"హలో వదినా! నువ్వా? బావున్నావా? అన్నయ్యున్నాడా ? పిలువు, అన్నయ్యా! నీ అల్లుడికి బెంగుళూర్లో మంచి ఉద్యోగం వచ్చింది , ఐ.టి.పి. యల్.లో ,మీ ఇల్లు అక్కడికి దగ్గరేగా?ఓ పది ,పదిహేను రోజులుండనీ మీ ఇంట్లో ,ఈ లోగా ఫ్రం డ్స్ తో కల్సి వసతి చూసు కుంటాడు ", అంది దమయం తి ఫొన్ లో దడ దడా ."మాఇంట్లోనా---- ", అని సందేహిం చాడు. సంజీవరావు.
" ఔ న్రా ! మీ ఇంట్లోనే --",
"మాది రెండు గదుల ఇల్లు గదే! నేను రిటైరయ్యాక మీ వదిన చేసుకోలేదని ఈ చిన్న ఇల్లు కొనుక్కు న్నాం.--", అన్న మాటలు పూర్తి కానివ్వ కుండానే అందు కుంది దమయంతి,
" చిన్నదైనా ఫర్లేదులేరా! , వాడు ఉదయం వెళ్ళి రాత్రికి వస్తాడు. సాఫ్టు వేర్ వాళ్ళ సంగతి నీకు తెల్సుగా! వాడు బయల్దే రాడు , రేప్పొద్దుటే దిగుతాడు. వాడి కి మీ ఇంటికి దారి తెలీక పోతే ఫొన్ చేస్తాడు, కాస్త డైరె క్షన్స్ ఇవ్వు . లేదా బస్టాం డ్ లో వెళ్ళి నిల్చో . వాడు ఇల్లు చేరగానే ఫొన్ చెయ్యి . ఉంటానన్నయ్యా!
మా ఆయనకి భోజనం వేళైంది." , అంటూ ఫొన్ కట్ చేసింది దమయంతి. సంజీవరావు కు, ఆయన భార్య సరోజనమ్మ కూ , దిగ్భ్రమ కలిగింది. కనీసం వసతి వుం టుందా అని కూడా అడక్కండా కొడుకును బస్సెక్కించి మరీ ఫోన్ చేస్తున్న చెల్లెలి మనస్తత్వాని కి విసు గొచ్చింది, సంజీవ రావుకు.
ఈ మధ్య ఇద్దరి ఆరోగ్యాలూ అంతంత మాత్రం గానే వుంటున్నాయి. రిటై రయ్యాక మూడో ఫ్లోర్ లో టూ బెడ్ రూం ఫ్లాట్ కొని సింపుల్ లివింగ్ తో వుంటు న్నారు. తప్పదు గనుక వాడికో బెడ్ సరిపడా స్తలం కేటాయించారు. ఓ పెన్ కిచెన్ , హాలు,బెడ్రూం ,రెండో బెడ్రూం ని దేవునిగది గా , స్టోర్ రూం గా చేసు కున్నారు. రెండో బాత్ రూం ని గిన్నెలు కడగనూ, బట్టలుతకనూ, పనిమనిషి వచ్చి ఇల్లు క్లీన్ చేసి ,బట్టలూ గిన్నెలూ చేసి పోతుంది. బాత్ రూం ఖాళీ గా వుంటే కడిగి పోతుంది. లేకపోతే వెయిట్ చేయదు.
దమయంతి కొడుకు కుమార్ ,"అత్తా! నేను క్రింద పడుకోలేను మీలాగా , హాల్లో సోఫాలో పడుకుంటా, టి.వి. చూస్తూ పడుకోడం నా అలవాటు.", అని తన పడక సోఫా మీదికి మార్చేసుకున్నాడు.
ఆ సోఫా సంజీవరావు మోజుపడి , పది షాపులు తిరిగి, లైట్ వెయిట్ ,సాఫ్ట్ ఉడ్ తో , అందమైన పింక్ కలర్,కుషన్స్ తో , ఫినిషింగ్ చేయించు కున్నా డు .రోజూ తానే డస్టింగ్ చేసుకుంటూ క్రొత్త దానిలా ఉంచుకుంటున్నాడు. పోనీ పది, పది హేను రోజుల్లో పోతా డు గదాని సర్దుకున్నారు .
నెల , రెండునెలలైంది. కుమార్ కదిలేలా లేడు. రోజూ రా త్రి 11 గం . వచ్చి బెల్కొడతాడు , ఉదయం పదింటి దాకా నిద్ర లేవడు . వయస్సుకు మించిన భారీ కాయంతో , నిక్కరుతో . ఆ సోఫా ను కృంగదీస్తూ , పదివర కూ పడుకోడం ఇబ్బందిగా ఉంటోంది , సంజీవరావు దంపతులకు, రిటైరయ్యాక హాయిగా ప్రొద్దుటే భక్రి ఛానల్ చూస్తూ కాఫీ త్రాగుతూ కబుర్లు చెప్పు కుంటా కాలక్షేపం చేయాలనే వారి కోరిక కంచి కెళ్ళింది.
అప్పుడు లేచి, పనిమనిషి బాత్ రూం క్లీన్ చేసే వేళకి ,స్నా నానికి వెళ్తాడు ,పనిమనిషి వెళ్ళి పోతుంది. ఫొన్ లో రాత్రి 11గం. ల తర్వాత పెద్దగాఫ్రెండ్స్ తో మాట్లాడటం [ సెల్ ఫొన్ వున్నా అది వాడడు , ఖర్చుతనదవు తుంది కదా!] , ఆరాత్రి పూట బాత్ రూం లో పాటలు పాడుతూ స్నానం చేయడం, తలుపులు పెద్ద శబ్దం తో వేయడం ,తడి టవల్స్ సోఫా మీద వేయడం, ఉదయం స్నానంచేసి లోయర్సన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర వేయ డం, బూట్ల కాళ్ళతో ఇల్లంతా తిరగడం ,రాత్రి టి.వి. ఒంటి గంట వరకూ పెద్ద శబ్దం తో చూస్తూ, లైటు ,టి.వి .ఆపకుండానే నిద్ర పోడం, అన్నీ ఇబ్బంది కరం గానే వున్నాయి వారికి.
" అన్నయ్యా ! మావాడికి స్వీట్స్ ఇష్టం , పిచ్చి వెధవ , వాడు వచ్చే సరి కి షాపులు మూస్తున్నారుట కొంచెం తెచ్చి వుంచుదూ! --", అంటూ ఆజ్ఞ జారీ చేసింది దమయంతి, అభ్యర్ధి స్తున్నట్లు గానే.
వారాని కోసారి, చాకి రేవు పెడతాడు ,ఇల్లం తా తడిచేస్తూ బాల్క నీ లో బట్టలు వేయను చాలక ఇంట్లో వేయడం,సాక్స్ నీళ్ళు కారుతూ వేయడంతో , క్రింది ఫ్లోర్ ఆవిడ కంప్లయింట్ చేసింది. సర్ఫ్ ,సబ్బులు ,తలనూనె ఏమీ తెచ్చుకోడు, యాపిల్స్ తెచ్చుకుని కవర్లో పెట్టి, భద్రంగా ఫిజ్ లో దాచుకుని తింటాడు. సీరియల్ తెచ్చుకుని పాలు పోసుకు తాగుతాడు, శని ఆది వారాలు ఇంట్లోనే బ్రేక్ ఫాస్ట్ , లంచ్, డిన్నర్ ,అదీ టైం కు నిద్ర లేవడు, రాడు. వాడి అశుభ్రత ,భరించలేక , సరోజనమ్మ "కుమార్! పనిమనిషికి మూడు వంద లివ్వునీబట్టలూ నీ పనులన్ని చేసి పెడుతుంది. " , అంటే ,"ఎందు కత్తా నేనే చేసుకుంటాన్లే ", అనే శాడు. తనటవల్స్ వాడడు, దుప్పట్లు తీయడు అన్నీ సంజీవరావువే. కరెంటు బిల్లు,ఫోను బిల్లు, అదిరిపోతున్నాయ్ . పాపం పొదుపు గా ,మితంగా, ప ధ్ధతిగా వుండే సంజీవరావు సందిగ్ధంలో పడి పోయాడు. ఖర్చు తో పాటు, ఇబ్బంది, ఇరుకు , తమ ఇంట్లో నే పరాయి వారిలా ఉండ వలసి వస్తోంది.
పొద్దుటే భక్తి రంజనీ , వార్తలూ చూసే సంజీవరావు , కుమార్ నిద్ర పోతుండ డంతో అవి వదులు కున్నాడు. తన కు ఇష్ట మైన సోఫా వాడి 85 కె.జి. ల బరువుకు కుషన్స్ సాగి పోయాయి, వాడివంటి చెమటతో కంపు కొడుతున్నా యి. మూడేళ్ళుగా ఎంతో శుభ్రం గా వుంచుకున్న ఇల్లు ,మూడునెలలకే మురికి బట్టి పోయింది . తల నూనె రాస్తే గోడల మీద,బాత్ రూం లో షవర్ చేస్తే ఆషాం పూ మరకలు గోడల నిండా , కమోడ్ వాడాక సరిగా క్లీన్ చేయడు ,పనిపిల్లపోయా క వాడతాడు.. ఈ అగచాట్లతో సంజీవరావు దంపతులు విసిగిపోయారు. మూడు నెల లైనా పోడే !
చివరకు ఓ రోజు సంజీవరావు ," తన మిత్రుని మేడ మీది గది ఖాళీగా వుం దనీ , ఎవరికైనా కావలిస్తే చెప్ప మని అన్నాడనీ " సూచిస్తే ' అలాగే చెప్తాలే మామా !',అన్నాడే కానీ పోయేట్లు లేడు. సంజీవరావు ప్రియ మితృడు , అతని కూతురికి ఐ.టి.పి.యల్ . లో ఉద్యోగం వస్తే పి.జి.హోం. వెతుక్కుంటూ , వస్తే కనీసం తన ఇంట్లో ఒక్క రాత్రి కూడా ఉంచు కోను వీలుకానందు కు సంజీవ రావు ఎంతో ఫీలయ్యాడు. నెలకు 80వేలు సంపాదించు కుంటూ ఇలా తమని ఇబ్బంది పెట్టడం ఇదేం బుధ్ధి వీళ్ళకి ! అని మ్రింగలేక, కక్కలేక లోలోపల మధన పడసాగారు, సంజీ వరావు దంపతులు.
ఒక్క సంజీవరావే కాదు, అలాంటి రావులు సమాజంలో నేడు ఎందరో. అలా గే , దమయంతులూ, కుమా ర్లూ కూడా. వెనుక తిరుపతి వంటి యాత్రా స్థలాల్లో చుట్టాల దాడి వుండేది, ఈ ఆధునుక కాలంలో , సాఫ్ట్ వేర్ సంస్థలు వున్నచోట ల్లా ఈ కుమార్ల దాడి ఎక్కువగానే వుంటోంది. తమ పిల్లల్ని పధ్ధతిగా పెంచు కోడం, వారి సంపాదనతో పాటు ,వారికి తగిన సలహాలు , జాగ్రత్తలూ చెప్తూ , ఇతరుల ఇళ్ళకెళ్తే ఎలా వుండాలి , వారిని ఇబ్బంది పెట్టే మన అలవాట్లని ఎలా మార్చు కోవాలి, బంధువుల ఇళ్ళలో నైనా ,స్నేహి తుల ఇళ్ళలోనైనా 3 రోజుల కంటే ఉండ రాదనీ , తమ వస్తువులనే వాడు కోవాలనీ ,ఇంట్లోని తమ అల వాట్లని బయట సాగించు కోరాదనీ కనీసం తమ అవసరానికి సరి పడా ఖర్చులు తామే భరించుకోవాలనీ , ఇలాంటి ఎన్నో ., మరెన్నో విషయాలు తల్లులు , తమపిల్లలకు చెప్తే బావుంటుందేమో ! ముద్దులూ ,మురి పాలూ బయట సాగించుకోక ఇంటివరకే పరిమిత మనే విషయం పిల్లలకు చెప్పాల్సి న బాధ్యత ఎంతైనా వుంది. బయ టి కెళ్ళినపుడు ప్రవర్తనా నియమావళిని పిల్లలకు నూరిపోసి మాత్రమే పాపాల్సిన బాధ్యత తల్లి తండ్రులదే. అలా కాన పుడు తమ పిల్లల వలన ,పాపం సంజీవరావు వంటి ముసలి దంపతు లెందరో ఇక్కట్ల పాలవడం క్షమించరాని నేరమవుతుంది. ఇంతకూ సంజీవరావు సమస్య ఎలాతీరిందనుకుంటున్నారు? సంజీవరావు స్నేహితుడు ఒకరు ఓమారు ఇంటికొచ్చి పదివరకూ పడుకోనున్న కుమార్ ను చూసి, "ఎవరీ ! తెల్ల ఎలుగుబంటు? ఇంతసేపు నిద్రపోడ మేంటీ?
మా స్నేహి తుని కొడుకు ఫలానా కంపెనీ బాస్, అతగాడే ఉదయం ఆరింటికి లేచి జాగింకె ళతాడు, ఫామిలీ ఇంకారాలేదు, వేరేగదిలో ఉంటాడు,అన్నీతానే చేసుకుంటా డు, మాయింటికి రావోయ్ అంటే రిటైరైన మీకు శ్రమెందుకండీ! మాకు జీతం బాగానే ఇ స్తారుగా!అన్నాడు. ఇతరుల ఫోన్లూ, గట్రావాడుకోడు,తనలాంటి మం చి ఎంప్లాయ్ కి కొత్తగా చేరిన వాడికి ప్రెమోషన్ ఇవ్వాలను కుంటున్నా డో య్! నన్ను రెకమెండ్ చేయ మని కూడా అన్నాడు,నీఎరికలో ఎవరైనా ఉంటే చెప్పు." అన్నమాటలు విని గబుక్కినలేచి తయారై వెళ్ళి పోయాడు. సాయంకాలం వస్తూనే " మామయ్యా! మాకొలీగ్ తన గది షేర్ చేసుకోను రమ్మని పిలిచాడు, అక్కడైతే ఇద్దరం కలిసి పని గురించీ డిస్కస్ చేసుకోవచ్చనీ, ఇప్పు డే వెళుతున్నాను, బయట ఆటో వెయి టింగ్ , ఉదయం వచ్చిన పెద్దాయన కు నాగురించీ చెప్పవూ!ప్లీజ్ !" అంటూ చకచకా తన వస్తువులు సర్దుకుని వెళ్ళిపో యాడు,సంజీవరావు దంపతులు అవాక్కై చూస్తుండగా.