అమ్మా నాన్న ఓ కథ - ముల్లా జమాల్ బాషా

amma naanna o katha

అది ఎండాకాలం. ఆరోజు శనివారం. రజియా బ్యాంకులో ఉద్యోగి. ఆఫీస్ కి వెళ్దాం అని తయారు అవుతూ ఉంటుంది. రామ్, రజియా భర్త. ఇద్దరు ప్రేమించి, ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటారు. ఉదయం ఎనిమిది గంటలు అయిఉంటుంది. రామ్ సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ టీవీ చూస్తుంటాడు. రామ్ ప్రైవేట్ కంపెనీ లో పనిచేస్తూ ఉంటాడు. రామ్ కి ప్రతి శని, ఆది వారాలు సెలవు. రామ్, రజియా కి ఒక కొడుకు ఉంటాడు. పేరు వివేక్. ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటుంది. "జీ(ముస్లిం అమ్మాయిలు పెళ్లి తర్వాత భర్తలని "జీ" అని సంభోదిస్తారు. హిందూ అమ్మాయిలు "ఏవండీ" అన్నట్లు ) టిఫిన్ తయారు చేశాను. పొయ్యి మీద పెట్టి ఉంది, త్వరగా తినేయండి. బాబు ఇంకా లేవలేదా? " అని రామ్ ని అడుగుతుంది. "లేవలేదు అనుకుంటాను. నువ్వు వేళ్ళు ఆఫీస్ కి సమయం అవుతుంది కదా, నేను చూసుకుంటా లే" అంటాడు. "సరే ఐతే. నేను వెళ్ళొస్తాను జీ" అని బ్యాంకు కి బయల్దేరుతుంది.

వివేక్ కి ఎండాకాలం సెలవులు. అందువల్ల ఆలస్యం గ నిద్ర లేవడం,స్నేహితులతో బయట తిరగడం ఇదే పని రోజంతా. వివేక్ నిద్ర లేచి సోఫా లోకి వస్తాడు. "వివేక్ బ్రష్ చేశావా?" అని కొడుకుని అడుగుతాడు రామ్. "లేదు నాన్న, ఇప్పుడే లేచాను" అంటాడు. "ఎండాకాలం సెలవులు కదా ఏం చేయాలి అనుకుంటున్నావు మరి?". ఏమో నాన్న ఏం చేయాలో అర్థం కావడం లేదు" అంటాడు వివేక్. "హ చెప్పడం మర్చిపోయా. మొన్న పేపర్ లో ఒక ప్రకటన చూసాను, కథల పోటీల గురించి. నేను ఒక కథ రాసి పంపిద్దాం అనుకుంటున్నా. ఏమంటావు నాన్న" అని తండ్రి ని అడుగుతాడు. "మంచిదే ర అలాగే రాసి పంపు. పంపే ముందు నాకు ఒకసారి చూపించు నేను చదువుతాను ఎలా రాసావో" అంటాడు. "అలాగే నాన్న. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది నాన్న. మనం రాసే కథ యూత్ కి సంభందించిందాయి ఉండాలి అన్నారు " అంటాడు వివేక్. "అలాగా. నువ్వు యూత్ వె కదా, నువ్వే కరెక్ట్ గ రాయగలవు ఐతే" అని వివేక్ ని ప్రోత్సహిస్తాడు. "లేదు నాన్న. నేను రెండు రోజుల నుండి ఆలోచిస్తున్నాను ఏం రాయాలో ఏమి తోచడం లేదు. నువ్వు కొంచెం సహాయం చేయవా? నీకు తెలిసిన, నువ్వు విన్న కథ ఏదైనా ఉంటె చెప్పు నాన్న" అని నాన్న ని అడుగుతాడు. "నేను చెప్తే ఇంకా నువ్వేం రాసినట్టు అవుతుంది. నీ సొంత తెలివి ఉపయోగించి నువ్వే రాయి. నువ్వు రాయగలవు" అంటాడు. "అబ్బా, దయచేసి ఈ ఒక్కసారికి చెప్పు నాన్న" అని బ్రతిమాలాడతాడు. "సరే" అని ఒప్పుకుంటాడు.

-------------------------------

ఒక ఊరిలో ఒక అమ్మాయి " రేష్మ", ఒక అబ్బాయి " రాజు " ఉంటారు. వాళ్ళు ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకే స్కూల్ లో చదువుతుంటారు. చిన్నప్పటి నుండి చాల కలిసి మెలిసి ఉంటారు. క్లాస్ లో కూడా ఒకే బెంచ్ లో కుర్చుంటుంటారు , కలిసి తింటుంటారు . ఇలా ఉండగా పదవ తరగతి ఫైనల్ పరీక్షలలో ఇద్దరు మంచి మార్కులతో పాస్ అవుతారు.

ఆ తర్వాత ఇద్దరు ఒకే కాలేజీ లో ఇంటర్మీడియట్ లో జాయిన్ అవుతారు. మొదటి సంవత్సరం అయిపోతుంది. రెండవ సంవత్సరం లోకి వచ్చాక " రేష్మ " కి ఏం అవుతుందో తెలీదు. ఎప్పుడు చూసే రాజు ని కొత్తగా చూడటం మొదలుపెడుతుంది. రాజు తో వేరే అమ్మాయిలు మాట్లాడితే సహించేది కాదు. రాజు తో మాట్లాడకండి అని అమ్మాయిలకి వార్నింగ్ కూడా ఇచ్చేది. రాజు వేరే అమ్మాయిలతో చనువుగ మెలగడం రేష్మ కి అస్సలు నచ్చదు. ఒకరోజు రాజు ని పర్సనల్ గ మాట్లాడాలి అని పిలుస్తుంది. రాజు, రేష్మ కాలేజీ అయ్యాక కలుస్తారు. "ఏంటి ఏదో మాట్లాడాలి అన్నావు" అంటాడు రాజు. రేష్మ ఏమాత్రం ఆలోచించకుండా "నువ్వంటే నాకిష్టం, ఐ లవ్ యు" అనేస్తుంది. "నన్ను క్షమించు రేష్మ నాకిష్టం లేదు" అని ఏమాత్రం ఆలోచించకుండా బదులిస్తాడు. "ఎందుకు ఇష్టం లేదు" అని అడుగుతుంది. "నేను ఒక హిందూ అబ్బాయిని , నువ్వు ఒక ముస్లిం అమ్మాయివి, భవిష్యత్తులో మతపరమైన సంఘర్షణలు జరగడం నాకేమాత్రం ఇష్టం లేదు" అంటాడు.
అది విన్న రేష్మ ఏడుస్తూ అక్కడినుండి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాజు, రేష్మ కి దూరంగా ఉంటాడు. ఒకవేళ ఎదురుపడినా చూసి చూడకుండా దూరంగా వెళ్ళిపోతాడు.

ఇంటర్మీడియట్ పూర్తి అవుతుంది. ఇద్దరు మంచి మార్కులతో ఉత్తీర్ణులై ఉంటారు. కానీ ఒకరికి ఒకరు దూరంగా ఉంటారు. ఆ సంఘతన జరిగాక ఇద్దరు మాట్లాడుకోవడం మానేస్తారు. రాజు డిగ్రీ చదవడానికి వేరే ఊరికి వెళ్ళిపోతాడు. రేష్మ అదే ఊరిలో డిగ్రీ లో చేరుతుంది.
రేష్మ డిగ్రీ రెండవ సంవత్సరం లో ఉన్నప్పుడు జోసెఫ్ అనే అబ్బాయి "నిన్నుప్రేమిస్తున్నాను. ఐ లవ్ యు" అని చెప్తాడు. రేష్మ కి తాను రాజు కి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. రేష్మ ఇలాగే రాజు కి చెప్పడం, రాజు వేరే మతం అనే కారణంతో రేష్మ ని వద్దు అనుకుంటాడు. ఇప్పుడు జోసెఫ్ కూడా వేరే మతం. అందువల్ల కేవలం మతం కారణంతో జోసెఫ్ ని తిరస్కరించకూడదు అనుకుంటుంది. తనకి కూడా ఇష్టమే అని రేష్మ జోసెఫ్ తో అంటుంది. జోసెఫ్ చాల సంతోషంగా ఎగిరి గెంతేస్తాడు.

ఆ తర్వాత ఇద్దరు కాలేజీ అయ్యాక తరుచూ కలుస్తూ ఉండేవాళ్లు. ఇద్దరు చాలా దగ్గరవుతారు. జోసెఫ్ వేరే ఊరివాడు. ఇక్కడ కాలేజీ హాస్టల్ లో ఉంటాడు. కాలేజీ అయ్యాక రేష్మ ని రోజు తన బైక్ మీద ఇంటి దగ్గర వదిలి వస్తుంటాడు. ఈ ప్రేమ విషయం రేష్మ వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలీదు. తాను ఎవరికి చెప్పుకోదు కూడా. అప్పుడప్పుడు జోసెఫ్ రేష్మ కలిసి సినిమా కి కూడా వెళ్తుండేవాళ్లు. ఇలాగ కొన్ని రోజులు గడుస్తుంది.

ఒక రోజు జోసెఫ్ "ఈరోజు నా పుట్టినరోజు, నువ్వు ఈరోజు అంత నాతోనే ఉండాలి. సాయంత్రం మా హాస్టల్ కి వెళ్దాం" అంటాడు. "పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను హాస్టల్ కి రావడం ఏంటి, మీది అబ్బాయిల హాస్టల్" అంటుంది. "అరే ఏం పర్వాలేదు, ఈరోజు ఎవరు ఉండరు మా రూమ్ లో, నువ్వు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం కేక్ కట్ చేద్దాం, తర్వాత నిన్ను ఇంటి దగ్గర వదిలిపెడ్తాను" అంటాడు. జోసెఫ్ మాటలు నమ్మి రేష్మ హాస్టల్ కి వెళ్తుంది. ఇంట్లో ఏమో పరీక్షలకి చదువుకోవడానికి లహరి ఇంటికి వెళ్తున్నాను అని చెప్తుంది.

కాలేజీ అయ్యాక బయట కేక్ తీసుకొని ఇద్దరు హాస్టల్ లో జోసెఫ్ గదికి వెళ్తారు. రాత్రి ఎనిమిది అయి ఉంటుంది. కేక్ కట్ చేయడం అయ్యాక, "వెళ్దామా నాకు భయం వేస్తుంది" అంటుంది రేష్మ. జోసెఫ్ ఇదే అదునుగా చేసుకొని రేష్మని బలవంతం చేయడం మొదలుపెడతాడు. తనకి ఇవన్నీ ఇష్టం లేదు అని ఎంత చెప్పిన వినడు జోసెఫ్. జోసెఫ్ ని బలవంతంగా పక్కకి తోసేస్తుంది. అయినా జోసెఫ్ వదలకుండా రేష్మని కొట్టి బలవంతం చేస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడిగితె "నువ్ నాకు ఓకే చెప్పావ్ కదా" అంటాడు. రేష్మ మనసులో అనుకుంటుంది " ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఇదా" అని. ఆరోజు రాత్రంతా అక్కడే రూమ్ లో ఉంటుంది. ఇంట్లో వాళ్లకి భయపడి జరిగిన సంగతి చెప్పుకోదు.
మరుసటి రోజు జోసెఫ్, రేష్మాతో "ఎవరికైనా చెప్పవా నిన్న జరిగింది" అని అడుగుతాడు. లేదని చెప్తుంది రేష్మ. జోసెఫ్ స్వరం మారుతుంది. "ఈరోజు కూడా సాయంత్రం రావాలి" అంటాడు జోసెఫ్. "చెప్పు తీసుకొని కొడతా" అంటుంది. "రాకపోయావో నిన్న జరిగిందంతా ఫొటోస్, వీడియోస్ తీశాను. అవి అందరికి చూపిస్తాను" అని భయపెడతాడు. అవి నిజంగానే బయటపడితే తన తల్లి తండ్రులు బ్రతకరు అనుకోని సాయంత్రం రూమ్ కి వెళ్తుంది.

ఈ సారి జోసెఫ్, తన ముస్లిం స్నేహితుడు యాసీన్ ని తీసుకొని వస్తాడు రూమ్ కి. ఆరోజు ఇద్దరు కలిసి బలవంతం చేస్తారు. కొద్దీ రోజుల తర్వాత యాసీన్, రేష్మ తో "ఈరోజు సాయంత్రం నాతోరా. లేకుంటే ఫొటోస్ మన మతం వాళ్ళు అందరికి పంపిస్తా" అంటాడు. "నన్ను వదిలేయండి. మీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటాను" అని ఎంత బ్రతిమలాడిన పట్టించుకోడు. రేష్మ కి ఇంకా వేరే దారి లేక చనిపోదాం అనుకుంటుంది.

చివరి సారిగా తన తల్లి తండ్రులను కలిసి చనిపోదాం అనుకుంటుంది. కాలేజీ అయ్యాక ఇంటికి బయల్దేరుతుంది. తాను ఉండే బస్సు లో తన చిన్ననాటి స్నేహితుడు రాజు కూడా ఉంటాడు. రేష్మ, రాజు ని చూస్తుంది. రాజు కూడా రేష్మ ని గుర్తుపడ్తాడు. బస్సు దిగాక " కాఫీ కి వెల్దామా" అని అడుగుతాడు రాజు. "సరే" అంటుంది. రాజు కాఫీ సమోసా ఆర్డర్ చేస్తాడు. అవి వచ్చేలోపు రాజు తన కాలేజీ జీవితం గురించి చెప్పడం మొదలుపెడతాడు. తాను స్టూడెంట్ యూనియన్ లీడర్ అని, క్లాస్ టాపర్ అని చెప్తుంటాడు. రేష్మ అన్ని విని విననట్టు ఉంటుంది. రేష్మ అసౌకర్యంగ ఉండటం గమనించి "ఏమైంది రేష్మ, నీకు నాతొ కాఫీ కి రావడం ఇష్టం లేదా"అని అడుగుతాడు."నన్ను క్షమించు ఆరోజు నీతో అలా మాట్లాడి ఉండకూడదు. ఎలా మాట్లాడాలో కూడా తెలియని వయసు మనది అప్పుడు. మన స్నేహాన్ని కూడా దూరం చేసుకున్నాను. నన్ను క్షమించు" అంటాడు.

"అయ్యో నేను దాని గురించి ఆలోచించడం లేదు" అంటుంది. "మరి ఏమైంది చెప్పు" అంటాడు. రేష్మ ఆపుకోలేక జరిగిందంతా రాజు కి చెప్పేస్తుంది. చెప్పడం అయ్యాక బోరున ఏడుస్తూ" ఎవ్వరికి చెప్పకు ఈ విషయం గురించి. అయినా నేను ఈరోజు చనిపోతున్నాను" అంటుంది. రాజు మొదట కంగారు పడతాడు. తర్వాత రేష్మ కి ధైర్యం చెప్తాడు. "మీ అమ్మ నాన్న గురించి ఒకసారి ఆలోచించు. వాళ్ళు ఏమైపోవాలి నువ్వు ఇలా చేస్తే" అని. యాసీన్ గురించి అడిగి తెలుసుకుంటాడు రాజు. రాజు మాటలతో రేష్మ కి కొంత ఉపశమనం కలుగుతుంది. చనిపోవాలి అనుకున్న ఆలోచనని వాయిదా వేసుకుంటుంది. రాజు రేష్మ ని ఇంటిదగ్గర వదిలిపెడతాడు.

మరుసటి రోజు రాజు, రేష్మ కి కాల్ చేస్తాడు. "మీ కాలేజీ దగ్గర ఉండే హాస్టల్ దగ్గరికి రా" అంటాడు. "హాస్టల్ కి రా" అనే మాట రాజు నుండి వినగానే రేష్మ కి ఎక్కడాలేని భయం వేస్తుంది. అబ్బాయిలు అందరు ఇంతేనా అని, ఏవేవో చేడు ఆలోచనలు మెదడులోకి వస్తాయి ఆక్షణంలో. ఎందుకు పిలిచాడో అనుకోని బయల్దేరి వెళ్తుంది రేష్మ. రేష్మ హాస్టల్ దగ్గరికి వెళ్ళగానే రాజు తన చేయి పట్టుకొని ఒక రూమ్ కి తీసుకొని వెళ్తాడు.

ఆ రూమ్ లో ఒక అబ్బాయిని కుర్చీలో కట్టేసి ఉన్నారు. కట్టేసింది ఎవరినో కాదు యాసీన్ ని. రాజు తన ముందే యాసీన్ ని చితకబాదుతాడు. తర్వాత తనని కూడా కొట్టమంటాడు. వద్దు ఇప్పుడు నేను ఏమైనా చేస్తే వాడు మల్లి నన్ను హింసిస్తాడు అంటుంది. "వాడేం చేయలేడు నువ్వు భయపడొద్దు. నేను పోలీసులకి చెప్పాను జరిగింది. వాళ్ళు కూడా వస్తూ ఉంటారు" అని చెప్తాడు రాజు. రేష్మ ధైర్యం చేసి తాను వేసుకున్న చెప్పు తీసుకొని గట్టిగ ఎడా పెడా చెంపలకి వాయిస్తుంది. "పోలీసులు ఏం వద్దు, ఎవరికైనా తెలిస్తే మా ఫామిలీ పరువు పోతుంది. ఇంట్లో తెలిస్తే వాళ్ళు బ్రతకరు" అంటుంది. ఈలోగా పోలీసులు కూడా వస్తారు. రేష్మ ని రాజుఁ వేరే రూమ్ లోకి పంపించి, రాజు మరియు పోలీసులు కలిసి యాసీన్ ని పిచ్చ కొట్టుడు కొట్టి, ఇంకోసారి ఆ అమ్మాయి జోలికి వెళ్ళావో అని వార్నింగ్ ఇస్తారు. రాజు ఆరోజంతా రేష్మతో పాటు ఉండి సాయంత్రం ఇంటిదగ్గర వదిలిపెడతాడు. ఆరోజు రాత్రి రేష్మ మనసులో ఏ ఆలోచనలు లేకుండా హాయిగా పడుకుంటుంది.

రాజు ఇంటికి వెళ్ళాక రేష్మ గురించి ఆలోచిస్తాడు. ఒకవేళ రాజు, రేష్మ ప్రేమని అంగీకరించి ఉంటే ఈరోజు రేష్మ కి ఈ విధంగా జరిగి ఉండేది కాదు కదా అని మనసులో అనుకుంటాడు. రేష్మ ఎలాంటి కల్మషం లేని మంచి అమ్మాయి. తన వల్లే రేష్మ కి ఇలా అయిందని చాల బాధ పడతాడు.

రేష్మ మామూలు మనిషి అయ్యే వరకు రాజు అప్పుడప్పుడు రేష్మ ని కలవడం, యాసీన్ మల్లి ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగి తెలుసుకోవడం చేస్తూ ఉంటాడు. రేష్మ తన డిగ్రీ పూర్తి చేస్తుంది. రేష్మ ని తాను పెళ్లి చేసుకోవడమే సరైనది అనిపించి, రేష్మ తో విషయం చెప్పి, వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు రాజు. అక్కడినుంచి రేష్మ జీవితం సుఖంగా ఉంటుంది.

----------------------

"ఇది కథ" అని రామ్ ముగిస్తాడు. "నిజంగా జరిగినట్టే చెప్పావ్ నాన్న కథ. ఇదే రాసి పంపిస్తాను. థాంక్స్ నాన్న" అని తన రూమ్ లోకి వెళ్తాడు.

"నిజంగా జరిగినట్టే కాదు, నిజంగానే జరిగిన కథ ఇది. ఈ కథలో రాజు ఎవరో కాదు మీ నాన్నే(రామ్), రేష్మ ఎవరో కాదు మీ అమ్మ(రజియా)" అని మనసులో అనుకుంటాడు.

"వివేక్ వివేక్ ఇలారా ఒకసారి" అని పిలుస్తాడు రామ్.

"వివేక్ నువ్వు ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి" అంటాడు రామ్. "చెప్పండి నాన్న" అంటాడు వివేక్. "నువ్వు ఎప్పుడు కూడా కులం, మతం అని ఎవ్వరిని దూరం చేసుకోకూడదు. ఇంకొకటి నువ్వు ఎవరినైనా నిజంగా ప్రేమించాలి అనుకున్నప్పుడు, పెళ్లి అయ్యేంత వరకు ఆ అమ్మాయి దగ్గరినుండి శారీరకంగా ఏమి ఊహించకు. నువ్వు మీ అమ్మని ఎంతగా ఐతే గౌరవిస్తావో సమాజంలో ఉండే ప్రతి అమ్మాయి ని అలాగే గౌరవించాలి. సరేనా?" అని చెప్తాడు. "తప్పకుండ నాన్న" అని రామ్ చేయిని పట్టుకొని బదులిస్తాడు వివేక్.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న