళ్ళిపోయాడు ధరణిరావు.

“మమ్మీ !కాఫీ ..”

అక్క లెవెల్లో అదిరిపోయే ఎంట్రీ యిచ్చింది రెండో కుమార్తె అదితి .

ఖాలీగావున్న హాల్ ..నోట్లో బ్రష్ తోవున్న అక్కను చూస్తూనే మత్తు దిగిపోయి

వాస్తవానికొచ్చినట్లు సిగ్గు పడిపోయింది.

“తల్లీ నువ్వుకూడా బ్రష్ చేసుకోరా ..కాఫీ తయార్.”

కిచేన్ లోంచి కేకపెట్టారు ధరణిరావు.

ఒక్కసారిగా పరుగెత్తింది బాత్ రూమ్లోకి అదితి.

పొగలుకక్కే కాఫీ కప్పుల్ని టీపాయ్ మీద పెట్టి

“సాహితీ ! పదకొండు అయిపోయింది ఇకా నిద్రేనా?”

గట్టిగా కేక పెట్టాడు ధరణిరావు.

“స్నానంచేసి వస్తున్నా డేడీ..”

భుజం మీద టవల్ తో వచ్చింది సాహితి .

“సారీరా ..అక్కలకంటే నువ్వే నయం.నీకు బూష్ట్ కలపనా?”

“బూస్ట్ వద్దు..నాకు అమ్మే కావాలి.”

“నీకేకాదు మాకూ అమ్మే కావాలి. నాదగ్గర అదిఉండుంటే బాగుండేది.”

“అదా?అదఒటే ఏమిటి డాడీ?”

“అల్లావుద్దీన్ అద్భుత దీపం.”

“డేడీ! మమ్మీ అందుకే మీకు ఆపేరుపెట్టింది.”

“నాకు మీమమ్మీ పేరుపెట్టిఒదా? ఏఒపేరు ?”

“చెప్పకూడదని ఒట్టుపెట్టించింది.” ముసి ముసి నవ్వులు చిందించింది అదితి.

“నావెనుక యిన్ని కుట్రలా?చెప్పకపోతే కాఫీ కట్.”

“అయినా చెప్పం డేడీ ..మాది మాటతప్పని వంశం.” నవ్వుతూ చెప్పింది కార్తిక.

“జోకులు తర్వాత ..ముందు మమ్మీని రప్పించే మార్గం చూడండి.”

అక్కలిద్దరిని అర్ధించింది సాహితి.

“నువ్వే ఫోన్ చెయ్ ..చాట్ చెయ్..మెయిల్ చెయ్ ..మెసేజ్ పెట్టు ..వాళ్ళను అడిగితే ఏంచేస్తారు చెప్పు?” చిరునవ్వుతో సమాధానమిచ్చాడు డాడీ ధరణిరావు .

“సాహితి అంటేనే అమ్మకు ఇష్టం..మనం ఆదారిలో నడుద్దాం ..దానితోనే..”

అదితి కామెంట్ చేసింది.

“ఏదారిలో వచ్చినా మనకు మాత్రం వంటింటి దారి తప్పదు తల్లి .”

“నాబాధా అదే డాడీ.యెంత ప్రయత్నిఒచినా అమ్మచేతి రుచి రావడం లేదు.”

“ నేనూ నీలాగే బాధ పడేవాడిని..పెళ్లైన కొత్తలో.మాఅమ్మ చేతివంట రుచి చూడాలని. తర్వాత్తర్వాత మీ అమ్మే మా అమ్మయి పోయింది. నువ్వు కూడా అంతే కొంత కాలానికి .

వంట మ్మాయిని పెడితే వారానికే వీడ్కోలు చెప్పారు. బర్గర్లు పిజ్జాలు బోర్ కొట్టాయి. బిర్యానీలో కుక్కమాంసం.పలావుల్లో పిల్లి మాంసం ..వార్తలు చదివి వాంతులు చేసుకున్నారు. వాటి జోలికి పోవడం మానేశారు.నాకయితే ఎటువంటి ఇబ్బందీ లేదు.

ముద్దపప్పు ..ఆవకాయ్ ..కొంచం నెయ్యి..పెరుగుఒటే చాలు.

మా లాగ కాదుగా మీరు ..మీరంతా హైటెక్ జనాలు.ఫోన్లో నెట్ ..కార్డ్ లోబాలెన్స్ వుంటే కుష్.”

“అదంతా ఇప్పుడెందుకు డాడీ! ముందు ఈగండం నుంచి గట్టెక్కే దారేంటో చెప్పండి.”

“అఒదుకలదిఒదులేదనే ఒకేఒక వ్యక్తి అమ్మ” . అమ్మే సర్వాఒతర్యామి.ప్రార్ధిఒచండి..కరుణిఒచొచ్చు.”

“అన్నీ అయిపోయాయి. నేనే కాదు నాతోబాటు అక్క కూడా కోరస్ పాడేసింది. ఫలితం ఆశీస్సులు.మీరంతా మూడు పిజ్జాలు ఆరు బర్గర్లతో ,కోకాకోలా పెప్సీలతో హాయిగా ఉండమని.”

“మీపనే హాయి తల్లీ! ఫోన్ చేస్తే ఫుడ్ పాండా స్విగ్గి లాంటి వందమంది హాజర్..

నా పప్పు నేనే వండుకుఒటున్నాను. నాపాలు నేనే తోడుబెట్టుకుఒటున్నాను.”

“మరి ఆవకాయి అమ్మ పెట్టిఒదేగా?”

“ అవును కదూ?ఈసారి మాట్లాడినప్పుడు ధన్యవాదములు చెప్పండి.”

“అంతేకాని సొల్యూషన్ మాత్రం చెప్పరన్నమాట.”

“నేనా?చెప్పడమా?జోకులాపి సాహితితో ఫోన్ చేయించండి..”

“డాడీ!మీకు తెలుసా ?అది రెగ్యులర్ గా మమ్మీతో మాట్లాడుతోందని మాఅనుమానం..” రహస్యంగా చెప్పింది అదితి..

“డాడీ!మనకు తెలియకుండా ఏదో పెద్ద డ్రామా నడుస్తోంది.

అమ్మకూచి అది.అడిగినా నోరిప్పదు.”

సాహితిని చూస్తూ

“అమ్మకు ఫోన్ చేయవే.”

కార్తిక చెల్లిని బ్రతిమాలింది.

“యిప్పుడు కాదక్కా..వచ్చి చేస్తా ..డ్రెస్ చేసుకొని యిప్పుడే వస్తా.”

నవ్వుకుఒటు తన రూఒలోకి తుర్రుమంది సాహితి.

ధరణిరావు ..దమయంతుల ముద్దుల సంతానమే ఈ ముగ్గురమ్మాయిలు.

పెద్దమ్మాయి కార్తిక ..కుమారి ట్వంటీఫోర్.ఐటి జాబ్..పెళ్లి ఫిక్స్ అయ్యింది.

ద్వితీయ పుత్రిక అదితి ట్వంటీఒన్ బీటెక్ లోవుంది..

తృతీయ పుత్రిక సాహితి జస్ట్ ఇంటర్ మీడియట్.

అంతా సుఖాఒతమే అనుకుంటున్న సమయంలో చిన్న మెలిక.

ఇరవై ఏడు సంవత్సరాల సంసార జీవితంలో ఏనాడు ఇల్లు కదలని శ్రీమతిదమయంతి

నెల రోజుల క్రితం వులుకూ పలుకూ లేకుండా పుట్టింటికి చెక్కేస్తే దిక్కుతోచని స్థితిలో దిక్కులు చూస్తున్నారు ప్రస్తుతం కుటుంబమంతా. కార్తికా ట్వంటీఫోర్ ది ప్రేమ కం పెద్దల పెళ్లి.తనకు వంటచేయడం రాదని తెలిసినా
ప్రేమను తగ్గించుకోకుండా పెళ్ళికి ఒప్పుకున్న కళ్యాణ్.. కార్తికకు కలలో రాజకుమారుడైపోయాడు. దమయంతి పిల్లల్ని సక్రమంగా పెంచగలిగింది కానీ వంట నేర్పించలేక పరాజయాన్ని ఒప్పేసుకుంది.
“ఏరాకార్తీ ! కాఫీ అంటే నేను పెడుతున్నాను.పక్కిఒటి ఆంటి..ఎదురింటి ఆంటీ..ఎంతకాలం కూరలదానం చేస్తారు?మనమే దారి వెదుక్కోవాలి. గూగులమ్మ..అభిరుచి.. ఏదో ఒకటి..వెదకండి.

ప్రయోగాలు చేసేద్దాం.”

*******

“డాడీ! మీకు కొరియర్.”

వణికే చేతులతో కవర్ చింపి లెటర్ తీసి కార్తిక కిచ్చాడు.

మమ్మీ తెలుగులో రాసింది..నావల్లకాదు ..” అదితి కిచ్చిఒది.

“అక్కా..యిటివ్వు”

సాహితి అదితినుండి తీసుకొని చదవడం మొదలుపెట్టింది.

“మిస్టర్ ధరణి !..ఎలావున్నావ్ ?ముగ్గురమ్మాయిల ముద్దుల తండ్రివి.నీకేమిటి చెప్పు?

పెద్దది ఫుడ్ పాండా ..మధ్యది మైహోఒ ..చిన్నది స్విగ్గి ..ఫోనుల్లో నెట్..కార్డుల్లో క్యాష్ వుఒటే చాలు. అయినా “ఏ టి ఎం” లాంటి డాడీ మీరున్నారు. మీ లైఫే లైఫ్.ఎటు తిరిగీ మీ మధ్యలో యిమడలేనిది..నేను ఒక్కదానినే. అందుకే ఫోనుక్కూడా అందనంత దూరంలో సిగ్నల్స్ లేని చిన్న వూరికి వచ్చేసాను. ఈ కొరియర్ కూడా పక్కూరికి పంపించి చేయిస్తున్నాను. జీవితంలో ఓడిపోయాను. పిల్లలముందు చేతగానిదానిలా తలవంచేసాను.
దాదాపు ఇరవై యేడు సంవత్సరాలు సేవచేసాను. చివరకు సాధించ గలిగింది..చాదస్తపు మమ్మి .. పాతకాలపు డమ్మీ. ఎనిమిది గంటలకు నిద్రలేపితే నాన్సెన్స్..హాలిడేస్ లో స్నానం చేయమంటే చిరాకు.
పండగలొచ్చినా అంతే.రాత్రి పదకొండయ్యింది నిద్ర పొమ్మంటే మాకు తెలుసు. కుక్కర్ ఆన్ చెయ్యమంటే కోపం.

కనీసం కాఫీ చేసుకోవడం చేతకాదు.ఇక వంటావార్పూ పేరెత్తితే ..ఇది టుతౌజఒడ్ ఎయిటీన్..

నువ్వింకా బిసి లోనే వున్నావు.

తల్లులూ ఈరోజు పండగ పర్వదినం..అందమైన చీరలు అల్మారాలో వున్నాయి. ఈ ఒక్క రోజయినా కట్టుకొని కనువిందు చేయండి అంటే..మేము “అన్ పడ్” అమ్మాయిలం కాదు.

అని గర్వంగా పోజు పెట్టారే తప్ప అమ్మానాన్నల ఆశ తీర్చాలని ఆలోచించారా?

యెంత జెనరేషన్ గేపని సరిపెట్టుకుందామనుకున్నా నన్నునేను సమర్దించుకోలేక పోతున్నాను. ఈ రోజు వాళ్ళతో నువ్వూ నేనూ ఉంటాము.మనపిల్లలు మనకు ముద్దే. మరి రేపు..అత్తా మామ భర్త ఆడపడుచులు..
వాళ్ళకు ఏతేడా కనిపించినా కనిపెంచిన తల్లిదండ్రుల్ని తిట్టిపోస్తారు.సరిగా పెంచలేని వాళ్లు పిల్లల్ని

ఎందుకు కన్నారు? జంతువులకి మీకూ తేడా ఏమిటని ప్రశ్నిస్తారు. కనేశాము కాబట్టి.. చేయగలింది యేమీలేదు. నేను ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం కళ్యాణ్ ఫోన్ కాల్. రోజు మధ్యాహ్నం కళ్యాణ్ ఫోన్ చేసాడు.కార్తిక లేదనిచెప్పాను. నేను మీతో నే మాట్లాడాలి ఆఒటి అన్నాడు. చెప్పుబాబూ అన్నాను. నేను మీతో మాట్లాడినవిషయం కార్తికకు చెప్పకండి తను బాధపడితే నేను తట్టుకోలేను అన్నాడు..

అయినా మీకు చెపు తున్నాను.

“కార్తి అంటే నాకెంత యిష్టమో తెలుసు మీకు .అటువంటి కార్తిని ఎవరేమైనా అంటే నేను తట్టుకో లేను.

మేమిద్దరమే వుంటే ప్రోబ్లమే రాదు.తనకు వంటచేయడం రాదు.నాకువచ్చు.లేదా సిటీ నిండా హోమ్ డెలివరీ జనాలే.నోప్రోబ్లం ...” నీ ప్రోబ్లం చెప్పు బాబూ అన్నాను.

“అదే ఆఒటి..నేను లేనప్పుడు యింటికి ఎవరైనా వస్తే ఫుడ్ అంటే ఆర్డర్ చేసుకోవచ్చు.. కనీసం కాఫీ ..టిలయినా ఆఫర్ చెయ్యాలి కదా?

పిల్లలు పుడితే వాళ్లకు కనీసం పాలైనా పట్టాలి..డైపర్లుమార్చాలి.. స్నానాలు చేయించాలి. దానికి కూడా స్విగ్గి ..ఫుడ్ పాండా అనలేముకదా? ఆధునికత అవసరమే.ఎంతవరకు? అమెరికాలో నాఫ్రెండ్ బేబీకీ మాఅమ్మానాన్నల కాలఒ నాటి “వాంవాటర్” పడుతున్నారట.మోడరన్ అని విస్కీ బ్రాఒదీలు తాగిస్తే?

నేను మీపెంపకాన్ని తప్పుపట్టడం లేదు ఆఒటి..స్వేచ్చయివ్వాలి.చేతిలో కత్తి వుందని చెయ్యి కోసుకోముకదా?ప్రేమ మత్తులో తప్పులు కూడా ఒప్పులుగానే వుంటాయి. జీవితమఒటే కేవలం ప్రేమే కాదుగా?బాధ్యతలు కూడా వుంటాయి. మీరు మాకిచ్చిన ప్రేమ మాపిల్లకు మేమివ్వాలి.అవసరమైననాడు అమ్మా నాన్నలకివ్వాలి. నన్ను ముట్టకు నామాలకాకీ అన్నట్లు బ్రతకలేముకదా? నాకు అర్ధం అయ్యింది..కళ్యాణ్ మనసు.ముఖమల్ క్లాత్ అడ్డంపెట్టిచెప్పుతో కొట్టిన ఫీలింగ్. ధరణి..నీతో యిదంతా చెప్పి బాధపెట్టడం యిష్టంలేదు. కన్నకూతుర్లను కష్టపెట్టి వంట నేర్పించాలనిపించలేదు. వాళ్లకు ఇప్పటికే తల్లఒటే రాక్షసి..బ్రహ్మరాక్షసి.. వంట నేర్చుకోమని బలవంతం చేసి.. దెయ్యమనో ..పిశాచి అనో పిలిపించుకోలేను. నాతల్లికి కూడా తోడుకావాలి.అందుకే అమ్మతో ఈ గ్రామం వచ్చేసాను. పెద్దదానికి పెళ్లి సెటిల్ అయిపోయిఒది. రెండో దానికి ఇంకా చాలా టైం వుంది. సాహితి ఇంకా చిన్నపిల్లే. ఆ కాలంలో రాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడు సీత స్థానంలో స్వర్ణ సీత ను ప్రతిష్టిఒచుకుని చేసాడని చదివాను. ఆయన రారాజు కాబట్టి బంగారు సీత ను ప్రక్కనపెట్టుకున్నాడు. పెళ్లిళ్ళలో నీకు అంత కష్టం కలిగించను. కన్న నేరానికి వచ్చిముగ్గురు అల్లుళ్ళ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను. చేసిన వాగ్దానం తప్పినందుకు కల్యాణ్ ని క్షమించమని అడుగుతాను.

ముగ్గురు తల్లుల్ని మూడు పిజ్జాలు ఆరు బర్గర్లతో వర్ధిల్లమని చెప్పు. వుంటాను .నీదమయంతి.”

******

ఉత్తరం పూర్తి చేస్తూనే ..

“అయితే డాడీ..అమ్మ ఇక మనదగ్గరకురాదా?”

ఏడ్చేసింది సాహితి. రక్తం మంచులా గడ్డకట్టుకు పోయినట్లు పాలిపోయాయి . కార్తిక అదితి ముఖాలు.

యిద్దరూ వచ్చి ధరణిరావుని వాటేసుకుని బిక్క ముఖాలు పెట్టేసారు. ధరణి రావయితే చేస్టలుడిదిగినట్లు కుమార్తెల తలల మీద చేతులేసి శూన్యం లోకి చూస్తూ శిలావిగ్రహమై పోయాడు.

***

“నాన్నా!మీరు చదివింది సైకాలజీ . అమ్మరాసిన వుత్తరం విని యింతగా ఎందుకు షాకయ్యారు?నాకు ఏడుపు వచ్చింది.ఏడ్చేశాను.చిన్నపిల్లను కదా? మరి మీరో ?ముగ్గురూ పెద్దలే.అమ్మ ఏమిరాసిఒది? ఎవరినైనా తిట్టిందా? లేదే. తను ఓడిపోయానని కదా రాసింది.అమ్మని ఓడిఒచింది మనమే కదా?గర్వించాలి లేదా సిగ్గుపడాలి.అమ్మరాసింది నిజమే.అమ్మ ఆవేదనలో మాకూ భాగం వుంది. అమ్మ అహర్నిశలూ కష్ట పడుతుంటే సాయం చేయడం మాని పైగా విసుక్కున్నాం.

నాన్నా!నిన్నే నావాట్స్ యాప్కి ఓమెసేజ్ వచ్చింది. అమ్మలేదన్న బాధలో దానిని పట్టించుకోలేదు.అక్కలకుకూడా వచ్చి వుంటుంది కానీ అది తెలుగు మెసేజ్. చదువుకోలేరు. నేను చదువుతాను వినండి.విన్నాక అమ్మ వుత్తరం గురించి ఆలోచిద్దాం.

“అమ్మ” ... ఒక వేదం* ఒక భక్తి భావం* ఒక ప్రేమ రూపం * ఒక సంవేదన* క భావన *ఒక పుస్తకం* ఒక కలం* ఒక కవిత* ఒక జ్ఞానం* ఒక దీపం*చల్లని చిరుగాలి*ఒక అన్నపూర్ణ* ఒక లాలిత్యం*ఒక కరుణ*
ఒక దీవెన*ఒక అక్షిత *ఒకమధుర గేయం* ఒక ప్రవచనం* ఒక భద్రత* నమ్మకం *ఆరోగ్య ప్రదాయిని.* అమ్మ ఒక జోలపాట *అమ్మే దేవత*కంటి వెలుగు* యెవరు అమ్మనుకలిగి ఉంటారో.. యెవరు అమ్మ దగ్గర ఉంటారో వారు అతి సంపన్నులు. యెవరు అమ్మ సేవా భాగ్యం కలిగి ఉంటారో వారు ధన్యులు..అదృష్ట వంతులు. అమ్మ కొంగులో ప్రతి అణువునా కనిపించేది ప్రేమామృతమే.” మేము ఈరోజు అమ్మాయిలం.రేపు మేమూ అమ్మలమేగా? నాన్నా !మేము అమ్మచేసిన ఏ పనికీ విలువ యివ్వలేదు.ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏ పనికైనా విలువు కట్టగలమా అనిపిస్తోంది.అక్కలు చదువుకున్న అమ్మాయిలు. జ్ఞానవంతులు .వాళ్ళు ఆలోచిఒచాలి.అమ్మ చేసిన నేరం ఏమిటో.

మేము చూపిన నిర్వాకం యేమిటో.

ఏది ఏమైనా నాన్నా మీరు ఏమనుకున్నా నేను అమ్మదగ్గిరికే వెళ్ళిపోతాను.”

సాహితి ఆవేదనతో మూగదైపోయిఒది.

“అవును డాడీ..అమ్మరాసిఒది అక్షరాలా నిజం.ఆలోచిస్తుంటే అర్ధమవుతోంది. నిద్రలేపితే ..విసుక్కున్నాఒ. స్నానం చేయమంటే తాఒడవమాడాఒ.పండగలకు చీర కట్టుకోండి అంటే చీదరించుకుని
అమ్మను బాధపెట్టాం.జంక్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరం ..తినకండి అంటే తిరస్కార భావంతో తల ఎగరేసాం.” కార్తిక..రియలైజ్ అయినట్లు మాట్లాడింది. అక్క చెప్పింది నిజమే డాడీ ..చిన్న పనిచెప్పినా..చేసే వాళ్ళం కాదు.
ఫుడ్ పాఒడాలకీ ..పిజ్జ్ళాలకీ మెనీ ఎక్కడినుంచి వస్తుఒదో ఆలోచించలేదు. బావ పలికిన మాటలకే అమ్మ ముఖమల్ క్లాత్ మీద చెప్పుతో కొట్టినట్లు ఫీలయ్యానని రాసింది. ఆలోచిస్తుంటే మేము చేసిన పనులకి మాచెప్పులతోమేమే కొట్టుకోవాలనిపిస్తోంది.” అక్కఅదితి మాటలకు అడ్డమొస్తూ..

“వద్దక్కా నీవి హైహీల్ చెప్పులు.దెబ్బలు బాగా తగులుతాయి.సెప్టిక్ అయితే నీ అందమైన ముఖానికి ప్లాస్టిక్ సర్జరి అవసరమైతే కాలేజ్ ఎగ్గొట్టి హాస్పిటల్ చుట్టు తిరగాలి.అదిప్పుడు అవసరమా? డాడీ చెప్పులడిగి తీసుకో.” “అమ్మాయిలూ !మీరెవరూ కొట్టుకోవద్దు..సమస్యకు పరిష్కారం ఆలోచించండి.” డాడీ ధరణిరావు సూచనకు ముగ్గురూ ఆలోచనలో పడిపోయారు.

అర్ధరాత్రి పన్నెండు గంటలకు

“అక్కా !ఐడియా ..”

అక్కలిద్దరినీ నిద్రలేపి తన ఐడియాని కొత్త రైటర్ పాతనిర్మాతకు కధ చెప్పే స్టైల్లో చెప్పింది సాహితి పెద్ద ఆరిందాలా ..వృక్షం లేని చోట ఆముదపు చెట్టే మహా వృక్షం కదా?

*******

“ఆఒటి! కధ స్క్రీన్ ప్లే ..దర్శకత్వంలో రాజమౌళిని మించిపోయారు.

వూహల కఒదని మార్పు కార్తికలో అదితిలో కూడా..యెప్పుడు చుడిదారుల్లో ..లెగ్గింగుల్లో దర్సనమిచ్చే తల్లులిద్దరూ నిఒడైన చీరల్లో అందమైన జడలేసుకొని మాయిఒటికొచ్చి అమ్మానాన్నల్ని పలకరించి..నమస్కరించి..అత్తయ్యా !మాకు వంట నేర్పుతారా..? అని అడిగితే.. అమ్మదయితే “అవాక్కు” అంటారే అదే పరిస్థితి. దాదాపు స్పృహ తప్పిపోతుందేమోనన్నఫీలింగ్. డాడీ అయితే డాక్టర్ కి ఫోన్
చేయాల్సి ఉంటుందేమోనని తెగ హైరానా పడిపోయారు. డాక్టర్ ఫోన్ నెంబర్ కోసం సెల్లూ..డైరీలే కాదు ఇల్లు యిల్లఒతా వేదికేసారు. అంకుల్ కి అమ్మాయిలకి మీరెలాంటి షాక్ ఇచ్చారో తెలియదుకానీ..మీకు షాకులివ్వడానికి
కంచిపట్టు చీరల్లో ఇన్నోవా కారులో రధసారధిగా ఐమీన్ కారు సారధిగా కార్తీ ..సారధ్యంలో అంకుల్ అదితి సాహితి వేఒచేస్తున్నారహో.”

“కళ్యాణ్?అంతా బ్రేకింగ్ న్యూస్ లాగ బ్రేక్ చేస్తున్నావు యిన్ని లీకులా?ఎలా?”

“మీ అండర్ కవర్ ఏజెఒట్ యెవరు? సాహితి కదూ?

అదే ఏజెంట్ సాహితి నా ముద్దుల మరదలు అనే విషయం ఎలా మర్చి పోయారు ఆఒటి?” మొత్తానికి “ఆన్ హర్ మెజెస్టి సిక్రెట్ సర్వీస్” అనిపించారు.

అల్లుడు కళ్యాణ్ మాటలకు నవ్వుతూ

“ఫర్ అవర్ ఫ్యూచర్ ఓన్లీ.” నవ్వుతూ ఫోన్ కట్ చేసింది ...మదర్ ఆఫ్ కార్తిక..అదితి.. సాహితి. మరియు కాబోయే కళ్యాణ్ అత్తగారు.శ్రీమతిధరణి దమయంతి.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు