...పెళ్లి ఆగిపోయింది...
ఆరాధ్య పెళ్లి ఏర్పాట్లన్నీ
ఘనంగా జరుగుతున్నాయి..
ఖరీదైన శుభ పత్రికలు, పట్టుపీతాంబ్రాలు
ముత్యాలు పొదిగిన బంగారు ఆభరణాలు,
మిరిమిట్లు గొలిపే విద్యుత్ వెలుగులు, రంగు రంగుల పూలతో అందంగా అలంకరించిన కళ్యాణమంటపం..
అతిధులకు పసందైన విందు ఏర్పాట్లు... బ్రాహ్మఒడఒగా..పదుగురు పదికాలల పాటు చెప్పుకునేలా శ్రద్ధగా దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేయిస్తున్నాడు ప్రసాద్.
ఇక సరస్వతి విషయం చెప్పనవసరం లేదు,
పెళ్లికి సంబంధించిన ప్రతి ఘట్టాన్ని సాంప్రదాయబద్దంగా ఏ లోపం రాకుండా చేసే ఏర్పాట్లలో తల మునకలైంది.
ఇదిగో..మిమ్మల్నే.. ఏవండి..బ్యాఒడ్ మేళం వద్దనుకున్నాముగా, ఆ సన్నాయి మేళం సంగతి చూడండి..అలాగే..,
ఆ విడిది ఏర్పాట్లు కాస్త ఖరీదైన హోటల్లో చేయండి, అసలే ఫారిన్ పెళ్ళికొడుకు వసతులన్ని స్పెషల్ గా వుండేలా చూడండి,
మళ్ళీ మాటొస్తుంది సమా.....,
అన్నట్లు మరిచి పోయాను, ఒంటి బ్రాహ్మణుడు శొంఠికొమ్ములా కాకుండా...జంటగా మరో బ్రాహ్మణుణ్ణి తెచ్చుకోమని పంతులు గారికి చెప్పండి, సఒభావన మనమే యిస్తామని, కాస్తా శాస్త్రం తెలిసిన వారిని చూడమని మరీ చెప్పండి. అంది సరస్వతి.
సరే అలాగే కాని, ఆ పసుపు కొట్టే రోలు, రోకళ్ల సంగతి చూడు మళ్ళీ అది దొరకలేదు,ఇది కుదర్లేదని ప్రాణాలు తోడేస్తావు, అన్నాడు ప్రసాద్.
ఆ...ఆ..అలాగే లెండి అంది.. సరస్వతి.
పెళ్లంటే నూరేళ్ళ పంట అంటారు, ప్రతి విషయఒలో ఎంతో జాగ్రత్త వహించే తల్లిదండ్రులు.. అసలు పిల్లలు ఏమనుకుంటున్నారు ముఖ్యాఒగా ఆడపిల్ల మనసులో ఏముంది..తాను మనస్ఫూర్తిగా పెళ్లికి సిద్ధమైందా..లేదా, తన ఆలోచన ఏమిటి ? అని తెలుసుకునే ప్రయత్నం చాలా తక్కువమంది మాత్రమే చేస్తారు.
కానీ దీనిని తల్లిదండ్రుల తప్పని అనలేము, తమ బిడ్డల మీదున్న విపరీతమైన ప్రేమ కారణం చేతనో, మరేమో గాని, పిల్లలెఒత ఎదిగినా.. ఇంకా వారిని చిన్న పిల్లలుగానే చూస్తూ వాళ్లకేం తెలుసునని, తేలికగా తీసుకుంటారు.
కానీ ...అన్ని విషయాల్లోను చాలా గొప్పగా వుండే సంబంధం చూడాలని..
తమ తాహతుకు మించి కట్న కానుకలిచ్చయినా సరే , తమ పిల్లలకు మంచి సంబంధం తేవాలని తల్లిదండ్రులు ఆరాట పడుతుంటారు.
కానీ ఒక్కోసారి తల్లిదండ్రుల ఈ విపరీతమైన ప్రేమే పిల్లల పాలిట శాపంగా మారినట్లే, తల్లిదండ్రుల పట్ల పిల్లల కున్న భయమో..భక్తో... లేదా వారి దూకుడుతనమో తల్లిదండ్రుల పాలిట శాపంగా మారుతుందన్నది వాస్తవం.
ఈ పరిస్థితులే..ఈ పెళ్లి కథను ఊహించని మలుపు తిప్పాయి.
పెళ్లికోసం కన్నె పిల్ల ఎన్నో కలలు కఒటుంది, కాబోయే భర్త గురించి, ఆ తరువాత అతనితో గడపబోయే జీవితం గురించి..కానీ ఆరాధ్య ఈ పెళ్లంటేనే భయపడుతుంది.ఇష్టం లేదని చెప్పలేదు..అలా అని ఇష్టఒగా ఈ పెళ్లి చేసుకోలేదు. మనసులోని భావాన్ని బాధను ముఖంలో కనపడనీయకుండా...ఎంత జాగ్రత్త పడ్డా.. దాచలేక పోతుంది అందుకే కాబోలు "ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్" అంటారు.
తన భావాలన్ని..డైరీగా రాయడం అలవాటున్న ఆరాధ్య...గత వారం నుండి మనసు బాగోలేక రాయలేని డైరీని రాయడం మొదలు పెట్టింది.
బహుశా ఆ తరువాత ఇక డైరీ రాయడం కుదరక పోవచ్చనుకుంది కాబోలు.
"ఎప్పటికి నా హీరో నానే...
చిన్నప్పటినుండి నా సంతోషం లోనే నాన తన ఆనందం చూసుకున్నాడు.
నాకింత వయసొచ్చినా నాన పక్కన ఆయన చేతిపై తలపెట్టి నిద్రపోతే..అదో ఆనందం అదో భరోసా..
ఈ ప్రపంచంలోని సంతోషాలన్నీ నాన దగ్గరే నాకు లభిస్తాయనిపిస్తుంది. నాన కూడా అంతే పనులన్నీ పక్కన పెట్టి నాకేం కావాలి..
నా ఆనందం కోసం ఏం చేయాలి అని చూస్తూవుంటాడు...
నిద్ర లేవగానే నా మొఖం చూడటం నుదుటిపై ముద్దు పెట్టడంతో నాన దినచర్య మొదలవుతుంది.
నిజంగా అమ్మ దగ్గరికన్నా నాన దగ్గర నాకు చనువు ఎక్కువే...కానీ ఆయనంటే గౌరవంతో కూడిన భక్తి కూడా ఎక్కువే....
అందుకే అంత చనువున్నా నాన్నతో ఏది చెప్పాలన్న ఆలోచిస్తాను...ఏది అడిగినా నాన కాదనడు కానీ...అది ఆయన మనసును ఎక్కడ నొప్పిస్తుఒదో అని భయపడతాను.
ఇక అమ్మ...ఇప్పటికి ఇంటి దగ్గర ఒక్కనాఁడు నా చేత్తో అన్నం తిననివ్వదు ..
అమ్మ చేతి గోరు ముద్దలంటేనే నాకు కూడా చాలా ఇష్టం.
పనులన్ని పక్కన పెట్టి కొసరి కొసరి
నాకు అన్నం తినిపిస్తుంది అమ్మ...ఇంకా చాలమ్మానా కడువు నిండిపోయింది అంటే..
ఇదిగో ఇది నాన ముద్ద,
ఇది అమ్మ ముద్ద..
ఇదిగో ఇదే ఆఖరుది దేవుడి ముద్ద అంటూ..సెంటిమెంట్ తో నా పొట్ట నిండా అన్నం తినిపిస్తుంది అమ్మ.
అంత మంచి తల్లిదండ్రులకు..ఒక్కగానొక్క కూతుర్నవ్వటం నా అదృష్టం..నా మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందో అని అమ్మా నాన మరో సంతానానికి కూడా అవకాశం ఇవ్వలేదు అది నా పై వారి కున్న ప్రేమ.
అలాంటి నాన తో నాకీ పెళ్లి ఇష్టం లేదని, నాకు సుదీప్ అంటే ఇష్టమని ఎలా చెప్పగలను..
నేను లేకుండా బ్రతకలేనని..కావాలంటే అఒకుల్తో నేను మాట్లాడతానని..సుదీప్ ఎంత చెప్పినా ససేమీరా అన్నాను...
ఎందుకంటే ..?
నాకు నా సంతోషం కంటే నాన సంతోషమే ముఖ్యం కనుక.
మన ప్రేమను బలిచేయొద్దు..
ఆరాధ్య .....బాగా ఆలోచిఒచు, ఇది జీవితం, జీవితమంటే బొమ్మలాట కాదు, మనసొకచోట ....మనువొకచోట నరకంలా ఉంటుంది తెలుసా..అని ఎన్ని రకాలుగా చెప్పినా..
నేను నిన్ను ప్రేమిఒచిన దానికి వంద రెట్లు ఎక్కువగా నానను ప్రేమించాను..
ప్రేమిస్తూనే ఉంటాను..
నా జీవితంలో నరకం అంటూ ఉంటే అది నానకు బాధ కలిగించి నప్పుడు మాత్రమే...
అందుకే నా ప్రాణం ఉన్నంత వరకు నాన ఎలా చెపితే అలా నడుచుకుంటాను..
నానను బాధ పెట్టే రోజంటూ నా జీవితంలో వస్తుందంటే అది నా చావు మాత్రమే,
నా ఊపిరున్నఒత వరకు నాన కోసం ప్రపంచాన్నాయినా ఎదిరిస్తాను తప్ప, నానను బాధపెట్టను అని నిక్ఖచ్చగా సుదీప్ కు చెప్పాను.
ఈ ఒక్క రోజు దాటితే నీతో మాట్లాడే అవకాశం కూడా ఉండదు అని ఎంత చెప్పినా నో..అన్నాను.
నా నిర్ణయం మారదని సుదీప్ కు తెలుసు,
నీలా నానను ఇంతగా ప్రేమించే కూతురు దొరకడం మీ నాన అదృష్టం..
అలాగే నీలాంటి గొప్ప సంస్కారం ఉన్న అమ్మాయి లభించక పోవటం నా దురదృష్టం అంటూ బాధపడ్డాడు సుదీప్.
సుదీప్ ఆలోచనలు మనసులోకి రాగానే నా హృదయంలోని ప్రేమ కన్నీటి బిందువుల్లా నన్ను ఓదార్చటానికి బైటికి వచ్చింది..రాస్తున్న డైరీలోని అక్షరాలు కన్నీటి బిందువులతో నా మనసులా చేదిరిపోయాయి.
డైరీని మూసి..అలాగే పడుకున్నాను .
తెల్లవారితే పెళ్ళి..ఇల్లంతా సందడిగా వున్నా నా మనసు ఒంటరితనంతో బాధపడుతుంది.
ఆ రాత్రి నాన దగ్గర పడుకోవాలని ఆయన బెడ్ పై పడుకున్నాను...ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు..
కానీ....
తెల్ల వారేసరికి..నాన చేతిపై నిద్రపోతున్నాను.
నాన కళ్లనుండి కారుతున్న వెచ్చని కన్నీళ్లు..నా బుగ్గలపై పడటంతో..మెలకువ వచ్చింది.
నాన అన్నాను..నాన చేతిలో నా డైరీ ఉంది.
నాన నన్ను పొదవి పట్టుకొని..
తప్పు చేశాను నాన నన్ను క్షమించరా..
నీ మనసు తెలుసుకోలేక పోయాను అంటూ పొంగివస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నాడు.
సరే... ఇక చేసేదేమీ లేదురా, సమయం చెయ్యిదాటింది, నేను చెప్పినట్లు చేస్తావా నాన అన్నాడు నాన..
తప్పకుండా నాన అన్నట్లు తలా ఊపాను..నాన పై ఒదిగిపోయి తలను ఆయన చాతిపై ఉంచుతూ...
నాన ప్రేమగా నా తల నిమురుతూ..ఆప్యాయంగా...
నాన...
నువ్వెళ్ళి పెళ్లి కూతురులా చక్కగా ముస్తాబవ్వు తల్లి అన్నాడు నాన..
సరే నాన అన్నాను...
పెళ్లికి మరో గంట సమయం ఉంది...అంత రెడీ అయి మంటపానికి బయలు దేరాము.
మేళ తాళాలతో, ముత్తైదువుల మంగళ హారతి తోడు రాగా, బంధు మిత్ర సకుటుంబ సపరివార సమేతంగా,
సాంప్రదాయ బద్దంగా కళ్యాణ మంటపం చేరుకున్నాము..
బరువెక్కిన నా హృదయం..బాధతో కుండపోత వర్షానికి ముందు మేఘంలా భారంగా అనిపించింది..
ప్రపంచమంతా చీకటవుతున్నట్లు...మనసును ఎవరో మెలిపెట్టి పిండుతున్నట్లు..మోయలేని బారమంతా నాపై పడినట్లనిపించింది.
కారు దిగగానే..
పెళ్లి మండపంలో ..
బంగారు బొమ్మ రావేమీ..పందిట్లో పెళ్లి జరిగెనే పాట..వినిపించగానే అప్రయత్నంగా నా కళ్ళవెంట నీళ్లు జల జలా రాలాయి...
నాన నన్ను గమినించినట్లున్నాడు..
దగ్గరగా వచ్చి నా తలపై చెయ్యి పెట్టి భయపడకు బిడ్డా..అన్నట్లు నన్ను దీవించి,
నన్ను పొదవి పట్టుకొని ..
నా చేతిని తన చేతితో గట్టిగా పట్టుకొని..కళ్యాణ మంటపంలోకి నడిపించాడు. ఆయన చేతి స్పర్శ నన్ను ఓదార్చుతున్నట్లనిపించింది..కాని నా మనసును నేను ఓదార్చుకోలేక పోతున్నాను.
మంటపంలోకి చేరగానే...నేను రెడీ అవ్వడానికి పక్క గదిలోకి వెళ్ళాను..నాకోసం సిద్దంగా ఉన్న సుదీప్..నా చేతిలో ఒక ఉత్తరం పెట్టాడు.
అది నాన చేవ్రాలు...
"తల్లీ... ఈ పరిస్థితిలో పెళ్లి ఆపలేను.. అలా అని నా చిట్టి తల్లి బాధను చూడలేను, అందుకే..నువ్వు సుదీప్ తో
సంతోషంగా వెళ్ళు..
ఇక్కడి విషయాలు నేను చూసుకుంటాను.
మీ..
నాన
పెళ్లి కొడుకు కారు కళ్యాణ మంటపంలోకి వచ్చింది.
నా చేయి పట్టుకొన్న సుదీప్ పక్కదారి గుండా నన్ను కళ్యాణ మంటపం నుండి బైటికి తీసుక వెల్లాడు..
దూరంగా నిలబడి నాన చిరునవ్వుతో నన్ను వెళ్ళమని చేతులతో సైగ చేస్తున్నాడు.
ధైర్యంగా సుదీప్ తో ముందడుగు వేసాను.
ఆ తరువాత నేను లేచిపోయానని నాన్నను అందరూ నానా రకాల మాటలన్నారు..నాన మౌనంగా అన్ని నా కోసం భరించాడు.
కాల చక్రం గిర్రున తిరిగింది.. నాన మా పాపను చేతిపై పడుకోబెట్టుకొని నిద్ర పుచ్చుతున్నాడు.
నేను నాన వడిలో నా బిడ్డను చూసి మురిసిపోయాను.
ఆయన మంచి నాన తో పాటు
మంచి తాత అయినందుకు.