నూకలిస్తే - బేతంచర్ల సూర్య ప్రకాశ్ రావ్

nookaliste

ఒక మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ను పోలీసులు ఇంటరాగేషన్ చేయటానికి ఉన్నారు. ఆ నక్సలైట్ ఒళ్లంతా రక్తంతో తడిసిపోయింది. మోసం పోలీసులు కొట్టరేమో.. చూడటానికి పాతికేళ్ల కుర్రాడిలా ఉన్నాడు.కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీంద్ర నారాయణ ఆ నక్సలైట్ ని ఇంటరాగేషన్ చేస్తున్నాడు. ఆ నక్సలైట్ ని కుర్చీలో కూర్చోబెట్టి ముఖానికి గుడ్డ తీస్తాడు. “రేయ్... ఎవడ్రా నువ్వు. ఇంత మందిని చంపావు.” అని కమిషనర్ అడుగుతాడు.

“సార్! నాపేరు సిద్ధార్థ మాది తెలంగాణ చత్తీస్గఢ్ సరిహద్దు గ్రామం. అది చాలా చిన్న పల్లె సార్. మా ఊర్లో చదువుకోటానికి బడి లేదు, ఏదైనా రోగం వస్తే చూపించుకోవటానికి ఆసుపత్రి ... సార్ మా ఊరు నాగరికతకు బాగా దూరంగా దరిద్రానికి బాగా దగ్గరగా ఉంటుంది సార్. అలాంటి పరిస్థితుల్లో కూడా మా నాన్న నన్ను బాగా చదివించాలని అనుకున్నాడు. ఉన్న ఐదెకరాల్లో రెండెకరాల అమ్మి నన్ను ముంబాయి ఎన్.ఐ.టి లో ఎలక్ట్రానిక్స్ చదివించాడు. నాకోసం రెండెకరాల అమ్మి మూడు ఎకరాలు సాగు చేస్తున్నాడు. ఒకసారి పంటకి పురుగు పట్టింది అమ్మ నగలను తాకట్టు పెట్టి పురుగుమందులు కొన్నాడు పంటకు వాడాడు పని చేయలేదు తనే తాగాడు పని చేసింది. నాన్న తో జీవితాన్ని పంచుకున్న అమ్మ చావును కూడా పంచుకుంది. నేను ఊరిలో ఉంటే తిండి కష్టమవుతుందని హాస్టల్లోనే ఉంటే అటు చదువు ఇటు తిండి కానీ మా నాన్న చదువు అయిపోయేదాకా ఊర్లో అడుగుపెట్ట వద్దన్నాడు. అందుకే వల్ల చదువు నాకు తెలియలేదు. ఎవరు ఉత్తరం రాస్తే తప్ప నాకు తెలియదు.

ఇక నాకంటూ ఆయన వాళ్ళు ఎవరూ లేరు నాకంటూ ఉంది మా నాన్న కష్టపడి చదివిన చదువు. ఎన్.ఐ.టి లో గోల్డ్ మెడల్ సాధించాను. కానీ ఈ వ్యవస్థ నన్ను నిరుద్యోగిని చేసింది. కూటికోసం కూలి పని కూడా చేశా. చాలా ఇంటర్వ్యూస్ వచ్చాయి చాలా సెలెక్ట్ కూడా అయ్యా కానీ జాబు లో చేరాలంటే రెండు లక్షలు లంచం అడుగుతున్నారు. ఇవ్వలేను అన్నాను. అయితే నీకు ఈ జన్మలో ఉద్యోగ రాదు అన్నారు. ప్రభుత్వ సంస్థల్లో కూడా ఉద్యోగానికి అప్లై చేశా కానీ రిజర్వేషన్లు, రికమండేషన్లు అంటూ చాతగాని యదవ అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఎన్ ఐ టీ లో గోల్డ్ మెడల్ వచ్చినా నన్ను ఈ వ్యవస్థ చేతకాని వాన్ని చేసింది.

ఇక ఉద్యోగాలు నా వల్ల కాదని ఊరికి వెళ్లి వ్యవసాయ చేద్దాం అనుకున్న. అదేంటో మా ఊరు కనిపించలేదు. మా ఊరిని కోల్ మైనింగ్ గా మార్చేశారు.ఇక్కడ నాకు తెలిసిన నిజం ఏమిటంటే మా నాన్న అమ్మ లది ఆత్మహత్య కాదు హత్య మా ఊరి ఎమ్మెల్యే,ఎంపీ లు కలసి ఊర్లో అందర్నీ చంపేసి తెల్లగా చిత్రీకరించారు. పొలాలు లాక్కొని గుడిసెలు తగలబెట్టారు. ఊరు మొత్తం స్మశానం చేసి మైనింగ్ గా మార్చేశారు. నాలో కోపం కట్టలు తెంచుకుంది వెళ్లి మా ఎమ్మెల్యే గాడిని కాలర్ పట్టుకొని అడిగా వాడు వాళ్ళ మనుషులతో కొట్టించి అడవిలో పడేసాడు. నన్ను కాపాడింది నక్సలైట్లు. ఈ సమాజం ఈ వ్యవస్థ నన్ను వద్దనుకున్నారు కానీ వాళ్లు నన్ను దగ్గరకు తీసుకున్నారు.

ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే సాయుధ పోరాటమే కరెక్ట్ అనిపించింది. ముందు క్యాడర్ గా తర్వాత లీడర్ గా ఎదిగాను. అవినీతిపరుల్ని , దేశద్రోహుల నీ ఎంతో మందిని చంపాను. ఈ మహాభారతంలో ఉన్న చీడపురుగులను వేస్తుంటే నాకు ఇచ్చిన బిరుదు “దేశ ద్రోహి”. సార్ ఎక్కడైనా మావోయిస్టులు సామాన్యులను చంపుతారు అని విన్నారా వినలేదు ఎందుకంటే మేము చంపము కాబట్టి. అంతెందుకు సార్ రిజర్వేషన్ అనో, రికమండేషన్ అనో, లంచం ద్వారానో, సంతకం కూడా సరిగా చేయడం రానోడు మీ పై ఆఫీసర్ గా ఉండొచ్చు. జనగణమన కూడా సరిగా పాడటం రానోడు ప్రజా ప్రతినిధి అవ్వచ్చు. ఎంతోమంది చావుకు కారణం నేను అంటున్నారు. ప్రత్యక్షంగా నేను అవ్వచ్చు కానీ పరోక్షంగా మీరు నన్ను ఇలా తయారు చేసింది మీరు, మీ సొసైటీ... చేతినిండా పని, తినటానికి తిండి ,ఉండటానికి ఇల్లు దొరికితే నాలాంటి వాడు ఇలా ఎందుకు తయారవుతాడు సార్. నన్ను మీరు ఉరితీసిన నేను బాధపడను ఎందుకంటే దేశం కోసం ఏదో ఒకటి చేసిన అనే తృప్తి.

జై హింద్”

నక్సలిజం ప్రజాస్వామ్య వ్యతిరేకం కాబట్టి భారత ప్రభుత్వం సిద్ధార్థ నీ ఉరితీసింది. రవీంద్ర నారాయణ కారణం చెప్పకుండా జాబ్ రిజైన్ చేశాడు.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న