"హాయ్ ఇందు! ఏమిటీ ఇక్కడున్నావు"? అంది లీల ఆశ్చర్యంగా.
"లీలా! బాగున్నావా? నేను నిన్న రాత్రి వచ్చెను. గరల్స్ హాస్టల్ కి వార్డెన్ గా చేరెను."
"అదేమిటే ఒక ఫోన్ చేస్తే నేను నిన్ను మా ఇంటికి తిసుకెడుదును కదే."
"అంతా హడావిడిగా వారం రోజుల్లో అయింది. తెలియ పరచడానికి కూడా టైం లేక పోయింది. సరే క్వార్టర్ కుడా రెడీగా ఉందనడం తో తిన్నగా ఇక్కడికే వచ్చేసాను."
"సరే స్కూల్ అయ్యాక కలుస్తానే."
లీలా ఇందిరా చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ గ్రాడ్యుఏషన, టిచర్స్ ట్రైనింగ్ చేసి ఇదే స్కూల్ లో టీచర్స్ గా ఒక్కేసారి చేరారు. ఒక్కరంటే ఒకర్కి చాలా చనువు. ఐదేళ్ళ తర్వాత ఇదే కలవడం. లీల తన చాంబర్ లో కుర్చునీ ముఖ్యమైన పన్లు చూసుకున్నాక, ఒక కప్పు కాఫీ తెప్పించుకొని అలా పాత జ్ఞాపకాల్లోకి వెళ్లి పోయింది.....
ఇందు చాలా నెమ్మదస్తురాలు. తెలివైనది కూడా. చూసెందుకు చక్కటి రూపం,పెద్ద కళ్ళు, తీరైన కనుముక్కులతో, చక్కటి ఉంగరాలా జుట్టుతో, చెరగని చిరు నవ్వుతో ఎంతో బాగుండేది. కానీ, ఆ భగవంతుడు ఎంత నిర్దాయుడో! ఆమెకి గూనీ! తండ్రి చిన్నప్పుడే పోయాడు. ఆయన వదిలి పోయిన చిన్న ఇల్లే తల్లి కూతుళ్ళను, వీధిన పడకుండా కాపాడింది. తల్లి వంటలు వండీ ఇందిరని పెంచింది. ఈ అవిటి పిల్ల భవిష్యత్తు ఏమిటాని బెంగ పడేది. చిన్నప్పటి నుండీ అందరితో కలివిడిగా ఉండి, సహాయం చేస్తూ ఉండడం వల్ల ఇందిర, అందరికీ ప్రీతి పాత్రురాలైంది.
స్కూల్ లో కూడా తన పనై పోయాకా, ఖాళీగా ఉన్నప్పుడు అందరికీ సహాయ పడుతూ ఉండేది. స్కూల్ ఆఫీసులో అక్కౌంట్స్ సెక్షన్ లో రాంప్రసాద్ అనే అక్కౌంటంట్ ఉండేవాడు. అతనికీ ఒక్కడే క్లర్క్ ఉండేవాడు. ప్రతీ రోజు ఒక గంటా గంటన్నర, ఇందు వాళ్ళకి సాయం చేసి వచ్చేది.
రాంప్రసాద్ ఇల్లు స్కూల్ ఎదురుగానే ఉండేది. లీలకి స్కూల్ లో చేరిన ఆర్నేల్లకే కృష్ణతో వివాహం జరిగి పోయింది. భర్తది కూడా అదే ఊరు కావడం వల్ల, లీలా ఇందుల స్నేహం కొన సాగుతూనే ఉంది. రాంప్రసాద్ కీ పెళ్ళయి బాబు పుట్టెడు. అతడి భార్యకీ పురిటి లో జబ్బు చేసీ మంచం పట్టింది. వాళ్ళిద్దరికీ దగ్గర కుటుంబీకులు లేక పోడం వల్ల, ఇంటి భాద్యత, చంటి పిల్లాడి ఆలనా పాలనా, రాంప్రసాద్ మీదే పడింది. ఇందిర వాళ్ళింటికి వెళ్లి బాబునీ ఆడించడం లాంటి చిన్న చిన్న పనులు చేసి వచ్చేది.
రాంప్రసాద్ భార్య, అతడినీ, ఏడాది పిల్లవాణ్ణి విడిచీ పైలోకాలకి వెళ్ళి పోయింది. పిల్లవాడు ఇందిరకి మాలిమీ అవడంతో, బాబునీ చూసుకుంటూ , చాలా సమయం అతడి ఇంట్లో గడప వలసి వచ్చేది. స్కూల్ లో నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుకో సాగారు. ఇందునీ పెళ్ళి చేసుకోమని, రాంప్రసాద్ కి, లీల సలహా ఇస్తుంది. దానికి అతడు " నాకైతే ఆమే ఇష్టమే, కానీ నేను బాబు కోసం కానీ లోకాపవాదు కోసం కానీ అంగీకరిస్తున్నానని అనుక్కుంటుందేమో, అనే ఇన్నాళ్ళూ నేను ఆవిడని అడగలేదు. ఆమెకి సమ్మతమైతే నాకూ సమ్మతమే" అన్నాడు.
లీల, ఇందిరని వివాహానికీ ఒప్పించి, ఇద్దరి తరఫునా పెద్దగా, తానె సారధ్యం వహించింది.
పెళ్ళి కి ఇంకా వారం రోజులుందనగా, రాంప్రసాద్, ఆఫీస్ లో పని చేస్తుండగా హటాత్తుగా హార్ట్ అట్టాక్ వచ్చీ, చనిపోయాడు. ఇదీ అందరికీ ఒక పెద్ద షాకు. ఇందిరా మాటామంతీ లేకుండా పిల్లవాణ్ణి ఒళ్లో పెట్టుకుని ఉండి పోయింది. ఇద్దరివైపు కావలసిన వాళ్లు లేక పోవడం వల్ల, ఆఫీస్ ప్రిన్సిపాల్, స్టాఫే జరపవలసిన కార్యక్రమం జరిపారు. లీల దుఃఖానికీ అంతే లేకపోయింది.
అందరినీ ఆశ్చర్య పరుస్తూ, స్కూల్ లీగల్ అడ్వైజర్ వచ్చీ, రాంప్రసాద్ విల్లు రాసేడనీ, చదివీ వినిపించాడు. తన ఆస్తి మొత్తం తన కొడుకు, శ్యాంకీ చెందుతుందనీ. పిల్లవాడు మేజర్ అయ్యేదాకా, ఇందిరే గార్డియన్ గా ఉంటుందని, బ్యాంక్ లో ఉన్న కాష్ వగైరాలు ఆమె పేరు మీద ట్రన్స్ఫర్ చెయ్యాలనీ, దాన్నీ వాళ్ళిద్దరి పోషణకి, పిల్లవాడి చదువుకి వాడాలనీ, అన్ని వివరంగా రాసేడు. అతడి ముందు చూపుకి అందరు ప్రశంసించారు.
ఇందిర ఒక నెల్లాళ్ళు పిల్లాడితో ఇంట్లోనే ఉండిపోయింది. లీల కుడా ఇందు వెనకాలే ఉండి ఆమెకు ధైర్యం చెబుతూ ఉండేది. ఇందు స్కూల్ కి వచ్చిన రోజు అందరూ ఆశ్చర్య పోయారు. ఆమె స్కూల్ రికార్డ్స్ లో తన పేరు శ్రీమతి ఇందిర రాంప్రసాద్ గా మార్చేసుకుంది . తెల్ల చీర కట్టుకు రావడం మొదలు పెట్టింది. శ్యాం ఆలనాపాలనా, వాడి చదువూ, స్కూల్ లో తన పని చేసుకోవడం తప్ప ఎవ్వరితోటి కబుర్లు చెప్పడంగాని, తిరగడం గానీ చేసేది కాదు. శ్యాం కుడా చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. తల్లి అంటే వల్ల మాలిన ప్రేమ. ఆమె మాటని జవ దాటేవాడు కాడు. ఇంటర్ మెరిట్ లో పాసయ్యేడు. ఐఐ టీ అడ్మిషన్ రావడమైతే వచ్చిందీ గానీ , చేర్చడానికి చేతిలో సరిపోయే పైకం లేక పోయింది. ఇందిర తన పేర ఉన్న ఇంటిని అమ్మేసి, కొడుకు ని ముంబై పంపేసింది. అతడికి కోర్స్ పూర్తీ అయ్యేనాటికి, కాంపస్ సెలెక్షన్ లో, ఓ ఎమేన్సి లో మంచి జీతంతో ఉద్యోగం దొరికింది. వెంఠనే అతడు ఉద్యోగంలో చేరడానికి బయలు దేరుతూ, తల్లినీ ఉద్యోగం మానేసి అక్కడ తన తోనే వచ్చెయ్యాలనీ, తానూ ఇల్లు వగైరాలు కుదుర్చుకున్నాక వచ్చీ ఆమెని తీసుకు వెడతా ననీ చెబుతాడు. అన్నట్లే వచ్చీ తీసుకెళ్ళేడు.
అక్కడకి వెళ్ళిన ఆరు నెలలకీ శ్యాం పెళ్ళి, అతడి క్లాస్ మేట్ శీలా తో జరగడం, వారికీ బాబు శ్రీరామ్ పుట్టడం దాకా ఇందు దగ్గరనించి సమాచారాలు వస్తుండేవి. దగ్గర దగ్గర రెండు సంవత్సరాలై వారి సమాచారము ఏమీ తెలియలేదు. అంతలోకి ఆమే ఇక్కడ వార్డెన్ గా చేరడం సాయంత్రం స్కూల్ అవగానే, ఇంటికీ ఆలస్యం గా వస్తాననీ ఫోన్ చేసి, ఇందు క్వార్టర్ కేసి బయలు దేరింది లీల.
"రారా లీలా. ఎలా ఉన్నవే? మీ ఆయనా, పిల్లలు బాగున్నారా? అమ్మాయి అల్లుడూ యూఎస్ లోనేనా." అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూంటే, లీల, ఆమెకేసి కోపంగా చూస్తూ
"అయిందా నీ ప్రశ్నల దండకం. నేను నిన్ను అడగాలి, నువ్వు కాదు." కోపంగా చూస్తూ అంది. "సరే రా నీకిష్టం అనీ కాలిఫ్లవర్ పకోడీలు వేసెను. ఫిల్టర్ కాఫీ వేసేను. రా తొందరగా తిందాము." అని వేడి వేడి పకొడీల పళ్ళెం అందివ్వగానే, లీల కంట్లో నీళ్ళు తిరిగాయి.
"ఏమిటే పిచ్చీ! ఆ కన్నీళ్ళేమిటీ?" అని ఇందు, తన కొంగుతో తుడుస్తుంటే, ఆమెను అల్లుకు పోయింది లీల.
"మనది ముప్పై ఏళ్ళ బంధమే, నన్ను ఎలా మర్చి పోయావే ఇందూ? నీ సుఖాల్లో పాలుపంచు కున్నట్లు, నీ కష్టల్లో నేను గుర్తు రాలేదా? నీ కెంత కష్టం వస్తే నువ్వు ఇక్కడకి వచ్చేసావో నేను ఊహించ లేననుక్కున్నావా?" అని బోరుమంది.
టిఫిన్ , కాఫీలు అయ్యాక ఇందు ఆమె పక్కన వచ్చీ కూర్చుంది. చటుక్కున లీల బుజంపై తల ఆన్చి వెక్కివెక్కి ఏడ్వసాగింది. లీల ఆమెనీ పొదవి పట్టుకుని ఆమె తలపైన రాస్తూ కూర్చుండి పోయింది. కొంచెం తేరుకున్నాక, ఇందు కళ్ళు తుడుచుకుంటూ " ఏమిటో బాధగా అనిపించిందే, ఆపుకో లేక పోయాను. నిన్ను కంగారు పెట్టేనా? ఎప్పుడూ జీవితంలో ఏ వడిదుడుకు వచ్చినా ధైర్యగానే ఎదుర్కున్నాను. చిన్నతనంలోనే నాన్న పోయినా, అధైర్య పడకుండా, అమ్మనీ చూసు కుంటు చదువు పూర్తీ చేసాను. ఉద్యోగంలో చేరగానే అమ్మ కూడా వెళ్ళిపోయింది. నాకొక అవ కరం ఉందనీ నేను చిన్నప్పటినుండి, బాధ పడకుండా, దానీతోనే జీవించడం నేర్చు కున్నాను. రాంప్రసాద్ ని ఒక స్నేహితుడిగానే చూసాను. చంటి పిల్లాణ్ణి చూస్తే నాలోని మమత ఉప్పొంగేది. అందుకే వెళ్లి వాడి ఆలనా పాలనా ఇష్టపూర్తిగా చేసేదాన్ని. లోకుల గురించీ, సంఘపు కట్టుబాట్ల గురించీ నేనెప్పుడూ ఆలోచించ లేదు. రంప్రసాద్గారు నన్ను పెళ్ళి చేసుకుంటానంటే, మనస్పూర్తి గానే ఒప్పుకున్నాను. నాకు తెలియకుండానే ఆయననీ నేను ప్రేమించాను అనీ, ఆయన పోయిన తర్వాతే తెలుసుకున్నాను. ఆయన మరణం నాకొక పెద్ద షాక్. చాలా రోజులు ఏం చెయ్యాలో తెలి యనీ అయోమయ పరిస్థితిలో ఉండిపోయాను. ఆయన విల్లు నా పేర రాసి ఆయన ఔన్నత్యాన్నీ చాటుకున్నారు. పిల్లాడి బాధ్యతని నా మీద భరోసాతో పెట్టేరనే విషయం నన్ను మేల్కొలిపింది. ఆ రోజునించి ఆయనే నా భర్త, శ్యాం నా కొడుకు అనీ మనస్పూర్తిగా నమ్మీ నా జీవితాన్నీ కొత్త భాద్యతలతో జీవించాను. అన్నీ మనం అనుక్కున్నట్లు జరిగితే ఎంత బాగుండును!
సరే శ్యాం చదువు పూర్తవ్వడం, ఉద్యోగం రావడం ఈ ఊరు వదిలి ఉద్యోగాని కెళ్ళడం, వాడి పెళ్లి , ఈ వివరాలన్నీ నీకు తెలుసుగదా. శ్రీరామ్ పుట్టేక వాడి ఆలనా పాలనా, వాడి ఆటపాటలతో చాలా సంతోషంగా ఒక ఏడాది గడిచి పోయింది. కోడలు కూడా చాలా కలివిడిగా ఉండేది. తానూ ఉద్యోగాస్తురాలవడం వల్ల, పూర్తి ఇంటి భాద్యత, పిల్లవాడి పెంపకమూ నా మీదే పడింది. ఇంతలోకీ కోడలి తల్లి తండ్రులు అక్కడే సెటిల్ అవుదామనీ వచ్చీ రెండు నెలలు మా ఇంట్లో ఉంన్నారు. పక్కనే ఫ్లాట్ కొనుక్కొని వెళ్లారు. వాళ్ళొచ్చినప్పటినుంచి, కోడలి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. పిల్లవాణ్ణి తన తల్లి దగ్గర వదిలీ ఆఫీస్ కి వెళ్ళేది. పిల్లాడు ఆవిడ దగ్గర్నించి నా దగ్గరకి వచ్చేసేవాడు. సాయంత్రం రాగానే విసుక్కుంటూ వాణ్ని తీసుకుని వాళ్ళమ్మ దగ్గరకి వెళ్ళిపోయేది.
మెల్లిగా మా ఇద్దరి మధ్య దూరం పెరగ సాగింది. శ్యాంతో కుడా రోజూ ఎదో గొడవ పెట్టుకునేది. పదిహేను రోజ్జుల ముందు ........ నేను బయటకి వెళ్ళి ఇంట్లోకి రాగానే, వాళ్ళ గదిలోంచి గట్టిగట్టిగా మాటలు వినిపిస్తే, ఆగిపొయాను. ఏం చెప్పను లీలా.... నా మీద నాకే అసహ్యం వేసింది......
" విను శ్యాం! ఈ ఇంట్లో ఆ గూనిది ఉండడానికీ వీల్లెదు. దాన్ని ఇంట్లోంచి తగలేస్తావా లేదా. అమ్మ అమ్మ అని పాడుతూ ఉంటావు, అది నిన్ను కన్నా తల్లా లేక సవిత్తల్లా? మీ నాన్న ఉంచుకున్న దాన్ని తీసికెళ్ళి అమ్మ అని అందలం ఎక్కిస్తావేమిటీ? "
"నోర్ముయ్యి".
"నన్ను కొట్టినంత మాత్రానా నిజాలు మారిపోతాయా? మా అమ్మ చెప్పింది, పెళ్లి అవకుండానే, మీ నాన్న చనిపోయాడట. మరి ఈవిడ నీకు తల్లీ ఎలా అయిందీ? ఆఖర్లేని లంపటం ఎందుకూ?" " శీలా! నోరు మూస్తావా? చదువు కున్న దానివీ, నోటికి ఎంతోస్తే అంత వాగేయ్యడమేనా? ఆమె నన్ను కన్నాకనక పోయినా ఆవిడ నా తల్లి. నీకు ఇష్టముంటే ఉండు లేకపోతే పో." అని బైటకి వెళ్ళిపోయాడు.
ఇంకా నాకా ఇంట్లో ఉండ బుద్ధి కాలేదు. మర్నాటి పొద్దున్నే మన ప్రిన్సిపాల్ శివా గార్కి ఫోన్ చేసాను, నన్ను మన స్కూల్ లో చేర్చు కో మనీ రిక్వెస్ట్ చేసాను. టిచర్ పోస్ట్ లేదనీ, వార్డెన్ పోస్ట్ ఖాళీగా ఉందన్నారు, దానికీ క్వార్టర్ కూడా వస్తుందన్నారు. నేను వచ్చీ చేరుతున్నానని చెప్పి, బయలు దేరి వచ్చేసాను. నేను ఇక్కడకి వస్తున్నసంగతి చెప్పకుండా, నా కోసం వెతకొద్దని, కొన్నాళ్ళు తీర్థ యాత్రలు చేసోస్తానని ఉత్తరం పెట్టి వచ్చేసాను. ఇదీ సంగతి. లీలా! ఆ రోజు పెళ్ళవకుండానే, నేను పిల్లాడి కోసం ఉండిపోయిన్నాడు, నన్నెవ్వరూ తప్పు పట్టలేదు. కానీ పాతికేళ్ళ తర్వాత, ఈ వయసులో నేను ..........." అని బోరుమంది ఇందిర. ఎలా ఓదార్చాలో తెలియక లీల ఆమె చెయ్యి పట్టుకుని కూర్చుండి పోయింది.
ఇందు పనిలో పడి, ఇక్కడ అలవాటు పడ సాగింది. కొడుకుని, మనవడినీ తలుచుకొని బాధ పడుతూనే ఉండేది. లీల ఆమెనీ నీడలా వెన్నంటే ఉండేది.
ఒక రోజు తెల్లవారుజాము నాలుగ్గంటలకీ వాచ్మేన్ తలుపు తట్టి ఇందునీ లేపేడు. కంగారు పడుతూ లేచీ " ఏమైంది యాదయ్య!? ఎందుకు లేపేసావు?"
" ఏమీ లేదమ్మా, నీ కోసం ఎవరో బాబు వచ్చేడు. రండీ బాబూ" అనీ అతడి సామాను తేవడానికి వెళ్ళేడు .
ఎదురుగా శ్యాం! పరిగెట్టుకుని వచ్చి తల్లీ కాళ్ళని చుట్టేసుకుని " అమ్మా! నన్ను వదలి ఎలా వచ్చేసావమ్మా? నువ్వు లేక, ఎక్కడున్నావో తెలియక, ఎంత కంగారు పడ్డానో" అని వెక్కి వెక్కి చంటి పిల్లాడిలా ఏడవ సాగాడు. కోడలు వెనకే బాబునీ తీసుకుని " అత్తయ్యా! నన్ను క్షమించండి అత్తయ్యా. మీరు కనబడక వీడు బెంగ పెట్టేసు కున్నాడు. నా మూర్ఖత్వం వల్ల ఇన్ని అనర్ధాలు జరిగాయి." అని బాబుని అందించింది. మనవణ్ణి దగ్గర తీసుకుని ఇందు, ఆర్తిగా గుండెల్లో పోడువుకుంది.
" అమ్మా! ఎందుకు అంత తొందర పడ్దావమ్మా? నీ శ్యాం మీద నీకు న్నమ్మకమే పోయిందా?" అనీ శ్యాం ఏడుస్తూ ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అతన్ని కుడా పొదువుకునీ లోపలకు తీసికెళ్ళింది. మెల్లిగా వారి నుంచీ రాబట్టిన విషయం ఏమిటంటే..... ఇందు ఇంటినుండి వెళ్ళిపోయాక, శ్యాం తల్లి కోసం వెతకని చోటు లేదు. మామగారు వచ్చీ" ఆమె యాత్రలకి వేదతానంది కదా, ఓ వారం పది రోజులు చూద్దాం" అన్నాక, కొంచెం గుండె దిటవు చేసుకున్నాడు. అమ్మమ్మ దగ్గర చేరిక లేకపోవడం వల్ల, పిల్లవాడు నాన్నమ్మ మీద బెంగ ప్పెట్టుకుని జ్వరం తెచ్చేసుకున్నాడు. తిండి నిద్రా లేకుండా, పిల్లవాడు, ఢీలా పడిపోయాడు. అత్తగారికి చంటి పిల్లాణ్ణి సముదాయించడం చాతకాక విసుక్కోవడం ఎక్కువైంది. కోడల్కి కూడా అత్తగారి మంచితనం, ఆవిడ కార్యదక్షత తెలిసొచ్చింది. తన తల్లీ చెప్పుడు మాటలు వినీ, తాను ఎంత పొరపాటుగా వ్యవహరించిందో తెలిసోచ్చింది.
తల్లీ పక్షం రోజులైన తిరిగి రాలేదనేప్పటికీ తెలిసిన వాళ్లందరికీ ఫోన్లు చేయసాగాడు. తన స్కూల్ ప్రిన్సిపాల్ కి కుడా ఫోన్ చేసినప్పుడు, తల్లి జాడ తెలిసింది.
" అమ్మ!మనది ఒక ఆత్మీయ అనుబంధం ఇది విడదీయలేనిది. నువ్వు మాతో వచ్చెయ్యాలి. చిన్నవాళ్ళం తప్పు చేస్తే, మమ్మల్ని దండించి సరైన తోవలో పెట్టు, కానీ ఇంత పెద్ద శిక్ష వద్దమ్మా. నాన్నను నేను చూడనే లేదు, నువ్వూ మమ్మల్నీ దూరం చేస్తే, మేమేమై పోవాలమ్మా." శీలా కుడా అత్తగారి కాళ్ళు పట్టుకుని "వచ్చేయ్యండీ అత్తయ్యా! నాకు పుత్ర భిక్ష పెట్టండి." ఏడవ సాగింది.
చూడండీ నేను ఇప్పుడే ఇక్కడ డ్యూటీ లో చేరేను, ఇలా అర్దాంతరంగా వదిలీ వచ్చెయ్య లేను. మీరు బాబుని నా దగ్గర కొన్నాళ్ళు వదిలీ వెళ్ళండి. కోలుకున్నాక ఏం చెయ్యాలో ఆలోచిద్దాం". శ్యాం దంపతులు కళ్ళు తుడుచుకుంటూ సంతోషంగా తలలు ఊపారు. శ్యాం కి తెలుసు అమ్మ ఇంక ఆక్కడకి రాదనీ. తానే ఇక్కడకి రావడాన్కి ప్రయత్నించాలనీ. ఎంత అమ్మైనా, ఆడదే కదా! తన ఆత్మాభిమానాన్ని వదులుకో గలదా!!