ఎ రొమాంటిక్ జర్నీ - లాస్య రామకృష్ణ

a romantic journey

బెం గుళూరు లో ని MNC లో జాబ్ చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళందరూ హైదరాబాద్ లో ఉండటం వల్ల తరచూ బెంగుళూరు టు హైదరాబాద్ ప్రయాణం నాకు అలవాటే. ప్రయాణం లో అలసట తెలియకుండా ఉండడానికి నేను పుస్తకాలను ఎక్కువగా చదువుతూ ఉంటాను. ఈ సారి ప్రయాణం లో నాతో పాటు రవీందర్ సింగ్ రచించిన 'ఐ టూ హాడ్ ఎ లవ్ స్టొరీ' అనే బుక్ చదువుదామని తెచ్చుకున్నాను. ఇంతలో ఎవరో 'హాయ్' అని పలకరించారు. ఆ పిలుపు వినగానే పుస్తక పఠనం లో నిమగ్నమయిన నేను వెంటనే బయటపడ్డాను.

'హాయ్' అని బదులిచ్చాను. అందంగా ఉంది. కర్లీ లూస్ హెయిర్ గాలికి ఊయలలూగుతూ ఉంది. మొన్నొచ్చిన సినిమాలో సమంతకి ఈ అమ్మాయికీ చాలా పోలికలు ఉన్నాయి. బొట్టు పెట్టుకోలేదు. చీర కట్టుకుంది. వాయిస్ కూడా హస్కీ వాయిస్.

'హాయ్ అండి' అని బదులిచ్చాను. నా పక్క సీటు కి వచ్చిన అమ్మాయి అనుకుంట. 'ఐ యాం అనిత. సీట్స్ ఎక్స్చేంజి చేసుకుందామా. నాకు విండో దగ్గర కూర్చోవడం ఇష్టం. బుక్ చేసుకుంటున్నప్పుడు కుదరలేదు. సరేలే బస్సులో అడిగి అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అనుకున్నాను' అని అంది.

సాధారణం గా ఎవరైనా అమ్మాయి ఇంత అందంగా రిక్వెస్ట్ చేస్తే ఎవరు కాదనగలరు. ఖలేజా సినిమాలో మహేష్ బాబు డైలాగు గుర్తొచ్చింది. 'ఏం అడిగిందండి' అని సునీల్ అనగానే, 'కదా బస్ ఉండుంటే నేనే లిఫ్ట్ ఇచ్చేవాడిని.' అనే రేంజ్ లో మహేష్ బాబుని పడేసిన అనుష్కలా అడిగితే సామాన్య మానవుణ్ణి నేను మాత్రం కాదనగలనా.

కట్ చేస్తే సీట్స్ ఎక్స్చేంజి అయిపోయాయి. సాధారణం గా అమ్మాయిలందరూ ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు లేడీస్ పక్కనుండే సీట్స్ ని బుక్ చేసుకుంటారు. మరి ఈ అమ్మాయి ఏదైనా హడావిడిలో ఉందేమో.

ఇప్పటివరకు నేను ఒంటరిగా చేసిన ప్రయాణాలలో అబ్బాయిలే నా పక్క సీటులో ఉండేవారు. అమ్మాయి అందులో సమంత లాంటి అమ్మాయి నా పక్కన కూర్చోవడం ఇదే మొదటిసారి.

ఆ అమ్మాయితో మాట్లాడాలనిపించింది కానీ అమ్మాయిలతో మాట్లాడే అలవాటు పెద్దగా లేనందువల్ల ఎలా మాట్లాడాలో తెలియలేదు . పుస్తకం చదువుదామని అనుకున్నా ఇది ఇదివరకటిలా బోర్ కొట్టే ప్రయాణం కాదు కదా నా మనసు పుస్తకం పై కి వెళ్ళట్లేదు. ఎలాగోలా మనసుకి సర్ది చెప్పుకుని నేను పుస్తకం చదవడం ప్రారంభించాను. ఇంతలో ఆ అమ్మాయే నాతో మాటలు కలపడానికి ప్రయత్నించింది.

'ఏ బుక్ చదువుతున్నారు, ఈ బుక్ చదువుతున్నారా' అని ఆశ్చర్యం గా అడిగింది.

'అవునండి, ఎందుకలా అడిగారు' అని అడిగాను.

'అదేం లేదండి, ఈ నవల్ లో హీరోయిన్ చనిపోతుంది. ట్రాజెడీ లవ్ స్టొరీ' అని చెప్పింది.

'చెప్పేసారా, ఎవరైనా కథ చివరలో ఏమవుతుందో ముందే చెప్పేస్తే నాకు ఆ కథ పై ఇంట్రెస్ట్ పోతుంది' అని అన్నాను.

'అయ్యయ్యో, మీకు ఇంట్రెస్ట్ పోగొట్టాలని అలా చెప్పలేదు. వయసులో ఉన్నారు. ఇలాంటి ట్రాజెడీ లవ్ స్టోరీస్ ఎందుకు చదవడం అని అనిపించి ముందే చెప్పేసాను, ఐ యాం సారీ' .

'మరి మీరు కూడా వయసులోనే ఉన్నారు. మీరు చదివారు కదా'.

'లేదండీ, నేను చదవలేదు. ఏదైనా బుక్ చదివే ముందు నేను రివ్యూస్ చదువుతాను. అలా తెలిసింది. మీకెలాగైతె కథ ముందుగా తెలిసిపోతే కంటిన్యూ చెయ్యలేరో అలాగే నాకు ట్రాజెడీ కథలు చదవడం ఇష్టం లేదు.' అని చెప్పింది.

అందంగా లేనా? అసలేం బాలేనా? నీ ఈడు జోడూ కాననా అనే పాట వినబడుతోంది. వెంటనే ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి 'హాయ్ రా, ఎలా ఉన్నావు? హా వస్తున్నా. బస్సులోనే ఉన్నా. ఇంకా నా మీద కోపం పోలేదారా. యు ఆర్ చో చ్వీట్ కదూ. హాయిగా నిద్రపో. ఐ విల్ బి దేర్ బై టుమారో మార్నింగ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్' .

ఆమె ఫోన్ లో మాట్లాడుతున్నంత సేపు నాకు టెన్షన్. కొంపదీసి ఈమెకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా. అలా అయితే నా పరిస్థితి ఏంటి.

ఇంతలోనే నాకు నేనే సర్దిచేప్పుకోవడం ప్రారంభించాను. 'అయినా ఈ ప్రేమలు దోమలూ మా ఇంటా వంటా లేవు. హాయిగా అమ్మా నాన్నా తెచ్చిన సంబంధం చేసుకోవాలనే ఇప్పటివరకు నా ఉద్దేశ్యం. అరె అదేంటి. ఇప్పటివరకు అంటే ఇప్పట్నించి నా ఉద్దేశ్యం మారిందా. ఏమో అంతా దేవుడి చేతిలోనే ఉంది.'

'ఆ ఫోన్ లో మాట్లాడినది ఎవరో తెలుసుకుంటే సమస్య తీరిపోతుంది. కానీ ఎలా అడగను. రెండు ముక్కలు సరదాగా మాట్లాడగానే నేను ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకునేంత చనువు వచ్చిందా అని గనక ఆ అమ్మాయి రివర్స్ అయితే... ' అని ఆలోచనలతో సతమవుతుండగా ఆ అమ్మాయి నా మనసులో మాట కనిపెట్టినట్లుగా ముసి ముసిగా నవ్వుతోంది.

'ఏం అయిందండీ. ఇంత సేపూ బాగానే ఉన్నారు కదా, ఎనీ ప్రాబ్లం' అని తనదిన స్టైల్ లో హస్కీ వాయిస్ లో అడిగింది.

'అబ్బెబ్బే, ఏం లేదండీ. మీరెక్కడ దిగాలండి బెంగుళూరు లో' అని టాపిక్ డైవెర్ట్ చెయ్యాలి అన్నట్టుగా అడిగాను. అవసరమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది కూడా

'హేబ్బాల్ లో దిగాలండి. మై ఫ్రెండ్ పిక్స్ అప్ మీ ఫ్రం దేర్' అని చెప్పింది. అదే తెలుగులో చెప్పుంటే 'నా ఫ్రెండ్ నన్ను పిక్ అప్ చేసుకుంటుంది లేదా చేసుకుంటాడు అనే సరికి నాకు క్లారిటీ వచ్చేది కదా. ఇలాంటి సందర్భాల లో నే నాకు ఇంగ్లీష్ ని కనిపెట్టిన వాడంటే పిచ్చి కోపం'

'ఓహ్ ఫ్రెండ్, హి హి హి' అని బ్రహ్మానందం స్టైల్ లో ఒక నవ్వు నవ్వాను. ఇంకా డీటెయిల్స్ అడిగితే నా మీద అనుమానం రావొచ్చు

పొడి పొడి డైలాగు ల తో నే అమ్మాయిలు పడిపోతారని మహేష్ బాబు సినిమాల ద్వారా నేర్చుకున్నాను. కానీ నాకు త్రివిక్రమ్ అనే రైటర్ లేడుగా. ఒక వేళ అటు ఇటు గాని అయితే, నాకు ఇంట్రెస్ట్ లేదనుకుని తను తప్పుకోవచ్చు.

నో నో నో.. నా స్టైల్ నే ఫాలో అవుదామని ప్రయత్నించాను. ఎలాగైనా మాటలు కలపాలి. సినిమాల గురించయితే నేను నిర్విరామంగా గంట సేపు మాట్లాడగలను. 'ఒరేయ్ అప్పుడు వన్ సైడ్ కాన్వర్సేషన్ అవుతుందిరా' అని నా మనసు హెచ్చరించిది. ఆ హెచ్చరికను గుర్తుంచుకుని వన్ సైడ్ కాకుండా జాగ్రత్తపడాలి అనుకున్నాను.

'మీరు రీసెంట్ గా చుసిన సినిమా ఎంటండి' అని అడిగాను

'ఏంటోనండి సినిమాలంటే ఇంట్రెస్ట్ పోతోంది. ఇదివరకటిలా సినిమాల పై న ఆసక్తిఉండట్లేదు. మాక్సిమం డౌన్లోడ్ చేసుకుని చూస్తుంటాను. రీసెంట్ గా అంటే 'ఎటో వెళ్ళిపోయింది మనసు' చూసాను. ఏంటో బోరింగ్ గా అనిపించింది' అని అంది.

'ఓహ్ ఆ సినిమా చూసారా. హీరోయిన్ సమంత బాగా నటించింది కదా. కొంచెం మీకు సమంత కి దగ్గర పోలికలు ఉన్నాయండి' అని అనగానే ఆమె లో ని అమితానందం గమనించాను. ఒక్కసారిగా సమంత నటించిన సినిమాలో తనని తానూ ఉహించుకుందేమో ఎంత సేపటికి ఆలోచనలోనే ఉంది.

'హలో హలో' అని చిటికేసి లేపాను

'ఓహ్! సారీ...చాలా మంది ఈ కాంప్లిమెంట్ ఇచ్చారండి. యు నో వన్ థింగ్? 'ఏమాయ చేసావే' సినిమా తరువాత నుండి నేను జీన్స్ వేసుకోవడం మానేసాను తెలుసా. ఓన్లీ శారీస్.'

గౌతం మీననూ. నీకేంటి సినిమాలు తీసేసి హ్యాపీ గా ఉంటావు. ఇక్కడ చూడు సినిమా సినిమా కి హీరోయిన్ లా తయారయి అమ్మాయిలందరూ ఇలా అబ్బాయిలని పడేస్తున్నారు. నువ్వొచ్చి చెప్తావా నా ప్రేమ సంగతి. అని మనసులో ఆ సినిమా తీసిన డైరెక్టర్ ని తిట్టుకున్నాను.

అలా మేము మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుండగా మెల్లగా నిద్రపట్టేసింది.

తెల్లారి లేవగానే ఆ అమ్మాయిని విడిచి వెళ్లాలే అని బాధ. పేస్ బుక్ అకౌంట్ తీసుకుందామని అనుకుంటుండగా బస్సు బెంగుళూరు లో హేబ్బాల్ వద్ద ఆగింది.

బస్సు దిగాను

ఇంతలో

"ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యరం "

అనే రింగ్టోన్ వినపడింది. నన్ను దాటుకుంటూ అచ్చు గబ్బర్ సింగ్ సినిమా లో ని శృతి హస్సన్ లా ఒక అమ్మాయి నడచుకుంటూ వెళ్ళింది. ఆ అమ్మాయి వెనకాతలే నా పాదాలు నన్నడగకుండానే కదిలాయి

దిస్ ఈస్ ఎన్ ఎండ్ లెస్ జర్నీ

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు