పక్కింట్లో చెప్పా... - ఆకెళ్ళ శివప్రసాద్

Pakkintlo Cheppa

రో జూలాగే రొమాంటిగ్గా తయారయి ఫినిషింగ్ టచ్ లా పెదాలకి లిప్ స్టిక్ అద్ది, అద్దంలో తనని తానే ముద్దు పెట్టుకుంది మల్లీశ్వరి. 'యింత అందమైన విగ్రహాన్ని చూసినా నిగ్రహంగా ఎలా వుంటున్నాడే మీ ఆయన' అన్న పిన్ని మాటలు గుర్తు కొచ్చాయి. కిశోర్ యిష్టపడే పెళ్ళిచేసుకున్నాడు. అంత కన్నా యిష్టంగా హైదరాబాద్ లో కాపురం పెట్టాడు. కంపెనీకి వెళ్ళే రోజు వరకు నిరంతర ప్రణయానందంలో ముంచేశాడు. సెలవులయి కంపెనీకి వెళ్ళి వొచ్చాకా కధే మారిపోయింది. అలసటతో వస్తున్నాడు. అలరించకుండా నిద్రపోతున్నాడు. కంపెనీలో పని ఒత్తిడి పెరిగినప్పుడేగా ఇలాంటి 'రిలాక్సేషన్' కావాలి! ఊహా! ల్యాప్ టాప్ ముందే న్యాషీతో మొదలుపెట్టి కునుకులో జారుకుంటున్నాడు.

ఆ రోజు కిశోర్ వచ్చేసరికి - టీవీలో వసందైన హిందీ సిన్మా లో పాట వస్తోంది. హీరో, హీరోయిన్లు సముద్రం ఒడ్డున వంటిమీద గుడ్డలు వున్నాయో లేవో కూడా పట్టించుకోకుండా రెచ్చి పోతున్నారు. కిశోర్ దృష్టి అటుపడిన వెంటనే, వచ్చిన అవకాశం అంది పుచ్చుకున్నట్లు మల్లీశ్వరి అతని పెదాలతో తన పెదాలు కలిపింది. కాసేపు ఆనందమిచ్చిన తమకం. తమకంలోంచి పుట్టిన వేడి.

కిటికీ లోంచి జాలువారుతున్న వెన్నెల కిరణాలు ఇటుగా చూసి సిగ్గుపడిపోయాయి. కాసేపే... ఆ తరువాత... పాతపాటే... అలసట బాటే!!

మల్లీశ్వరి ప్రతి రోజులా నిరాశపడకుండా, పిన్ని ఫోన్ లో ఛెప్పిన సలహాను అమలు చేస్తూ - "యివాళ మధ్యాహ్నం టూ నాట్ ఫోర్ లో వుండే శ్రీదేవి అడిగింది మీవారు బెడ్ రూమ్ లో ఎలా వుంటారని... కొత్తగా పెళ్ళయిన వాళ్ళంటే అదో ఆసక్తి వుంటుంది... పెళ్ళయి పిల్లలు పుట్టినా వాళ్ళాయన అస్సలు వదిలి పెట్టడట... నుదురు మీద మొదలయిన ముద్దులయాత్ర చిటికెన వేలు దాకా సాగవలసిందేనట... నన్ను అడిగింది..."మల్లీశ్వరి మాట పూర్తి కాకుండానే కిశోర్ గురక వినిపించింది. మల్లీశ్వరి విరహం గోడల్ని తాకింది!
మర్నాడు -
మళ్ళీ కధ బెడ్ రూమ్ కి వచ్చేసరికి -
"ఒన్ నాట్ సిక్స్ లో వుండే మార్గరెట్ కి అస్సలు సిగ్గులేదు..." అని మొదలుపెట్టే సరికి -
"ఎవరు?" కిశోర్ టక్కున అడిగాడు.
"అదేనండి... ఇవాళ మీరు బైక్ తీస్తుంటే టైట్ జీన్స్ వేసుకుని అందరిని రెచ్చగొట్టేటట్టు ఏదో హిందీ పాట పాడ్తోంది... ఆవిడ... బెడ్ రూమ్ బ్యాడ్ రూమ్ కావాలిట... బ్యాడ్ అంతా బెడ్ మీద గుడ్ గా జరగాలి... అని అడిగితే... నేను సిన్సియర్ గా మీరు అలిసిపోయి పడుకుంటున్నారని చెప్పేశా... హ్యాపీ లేని సంపాదన ఎందుకు?... డబ్బులతో ముద్దులు కౌగలింతలు రావుగా... అసలు తప్పునీది అని అరచి... తలుపులు మూసుకున్నవెంటనే తలపులన్నీ నా మీదే వుండేటట్టు చేసుకోవాలంది..."

ఈ సారి మల్లీశ్వరి మాటలు పూర్తిగా వినకుండా మల్లీశ్వరి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకి లాక్కున్నాడు. అపార్ట్ మెంట్ లో ఆడవాళ్ళందరకి తను 'చేస్తున్న' పని తెలిసిందనేసరికి 'ఇగో' దెబ్బతింది.
మల్లీశ్వరికి కావలసింది అదే!!
మళ్ళీ మర్నాడు పాత కధే!
మల్లీశ్వరికి విరహం తప్పలేదు!!
ఆ మర్నాడు -
కిశోర్ కంపెనీ నుండి వచ్చి ఫ్రెష్ అయి ఎప్పటిలాగే నిద్రకి ఉపక్రమిస్తుంటే -
మల్లీశ్వరికి ఫోన్ వచ్చింది -

ఫోన్ లో మాట్లాడుతూ మల్లీశ్వరి కాస్త గట్టిగానే -
"...ఆ... ఆ... పిన్నీచెప్పు... నన్నేం చెప్పమంటావ్... కిశోర్ గారు పడుకుంటున్నారు... కాసేపాగి ఫోన్ చేస్తే ఆయన నిద్రకి డిస్టర్బ్ వుండేది కాదు... పాపం... అదొకటే తక్కువ... ఎంత ప్రేమగా చూసుకుంటారని... మా అపార్ట్ మెంట్ లో వాళ్ళు చెప్పడం... వాళ్ళు ఆయనకి ఏం చెప్తారు?... మా దగ్గరుండే నార్త్ ఇండియన్ ఆంటీ అలిసి పోతున్నారంటే 'అచ్చా ఫుడ్ కిలావ్' అని డ్రై ఫ్రూట్స్ యిచ్చింది... కిశోర్ కి వాటిని తినే ఓపిక కూడా లేదు... మలయాళీ ఆంటీ అయితే 'యోగ' నేర్చుకోమను...'సంయోగ యోగం' బావుంటుంది అంది... ఆవిడ దగ్గరకి నన్నే కాదు కిశోర్ ని రమ్మంటోంది... రసం లేక నీరసంగా వుందేమో పళ్ళరసం యిమ్మని యింకోరి సలహా... మా అపార్ట్ మెంట్ లో ఈ విధంగా పాపులర్ అయినామనుకో... కిశోర్ గమనించడం లేదు గానీ ప్రొద్దున్నే జాలి పడ్తున్నారు ఆయన్ని చూసి..." అనేసింది.

కళ్ళలోకి ఎక్క బోయిన నిద్రమత్తు టక్కున కిశోర్ కి ఎగిరిపోయింది. రోజూ కంపెనీకి వెళ్తున్నప్పుడు 'పని'గట్టుకుని అపార్ట్ మెంట్ లో వున్న వాళ్ళందరు 'తననే' చూస్తున్నారా? మలయాళీ ఆంటీ అందుకే నవ్విందా? మార్గరెట్ కొంటె చూపులో అర్ధమదా?... ఒకావిడకి పెద్దావిడని సెంటర్ వరకు లిఫ్ట్ యిస్తే 'ఆల్ ది బెస్ట్ చెప్పడంలో అర్ధమింతవుందా?...
యిలా చాలా చాలా వూహించేసుకుని -
సామూహికంగా అందరూ తనలోని 'మొగాడి' ని ప్రశ్నిస్తున్నట్టుగా ఫీలై పోయాడు - దానికి తోడు - మల్లీశ్వరి బంధుమిత్రులకి కూడా జిల్లాల వారీగా తన 'మగతనం' ప్రతిభ చాటేస్తోందా?... 'నో' అలా జరగకూడదు!!
తనని తాను 'ఫ్రూవ్' చేసుకోవాలి!!

ఫోన్ లో మాట్లాడుతున్న మల్లీశ్వరిని అమాంతం తనవైపు లాక్కున్నాడు - ఫోన్ లో అప్పుడే పిన్ని అంటోంది -
"తన భార్య మాట ఎలా వున్నా పక్క ఆడవాళ్ళు తన గురించి 'తక్కువగా' వూహించడం ఏ మొగాడు తట్టుకోలేడు..." అని ఆతరువాత -
మల్లీశ్వరి ఫోన్ కట్ చేసే అవకాశం కిశోర్ యివ్వలేదు. అక్కడి శబ్ధాలకి పిన్ని మురిసిపోయి సీన్ వూహించుకుని ఆనందపడింది. పక్కింటి వాళ్ళకి చెప్పకుండా చెప్పేనని చెప్పమన్నా పిన్ని సలహాని రహస్యంగా దాచుకుని కిశోర్ కౌగిలలో కరిగిపోయింది మల్లీశ్వరి!!!

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ