ఇ ప్పుడున్న స్థాయిలో మద్య వినియోగం కొనసాగితే...తదుపరి సంవత్సరాలలో మార్పులు ఎలా ఉంటాయంటే...
రాష్ట్రం పేరు: మద్యప్రదేశ్
రూలింగ్ పార్టీ పేరు : పార్టీ
పార్టీ సింబల్ : వైన్ గ్లాస్( ఇది మరీ అభ్యంతరకరంగా ఉందనిపిస్తే...బాటిల్...)
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు:
1. ప్రభుత్వానికి అత్యధిక అదాయం లభించేది...మద్యం అమ్మకం ద్వారా కాబట్టి మద్యం కొనేవారికీ, వాడే వారికీ అన్ని స్థాయిల్లో రిజర్వేషన్లూ రాయితీలు..
2. నీళ్ళు, పాలు న్యూస్ పేపర్లు ఇళ్ళకు ఉదయాన్నే సరఫరా చేసే విధంగానే మద్యం కూడా సప్లయ్ చేయడానికి ఏర్పాట్లు
3. డ్రాట్ బీరు పైప్ లైన్స్ లో ఇంటింటికి సరఫరా చేయడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం కోసం ఫ్రాన్స్ కంపెనీతో ఒప్పందం.
4. మద్యం ఇంటికే సరఫరా అవడం వలన ఎవరూ తాగి డ్రైవ్ చెయ్యరు కనుక రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతాయి.
5. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ : లివర్ ఆపరేషనూ, లివర్ ట్రాన్స్ ప్లాంటూ ఉచితం. (గత ఆర్ధిక సంవత్సరంలో రోజుకు కనీసం ఆరు పెగ్గులు తాగిన వారికే ఈ సదుపాయం.)
మద్యప్రదేశ్ పాలక మండలి సభ్యులు:
1. కబీర్ దాస్
2. సుందరమ్
3. మహర్షీ వైన్ తేయ
4. సారాభయ్ దేష్ ముఖ్
5. కల్లూ భాయ్ లల్లూరం
6. స్వామీ జిన్ మయానంద
తాజా వార్త
ఈ సభ్యులందరూ స్కూళ్ళలో గ్లాస్ మేట్స్ అని ఓ పత్రిక హేళన చేస్తూ రాసింది. ఆ వార్తని ఖండిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన వివరణ:
" ఇది తప్పుడు వార్త ..మా మీద బురద చల్లడానికే చేసిన ప్రయత్నం.
మా పార్టీ లోని సభ్యులెవరూ ఒకరోజు కూడా స్కూల్ లో అడుగు పెట్టనప్పుడు ఈ వార్త ఎలా నిజమవుతుంది?..ప్రజలే ఆలోచించాలి..
" ఇది తప్పుడు వార్త ..మా మీద బురద చల్లడానికే చేసిన ప్రయత్నం.
మా పార్టీ లోని సభ్యులెవరూ ఒకరోజు కూడా స్కూల్ లో అడుగు పెట్టనప్పుడు ఈ వార్త ఎలా నిజమవుతుంది?..ప్రజలే ఆలోచించాలి..
స్ఫూర్తి:1966 జ్యోతి మాస పత్రిక లో రమణ గారు వ్రాసిన ఒక ఐటం!