ఆరోజు నా పదవీ విరమణ..
దాదాపు ముప్పది సంవత్సరాలు విద్యార్థులతో అనుబంధమున్న నేను ఇక ఒంటరి వాణ్ణి కాబోతున్నాను అనే భావన. విద్యార్థులే నాఆస్తిపాస్తులనుకున్న నేను సర్వస్వం కోల్పోతున్నానేమో..! అని ఒక ప్రక్క బాధ కలుగుతోంది. ఇలాంటి ఆస్తులు తరగి పోనివి,. మరొకరు దోచుకోలేనివని మనసు మరో ప్రక్క సర్ది చెబుతోంది. మధ్యాహ్నం మా కాలేజీ సిబ్బందికి, అతిథులకు ఇంకా విద్యార్థులందరికీ భోజనాలు ఏర్పాటు చేశాను. భోజనాల అనంతరం సరిగ్గా సభ ఆరంభానికి ముందు ఒక మినీ బస్సు వచ్చి కాలేజీ గేటు ముందు ఆగింది. ఆశ్చర్యంగా బస్సు వంక చూడసాగాం. బస్సు దిగి అంతా కలిసి గుంపుగా సభాప్రాంగణంలోకి వస్తున్నారు.. నన్ను చూస్తూనే అభివాదం చెయ్యసాగారు. నేను అన్యమనస్కుడనయ్యాను. అందులో ఒకతను నాపాదాలను తాకాలనే యత్నంలో నేను చటుక్కున అతణ్ణి లేవనెత్తి ఎగాదిగా చూశాను. అతని కళ్ళల్లో నీళ్ళు.. అవి గుర్తుపట్టాను. అమాంతం హత్తుకున్నాను. మా స్టాఫ్ అంతా అయోమయంగా మమ్మల్ని చూడసాగింది.

“సార్.. మీరు పదవీ విరమణ చెయ్యబోతున్నారని తెలుసుకొని మేమంతా వచ్చాం. మా పేర్లు మీకు గుర్తున్నాయో..! లేదో..! గాని మాకు మార్గదర్శకులు మీరు” అంటూ అందరినీ పరిచయం చెయ్యసాగాడు.
చివరగా నేను అతని పేరు చెప్పేను. అవునన్నట్లు తలూపుతన్న అతని కళ్ళల్లో నుండి ఆనందభాష్పాలు జల, జలా రాలసాగాయి. శిరస్సు వంచి రెండు చేతులా నమస్కరించాడు.
నేను లోగడ పనిచేసిన కాలేజీలలోని విద్యార్థులని మా ప్రిన్సిపాల్కు, కళాశాల సిబ్బందికి. ఇంకా అతిథులందరికీ పరిచయం చేశాను. వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. నేను ఊహించని పరిణామమది. నా పెన్నిధి సమస్తం నాముందు నిలిచినట్లుగా కించిత్ గర్వపడ్డాను.

అందరినీ ఆత్మీయంగా సభలో వేదికపైకి ఆహ్వానించాడు ప్రిన్సిపాల్.
సభ ఆరంభమయ్యింది. ఆ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు మొదలుకొని మా స్టాఫ్ సభ్యులు ఒక్కొక్కరూ తమ, తమ ఉపన్యాసాలలో నన్ను పొగడ్తలతో ముంచెత్తసాగారు.పద్మాకర్ వంతు వచ్చింది. అతను చెప్పబోయే అంశాలు నేనూహించుకోగలనన్నట్లు నా మనసు ఆనాటి సంఘటనలను నెమరు వేసుకోసాగింది.
***
ఆ రోజు నేను ఇంటర్మీడియట్ తెలుగు మీడియం ప్రధమ సంవత్సరం తరగతి విద్యార్థులకు గణితంలో ఒక సమస్య వివరిస్తున్నాను.

“ఎక్స్క్యూజ్ మీ.. సర్” అంటూ ఒకతను ఒక కాలు తరగతి గదిలో, మరొక కాలు వరండాలో పెట్టి అనుమతి కోసం నావంక చూస్తున్నాడు. అతణ్ణి చూడగానే క్లాసులో ఉన్న విద్యార్థినీ, విద్యార్థులంతా కిసుక్కున నవ్వారు. ఓమారు విద్యార్థుల వంక తీక్షణంగా చూశాను.
“ఎవరు కావాలి“ అంటూ అడిగాను వచ్చిన ఆసామిని. కిళ్ళీ నమిలి అప్పుడే ఊసేసినట్టుగా ఉంది అతని ఆడుతున్న నోరు. “ఎవరు ఎందుకు సార్. నాది ఇదే క్లాసు” అంటూ తన చేతిలోని ఒక నోట్ బుక్ చూపిస్తూ.. గాలిలో ఊపసాగాడు, ఆదృశ్యం చూసి పిల్లలు మళ్ళీ నవ్వకుండా ఉండాలని, వారిపై ఒక దృష్టి సారించి, తిరిగి అతని వంక తదేకంగా చూపు నిలిపాను. నాకు ఆశ్చర్యమేసింది. సాధారణంగా ఆవయసులో ఉన్న వారు అత్యవసరమై తమ పిల్లల కోసం వస్తుంటారు. అదే విషయాన్ని అతనితో అన్నాను.
“సారీ.. ఎవరో పేరెంట్ అనుకున్నాను” అంటూ లోనికి వచ్చి కూర్చోమన్నట్లుగా ఎడం చేత్తో సంజ్ఞ చేశాను. “నేను పేరెంట్నే సార్. ఒక అమ్మాయి చాలనుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేసుకున్నాను” అన్నాడు నింపాదిగా. క్లాసంతా పది నిండు నీటి కుండలు నేలపై పడి పగిలిన శబ్దంలా నవ్వడం నేను ఆపలేక పోయాను. ముందు బెంచీలో కూర్చున్న అతను తల వెనక్కి తిప్పి అందరినీ లిప్త కాలం సీరియస్గా చూశాడు. చివరికి తనూ చిన్నగా నవ్వసాగాడు. నాకూ నవ్వు వచ్చింది.. కాని తమాయించుకున్నాను. పల్లెటూళ్ళలో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసే సంప్రదాయం ఇంకా సమసిపోలేదనుకున్నాను. దట్టమైన గడ్డంతో పెద్దవాడిలా కనబడుతున్నాడు.
“వివాహమైనా కూడా చదువు మీద శ్రద్ధకు నిన్ను మనఃస్ఫూర్తిగా అభినందిస్తున్నాను” అంటూ ప్రశంసించాను. “చదువా.. పాడా.. సర్. ఇంక దాని మీద శ్రద్ధ కూడానా,,!” అంటూ వ్యంగ్యంగా అన్నాడు. అయితే కాలేజీకి ఎందుకు వస్తున్నావు అన్నట్లుగా తల చిన్నగా ఎగరేస్తూ.. పేరు అడిగాను. “నాపేరు పద్మాకర్ సార్. నిజం చెప్పాలంటే నేను వచ్చేది స్కాలర్షిప్ కోసం” అంటూ నేల చూపులు చూడసాగాడు. నాకు ఒక రకంగా వారి పేదరికం మీద జాలి వేసింది. “కావచ్చు. కాని ఇంటర్ పూర్తి చేస్తే నీజీవితానికి ఒక దారి దొరుకుతుంది. నేను ఈ కాలేజీకి వచ్చి వారం రోజులయ్యింది. ఈ రోజు కనబడ్డావు. ఎలా పాసవుతావు?” “పాసుదేమున్నది సార్. ఇక్కడ ఫుల్ మాస్ కాపీ. మీకు తెలియదు. కొత్త గదా..! లెక్చరర్లే బోర్డు మీద సమాధానాలు రాసి చెబుతారు” అంటూ ధీమాగా తలెత్తి చూడసాగాడు. నాకు కాలేజీ గురించి కొద్దిగా అవగహన మయ్యింది. కాలేజీ రహస్యాలు, లెక్చరర్ల గుట్టు పిల్లలకే ఎక్కువగా తెలుస్తూంటాయి. అని మనసులో అనుకుంటూ.. ఇక ఈ విషయం ఇంతటితో ఆపుదామన్నట్లు బోర్డు దిక్కు తిరిగాను. సగంలో ఆగిపోయిన సమస్యను వివరిస్తూ పూర్తి చేశాను. విద్యార్థులంతా నోట్ చేసుకోవడం పూర్తి కాగానే..
“రేపటి నుండి అంటే సోమవారం నుండి రోజూ రెండు క్లాసులు తీసుకుంటాను. లేకుంటే సిలబస్ పూర్తిగాదు” అంటూ నా అనుభవాలను కొన్ని పద్మాకర్ను దృష్టిలో పెట్టుకొని చెప్పాను. ఇంతలో కాలేజీ బెల్ మ్రోగింది. ప్రతీ రోజూ రావాలి అన్నట్లుగా అందరినీ హెచ్చరిస్తూ.. స్టాఫ్ రూంకు దారితీశాను.
కాలేజీ సమయం పూర్తి అవుతుండగా.. హెడ్ క్వార్టర్స్ లీవింగ్ పర్మిషన్ తీసుకొని నాగదికి వెళ్లాను. చిన్న హ్యాండ్బ్యాగులో బట్టలు సర్దుకుని మర్పల్లి రైల్వేస్టేషన్కు గబా, గబా బయలుదేరాను. మర్పల్లి నుండి బీదర్ ఫాస్ట్ ప్యాసింజర్ ఐదు గంటలకు బయలు దేరి సనత్నగర్కు దాదాపు తొమ్మిది గంటల ప్రాంతంలో చేరుకుంటుంది. బదిలీ మీద వచ్చిన నేను పిల్లల చదువు కోసం భరత్నగర్లో కాపురం పెట్టక తప్పలేదు.

స్టేషన్ చేరుకుని టిక్కట్టు తీసుకున్నాను. ఫ్లాట్ ఫాం మీదకు వెళ్లేసరికి నన్ను చూసి కొందరు విద్యార్థులు దూరంగా మరో భోగీ వైపు మళ్ళారు. ‘బహుశః పిల్లలు కూడా వారి, వారి ఇండ్లకు వెళ్తున్నారు కాబోలని’ అనుకున్నాను.
ట్రైన్ కదిలి మర్పల్లి నుండి మొదటి స్టేషన్ మొరంగపల్లి దాటింది. ఇంతలో ఒక పాట ట్రైన్ కదలికలకు అనుగుణంగా వినరాసాగింది. ఆ గొంతు విని అనుమానమేసింది. అటువైపు కదిలాను. నాఅనుమానం నిజమయ్యింది. పద్మాకర్ నృత్యం చేసుకుంటూ.. గొంతెత్తి పాడుతున్నాడు. కుడి చేతిలో ఎర్రని కర్చీఫ్ ఊపుకుంటూ.. మధ్య, మధ్యలో ఈలలు వేసుకుంటూ. అతని చుట్టూ నిల్చున్న పిల్లలు పాట చివరి పదాన్ని వల్లె వేస్తున్నారు.
‘దండాలు, దండాలు రత్నాకరా..!
నీకు శతకోటి దండాలన్నా రత్నాకరా..!! /దండాలు/’
అలా సాగిన పాటలో రత్నాకర్ మనఃస్తత్వం.. అతను చనిపోయిన విధానం.. హృదయ విదారకంగా ముగిసింది.
నాకు విషయం కొంతమేరకు అర్థమయ్యింది. వచ్చి నాసీట్లో కూర్చున్నాను.
సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు తిరిగి అదే ట్రైన్లో మర్పల్లికి బయలుదేరాను. మా కళాశాలకు స్వతంగా భవనం లేదు. మధ్యాహ్నం ఒకే షిఫ్టులో పని చేస్తుంది. ఉదయం పాఠశాల. సాయంత్రం కళాశాల. గొల్లగూడ స్టేషన్లో పద్మాకర్ నా భోగీలోనే ఎక్కడం గమనించి రమ్మంటూ పిలిచాను.“ఈ రోజు కూడా కాలేజీకి వస్తున్నావు” అంటూ చిన్నగా నవ్వాను. “సర్.. నేను ఇక ప్రతిరోజూ వస్తాను. మొన్న మీరు పాఠం చెబుతున్నప్పుడు నాకు మా అన్నయ్యే గుర్తుకు వచ్చాడు” అంటుంటే అతని కళ్ళు చెమ్మగిల్లాయి. చటుక్కున పద్మాకర్ భుజాలు పట్టుకుని ఆప్యాయంగా చూశాను. “సార్.. మా అన్నయ్య అంటే నాకు ప్రాణం. ఎక్కువగా చదువుకోలేదు. కౌలుకు వ్యవసాయం చేసే వాడు. భూస్వాముల ఆగడాలు నచ్చక తఱచూ గొడవలు పడే వాడు. అన్నల ప్రభావంతో.. వారి పరిచయాలు పెంచుకొని అడవుల్లో కలిశాడు. మనం ఇద్దరం. నువ్వు అమ్మా, నాన్నలను చూసుకో. నేను దొరల భరతం పడతానని అని నాకు సందేశాలు పంపే వాడు. ఆమధ్య బోగస్ ఎన్కౌంటర్లో పోలీసులు చంపేశారు సార్” అంటూ నుదురు సుతారముగా కొట్టుకుంటూ ఏడ్వసాగాడు. మా ఇద్దరి మధ్య ఆవహించిన మౌనాన్ని రైలు లయబద్ధంగా వాడుకుంటోంది. “పద్మాకర్.. మొన్న పాడిన పాటలోని రత్నాకర్ మీ అన్నయ్యనా..!” అంటూ అడిగాను మౌనాన్ని ఛేదిస్తూ. “మీరు విన్నారా సర్..” అంటూ ఆశ్చర్యంగా చూస్తూ.. అవునన్నట్లు.. తలూపాడు పద్మాకర్. కర్చీఫ్ తీసి కళ్ళల్లోని నీరు ఒత్తుకోసాగాడు.
నా ఊహ నిజమని తేలింది. నేను మాట మార్చాలనుకున్నాను. లేకుంటే అలాగే బాధలో మునిగి పోయేలా ఉన్నాడు. నేను గణితశాస్త్రంలోని సమస్యలను సాధిస్తూ.. వానిని మన దైనందిన జీవితంతో పోల్చుకుంటూ.. విడమర్చి చెబుతుంటాను. అందుకేనెమో..! నామొదటి పాఠం ప్రభావితంతో నన్ను తన ఆత్మీయుడుగా భావించాడనుకుంటాను.. దానిని ఆసరాగా తీసుకుని నెమ్మదిగా మాటల్లో దింపాను. “పద్మాకర్.. మీరు తరగతులకు హాజరు గాకున్నా స్కాలర్ షిప్ వస్తుందా!” అంటూ ఆరా తీశాను. “సర్.. మీరు మొన్న పాఠం చెబూతూ.. మీ జీవితంలో ఎప్పుడూ ఎవరికీ లంచం ఇవ్వలేదని చెప్పారు. మిమ్మల్ని దూరంగా బదిలీ చేస్తామన్నా, బెదరకుండా చేతనైతే అండమాన్, నికోబార్ దీవులకు బదిలీ చేసినా వెళ్తాను గాని ఒక్క పైసా గూడా లంచం ఇవ్వనని కరాఖండిగా చెప్పేవాడినని అన్నారు. అందుకే కాబోలు ఇక్కడ ఎలా నెగులుతారో చూద్దామన్నట్లు మిమ్మల్ని ఈ మారుమూల ప్రాంతానికి కావాలని బదిలీ చేశారనుకుంటున్నాను” అంటుంటే పద్మాకర్ గొంతు పొర మారింది. తన బ్యాగులో నుండి వాటర్ బాటిల్ తీసి కొన్ని నీళ్ళు త్రాగి, తిరిగి సర్డుకుంటూ.. “ఈ వ్యవస్థను మార్చడం ఎవరి తరమూ కాదు సార్” అన్నాడు.
పద్మాకర్ మాటల్లో కాలేజీ వ్యవహారం ముడుపులతో ముడి పడి ఉన్నదని అర్థమయ్యింది. “అంటే కాలేజీలో స్కాలర్షిప్ కోసం ఎవరి చేతులన్నా తడుపుతున్నారా..!” అంటూ ఆశ్చర్యంగా అడిగాను. “సార్.. ప్రిన్సిపాల్ కాలాంతకుడు. స్కాలర్షిప్ ఇన్చార్జ్తో చేయి కలిపి మేము కాలేజీకి వచ్చినా.. రాకున్నా.. కావాల్సిన హాజరు శాతం సర్టిఫికెట్లు పెట్టి పది శాతం పిండుకొని మిగిలిన డబ్బులు మాచేతుల్లో పెడ్తారు. ఇద్దరూ తోడు దొంగలు. పోనీయండి సార్.. మేమంటే అప్పుడప్పుడైనా వస్తున్నాం. కాని అసలు కాలేజీలో లేని వారి సంగతి ?” అంటూ ప్రశ్నార్థకంగా ఆగిపోయాడు. నాకూ అర్థం కాలేదు.. “కాలేజీలో లేని వారా..! వాళ్ళెవరు “ అంటూ మరింత లోతుగా అడిగాను. “అవును సార్.. ముప్పది మంది బినామీ పేర్లను చేర్చి వారి డబ్బులూ పంచుకుంటారు. పది మంది డబ్బులు సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో బక్షీసుగా ఇస్తారట”

“ఇదంతా నీకు ఎలా తెలుసు” అంటూ రెట్టించాను. తలదించుకొని సమాధానం చెప్పసాగాడు పద్మాకర్. “నేను రత్నాకర్ తమ్మణ్ణని తెలిసి అంతా భయపడుతూ ఉంటారు. నేను ఆఫీసు సిబ్బంది ద్వారా తెలుసుకున్నాను సార్. ప్రిన్సిపాల్ నాకు పూర్తిగా స్కాలర్ షిప్ ఇవ్వడమే గాకుండా.. తన తెరువు రాకుండా.. మరో ఇద్దరి డబ్బులు అదనంగా అంటగడ్తాడు”
“చూశావా పద్మాకర్.. నువ్వు తల దించుకున్నావు. మన జీవితంలో అలా తల దించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. అంతా మన చేతుల్లోనే ఉంది. మీ అన్నయ్య అంటే ప్రాణమన్నావు. అతని ఆశయాలను నిలబెట్టాలి. కాని నువ్వు చేస్తున్నదేమిటి? అవినీతిని ప్రోత్సహిస్తున్నావు. మీ లాంటి యువతరం ఇలా మసలుకుంటే మన దేశం ఏమైపోతుందోనని భయంగా వుంది. మన ఆశయాలను సాధించుకోవాలంటే.. అడవుల బాట పట్టనఖ్ఖర లేదు. సంఘంలో ఉంటూనే.. మన వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తూ.. మనచుట్టూ ప్రక్షాళన చెయ్యాలి. అలా ప్రతీ ఒక్కరూ కృషి చేస్తుంటే సమాజంలో మార్పు తప్పకుండా వస్తుంది ” అంటూ హిత బోధ చేశాను. “ఏం చెయ్యాలి సర్.. నేనూ ఒక రకంగా ఏమీ చేత గాని వాణ్ణి”

“అలా ఎప్పుడూ అనుకోవద్దు పద్మాకర్. ఎప్పుడైతే మన శతృవు మనకంటే బలవంతుడు అనుకుంటామో..! అప్పటి నుండి మనం బలహీనులంవుతాం.. పతనం ఆరంభమవుతుంది. అవినీతి అనే మన శతృవును మనమే పెంచి పోషిస్తూ.. బలవంతుణ్ణి చేస్తున్నాం. నిజమా.. కాదా..!” “అవును సార్” “నువ్వు సహకరిస్తే.. కనీసం మన కాలేజీని చక్కదిద్దుకుందాం” అంటూ నాప్రణాళికలను వివరించాను. నేనిదివరకు పని చేసిన కళాశాలల్లో తీసుకు వచ్చిన సంస్కరణలను విశదీకరించాను. నా భరోసా వాక్యాలతో పద్మాకర్ ముఖంలో వేయి దీపాల వెలిగాయి. “నేనే కాదు సార్. మా విద్యార్థి లోకమంతా మీకు అండగా నిలబడుతుందని హామీ ఇస్తున్నాను” అంటూ రెండు చేతులతో నమస్కరించాడు.
ఒక ఉపాద్యాయుడు సచ్ఛీలుడై, తాను సరియైన మార్గంలో నడిచినప్పుడే,, విద్యార్థులను ఆదేశించ గలడు. ఇంతలో మర్పల్లిస్టేషన్ వచ్చింది. నేను దిగి వడి, వడిగా అడుగులు ముందుకు వేస్తుంటే.. నన్ను అనుసరించసాగాడు పద్మాకర్. సభలో ఆకాశాన్నంటే కరతాళ ధ్వనులతో ఆలోచనల నుండి తేరుకున్నాను. పద్మాకర్ తన ప్రసంగాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. “సుగుణాకర్ సార్ నేతృత్వంలో మర్పల్లి కాలేజీ బాగుపడడమే కాదు.. స్కాలర్షిప్లను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలలో జమచేయడమనే ఆదేశాలు రాష్ట్రప్రభుత్వం అన్ని కాలేజీలకు పంపించింది. మీకు మరొక అద్భుతమైన విషయం చెబుతాను. సుగుణాకర్ సార్ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల నిర్వహణకై డిపార్ట్ మెంట్ ఆఫీసరుగా మెదక్ జూనియర్ కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రైవేటు కాలేజీల జులుం ఎదుర్కొని, దానికి విరుగుడుగా ఆలోచించి జంబ్లింగ్ సిస్టం స్వయంగా తయారు చేసి అమలు పర్చాడు. దాన్ని కమీషనరు గారు మెచ్చుకుంటూ.. ఆ పద్ధతిని కంప్యూటర్ల సాయంతో తయారు చేయించాడు” సభలో చప్పట్లు మరో సారి మారుమ్రోగాయి. పద్మాకర్ మైకు వదల లేదు. “అగమ్యగోచరంగా తయారై.. నడి సముద్రంలో కొట్టుకుపోయే నావలా తయారైన నాబతుక్కు చుక్కానిలా.. దారి చూపించిన మహానుభావుడు మన సుగుణాకర్ మాష్టారు. వారు చూపించిన మార్గంలో నడుస్తూ.. వృత్తులలోకెల్ల ఉపాద్యాయ వృత్తిని మించిన వృత్తి లేదని చెప్పే వారి మాటలను బలపరుస్తూ.. నేనూ ఉపాధ్యాయ వృత్తినే చేపట్టాను. యువతరాన్ని వారి ఆశయాలమేరకు తీర్చిదిద్దుతానని ప్రమాణం చేస్తున్నాను” అనగానే సభ యావత్తు చప్పట్లతో మద్దతు తెలిపారు. పిల్లలంతా లేచి.. “వారు చూపిన బాటలో మేమూ నడుస్తాం” అంటూ సభ దద్దరిల్లేలా ప్రమాణం చెయ్యసాగారు. *