సాయంత్రం అవుతోంది.
ఆఫీస్ అవగానే నేరుగా ఇంటికొచ్చేసే అలవాటు నాకు.
ఇంటికి వెళ్ళగానే చిరునవ్వుతో ఎదురొచ్చే ఇల్లాలు నా భార్య గాయత్రి. పదేళ్ళ పుత్రరత్నం బాబి గాడు. నాకు వారి తోడిదే ప్రపంచం. స్నేహితులతో బయటకు వెళ్ళడం తక్కువనే చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురం కలిసి వెళుతూ ఉంటాము.
ఆ రోజు కూడా ఇంటికి వెళ్ళగానే గాయత్రి నా చేతిలో లంచ్ బాక్స్, బాగు అందుకుని లోపల పెట్టి మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. నేను డ్రెస్ మార్చుకుని, ముఖం కడిగి ఫ్రెష్ అయి వచ్చేలోగా వేడి వేడి గా వేసుకొచ్చిన పకోడీల ప్లేట్ తో రెడీ గా ఉంది ఆమె. నేను పకోడీలు పూర్తి చేసేలోగా పొగలు కక్కే కాఫీ సిద్ధం. తనూ ఓ కప్పు కాఫీ తెచ్చుకుంది. ఇద్దరం మాట్లాడుకుంటూ అవి పూర్తి చేసాం. మా ఇంట్లో దాదాపు రోజూ సాయంత్రం ఇలా గడిచిపోతూ ఉంటుంది. కార్యేషు దాసీ...కరణేషు మంత్రి...పద్యానికి నిలువెత్తు రూపం గాయత్రి. ఇల్లు ఇలా స్వర్గంలా ఉంటె ఇక బయట స్నేహితులు...షికార్లు ఏముంటాయి నాకు.
బాబి హాల్లోనే కూర్చుని హోం వర్క్ చేసుకుంటున్నాడు. హోం వర్క్ పూర్తయ్యే దాకా వాడికి టీవీ , ఆటలు నిషేధం మరి. అది గాయత్రి చేసిన ఏర్పాటు. విలువలతో కూడిన పెంపకం ఆమెది. ఇంట్లో నాకు తప్ప తనకు కూడా ఫోన్ లేదు. స్మార్ట్ ఫోన్ల వల్ల పిల్లలు ఎంతగా పాడవుతారో తెలియంది కాదు. ఆమెకున్న పుస్తకాలు చదివే అలవాటు బాబికి కూడా అలవాటు చేసింది. వాడు కూడా ఎప్పుడో కాని నా ఫోన్ జోలికి రాడు.
”మన ఊరిలో రేపటి నుండి ఆర్ట్ ఎగ్జి బిషన్ అట. మనం ఆదివారం చూడటానికి వెళదామా” గాయత్రి అంది.
“ఈ ఆదివారం నాకు వీలవదు. నెక్స్ట్ వీక్ లో ఇన్స్పెక్షన్ ఉంది. కొన్ని రికార్డ్స్ అప్ డేట్ చేయడానికి ఆదివారం కూడా ఆఫీస్ కు వెళ్ళాలి.” అన్నాను.
“ అయ్యో! ఆ తర్వాత ఉండదే. మరెలా?”
“మరేం పర్లేదు. ఎలాగూ నేను ఆఫీస్ కు వెళ్ళిపోతాను. ఆదివారం బాబి కి కూడా బోర్ కొట్టకుండా నువ్వు, బాబి వెళ్లి రండి.”
“మీరు లేకుండానా? అందరం వెళితే బాగుండు కదా !”
“వీలు కానపుడు ఏం చేద్దాం. ఈ సారికి మీరిద్దరూ వెళ్ళండి.” అంటూ ఉదయం చదవగా మిగిలిన న్యూస్ పేపర్ అందుకున్నాను.

గాయత్రి వంట గదిలోకి వెళ్ళిపోయింది.
************
ఆదివారం గాయత్రి, బాబి ఎగ్జి బిషన్ కు వెళ్లారు. ప్రముఖ చిత్రకారుల చిత్రాలతో పాటు ఔత్సాహిక చిత్రకారులు వేసిన బొమ్మలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క చిత్రమే చూసుకుంటూ బాబి కి వాటి గురించి తనకు తెలిసింత వరకు వివరాలు చెప్తూ ముందుకు వెళుతోంది గాయత్రి. ఒక చిత్రం దగ్గర ఆగిపోయింది ఆమె. అది ఒక అమ్మాయి నది ఒడ్డున కూర్చుని మనసైన వాడి కోసం ఎదురుచూస్తున్న భంగిమలో ఉంది. అందమైన ఆమె ముఖం లో విరహం, ప్రియుడు రాలేదనే నిరుత్సాహం రెండిటిని అద్భుతంగా చిత్రించాడు చిత్రకారుడు. కింద అభిసారిక అని ఉంది. ఓహో...చిత్రకారిణి అన్నమాట. ఆ చిత్రం ఆమె మనసుకు హత్తుకుంది. గాయత్రి వెంటనే రిసెప్షన్ కు వెళ్లి ఆ చిత్రం అక్కడ పెట్టిన ఆర్టిస్ట్ గురించి వివరాలు అడిగింది.
వారు అక్కడే తిరుగుతున్న మరో స్త్రీ ని చూపించి ఆమెదే అని చెప్పారు. గాయత్రి ఆమె దగ్గరికి వెళ్లి తనను తను పరిచయం చేసుకుంది. ఆమెకు ఇంచుమించు తన వయసే ఉండవచ్చు. పచ్చని మేని ఛాయతో, వయసు తెచ్చిన హుందాతనంతో అందంగా ఉందామె. గాయత్రి ఆమె చిత్రం తనకు చాలా నచ్చిందని మెచ్చుకుంది. ఆమె తన పేరు అభిసారిక అని, తను మరో ఊరి నుండి తన చిత్రాలను ఎగ్జి బిషన్ లో ప్రదర్శించడానికి వచ్చానని తెలిపింది. కాసేపు మాట్లాడుకునే సరికి ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. గాయత్రి అభిమానానికి అభిసారిక ముచ్చట పడింది.
“మా వారికి కూడా చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. ఈ రోజు వీలు కాక రాలేదు. మీ వంటి వారితో పరిచయం నా అదృష్టం. మీరు తప్పక మా ఇంటికి రావాలి.” ఆహ్వానించింది గాయత్రి.
“అయ్యో! ఇప్పుడెందుకు లెండి. మరో సారి వస్తాను” మొహమాట పడింది అభిసారిక. మొదటి పరిచయం లోనే గాయత్రి అలా ఆహ్వానించడం ఆమెకు ఆశ్చర్యం అనిపించింది.
“మరేం పర్లేదు. మా వారు కూడా ఒకప్పుడు చిత్రకారులే. ప్రస్తుతం ఆఫీస్ పనితో తీరక మానేశారు. మీలాంటి వారితో పరిచయం వారికి కూడా ఇష్టమే. రేపు సాయంత్రం మీరు తప్పకుండా రావాలి. నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇదిగోండి మా ఇంటి అడ్రస్.” చిన్న కాగితంలో అడ్రస్ రాసి ఇచ్చింది గాయత్రి.
“ మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు.” కాగితం అందుకుంటూ అంది ఆమె.
“అదేం లేదులెండి. సరే మరి నేను ఉంటాను. మీరు రావడం మర్చిపోకండి.” బాబి ని తీసుకుని బయలుదేరింది గాయత్రి.
మరుసటి రోజు సాయంత్రం అభిసారిక తయారయి గాయత్రి వాళ్ళ ఇంటికి బయలుదేరింది. కాస్త పరిచయానికే వాళ్ళ ఇంటికి వరకు వెళ్ళడం ఎందుకని మొదట వద్దనుకుంది కానీ అభిమానులే కళాకారుల బలహీనత. ఆమె అంత అభిమానంగా పిలిస్తే వెళ్ళకపోతే బాగోదని తనకు తనే సర్ది చెప్పుకుంది.
టాక్సీ మాట్లాడుకుని గాయత్రి ఇచ్చిన అడ్రస్ కు చేరింది. తలుపు తట్టగానే ఎదురుగా కనిపించిన మనిషిని చూసి ఆమె షాక్ తింది.
**********************
సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన నాకు ఎదురింటావిడ తాళాలు తెచ్చి ఇచ్చింది. గాయత్రి వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగాలేదని వెళ్ళింది. మీరు రాగానే ఇమ్మంది అంది.
ఆ! అక్కడికెళ్ళి నాకు ఫోన్ చేసింది లెండి అంటూ తాళాలు అందుకున్నాను. డ్రెస్ మార్చుకుని ఫ్రెష్ అయి వచ్చి రిలాక్స్ గా కూర్చున్నాను.

అంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీయగానే కనిపించిన మనిషిని చూసి నేను కూడా అవాక్కయ్యాను. అభిసారిక.....నేను చేపట్టలేకపోయిన నా ప్రేమ దేవత....ఇన్నేళ్ళ తర్వాత ఇలా నా ఎదుట ప్రత్యక్షం అవుతుందనుకోలేదు. ముందుగా నేనే తేరుకున్నా..
“బాగున్నావా అభీ! లోపలికి రా ....” ఆహ్వానించాను.
“ఇక్కడ గాయత్రి అనీ...” తడబాటుగా అడిగింది ఆమె.
“మా ఆవిడే.. ముందు లోపలికి రా...” లోనికి దారి తీసాను.
ఇక తప్పదన్నట్టు లోపలికి వచ్చి హాల్లోని సోఫాలో కూర్చుంది. ఊహించని ఈ పరిణామం ఆమె ఇంకా జీర్ణించుకున్నట్టు లేదు. నేను లోపలికి వెళ్లి మంచినీళ్ళ బాటిల్ తెచ్చి ఇచ్చాను.మంచినీళ్ళు తాగి ఆమె కొంత కుదుటపడ్డాక అడిగింది.”గాయత్రి లేదా...” అని.
“మధ్యాహ్నం వాళ్ళ అమ్మగారికి బాగోలేదని ఫోన్ వస్తే వెళ్లి వస్తానని నాకు ఆఫీసుకు ఫోన్ చేసి చెప్పి వెళ్ళింది. అవునూ...నీకు గాయత్రి ఎలా పరిచయం?”
“నిన్న ఎగ్జి బిషన్ లో కలిసింది. ఈ రోజు నన్ను తప్పక రమ్మని పిలిస్తే తను ఏమైనా అనుకుంటుందని వచ్చాను. కాని ఇది మీ ఇల్లని ఇక్కడికి వచ్చే దాక తెలియలేదు. నన్ను రమ్మని ఇలా తను లేకుండా పోయిందేమిటి?”
“తల్లికి వంట్లో బాగోలేదంటే ఆ హడావిడిలో మర్చిపోయి వుంటుంది. వాళ్ళు కూడా ఈ ఊర్లోనే వేరే ఏరియా లో ఉంటారు. వచ్చేస్తుంది లే”
“నువ్వెలా ఉన్నావు అభీ?” చాలా సేపటి తర్వాత ఆమె నా క్షేమం అడిగింది.
“బాగున్నాను. మరి నీ సంగతి ఏమిటి?” బాగున్నాను అన్నట్టు తల ఊపింది. గాయత్రి నాకోసం ఫ్లాస్క్ లో పోసి ఉంచిన కాఫీ రెండు కప్పుల్లో వేసి ఆమెకు ఒకటి ఇచ్చి నేనొకటి తీసుకున్నాను. ఇద్దరం మౌనంగా కాఫీ తాగుతూ ఆలోచనల్లోకి జారిపోయాం దాదాపు పదిహేనేళ్ళ వెనక్కి.
*******
నా పేరు అభిజ్ఞాన్. మా అమ్మకు అభిజ్ఞాన శాకుంతలం గ్రంధం అంటే చాలా ఇష్టం. అందుకే నేను పుట్టగానే నాకు ఆ పేరే పెట్టింది. ఆ రోజుల్లో నా పేరు కాస్త కొత్తగానే ఉండేది. కాలేజిలో ఆ రోజు చిత్రలేఖన పోటీలు జరుగు తున్నాయి. పోటీలో నేను కూడా ఉన్నాను. ప్రతిసారి లానే నా స్నేహితులంతా ఈ సారి కూడా ప్రథమ బహుమతి నీదేరా అని నన్ను మోసేస్తున్నారు. ఫలితాలు ప్రకటించారు. మొదటి బహుమతి మిస్ అభిసారిక. ద్వితీయ బహుమతి మిస్టర్ అభిజ్ఞాన్. ఫలితాలు విని ఎవరీ అభిసారిక అంటూ చూసాను. చిలుక పచ్చ రంగు చుడీదార్ లో అచ్చం రామచిలుక లానే అందంగా ఉన్న అమ్మాయి వేదిక మీదకి వచ్చి బహుమతి అందుకుంది. పేరుకు తగ్గ అమ్మాయే అనుకున్నాను. తరువాతి బహుమతి నాదే అవటం తో వేదిక మీదికి వెళుతుండగా తను దిగుతూ నా వైపు చూసింది. నేను ప్రశంసా పూర్వకంగా చూసాను. తను విడీ విడివడని పెదవులతో చిరునవ్వు నవ్వింది.
తర్వాత తెలిసింది ఆమె కూడా అదే కాలేజీ లో నా జూనియర్ అని. బహుమతి పొందిన ఆమె చిత్రాన్ని చూసాను. గ్రామీణ నేపథ్యం లో ఉన్న ఓ మహిళ చిత్రం అది. నిజంగానే చాలా బాగా వేసింది. ఆమె కనిపించగానే నిజాయితీగా ఆమెను అభినందించాను.
“మీరు కూడా చాలా బాగా వేసారు” మెచ్చుకుంది. మెల్లగా పరిచయం పెరిగింది. ఒకే రంగానికి చెందిన కళాకారులం కావడం తో త్వరగానే ప్రేమలో పడిపోయాం. తర్వాత పెద్దల చాదస్తానికి, కుల మౌడ్యానికి బలి అయిన ప్రేమ జంటల్లో మేమూ చేరక తప్పలేదు. పెద్దలను ఒప్పించలేక......నొప్పించలేక ఇద్దరూ విడిపోయాం. ముందుగా ఆమెకు పెళ్లి అయి వేరే ఊరికి వెళ్ళిపోయింది. తర్వాత నా జీవితంలోకి గాయత్రి రావడం....జీవితంతో నేను రాజీ పడిపోవడం జరిగిపోయాయి. ఇన్నేళ్ళు గడిచాక ఇలా తామిద్దరూ గాయత్రి మూలాన కలుసుకోవడం యాదృచ్చికం.
******
కాఫీ తాగిన తర్వాత కాసేపు ఆమె గురించి, తన కుటుంబం గురించి అలాగే నా గురించి మాట్లాడుకున్నాము. తనకి ఒక పాప అని, ఆమె భర్త బిజినెస్ చేస్తుంటారని, తనని బాగా చూసుకుంటారని చెప్పింది. ఆయన ప్రోత్సాహం వల్లనే తను ఇంకా చిత్రలేఖనం కొనసాగించ గలుగుతు న్నానని అంది. అది విని చాలా సంతోషించాను. గాయత్రి కూడా నాకు అనుకూలవతి అయిన భార్య అని చెప్పాను.
“అవును. నిన్న ఎగ్జిబిషన్ లో కలిసాను కదా..తను చాలా స్నేహశీలి.” అంది ఆమె. గాయత్రి వస్తున్న జాడ లేదు. అత్తవారింటికి ఫోన్ చేసాను.

తను రావడానికి ఇంకొంచెం ఆలస్యం అవుతుందని, ఫోన్ లోనే అభిసారిక కు సారీ చెప్పింది. మరోసారి వచ్చినపుడు మరల తప్పక రమ్మని, తల్లికి ఆరోగ్యం బాగోలేక ఇంట్లో ఉండలేకపోయానని, మరోలా అనుకోకండి అని క్షమించమని కోరింది. ఇక అభిసారిక వెళ్లి వస్తానని బయలుదేరింది.
“పోనిలే అభీ! ఇలాగైనా మనం కలిసాం. ఇన్నాళ్లుగా మనకు ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశం రాలేదు. నువ్వు క్షేమంగా, సంతోషంగా ఉన్నావని తెలిసాక మనసుకు కొంచెం తృప్తిగా ఉంది.” అన్నాను.
“నాక్కూడా అలాగే ఉంది అభీ! సరే మరి వెళ్లొస్తాను.” ఆమె లేచింది. గుమ్మం వరకు వెళ్లి ఆమెను సాగనంపాను. లోపలికి వచ్చేసాక కూడా కాసేపు ఆమె ఆలోచనల్లోంచి బయట పడలేక పోయాను. రాత్రవుతుండగా గాయత్రి, బాబి తిరిగొచ్చారు. ఇప్పటికే ఆలస్యం అయిపోయిం దంటూ రాగానే వంటపని మొదలుపెట్టింది. అందరం భోంచేసిన తర్వాత నేను బాబి గాడు పడక గదిలోకి చేరాం. గాయత్రి వంటగది సర్ది వచ్చేసరికి వాడు స్కూల్ లో విశేషాలు చెబుతూ చెబుతూ అలాగే నిద్రపోయాడు.
“ఆమెను మన ఇంటికి రమ్మని చెప్పి నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా గాయత్రి?” అడిగాను ఆమెను. “ వెళ్ళక తప్పని పరిస్థితి. అందుకే ఫోన్లో ఆమెతో మాట్లాడాను కదా. ఆవిడ ఏమైనా అన్నారా?” అడిగింది ఆమె.
“అదేమీ లేదు కానీ నీకో విషయం చెప్పాలి” మెల్లగా అన్నాను.
“ చెప్పండి వింటాను” అందామె.
“మన పెళ్ళైన కొత్తలో కాలేజీ రోజుల నాటి నా స్నేహితురాలి గురించి చెప్పాను కదా. తను మరెవరో కాదు అభిసారికే.” ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అనుకుంటూ ఆమె ముఖం లోకి చూస్తూ చెప్పాను. కాసేపు మౌనంగా ఉండిపోయింది.
“అలాగా. అయితే మరి బాగా మాట్లాడుకున్నారా? మరింకేం... నేను లేకపోవడమే మంచిది అయింది కదూ.” అదోలా ముఖం పెట్టి అంది.
“ అయ్యో గాయత్రీ! నువ్వు ఏదేదో ఊహించకు. మా మధ్య అలాంటివేం లేవు.” ఆదుర్దాగా అన్నాను.
“ఏమో! ఏం జరిగిందో చూడటానికి నేనున్నానా “ అటువైపు తిరిగి బాబి బట్టలు, పుస్తకాలు సర్దసాగింది.
ఇదెక్కడి గొడవరా దేవుడా! హాయిగా సాగిపోతున్న మా సంసారంలో తుఫాను రేగబోతుందా.. నేరకపోయి చెప్పినట్టున్నాను....నాకు లోలోపల గుబులు రేగింది.
కాసేపు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. ఆమె అటువైపు తిరిగి ఉండటంతో ఆమె ముఖంలో భావాలు తెలియటం లేదు. గాయత్రి అవన్నీ సర్దేసి నా ఎదురుగ వచ్చి కూర్చుని నాముఖం లోకి చూసింది. నేను ఏ పాపం ఎరుగను అన్నట్టు దీనంగా మొహం పెట్టాను. నా ఏడుపు ముఖం చూసి ఆమె గలగలా నవ్వేసింది. అర్థం కానట్టు చూసాను.
“ఆమె మీ స్నేహితురాలని నాకు ముందే తెలుసు. నేను కావాలనే ఆ సమయానికి ఇంట్లో లేకుండా పోయాను.” అంది. నాకు ఏం జరుగుతోందో అసలు అర్థం కాలేదు. అభిసారిక గురించి తనకు పూర్తిగా చెప్పలేదు కనీసం ఆమె పేరు కూడా... మరి తననెలా గుర్తించింది. ఎందుకు తనని ఇంటికి రమ్మని చెప్పి తను లేకుండా పోయింది....అసలు ఇదంతా ఎందుకు చేసింది....అన్ని ప్రశ్నలే.... నా అయోమయం చూసి ఆమె చెప్పసాగింది.
“నెల క్రితం మీ కాలేజీ స్నేహితుడు ఒకాయన వచ్చారు కదా...మాటల మధ్యన అతడు ప్రేమించిన అమ్మాయి వేరోకతనితో పెళ్లి అయి, అతడు పెట్టే చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని మీతో చెప్పి బాధ పడ్డాడు. అప్పుడు మీరు మనం ఇష్టపడ్డ మనిషి ఎక్కడైనా సుఖంగా ఉందని తెలిస్తే ఒక సంతోషం. తెలీకుండా ఉండిపోయినా అదో రకం. కాని ఇలా జరిగిందని తెలిస్తే చాల బాధగా ఉంటుందిరా అని అతడిని ఓదార్చారు.
మీ సంభాషణ నేను విన్నాను. అతడు వెళ్ళాక ఒకటి రెండు రోజులు మీరు కూడా దేని గురించో ఆలోచిస్తూ ఉండిపోవడం నేను గమనించాను. బహుశా ఆమె గుర్తొచ్చిందేమో అనుకున్నాను. నేను ఆమె కోసం ప్రయత్నం ఏమీ చేయలేదు కానీ మొన్న ఎగ్జి బిషన్ లో ఆమె గీసిన చిత్రం చూడగానే మీ ఫైల్స్ లో చూసిన అలాంటి బొమ్మ గుర్తొచ్చింది. వెంటనే ఆమెతో పరిచయం చేసుకుని మాటలలో మరికొన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఆమే అని ధ్రుడపర్చుకున్నాను. ఆమె క్షేమంగా ఉందని తెలుసుకుంటే మీ మనసులో బాధ తీరుతుందని మన ఇంటికి ఆహ్వానించాను. ఆమె వచ్చినపుడు నేను ఉంటే మీరు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడతారని నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను.”

గాయత్రి చెబుతుంటే కాలేజీ రోజుల నాటి ఒక సంఘటన గుర్తొచ్చింది నాకు.
ఒకసారి అభిసారికను కలుసుకోవడానికి ఆ ఊర్లోనే ఉన్న నది ఒడ్డుకు రమ్మన్నాను. ఫోటోగ్రఫి నా హాబీ. బయటకు వెళ్ళినపుడు ఎపుడూ నా చేతిలో కెమెరా ఉంటుంది. చిత్రకారున్ని అవటంతో మంచి వ్యూ దొరికినపుడు ఫోటోల్లో బంధిస్తూ తర్వాత నచ్చినవి చిత్రాలుగా గీస్తూ ఉంటాను. ఆ రోజు నా కోసం ఎదురుచూస్తున్న ఆమె అందమైన ముఖారవిందాన్ని కూడా కెమెరా లో బంధించాను. ఫోటో వచ్చాక చూస్తే అద్భుతంగా వచ్చింది.
దాన్ని చూసి ఆమె ఈ ఫోటోను మనిద్దరం పెయింటింగ్ వేద్దాం. ఎవరిది బాగా వస్తుందో చూడాలి అంది .
సరేనని ఇద్దరం పోటీ పడి చిత్రాలు గీసాం. వారం తర్వాత ఇద్దరూ కలుసుకున్నపుడు ఒకరి పెయింటింగ్ ఒకరికి చూపుకున్నాం. ఆమెకంటే నేను వేసిన బొమ్మ చక్కగా వచ్చింది.
అదెలా? అడిగింది ఆమె.
‘నీ బొమ్మే కదా అని నువ్వు అంత ఆసక్తిగా వేసి ఉండవు’ అన్నాను.
“మరి నువ్వెలా వేశావ్?”
“అది నీ బొమ్మ కదా అందుకే శ్రద్ధ గా వేశాను. నీ పేరుకు తగ్గట్టుగా ఆ చిత్రం చాలా చక్కగా కుదిరింది.” అన్నాను. ఈ పెయింటింగ్ చాల బాగుంది. ఇది నా దగ్గర పెట్టుకుంటాను అని తీసుకుంది. అయితే నీవు గీసిన చిత్రం నీ గుర్తుగా నేను నా దగ్గర పెట్టుకుంటాను అని నేను ఆమెది తీసుకున్నాను. అది ఇప్పటికీ నా ఫైల్ లో భద్రంగా ఉంది. బహుశా గాయత్రి దాన్ని చూసి ఉంటుంది.
నాకు మబ్బులు విడిపోయాయి. ఇలాంటి భార్యలు కూడా ఉంటారా? ఆమె నాకు ఇప్పుడు మరింత అపురూపంగా తోచింది. “నీకు నా మీద కాస్త కూడా అనుమానం లేదా? ఒకవేళ తనని చూసి నా మనసు చలించి ఉంటే?.....”అడిగాను. “మీ మనసు నా దగ్గర ఉంటే అది మరొకరిని చూసి ఎలా చలిస్తుంది? అయినా మీరు నన్ను విడిచి వెళ్ళగలరా....వెళ్ళగలిగితే నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు..”నవ్వును దాచుకుంటూ అంది ఆమె. నిజమే. గాయత్రి లేని జీవితం ఇప్పుడు నేను ఊహించలేను. “ఏమిటి నీ ధైర్యం? ఆ నమ్మకం నీ మీదా ....నా మీదా..” ఆమె కళ్ళ లోకి చూస్తూ అడిగాను. “మనిద్దరికీ ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమ మీద...” నా మెడ చుట్టూ చేతులేసి మనోహరంగా నవ్వింది ఆమె. ఆమె వేసిన ప్రేమ సంకెళ్లకు నేను ఎప్పుడో బందీనయ్యాను.