కం టు హాల్ లివ్ విత్ ఆల్ - బంటుపల్లి శ్రీదేవి

come to hall live with all

నేను ... నేను వెల్లను నాన్నమ్మ ...ఇక నేను వెల్లను...అలసిపోయాను ..ఇక నావల్ల కాదు నన్ను బలవంతం చెయ్యద్దు అంటూ నాన్నమ్మ ఒడిలో తల పెట్టుకుని చేతిలో ఉన్న సెల్ ని అటూ ఇటూ తిప్పుతూ చూసుకుంటుంది పూజ .అలాగేలె...వెల్లద్దు లే ....వచ్చి రెండు రోజులైంది అసలు ఏమి జరిగినది చెప్పవు....అన్నీ తెలిసినట్టే మీ అమ్మ నాన్న కూడా ఏమిటి...ఏమి జరిగింది అడగటం లేదు సరికదా....నా కూతురు నాకు భారమా...నా దగ్గరే ఉంటుంది ...వాడితో నా కూతురికి ఏం పని అఒటున్నాడు, ఇక పోతే అల్లారు ముద్దుగా పెంచుకున్నాం....అంత కట్నం, కానుకులు పోసి పెళ్ళిచేసామా.... రెండు సంవత్సరాలైంది...పాపం బిడ్డకి ఎంత నరకం చూపించాడని....వాడు అసలు మనిషేనా....అంటుంది... మీ అమ్మ ఇంతకీ ఏం జరిగింది అంటే ఎవరూ నోరు విప్పి చెప్పరాయె.... ఇంతకీ ఏమి జరిగింది పూజా

ఏంటి నానమ్మ....ఎన్ని సార్లు చెప్పాలి....ప్రతిరోజు జరిగిన ప్రతి విషయాన్ని ఫోన్ లో చెబుతూనే ఉన్నా గా అమ్మకి నాన్నకి...ఇప్పుడు నీకు కూడా చెప్పాలా...జరిగింది ఏదో జరిగింది మల్లీ ఇప్పుడు అన్నీ నేను చెప్పలేను...నానమ్మ అని అరిచింది పూజ. సరెలె...చెప్పద్దు....కాస్తా ఆ సెల్ పక్కన పెట్టి ప్రశాంతఒ గా పడుకో...దా అంటూ మనవరాలి తల మీద ప్రేమ గా నిమురుతూ జోకొట్టింది నానమ్మ జానకి . తలమీద చేతితో అలా ప్రేమగా నిమిరే సరికి మరింత దగ్గరగా నానమ్మ కుడి చేయిని తీసుకుని చెంప కింద పెట్టుకుని అలా నిద్రపోయింది పూజ...పూజ..పూజ...లాయర్ గారు వచ్చారు రా.....

డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టు అని పిలుస్తున్న కోటీశ్వర రావు మాట చెవిలో పడటం తో...ఉరుకున కొడుకు దగ్గర కి వెళ్ళింది జానకమ్మ . అక్కడకి ఇంకా పూజ రాకపోవడం తో ...ఒరెయ్ కోటి...నువ్వు, నీ తెలివి మండిపోను....నిన్న కాక మొన్న పెళ్ళైంది....నిండా రెండు సంవత్సరాలు ....ఈ లోగా ఏం కొంపలు మునిగిపోయాయని ...అప్పుడే విడాకులు అని గెంతుతున్నారు ఇద్దరూ అని అడిగింది జానకమ్మ. అది కాదే అమ్మా...వాడు ఉత్త సాడిష్టు, పిసనారి పీనుగ....మనమ్మాయి మాటకి కాస్తంతైనా విలువ ఇచ్చాడా...అది కూడా చదువుకుంది...కదా

పాపం పిచ్చిది ఎలా అయిపోయిందో చూడు.... అంటూ సెల్ తో బిజీ గా ఉన్న కూతుర్ని చూసి తెగబాద పడిపోయాడు కోటి... వచేసరికి ఇల్లు నీట్ గా ఉండాలిట...చక్కగా చీరకట్టుకుని లక్ష్మి దేవి లా ఉండాలి అంటాడట...మనమ్మాయికి చేతనవునా......... మనమ్మాయి ఏమన్నా పనమ్మాయి అనుకుంటున్నాడా ఏమి....ఇల్లు నీట్ గా పెట్టడానికి పనమ్మాయి ఉంది... ఒక రోజు పనమ్మాయి రాలేదు ...ఆ రోజు ఇల్లు నీట్ గా లేదు...అయితే ఏంటటా బద్దకిస్టువి నువ్వు అని తిడతాడా... మొన్నటికి మొన్న బిడ్డ ని షాప్ కి తీసుకుని పోయి చీరలు కొనిపెట్టాడంటా... పూజకి ఆ ఎ.టి.ఎం ఇచ్చి పోరాదా....బిడ్డకి నఇచ్చింది కొనుక్కుంటది. చీరలు వాడే కొనాలా.... అరె.....బిడ్డ ఏం తింటే అది పెట్టాలి గాని....బయట అవి తినద్దు...ఇవి తినద్దు...అని పూజ వంట చెయ్యకపోతే ...సాయంత్రం వచ్చి బన్నీ వచ్చి చేసి పెడతాడంటా... .... అంతే గాని బయట తిండి తింటే ఊరుకోడట....అరె ఓ సారి బద్దకం గా ఉంటుంది, ఒండుకోబుద్ది కాదు...ఏదో తెచ్చుకుని తినేద్దాం ఈ రోజు అనుకుంటే అదీ తప్పే.... .తెల్లారి లేచిందగ్గర నుంచి.. ఏం వండావు, ఏం చేస్తున్నవు..పాలు ఇచ్చావా...నీళ్ళిచావా...అని అత్తగారి ఫోన్ ... ఇంటికి చ్చిన దగ్గర నుంచి ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాడట....వాట్స్ ఏప్ లో చాటింగ్ లు ...వీడియో గేం లు ...ఇదే పని...ఆ టైం లో పూజ మాట్లాడితే మాత్రం ...నువ్వు నన్ను పట్టించుకోవు, ఎప్పుడూ ఫోన్ లోనే ఉంటావ్ అని గొడవకి దిగుతాడట...... ఈ విషయంలో పెద్ద రాద్దాంతం చేసాడట....మరి నువ్వు కూడా ఇంటికి వచ్చిన తరువాత సెల్ తోనే కదా అంటే ఎదురు చెప్పిందని చెయ్యి చేసుకున్నాడట

ఇదేమైనా బాగుందా అమ్మా....దాన్ని ఒక్క మాటైనా మనం ఏ రోజైనా అన్నామా....ఎంత ముద్దుగా పెంచాం...వాడి చేతిలో పెట్టాం ...అంటూ కల్ల నీళ్ళు పెట్టాడు కోటి . మొన్న అత్తగారు ఫోన్ చేసి... ఈ రోజు బన్నీ పుట్టినరోజు...తల స్నానం చెయ్యమని గుర్తు చేసి...వాడికి పాయసం ఇష్టం , పులిహోర ఇష్టం...గాడిద గుడ్డు ఇష్టం అని పనులు పురమాయిస్తుందట , అదొక్కటేనా....సాయంత్రం సినిమా కి వెల్లండి...అలా బయటకి వెల్లండి అని చెబుతూనే ఉంటుందట..... అంటే అన్నీ ఆవిడ చెప్పినట్టే చెయ్యలా... మద్యలో ఆవిడ పెత్తనం ఏమిటట ? ప్రతి రోజు ఒక ఫోన్ అత్తగారి నుంచి....పూజ మనకి ఫోన్ చేసి ...అమ్మా మా అత్తగారు ఇది పురమాయించింది, అది పురమాయించిందని గోల. ఇక్కడ నీ కోడలు ఏడుపు ...ఇక నా వల్ల కాదమ్మా...

మొన్నటికి మొన్న నేను ఆడిట్ లో బిజీ గా ఉన్న రోజు నీ కోడలు ఫోన్ చేసి...బన్నీ చూడండి మనమ్మాయిని ఎంత మాటన్నాడో ...ఎవరో ఫ్రెండ్స్ వచ్హారట వాల్ల ని హోటల్ కి తీసుకుపోదామంటే వద్దు ..లంచ్ ఇంట్లో ఏర్పాటు చేద్దామంటాడట...వంట నాకు రాదు అంటే...చేస్తుంటే అదే వస్తుంది...నేను ఉన్నా కదా...వండి పెడతా...నువ్వు తిని పెట్టు ...అన్నాడట...నన్ను తిండిపోతు అన్నాడని ఒకటే ఏడుపు పూజ... ఏదో ఒకటి చెయ్యండి ...నా కూతురు అన్నన్ని మాటలు పడాలా...నా దగ్గరకి తెచ్చేయండి అని ఒకటే గొడవ ...ఆ రోజు నాకు బి.పి ఎక్కువై పడిపోయాననుకో అంటున్న కొడుకుని సముదాయిస్తూ...ఇదిగో కోటి...ఇవన్నీ చాలా చిన్న విషయాలు...ఇక్కడొక పెద్ద తలకాయ అఘోరించింది గా నేను చూసుకుంటా...గట్టిగా ఒక పది రోజు లు ఓపిక పట్టు , నేను అంతా సెట్ చేస్తా...భయపడకు...ఈ మాత్రం దానికి విడాకులు, లాయర్లు అని మాట్లాడకు ..ఈ విషయం నేను చూసుకుంటా అని సర్ది చెప్పింది కొడుక్కి . అదేమిటి ఆ బన్ని గాడు అలా వాగుతూ ఉంటే....నా కూతురు పడి ఉండాలా...అంత ఖర్మ ఏం పట్టలేదు...ఈవిడ వెళ్ళి ఏం సెట్ చేస్తుంది అనగానే కోడలు చెంప చెల్లుమనిపించింది జానకమ్మ . దెబ్బతో నోరు మూసింది కోడలు....అమ్మని ఎంతో ముద్దుగా చూసిన నానమ్మ చెంప దెబ్బ కొట్టడంతో అవాక్కైపోయి అలా చూస్తూ ఉండిపోయింది పూజ.

మరుసటి రోజు పాయకరావు పేట కి టెకెట్ తీసి మనవరాలి అత్తింటికి వెల్లింది జానకమ్మ

అక్కడ ఇదే పరిస్తితి

నా కోడుకుని రాసి రంపాన పెడుతోంది...వంట చేత కాదట, అవసరమైతే బయట నుంచి తెచ్చుకుందాం అంటుందట. అంత బద్దకమైతే ఎలా అండీ మీ మనవరాలికి. వాడు ఎలా ఉన్నాడో ఏం తింటున్నాడొ రోజు టెన్షన్ ....ఉదయం ఫోన్ చెయ్యగానే ఈ రోజు టిఫిన్ తినలేదమ్మా అంటే ...కడుపు తరుక్కుపోదు ....రోజు ఇది చెయ్యు అది చెయ్యు అని చెబుతూనే ఉన్నా, ఇల్లు చిందర వందరగా ఉంటే ఇంటికి వచ్చేసరికి ఎలా చెప్పండి...ఇల్లే కదా స్వర్గ సీమ అంటారు, ఆమాత్రం తెలీదు మీ మనవరాలికి, ఆ పిల్ల కూడా చదువుకుంది కదా... ఎప్పుడూ ఫోన్.....ఫోను.......చేతిలో ఫోన్ లేకపోతే ముద్ద కూడా దిగదట మీ మనవరాలికి ....అంటూ బన్నీ తల్లి సరోజ వాపోయింది. నా కొడుకు గొంతు నేనే కోసాను, ఇదిగో మా తమ్ముడు లాయర్ని తీసుకుని వస్తున్నాడు ...విడాకుల నోటీస్ పంపి నా తమ్ముడు కూతురుతో పెళ్ళి జరిపిస్తానని అంతెత్తు ఎగురుతోంది బన్నీ తల్లి ఇదిగో సరోజా విడాకులు, మామిడాకులు అని పిల్లల మనసులు చెడగొట్టకండి, అన్నీ సర్దుకుంటాయి పిల్లల జీవిథాలు బాగుండాలనే కదా పెళ్ళి చేస్తాం .... చిన్న చిన్న సమస్యలు వస్తే సర్ది చెప్పాలి గాని, విడాకులు, కోర్టులు అంటారేమిటి ....అన్నీ నేను చూసుకుంటా అని వెనక్కి వచ్చింది జానకమ్మ..

ఒరెయ్ కోటి నా ఎ.టి.ఎం ఇలా ఇయ్యి మారు మాట్లాడకుండా....అంటూ తీసుకుని బయటకు వెల్లి వెనక్కి వచ్చింది...ఇదిగో పూజ బయల్దేరు...

ఎక్కడకి నానమ్మా....

బన్నీ....కి జ్వరమంట...నిన్నటి నుంచి నిన్నే కలవరిస్తున్నాడంట అని చెప్పగానే టక్కున బయలుదేరింది పూజ ఉండైతే ఫోన్ చేస్తా అంది...ఫోన్ వద్దు...ఇద్దరం వెళ్దాం పద అంటూ వెంటబెట్టుకుని హైదరాబాద్ బయలు దేరింది....

బన్నీకి తన ఫోన్ తీసి ఫోన్ చేసి ..., పూజ నీ కోసం బెంగపెట్టుకుంది, తీసుకువస్తున్నా ఇంట్లో నే ఉండమని ...చెప్పింది జానకమ్మ. అక్కడకు వెల్లగానే,,,బన్నీ ఈ పక్కింట్లో నా స్నేహితురాలు కుమార్తె ఉందట ఇప్పుడే వస్తా అంటూ మనవరాలిని ఏకాంతం కోసం వదిలి అలా బయటకు వెల్లింది జానకమ్మ. వారం రోజుల విరహం తరవాత కలుసుకున్నారేమో...ఒకరి కోసం ఒకరు తపించిపోయి...ముద్దుల వర్షం కురుపించుకుంటున్న వారిరువురు పరిసరాలని మర్చిపోయి మమేకమైపోయారు.. వెరీ సారీ పూజా , నేను కొట్టి వుండాల్సింది కాదు అన్నాడు బన్నీ......పాత తగువుల జాడ ను విడిచి, కొత్త బంగారు లోకం లోకి జారుకున్నారు. అప్పుడనగా వెల్ళ్ళినన పూజకి ఫోన్ చేస్తుంటే ఫోన్ అవటం లేదు ఎందుకో...ఈ ముసల్ది ఏం చేసిందో అంటూ ఫోన్ ని పది పది సార్లు నొక్కుతూ విసుక్కుంటోంది పూజ తల్లి సరళ. వీడికేమైంది, అమ్మ గాబరా పడుతోంది కదా ఒక ఫోన్ చేద్దాం అని ఉండద్దు వెదవకి, నా ఫోన్ కి ఏమైందో తెలీదు పని చెయ్యట్లేదు అనుకుంటూ చికాకు పడుతోంది బన్నీ తల్లి సరోజ

ఆ రెండు గంటల తరువాత వచ్చిన జానకమ్మ, రెండు ఫ్లైట్ టికెట్స్ చేతిలో పెడుతూ ...బన్నీ నువ్వు ఓ పది రోజులు సెలవు పెట్టు...ఇదిగో టికెట్స్, తెల్లారి మీ ప్రయాణం అని చెప్పటం తో షాక్ తిన్నారిరువురు.... ఎక్కడికి నానమ్మ, ఏమిటి హడావిడి...నేను చెబుతున్నా చెయ్యండి అని ఆర్డర్ వెయ్యడంతో తప్పలేదు ఇద్దరికీ... అయినా నానమ్మా మరి నువ్వో ....ఏముంది ఇదిగో నా టికెట్ నేను వెనక్కి వెల్లిపోతా అంది సింపుల్ గా... ఉండైతే అమ్మకి చెబుతా అంటున్న ఇరువురికీ....ఇద్దరికీ నేను సమాచారం ఇస్తా...ఇదిగోండి ఈ ఫోన్ మీదగ్గర ఉంచండి... మీ ఫోన్లు నాకివ్వండి ....ఈ ఫోన్ మీ కొంపలు ముంచే లా ఉంది అంటూ వాల్లిద్దరి ఫోన్లు తీసుకుని వాల్లిదరికీ ఒక పాతకాలం ఫోన్ ఇచ్చి, దీనిలో రెండు నంబర్లు ఉన్నాయ్....ఆ రెండూ నావే... కాల్ చెయ్యడం, కాల్ వస్తే మాట్లాడటం ఈ సౌలబ్యం మీరెక్కడున్నారో నేను తెలుసుకోవడానికి మాత్రమే .....వేరే ఏ ఆప్షన్ లేదు ఇందులో అని చెప్పి బయల్దేరమంది వారిరువురిని

బన్నీ, పూజ కులుమనాలి, డార్జిలింగ్ టూర్ లో హాయిగా ఉన్నారు... అసలు ఫోన్ అవసరం రాలేదు చేరేరా......వస్తున్నారా అని మాత్రమే అడిగి పెట్టెసేది జానకమ్మ....ఈ రోజు ఏం జరిగింది, ఎలా గడిచింది అని తెలుసుకోవడానికి సరళ, సరోజ ల దగ్గర కూడా ఫోన్ లకు సిం కార్డ్ లు తస్కరించింది జానకమ్మ. కూతురు ఏమైపోతుందో, కొడుకు ఏమై పోతాడో అని గాబరా పడుతున్న సరోజ సరళకి...విషయం నెమ్మదిగా చెప్పింది...వాల్లిద్దరూ హనీమూన్ కి వెల్లిన సంగతి చెప్పింది జానకమ్మ....అదేంటి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే అని సరళ....నాకు చెప్పకుండా అంత పెద్ద ప్రొగ్రామా....వీడి వెల్లిపోయాడు...ఆ పూజ చేతిలోకి వెల్లిపోయాడు....పూర్తిగా లాగేసింది అని సరోజ ఒకటే గొడవ.... కాని గొడవ పడడానికి నా ఫొన్ పని చెయ్యటేదు ఎందుకో అని ఫోన్ నేలకేసి కొట్టింది.

పూజ మీ నానమ్మ భలే ప్లాన్ చేసింది ....ఆవిడకి దన్యవాదాలు చెప్పాలి.... ఫోన్ లేకుండా భలే గడిపాం కదా....అంటూ రూం కి వెల్లిన వారికి ఒక కవర్ రూం లో కనిపించింది వీల్ల పేరుతో ....అందులో పిల్లలూ....బాగా ఎంజాయ్ చేసారా ....

మీ కొత్త బంగారు లోకం ఎలా ఉంది, ఈ పది రోజులు ఒకర్ని ఒకరు ప్రేమించుకుని ఉంటారు, అలాగే ద్వేషించుకుని ఉంటారు, గొడవపడి ఉంటారు...ఏది ఏమైనా ఒకరి గురుంచి మరొకరు తెలుసుకుని ఉంటారు...ఏం జరిగినా చెప్పడానికి మీ చేతుల్లో ఫోన్ లేదు.... మా రోజుల్లో ఎన్ని బాదలున్నా ఫోన్ చెయ్యడానికి ఫోనులు ఉండేవి కాదు, మేము మల్లీ మా తల్లి తండ్రులను కలిసేసరికి చిన్న చిన్న తగాదాలు, లోపాలు కూడా మరచిపోయేవాల్లం. నువ్వెలా ఉన్నావు అని ప్రతిరోజు అడిగే టైం అమ్మకి ఉండేది కాదు, అలాగని వాల్ల దగ్గర మా సమాచారం తెలుసుకోవడానికి ఫోన్ కూడా ఉండేది కాదు... మాకు సమస్యలు వచ్హేవి...పరిష్కారాలు మేమే వెతుక్కునే వాల్లం ...అందుకే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాం .ఈ రోజుల్లో ఫోన్ సౌకర్యం ఎక్కువ కావడంతో తుమ్మినా, దగ్గినా అమ్మకి ఫోన్ చెయ్యడం, అడిగినా అడగక పోయినా ఒక సలహా వారిచెయ్యడం అలవాటుగా మారిపోయింది. రోజు ఏముంటాయ్...ప్రతి రోజు ఒక ఫోన్ ఎలా ఉన్నావ్ ...ఏం చేస్తున్నావు... .....జీవితం లో ఫోన్ ఒక బాగమైపోయింది ...బాద అనిపిస్తే బాదని, సంతోషమని పిస్తే సంతోషాన్ని వెంటనే షేర్ చేసేసుకుంటున్నాం ...ఆ గడియలను అనుభవించటం మర్చిపోతున్నాం...ఆలోచించటం మర్చిపోతున్నాం....సంతోషమొస్తే కాసేపు మనసు ఉల్లాసం తో ఊగిసలాడుతుంది.. కాసేపు అనుభవించండి..... బాద వచ్హిందా షేర్ చేస్తే తగ్గిపోతుంది...కాని దాని వల్ల వచ్హే ఘర్షనను దాని వల్ల వచ్హే కన్నీల్లను బయటకు రానీయండి....సమస్యలు వస్తే, .. కాసేపు బాదపడండి....పరిస్కారం గురుంచి ఆలోచించండి...ఎదుర్కునే శక్తి పెరుగుతుంది ....అప్పుడు మనకు మనం అర్ధం అవుతాం, ఎదుటి వాల్లను అర్ధం చేసుకునే పరిది పెరుగుతుంది ప్రతి ఒక్కరు చిన్న చిన్న సమస్యలు వచ్హేసరికి ఒక ఫోన్ చేసి అమ్మకి, నాన్నకి చెప్పేసి సులువుగా ఒక పరిష్కారం పొందేస్తుంటే....మీ మైండ్ కి పనెక్కడుంటుంది....

ఏదైనా విషయాన్ని మీరు ఫోన్ లో చెప్పగానే ఒకొక్కరు ఒక్కొక్కలా తీసుకుంటారు, అలాగే వారికి తోచిన సలహా ఇచ్హేస్తారు, అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన మీద ప్రభావం చూపించవచ్హు

ఇకపోతే మీరిద్దరు అల్లారు ముద్దుగా పెరిగారు, పూజ బాద్యత తెలియని పిల్ల, నువ్వు బాద్యత తెలిసిన వాడివి, ఒకరినొకరు తెలుసుకుని ఒకరికొకరు మారండి...ప్రతి చిన్న విషయాన్ని అమ్మకి నాన్నకి చెప్పుకోవడం వల్ల , వాల్లు అతిగా ఫీల్ అవడం,బాదపడటం, అభిప్రాయ బేదాలు రావటం జరుగుతుంది. పిల్లల జీవితాలు బాగుండాలనే పెల్లిల్లు చేస్తారు తల్లి తండ్రులు. వాల్లు, మీ జీవితాల్లో వచ్హిన చిన్న చిన్న వాటికే వణికిపోతుంటారు, దాని వెనుక చాలా ప్రేమ ఉంటుంది. కాని ప్రేమ కి పరాకాష్ట పిల్లల జీవితాలు పాడు చేసుకోవడం కానే కాదు. ఇల్లు సర్దలేదనో, వండి పెట్టలేదనో మీరు చెప్పిన చిన్న చిన్న సమస్యలు మీ తల్లి తండ్రులను ఎంత దూరం తీసుకుని వెల్లాయంటే, లాయర్లను విడాకులకోసం సంప్రదించేదాకా వెల్లాయి. ఈ చిన్న చిన్న విషయాలను ఫోన్లు మోసుకెల్లి వారి మనసుల్లో భయాలను నింపుతున్నాయి. టెక్నాలజీ మనిషి కి ఉపయోగపడాలి గాని, మనిషి జీవితంతో” టెక్నాలజీ (ఫోన్)అనే వస్తువు” అనుబందాన్ని పెంచుకోకూడదు. పక్కన మనిషి లేకపోయినా బతికేస్తున్నాం కాని, చేతిలో ఫోన్ లేకపోతే బతకలేనంత బానిసలైపోతున్నాం, విచక్షణ కోల్పొయికోపం తో కొట్టేసుకుంటున్నాం......

ఇంట్లో ఉన్న నలుగురు...నాలుగు ఫోన్లతో నాలుగు రూముల్లో ఉంటున్నారు... "కం టు హాల్ లివ్ విత్ ఆల్" నేను నా ఇంటి హాల్ లో రాసుకున్న స్లోగన్ ని ఎవ్వరూ చదవను కూడా లేదు...ఎందుకంటే నా కొడుకు ఆఫీస్ కి వెల్లి వచ్హి..ఫోన్ తో ..వాట్సేప్ తో కాలక్షెపం చేస్తే, నా కోడలు తన కూతురు కాపురం లో రోజూ జరిగే సంగటనలు తెలుసుకోవడానికి నిత్యం ఫోను లలో నే గడుపుతుంది...ఇక పోతే నా మనవడు బాత్ రూం లోకి కూడా సెల్ తోనే వెల్తాడు...సెల్ తో నే వస్తాడు.....

అమ్మా....భోజనమైంది...ఇక టేబ్లెట్ వెయ్యు అని నా కొడుకు చెప్పి ఎన్ని రోజులైపోయిందో....అత్తయ్యా...మీ కిష్టమైన మజ్జిగ చారు చేసాను...కాస్తా వెయ్యనా అని నా కోడలు అడిగి కొన్ని రోజులైపోయింది ....

ఇక పోతే నా మనవడు...నానమ్మా ....నానమ్మా....సావిత్రి సినిమా వచ్హింది....టికెట్స్ తేనా మనిద్దరికి అని అడిగి కొన్ని
యుగాలైపోయింది... నా జీవితంలో ఈ సెల్ ఆనందాలన్నిటినీ హరించేసింది... ఇంట్లో నలుగురున్నా...ఒక్కొక్కరు ఒక్కో ప్రపంచం లో బతికేస్తున్నాఒ. ...నేను నా ఒంటరి ప్రపంచం లో కి వెల్లిపోతున్నా.... నలుగురం కూర్చుని ప్రశాంతం గా...భోజనం చేస్తూ ఈ కూర బాగుంది, ఈ కూర చేస్తే మా అమ్మమ్మ చెయ్యాలి, ఈ పచ్హడి పెడితే అమ్మే పెట్టాలి అని కబుర్లు చెప్పుకుంటూ తిని ఎన్ని రోజులైందో తెలుసా . ....ఎవరి సెల్తో వాల్లు రావటం, తినడం వెల్లటం ....... ఫోన్ వల్ల బందాలు ఎన్ని కలుస్తున్నాయో తెలీదు గాని, ఇంట్లో ఉన్న సంబందాలు మాత్రం తెగిపోతున్నాయి ....మనం దాని చుట్టు అంతలా అల్లుకుపోయి గుడ్డివాల్లం అయిపోతున్నాం....మానవ సంబందాలను సెల్ ఫోన్ లో బందించేస్తున్నాం . టెక్నోలజీ ని వాడండి తప్పు లేదు ...కాని దాన్ని మీ జీవితాలలో బాగం చేసేసుకోకండి ...దేని టైం దానికివ్వండి...బందాలని నిలబెట్టుకోండి...

గాడ్ బ్లెస్స్ యు చిల్డ్రన్

ఆ ఉత్తరం పక్కనే ఉన్న వారి సెల్ ఫోన్లను ఇద్దరూ చూసారు....ఆ ఉత్తరం కింద ఇద్దరూ వారి పేర్లు రాసి థాంక్స్ అమ్మమ్మా, నానమ్మా అని రాసి...అదే ఉత్తరాన్ని వాల్ల అమ్మకి నాన్నకి పోస్ట్ చేసింది పూజ .....రా బన్నీ స్నానం చేసిరా ...టిఫిన్ చేసి పెడతా అంది పూజ...అనుకోని ఈ మాటకి ఆస్చర్యం తో ప్రేమతో పూజ వైపు చూస్తూ....బాతు రూంలోకి దారి తీసాడు బన్నీ.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న