మౌనం మాటాడితే నిజంగా ఎంత బావుంటుంది కదా!!!!. నిజానికి మౌనం మాటైనప్పుడు మాటకు మాటలు రాక మౌనం అవుతుంది.
వేవేల మాటలు ఎలా మాట్లాడాలో తెలియక మళ్ళీ మౌనమైంది. ఒకప్పుడు ఇదే మౌనం దూరాన్ని పెంచింది. ఇప్పుడు అదే మౌనఒ ఎన్నో భావాలను పలికించి ఎంతో దగ్గర చేసింది. ఈ మౌనం గోలేంటా అనుకుంటున్నారా....
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ నాన్నను చూస్తే చాల సంతోషఒ వేస్తుంది. అమ్మమ్మ తాతయ్య మామయ్య అత్తమ్మ, మా ఫ్రెండ్స్ పేరెంట్స్ ఇలా ఏ జంటను చూసినా ఎప్పుడు తగువులాడడం మాత్రమే కనపడేది. ఎప్పుడు ఏదో ఒక దాని గురించి పోట్లాడుకుంటుంటారు. ఎందువల్లో ఈ పోట్లాటలు అని అనిపించేది. కానీ మా అమ్మ నాన్న ఎప్పుడు గొడవ పడడం కానీ అరచుకోవడం కానీ ఎప్పుడూ లేవు. చిన్నపాటి విసుగు కూడా వాళ్ళ మధ్యలో నేనెప్పుడూ చూడలేదు. నాకు అమ్మ నాన్న నాతొ మాట్లాడ్డఒ భలే ఇష్టంగా ఉండేది. అమ్మేమో బ్యాంకు లో నాన్నేమో ఇంజినీరు. నాన్న రాత్రి ఆఫీస్ నుంచి రావడం ఎంత ఆలస్యమైనా అమ్మ నేను మేలుకొనే వుండేవాళ్లుఒ.. నానొచ్చాకే అందరఒ కలిసి భోజనము చేసేవాళ్ళం. అదో ఆనందంగా ఉంటుంది..అందుకే నాకు నా ఇల్లంటే చాల ప్రేమ. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మ కాస్త మితభాషి. చాల వాటికి సమాధానం ఆమె చిరునవ్వుతోనే చెప్తుంది. అమ్మ కళ్ళు చాల చాల బాగుంటాయి రియల్లీ ఎక్సప్రెస్సివ్ అయిస్. ఆమె నవ్వినప్పుడు ఆమె కళ్ళు కుడా నవ్వుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే పొయెటిక్ అయిస్. నాన్న అమ్మకు పూర్తిగా వ్యతిరేకం ... .నాలాగా అల్లరి. నాకు అమ్మకన్నా నాన్నే మంచి ఫ్రెండ్. ఇద్దరం కల్సి చాల అల్లరి చేస్తాం. అమ్మ బయటకు కనిపించకుండా మా అల్లరిని చూసి మురిసిపోతూ వుంటుంది. అప్పుడు నాన్న అమ్మను చూసే దొంగ చూపు షారుక్ ఖాన్ కాజోల్ ను చూసినట్టు ఉంటుంది ...
చుట్టాలందరికి అమ్మ నాన్న అంటే చాల ఇష్టం. కొత్తింటికి వచ్చాకే నేను అమ్మ నాన్నలకు బాగా దగ్గరయ్యా!!!కానీ ఈ మాధ్య నాకెందుకో అమ్మ నాన్న మాట్లాడుకోవటం లేదేమో అని అనుమానం వచ్చింది. ఈ అనుమానం ఎందుకొచ్చిందంటే ఆ వేళ అమ్మ పుట్టిన రోజు!!! నాన్న అమ్మకు చెవి దిద్దులు తెచ్చారు. ఆ రోజు ఆదివారం అవడం తో నేను ఇంట్లోనే వున్నాను. అమ్మ పూజ గదికి వెళ్ళినప్పటి నుంచి నాన్న ముఖంలో ఏదో టెన్షన్. నాన్న కమ్మలు దేవుని గదిలో పెట్టడం నేను చూసా.... బహుసా అమ్మను సర్ప్రైజ్ చేస్తున్నారనిపించింది. సూపర్ గా వుంది నాన్న సర్పైజ్ అనిపించింది...కానీ నాన్నలో ఆ కంగారు, న్యూస్ పేపర్ అడ్డఒ పెట్టుకొని అమ్మ ఎప్పుడెప్పుడు దేవునిట్లోకెళ్తుందా అని ఒక్కటే గమనిస్తుంన్నారు. ఎందువల్లో నాకు అర్థ కాలేదు. అసలు ఎన్టీ కంగారు నాకర్థం కాలేదు. కాసేపటికే అమ్మ దేవుని గదికి వెల్లడఒ పూజ చేసుకోవడం వచ్చేయడం అయిపోయింది.. కాసేపటికి నాన్న వెళ్లి పూజ గదిలో చూసారు కమ్మలు అలానే వున్నాయి.. బహుశ అమ్మ గమనించినట్టు లేదు. అబ్బా!!!! నాన్న ఎంత డీలా పడిపోయారంటే నాన్నేనా!!! అనిపించింది. అమ్మ అటువైపు రావటం చూసి గభాలున వచ్చి మళ్ళీ సోఫా లో కూర్చున్నారు పేపర్ చదువుతున్నట్టు నటిస్తూ ... అమ్మ మళ్ళి పూజ గదిలోకెళ్ళి కమ్మలు తీసుకొని నాన్న ను చూసి ఒక చిన్న నవ్వు జస్ట్ లిప్త పాటు అంతే వెళ్ళిపోయింది. ఇక్కడ నాన్న పెద్ద జొక్పొత్ కొట్టిన్నట్టు తనలో తానూ నవ్వుకొని హ్యాపీగా బయటకెళ్లిపోయారు. అప్పటినుంచి వారిద్దరికీ తెలియకుండ వాళ్ళను గమనించడం మొదలుపెట్టా. అవసరం అనుకుంటే తప్ప మాట్లాడటం లేదు అని అర్థమయ్యిన్ది... నేనేం చిన్నపిల్లను కాదు ఇంటర్ చదువుతున్నా...ఏదో గ్యాప్ ఉందని అర్థ అయ్యిన్ది కానీ అడిగే ధైర్యఒ లేదు. ఒక్కోసారి నిజమా కాదా అని కూడా అనిపిస్తుంది. ఏమి అర్థం కావడం లేదు. అలాని వదిలేద్దాం అంటే మెదడులో తొలుస్తోంది.
* * * * *
అమ్మ ఏదో ట్రైనింగ్ వల్ల బొంబాయి వెళ్లాల్సి వచ్చింది. అందుకు నేను అమ్మమ్మ వాళింటికి వచ్చా. అమ్మమ్మ వాళ్ళు కూడా ఇదే ఊర్లో వుంటారు. ఇంతకు ముందు అంటే మా పాతింటికి కాస్త దూరం లో ఉండేవారు. అప్పుడు ఎక్కువగా వెళ్లేదాన్ని రెండేండ్ల క్రితం నానమ్మ తాతయ్య పోయాక ఈ కొత్తింట్లో కొచ్చి స్థిరపడ్డాము. అమ్మమ్మ తాతయ్య తో పాటు మామయ్య ఫామిలీ కుడి వుంటారు. నాకు నా కసిన్స్ మంచి ఫ్రెండ్స్. వాళ్లేమో అందరు తిరుపతి వెళ్లారు నన్ను కూడా రమ్మన్నారు కానీ నాకే వెళ్ళబుద్ధికాలేదు.. తాతయ్యకు ఆరోగ్యం బాలేకపోవడం వల్ల వీళ్ళు ఉండిపోయారు. . ఎందుకో చాల అసహనంగా అనిపించింది సందడిగా వుండే ఇల్లు మా ఇంటి లాగా ఖాళీగా అనిపించింది. ఒకప్పుడు మామయ్య అత్తమ్మ పోట్లాడుకుంటుంటే చికాకనిపించేది కానీ ఇప్పుడు అదే బాగుందేమో అనిపించింది. ఏమి తోచక గోళ్లు గిల్లుకుంటూ కూర్చొనివుంటే అమ్మమ్మ వచ్చి పూల బుట్ట చేతిలో పెట్టి డాబా మీదికెళ్లి పూలు కోసుకొని రమ్మంటే వెళ్ళాను. మల్లెపూలు మనింట్లో పూసినవి కోయాలంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో ఈ పని నేనే చేస్తా. కానీ ఈసారి ఆ పని కూడా ఇష్టంగా చేయలేకపోతున్నా... ఈలోపు అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ నేను ఇద్దరమే మనసులో మాటను అడగాలనిపించింది. వయసుకు మించిన మాటలు నీకెందుకే అని అంటుందేమోనని ఆగిపోయా.. మాట్లాడకపోతే అమ్మో యక్ష ప్రశ్నలు వేస్తుందేమోనని ఏవో మాటలు మాట్లాడుతూ పూలు కొస్తున్నా...
ఇంతలో అమ్మమ్మ స్వాతి మీ అమ్మ నాన్న మాట్లడుకుంటున్నారా అని అడిగింది. వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టుంది. కానీ ఎన్నో సార్లు వచ్చినా ఈ ప్రశ్న వేయలేదు ఇప్పుడెందుకు వేస్తున్నట్టు... ఇప్పుడు నేను ఏమనీ చెప్పాలి. అమ్మమ్మ పూల మాల కట్టడానికని దారంతో సిద్ధంగా వుంది తెంపిన పూలను తన ముందుంచి ఏమీ అర్థం కానట్టు...ఏంటి అమ్మమ్మ నీవు అడుగుతున్నది అని అమాయకత్వానికి ఆస్కార్ అవార్డు విన్నర్లా అడిగాను. అమ్మో అమ్మమ్మ!!!!! అమ్మ ఎప్పుడు అనేది వాళ్ళమ్మ ఆవులిస్తే పేగులు లెక్కపెడుతుందని... నేనోలెక్కా.!!!!! సూటిగా చెప్పవే వాళ్ళు మాట్లాడుకుంటున్నారా అంది. అవును అమ్మమ్మ... వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటున్నారు ....
మరైతే నీవెందుకు నన్నేదో అడగాలని అడగలేక తటపటాయిస్తున్నావు....అంటే నీవు ఏదో దాస్తున్నావని నాకు అర్థం అయ్యిన్ది విషయం చెప్పు అంది అమ్మమ్మ మహా సూటిగా. అదే అమ్మమ్మ నాకెందుకు అమ్మ వాళ్ళ మధ్యలో ఏదో గ్యాప్ ఉందనిపిస్తుంది. నాకు ఎందుకు అలా అనిపించిందో అంతా వివరంగా చెప్పా.
అయితే ఇంకా వారిద్దరిమధ్య ఆ వేడి చల్లారలేదన్నమాట. తనలో అనుకుంటున్నట్టుగా పైకే అన్నది. ఇదే అదనుగా నేను కూడా అడిగేసా అసలేమీ జరింగింటుంది అమ్మమ్మ. నాకు మీ అమ్మ చెప్పినంత వరకు నేను నాకు తెలిసింది చెప్తాను అని అమ్మమ్మ గతంలోకి వెళ్ళింది
***
మా ఇంటికి మూడు వీధుల చివర మీ నానమ్మ వాళ్ళుంటారు. మీ అమ్మను చాల సార్లు ఆ వీధిలో చూసి చాల ఇష్టపడి తన ఇష్టాన్ని ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పి వాళ్ళు వచ్చి మీ అమ్మను అడగడం దూరపు చుట్టరికం కూడా ఉండడం, మీ నాన్నకూడా ఒక్కడే కొడుకు పైగా గవర్నమెంటు ఇంజినీరు, బుద్ధిమంతుడని మంచిపేరు. అప్పటికె మీ అత్తకు పెళ్ళై అమెరికాలో ఉండడం తో ఇక మీ నాన్నకు ఏటువంటి భాద్యతలు లేకపోవడం.. కలిగిన కుటుంబం, మంచి వాళ్ళని చాల పేరు.... మంచి సంభంధం అని... ఇంట్లో అందరికి యీ సంబంధఒ నచ్చింది. మీ అమ్మ కూడా చాల ఇష్టంగా ఈ పెళ్ళికి అంగీకరించింది. మీ అమ్మ కు వుద్యోగం పెళ్లి రెండు తనను వెతుక్కుంటూ వచ్చాయి. నా ఒక్కగానొక్క కూతురు దగ్గరగా ఉంటుందని సంతోషంగా చాల ఘనంగా పెళ్లి చేసాము. తను బ్యాంకు లో వుద్యోగం ప్రతి రోజు ఇద్దరు కల్సి ఇదే దారిమీద ఉద్యోగానికి వెళ్తుంటే చూడ చక్కగా ఉండేది. ఎక్కడ నలుగురి ద్రుష్టి పడుతుందో అని భయపడేదాన్ని. అందమైన అన్యోన్యమైన జంట. చుస్తుండగానే నీవు పుట్టేసావు. ఇంకేమి రోజులు పరిగెత్తాయి. మీ మామయ్య కు పెళ్లయింది. మీ అమ్మ మొదటినుండి మిత భాషి మీ నాన్న చాల కలుపుగోలు మనిషి కాలం గిర్రున తిరిగింది ఇద్దరు ముగ్గురయ్యారు. అందరు మీ అమ్మను ఎంత అదృష్టవంతురాలో అని అంటుంటే నాకు చాల సంతోషంగా ఉండేది అమితంగా ఇష్టపడే భర్త, ప్రేమగా చూసుకొనే అత్తా మామలు, దేనికి లోటు లేని జీవితం.
ఎవరి ద్రుష్టి తగిలిందో నాలుగేళ్ళ కిందట మీ అత్తా రెండో కానుపుకని అమెరికానుండి వచ్చింది అదీ ఐదో నెలలోనే. ఆవిడకి జగడాలే మారి అని పేరుండేది. మీ అమ్మ సంతోషాన్ని, అత్త కోడళ్ల మధ్య వున్న ప్రేమానురాగాలని చూసి ఓర్చుకోలేక పోయింది. అమెరికానుండి శాంతమ్మగారు దిగబడి ఇంట్లోని ప్రశాంతమ్మను తరిమేశారు. మీ అమ్మ బయటకు చెప్పేదికాదు కానీ ఎప్పుడూ చిరునవ్వుతో వుండే ముఖంలో అశాంతి కనపడేది అడిగితె చిరునవ్వే సమాధాన౦. మీ అమ్మ తనకు తానుగా చెప్పాలనుకుంటేనే తను చెబుతుంది... తను వద్దనుకుంటే బ్రహ్మ రుద్రాదులు కూడా మీ అమ్మ మనసులో ఏముందో చెప్పలేరు. అప్పుడప్పుడు పనమ్మాయి చెప్పేది ఇంట్లో ఎందుకో కొద్దిగా గొడవలు జరుగుతున్నాయని. ఏమిటో తెలీలేదు... తల్లి మనసు కదా వుండబట్టుకోలేక ఏదో నెపంతో వాళ్ళింటికెల్లా. నేవెళ్ళేపాటికి మీ అత్తా మీ అమ్మను చాల సూటిపోటి మాటలతో అరుస్తోంది మీ నాన్నగారు తాతగారు ఆవిడకు నచ్చ చెప్పాల్సిందిపోయి మౌనంగా వున్నారు. కొన్ని సార్లు మౌనం మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుంది. అన్ని తెల్సి కూడా మీ నాన్న మౌనం మీ అమ్మ కలతకు కారణం అని అర్థం అయ్యిన్ది. నన్ను చూసి అందరూ సర్దుకున్నారు. మీతాతకు విషయం చుబుతామంటే ఆయనకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ. మీ అమ్మ లోపల్లోపల కుమిలిపోవడ బాగా కనబడుతోంది. పనమ్మాయి రోజు వార్తలు మోస్తూనే వుంది. ఏదోఒకటి చేద్దాం అంటే మీ అమ్మ ఏమి చెప్పదు . మేము కలగ చేసుకోవాలంటే భయం పిల్లనిచ్చినవాళ్ళం. ఎలారా దేవుడా అనుకుంటుండగా చాల ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ అమ్మ రెండోది గర్భ దాల్చింది. ఇదివరకు రెండు అబార్షన్లు అవ్వడం మూలాన డాక్టర్లు బాగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. నాకు మీ అమ్మ గర్భవతా!!! అన్న దానికన్నా కొన్నిరోజులు మీ అత్తకు దూరంగా ఉంటుందనిపించి సగౌరవంగా పుట్టింటికి పిల్చుకొని రావడానికి నేను మీ తాతయ్య ఇద్దరు వెళ్ళాము.
ఆ రోజు కూడా మీ అత్త దేప్పిపొడిచింది. ఆవిడన్నమాటలు నాకింకా గుర్తు... అమ్మ ఒక్కటీ చేసుకోలేదని సాయానికి మీరు వుంటారు అని నా కానుపుకు వస్తే ఎక్కడ పని మీద పడ్తుందోనని కడుపు తెచ్చుకున్నారు కాబోలు!!!! ఈ విషయం తెలుసుంటే అమ్మనే అమెరికాకు పిలిపించుకొనేదాన్నీ అంది. నాకు కోపం వచ్చి నేను ధీటుగానే జవాబిచ్చాను. మీ అమ్మ నన్ను తిడుతుంది అనుకుంటే ఏమి అనలేదు. ఎందుకంటే ఇదివరకు ప్రతిసారి ఏమి చెప్పబోయినా సున్నితంగా వారించేది. మొదటిసారి వారించలేదు అప్పుడనిపించింది ప్రతిరోజూ ఈ ఇంట్లో ఏదో ఒక గొడవ జరిగేదని... ఆవిడకు సమాధానమైతే ఇచ్చాను కానీ లోలోపల భయ వేసింది తను ఎంత రాద్ధాంతం చేస్తుందోనని. కానీ ఎవ్వరు తనకు వత్తాసు పలుకక పోవడం తో తను ఇంకేమి మాట్లాడలేదు. మీ అమ్మ మా ఇంటికైతే వచ్చింది కానీ మనసు మనసులో లేదు ఏదో మదన పడుతూనేవుంది. మీ అమ్మ మహా అభిమానవంతురాలు ఇది అని ఏది చెప్పదు. బ్యాంకు లీవ్ పెట్టి ఇంట్లోనే రెస్ట్ తీసుకోసాగింది. మీ నాన్న ఆఫీస్ కు వెళ్తూ వస్తూ ఇంటికొచ్చి వెళ్లేవారు. మళ్ళీ మీ అమ్మలో నవ్వు చిగురించింది. మీ నాన్న కూడా ఆఫీస్ నుంచి వాళ్ళింటి కెల్లకుండ ఒక్కోసారి ఈటె వచ్చి మీ అమ్మను బయటకు పిల్చుకెళ్ళేవాడు.. ఆ తర్వాత మీ అమ్మను ఎక్కడ దిగపెట్టి వాళ్ళింటికెళ్ళేవాడు. ఒకరోజు మీ అత్త వాకింగ్ పేరు మీద మా ఇంటికొచ్చింది. ఆ రోజు కూడా మీ నాన్న ఆఫీస్ నుంచి ఈటె వచ్చి మీ అమ్మను బయటకు పిల్చుకేళ్లాడు. మీ అత్త వచ్చి మీ అమ్మ మీద విచారణ మొదలుపెట్టింది. నాకోడలు స్నేహితురాలింటికి వెళ్లిందని సర్ది చెప్పింది. అప్పటికే ఆవిడ హాహాకారాలు మొదలయ్యాయి. మీ అమ్మకు ఫోను చేసి ఇప్పుడే రావద్దని చెబుదాం అనుకొనేలోపు మీ అమ్మ నాన్న వచ్చేసారు. అంతే మళ్ళీ మొదలు మీ అమ్మను నా ఎదురుగా ఏమి అనలేక మీ నాన్నమ్మ కు ఏమి నూరిపోసిందో.... ప్రతిరోజూ తల్లి కూతుర్లు వాకింగ్ కు ఈటె రావడ.... వాళ్ళ దెబ్బకు మీ నాన్న కూడా రావడం తగ్గించేశారు. మీ అమ్మ బ్యాంకు సెలవులు అయిపోయాయి మీ అమ్మ మళ్లీ బ్యాంకు కు వెళ్లడం మొదలు పెట్టింది. దాంతో మీ నాన్న గారు వచ్చి మీ అమ్మను వాళ్ళింటికి పిల్చుకేళ్లాడు... నీవేమో చిన్న పిల్లవు అటు ఈటు తిరిగేదానివి. నాకేమో మీ అత్త వెళ్లెవరకూ ఇక్కడే మీ అమ్మను ఉంచేసుకోవాలని కానీ.... దేవునిదయవల్ల తను కడుపుతో ఉండడం వల్ల మీ నానమ్మకు మీ అమ్మంటే ఇష్టఒ దాంతో ఈసారి మీ అత్త నాటకాలు ఉడకలేదు... అన్నీ సర్దుకున్నాయి అనిపించినా... కానీ ఏమూలో భయం ఉండేది. నా లెఖ్ఖలో మీ అమ్మ మీద చూపే ప్రేమ ఇంకా ఆవిడలో అసూయను పెంచాయనే నా నమ్మకం. నా అనుమానం నిజం అయ్యే రోజు రానే వచ్చింది.
మీ అత్త కు శ్రీమంతం చేయాలనుకున్నారు. శ్రీమంత ముందురోజు మీ అమ్మ మా ఇంటికి వచ్చి మీ అత్తకు అలంకరించటానికన్నట్టు తన నగలను తీసుకెళ్లింది. ఎందుకో నా మనసు కీడు శంకించింది. కానీ నేను భయపడ్డట్టు ఏమీ జరుగలేదు. అంతా సవ్యంగా జరిగిపోయింది. కానీ మనసులో ఎక్కడో చిన్న భయం. శ్రీమంతం అయ్యాక ఒక వారమైన మీఅమ్మ నగలు తిరిగి తెచ్చివ్వలేదు. ఎందుకో నాకు అనుమానం వేసింది. మీ అమ్మ ఇంటికొచ్చినప్పుడు అడిగా తను ఇంకా ఇవ్వలేదు అన్నది. ఏదో జరగబోతోంది అని అనుమానం వేసింది. ఆరోజు పనమ్మాయి అన్నది మీ ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరిగినట్టుంది అని తనను వివరాలడగడం సబబు కాదు అని తననే తిట్టి పంపించేసా కానీ మనసులో చాల భయం వేసింది. ఏమీ జరిగిందో తెలీదు.. సాయంత్రానికి ఫోను మీ అమ్మకు కళ్ళు తిరిగి పడిపోతేనూ ఆస్పత్రిలో చేర్పించారని చెప్పగానే నేను కాంతు రేఖ ఆసుపత్రికి వెళ్ళాము.. తెల్సిందేమిటంటే మీ అమ్మకు మళ్ళీ అబార్షన్ అయిందని రక్తం బాగా పోవడం మూలన మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉండి తర్వాత ఇంటికి పిల్చుకొచ్చాము మొదటే మనిషి అంతర్ముఖి. తనలో తాను కుమిలిపోతుంది గాని ఏమీ చెప్పలేదు.. నేను అడగలేదు... మీ నాన్న రోజు వచ్చి చూసుకొని వెళ్లేవాడు. ముద్దు ముచ్చటగా వున్న జంటమధ్య మౌనం మొదలైంది. ఈలోపు మీ అత్తా కానుపు... అది కొద్దిగా కష్టంకావడం తో మీ నాన్న తన బాధ్యతల వల్ల ఇటు రావడం తగ్గింది... దీంతో ఇంకాస్త దూరం పెరిగిందని నాకనిపించింది.
ఒక రోజు ఇంట్లో ఎవ్వరు లేని టైం లో మీ అమ్మ ను అడిగాను ఏమిజరిగిందని. మీ అమ్మ మీ అత్తను నగల గురించి అడిగింది దానికి తను ఆ రోజే ఇచ్చెశాను మీకు చెప్పాను కూడా మీ బీరువాలో పెట్టాను అని మీరు సరే అని కూడా అన్నారు... ఇప్పుడు నగలు ఇవ్వలేదని నాకు దొంగతనం అంటగట్టాలని చూస్తున్నరా అంటూ మీ అమ్మ బీరువాలోనుంచి నగలు తెచ్చి చూపింది మీ అత్తయ్య.... ఆశ్చర్యపోవడం మీ అమ్మ వంతయ్యిన్ది.. తనకు ఏమి పాలుపులేదు.. మీ అమ్మకేమో మీ అత్త చెప్పిన్నట్టు తెలీదు.... మీ నాయనమ్మ కూడా కూతురికే వంతు పాడింది.. మరి మీ అమ్మకు నిజంగానే చెప్పి పెట్టిందో లేక మీ అమ్మ ఇలా అడిగితె యాగీ చేయాలని పెట్టి చెప్పకుండా చెప్పానంటోందో తెలీదు.. మీ నాన్న తనకు సపోర్ట్ చేస్తాడనుకుంది మీ అమ్మ... కానీ మీ నాన్న మౌనం తనకు బాగా బాధించింది... విపరీతంగా కుంగదీసింది ... . మరి మీ నాన్న కూడా మీ అత్తను నమ్మి మీ అమ్మను అనుమానించాడా లేక అప్పుడు మాట్లాడం సబబు కాదనుకున్నాడో మరి తెలీదు. అంతే ఆ దూరం ఆ మౌనం ఆలా పెరుగుతూవచ్చింది. పరిస్థితులూ!!!! అనుకూలించలేదు. మీ తాతయ్యకు హార్ట్ ఎటాక్ రావడము ఆయన పోయాక రెండేండ్ల వ్యవధిలోనే మీ నానమ్మ పోవడం తర్వాత ఎందుకో మీ నాన్న ఈ ఇంటిని అమ్మి అక్కడ వేరే ఇల్లు కట్టుకోవడం అంతా చక చక జరిగిపోయాయి.
ఆ తర్వాత మీ అమ్మను చాలా సార్లు అడిగా మౌనమే సమాధానం... కానీ ఒకటేంటంటే కొత్త ఇంటికి వెళ్ళాక మీ అమ్మ లో మునుపటి కళ కాంతి తిరిగి వచ్చాయి... దాంతో అన్నీ సర్దుకున్నాయి అనే అనుకున్నాను....
నీవు వచ్చినప్పటినుండి గమనించా నన్ను ఏదో అడగాలని అడగలేకపోవడం చూసి అర్థం అయ్యింది. నాకు తెలిసిందంతా చెప్పాను ఇక నీవే మీ అమ్మ నాన్నల మధ్య ఆ మౌనాన్నీ చెరిపేయీ. అని పాపం కన్నీళ్లు పెట్టుకుంది అమ్మమ్మ... ఇక అప్పటినుంచి ఆ పనిమీదే.... ఏ ప్లాను వేసిన బెడిసికొడుతోంది. ఈ లోపు నా పరీక్షలు దాంతో ఈ విషయం కాస్త మరుగున పడింది. నా పరీక్షలయ్యాక ఊటీకి వెల్దామని అడిగా. అమ్మ నాన్న ఇద్దరు ఒప్పుకున్నారు. చెక చక రిజర్వేషన్లు అన్ని అయిపోయాయే.
* * * * * * *
ఊటీ నిజంగా చాల బాగుంది. బొటానికల్ పార్క్ ఇంకా బావుంది. రకరకాల మొక్కలు..... నాన్న తనకు ఓపిక లేదంటూ గడ్డి మీద హాయిగా పడుకున్నారు... నేను అమ్మ పూల మొక్కల్లో తిరుగుతున్నాము. అమ్మకేమో ప్రతి మొక్క గురించి తెలుసుకోవాలని నాకు బోటనీ అంటేనే బోరు సో అమ్మ కు చెప్పి నేను నాన్న దగ్గర కూర్చున్నా.... నాన్న హాయిగా కళ్ళు మూసుకొని పడుకోనున్నారు. ఎందుకో ఇదే మంచి అదను అనిపించింది. డైరెక్ట్ గా అడగడమే సుఖమనిపించింది. ఏదైతే అదవుతుందని...నాన్న మీతో కొంచం మాట్లాడాలని చెప్పి...అమ్మమ్మ చెప్పిన మొత్తం విషయం చెప్పేసి చివర్న అడిగాను... నాన్న మీరు కూడా అమ్మ తప్పు చేసిందని నమ్ముతున్నారా!!!!అని. అంతే నాన్న కళ్ళలో నీళ్లు తిరిగాయి అవి దాచుకుంటూ చి!!!! చి!!!లేదురా మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసు. తను అలా ఎప్పటికి చెయ్యదు. తనను చిన్నప్పటినుంచి చూసి ఇష్టపడి పెళ్లిచేసుకున్నాను. తనకోసమే తొందరగా ఉద్యోగంలో చేరిపోయా.. నాకు ఇప్పటికి గుర్తుంది ఆ రోజు మీ అమ్మ దీనమైన చూపులు తనను సపోర్ట్ చేయమంటూ, ఎందుకు చేయడం లేదంటూ. తను కార్చె ప్రతి కన్నీటి బొట్టులో భాషకందని ఎన్నో భావాలున్నాయి.... చేజారకుండా ఒడిసిపట్ట్టుకోవాల్సిన వాడిని.... కానీ మీ అమ్మకు సపోర్ట్ చేస్తే గొడవ ఇంకా పెద్దదవుతుందేమో అని ఏమి మాట్లాడకుండా ఉండిపోయా. తర్వాత మీ అమ్మకు నచ్చ చెప్పొచ్చు అనుకుంటుండగానే జరగరాని జరిగిపోయింది. తర్వాత ఒకటి రెండు సార్లు తనకు చెప్పటానికీ ప్రయత్నించా తను వినడానికి సిద్ధంగాలేదు.
అహం అడ్డమొచ్చింది ఇంతేనా తను నన్ను అర్థం చేసుకుంది అని నేను కొన్నాళ్ళు బిగుసుకున్నా అది ఇంకా ఇంకా దూరం పెంచుతూ వచ్చింది. నేను అర్థ చేసుకోనేపాటికే చాలా ఆలస్య అయిపోయింది. తనను నేనెప్పుడూ అనుమానించలేదు. తనను అనుమానించడం అంటే నన్ను నేను అనుమానించడమే. నా తప్పేంటంటే అవసరమైన సమయానికి తనను సపోర్ట్ చేయకపోవడమే. యీ విషయం ఇప్పటికి ప్రతి రోజు నన్ను కుంగదీస్తుంది. అని నాన్న కన్నీటి పొరను దాచుకుంటున్నాడు. ఎప్పుడొచ్చిందో అమ్మ మా మాటలు అన్ని విన్నట్టుంది నాన్న!!! అమ్మ అన్నాను, నాన్న అటు తిరిగారు. నాన్న... పాపం అమ్మకు ఏదో చెప్పాలనుకుంటున్నారు మళ్లి మౌనమే. ఈసారి ఆ మౌన భాషను నాన్న కన్నీటి భావాలను అమ్మ జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంది. మౌనం మాట్లాడితే మళ్లి మౌనమే అన్న అమ్మమ్మ మాట గుర్తుకొచ్చింది... వాళ్లద్దరిని చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు... మౌనమే... ఆనందభాష్పాలతో కూడిన మౌనం...